క్షుద్రపూజల కలకలం
కరీంనగర్‌రూరల్: మనిషి చంద్ర మండలంలోకి వెళ్తున్న ఈ కాలంలో గ్రామీణులు కొందరు ఇంకా మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. దుర్శేడ్ ఉన్నత పాఠశాల, చెర్లభూత్కూర్‌లో ఓ అంగన్‌వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేయడం గురువారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. దుర్శేడ్ హైస్కూల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రధానోపాధ్యాయుడి గది ఎదుట పసుపు, కుంకుమతో ముగ్గులు వేసి, నిమ్మకాయలు పెట్టి, క్షుద్రపూజ చేశారు. మరుసటిరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వాటిని చూసి, భయభ్రాంతులకు గురయ్యారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం రత్నాకర్ వెంటనే వాటిని తొలగించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలా చేసి ఉంటారని, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలాగే, చెర్లభూత్కూర్‌లో ఓ అంగన్‌వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు
పాలకుర్తి(రామగుండం): నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం ఎకై ్స జ్ సీఐ మంగమ్మ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకుర్తి మండలంలోని జీడీనగర్‌కు చెందిన పల్లపు వెంకట్ గురువారం ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్నాడు. అదే సమయంలో జీడీనగర్ నుంచి బసంత్‌నగర్ వెళ్లే దారిలో ఎకై ్స జ్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. వెంకట్‌ను ఆపి, తనిఖీ చేయగా 8 లీటర్ల నాటుసారా లభ్యమైంది. నాటుసారా స్వాధీనం చేసుకొని, అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీల్లో హెడ్‌కానిస్టేబుల్ ఖదీర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, నరేశ్, రాజు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment