ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమని టీఎన్జీవోల కేంద్రం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఈ సంఘానికి ఉందని తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని టీఎన్జీవో భవన్‌లో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఏప్రిల్‌లోగా పెండింగ్ బిల్లులు, 2 డీఏలను ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్జీవోల సంఘం 80వ ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, నాయకులు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శంకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్
Comments
Please login to add a commentAdd a comment