దేశానికి మోడీ గుర్తింపు తెచ్చారు
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
కరీంనగర్‌టౌన్: అంతర్జాతీయస్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయంలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కకొమరయ్యతో కలిసి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఎదైనా ఉందంటే అది బీజేపీ అన్నారు. ఇతరపార్టీల వారికి వారి సిద్ధాంతం అంటే తెలియదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పైన నమ్మకం పోయిందని, కాంగ్రెస్ ఒకరిని తప్ప అభ్యర్థులను పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ, వై.సునీల్‌రావు, గుగ్గిల్లపు రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, రత్నం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment