23 నుంచి ‘ఓదెల’ బ్రహ్మోత్సవాలు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈ నెల 23న(ఆదివారం) స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు మహాగణపతి పూజ, గౌరీపూజ, సాయంత్రం ధ్వజారోహణం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, 24న ఉదయం 10:30 గంటల నుంచి భ్రమరాంబ మల్లికార్జునస్వామి కల్యాణం, 25న నాకబలి, గ్రామోత్సవం, 26న మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు నిత్యోత్సవం, 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకం, రాత్రి 8 గంటలకు రథోత్సవం, 11:45 గంటల నుంచి లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వక, ఏకాదశ రుద్రాభిషేకం, మహాహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆలయ ప్రధాన ద్వారాలు రంగులతో ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. నీడ కోసం పందిళ్లు, మంచినీరు, విద్యుత్ దీపాలు, కోనేరు నీరు, గదులు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయానికి కరీంనగర్, గోదావరిఖని, హుజూరాబాద్ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులతోపాటు సికింద్రాబాద్, కొత్తగూడెం, సిర్‌పూర్ కాగజ్‌నగర్‌ల నుంచి రైళ్ల సౌకర్యం ఉంది.
ఏర్పాట్లు పూర్తయ్యాయి..
ఈ నెల 23 నుంచి 26 వరకు జరిగే ఓదెల మల్లన్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రిళ్లు జాగరణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
– సదయ్య, ఈవో, ఓదెల దేవస్థానం
23 నుంచి ‘ఓదెల’ బ్రహ్మోత్సవాలు
23 నుంచి ‘ఓదెల’ బ్రహ్మోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment