చొప్పదండి పీఏసీఎస్ సేవలు భేష్
చొప్పదండి: పట్టణంలోని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన అధికారుల బృందం సందర్శించింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సహకార సంఘాల అధ్యక్షులు, అధికా రులు చొప్పదండి సొసైటీని సందర్శించి సహకార సంఘం పనితీరును పరిశీలించారు. పీఏసీ ఎస్ అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో మూడుసార్లు చొప్పదండి సొసైటీ ఉత్తమ అవార్డులు సాధించడానికి దోహదం చేసిన అంశాలను వివరించారు. వ్యవసాయ రుణాలను వందశాతం రికవరీ చేయడంతో పాటు, ఇతర రుణాలు 85 శాతం రికవరీ అయ్యాయని, సభ్యులకు పది శాతం డివిడెంట్ అందిస్తున్నామని ఆయన అధికారుల బృందానికి తెలిపారు. సొసైటీలోని సిబ్బందికి, రైతులకు బీమా సౌకర్యం కల్పించామని, రైతులకు అందుబాటులో గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి ఎరువులు అందిస్తున్నామని వివరించారు. రుణాలు ఇవ్వడమే కాకుండా రైతులకు బహుముఖ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పీడీసీ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ, డైరెక్టర్లు, సీ ఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment