women reservation
-
కొలువుల పట్టిక తారుమారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయని వాటిల్లో హారిజాంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లు నోటీసులు ఇచ్చాయి. వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి. ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్ చేసి (నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్ చేసి) చూపించేవారు. కానీ తాజా హారిజాంటల్ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్ చేయరు (ఎలాంటి మార్కింగ్ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్‌తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది. ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లైౖతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్‌ను తొలగించి పది పోస్టులను జనరల్‌కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది. -
న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి న్యాయపోరాటం చేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో భారత్ జాగృతి తరఫున ఇంప్లీడ్ అవుతామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము పోరాడి సాధించిన మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలుకు పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ మేరకు ఇప్పటికే పలు సంస్థలు కోర్టుకు వెళ్లాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
జనగణన లేకుండా బిల్లు పెట్టి ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. సునీతారావు ఆరోపించారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను మభ్య పెట్టేందుకే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లు తెరపైకి తెచ్చారని, జనగణన జరగకుండా, మహిళల జనాభా తెలియకుండా ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మహి ళా బిల్లును వెంటనే అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే జనగణన పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. తక్షణం జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మోదీని నమ్మే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఇదో కొత్త నాటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న ముమ్మర ప్రయత్నాలకు అనేక రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసుకొని బిల్లును ఆమోదింపజేయాలని 47 రాజకీయ పార్టీలకు మంగళవారం రోజున ఆమె రాసిన లేఖ అపూర్వ స్పందన లభించింది. కవిత రాసిన లేఖ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల ఆవశ్యతపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. ఆమె లేఖ రాసిన కొద్ది గంటల్లోనే అనేక పార్టీల నాయకులు స్పందించారు కవిత విజ్ఞప్తిని అంగీకరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతిస్తామని ప్రకటించడమే కాకుండా కవిత చేస్తున్న కృషిని ప్రశంసించారు. కవిత లేఖపై ఎన్సీపీ, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఆర్జేడీ వంటి కీలక పార్టీలు తక్షణమే స్పందించాయి. జాతీయ మీడియాలో కవిత లేఖపై తీవ్ర చర్చలు జరిగాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందిస్తూ... చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరమని, ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొస్తే తాము మద్ధతిస్తామని ప్రకటించారు. కానీ బీజేపీకి మహిళా బిల్లుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ... మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలంగా మారుతుందని తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. లేదంటే మరో 25 ఏళ్ల పాటు వాటి కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పారు.రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా బిల్లుకు తమ పార్టీ మద్ధతిస్తుందని చెప్పారు. సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకురాలు పూజా శుక్లా స్పందిస్తూ...తమ పార్టీ ఎప్పుడూ మహిళా సంక్షేమం కోసం పాటుపడుతుందని, మహిళలకు అవకాశాలు కల్పించడంలో తమ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందుంటారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ అనుకూలమని ప్రకటించారు. మహిళా బిల్లు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని అభినందించారు. తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ... తమ పార్టీ మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తోందని, అనేక సందర్భాల్లో తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆ అంశాన్ని ప్రస్తావించారని వివరించారు. తమ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మహిళా బిల్లు కల్వకుంట్ల కవిత లేఖ రాశారని, తప్పకుండా మద్ధతిస్తామని స్పష్టం చేశారు. -
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి
పెద్దపల్లిరూరల్: మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేశారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో మంగళవారం మహిళా దినోత్సవం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి 91మహిళా సంఘాలకు రూ.7.75కోట్ల చెక్కులు అందించారు. పోలీసు నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బాలికలు ఉన్నత చదువులకు రెసిడెన్షియల్ వసతి కల్పించిందని అడిషనల్ కలెక్టర్ అన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, డీఆర్డీఓ శ్రీధర్, సంక్షేమాధికారి రవుఫ్‌ఖాన్, ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు, ఆర్అండ్బీ ఈఈ నర్సింహాచారి, రంగారెడ్డి తదితరులున్నారు. నాడు.. నేడు బేరీజు వేసుకోవాలి మంథని: మహిళల అభివృద్ధికి గత ప్రభుత్వాల పనితీరు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను బేరీజు వేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అన్నారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవంలో కలెక్టర్ సంగీత, జయశంకర్భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ శ్రీహర్షిణీతో కలిసి మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రతి దశలో సర్కారు సహాయం అందిస్తోందన్నారు. ముందుగా జెడ్పీ చైర్మన్లు, కలెక్టర్‌కు మహిళలు బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. గర్భిణులకు సీమంతం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, సీడీపీవో పద్మశ్రీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట గోదావరిఖని: మహిళల సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దుర్గానగర్ ఆర్కే గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ మహిళ దినోత్సవంలో పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ 40 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. వీహబ్ ద్వారా 64 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.4కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించామన్నారు. మేయర్ బంగి అనిల్‌కుమార్, జెడ్పీటీసీ అముల నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, సీడీపీఓ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
Agnipath Scheme: అగ్నివీరుల్లో 20 శాతం మహిళలే!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద ఈ ఏడాది నేవీలో చేపట్టే నియామకాల్లో 20 శాతం మంది మహిళలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నేవీలో ఈసారి మూడువేల మందిని ఎంపికచేస్తారు. అగ్నిపథ్ ద్వారా నేవీ తొలిసారిగా మహిళా నావికులను నౌకాదళంలోకి తీసుకోనుంది. అన్ని విభాగాల అప్లికేషన్లు జూలై 30వ తేదీ దాకా తీసుకుంటారు. ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటివరకు 10 వేల మందిపైగా మహిళా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలంటూ మంగళవారం సుప్రీంకోర్టులో మాజీ సైనికాధికారి రవీంద్రసింగ్ షెకావత్ పిటిషన్ దాఖలుచేశారు. (క్లిక్: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. చాయ్‌వాలా నామినేషన్) -
ఉమెన్స్ డే స్పేషల్!...స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మహిళలకు పట్టం
సాక్షి, హైదరాబాద్: ఉమెన్స్ డే నేపథ్యంలో ఏటా నగర పోలీసు విభాగం వివిధ రకాల కార్యక్రమాల నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుత కొత్తాల్ సీవీ ఆనంద్ దీనికి భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీ పోలీసు విభాగంలో ఓ మహిళ ఇన్స్పెక్టర్ను శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) నియమిస్తున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, కొత్వాల్ ఆనంద్ సమక్షంలో లాలాగూడా ఎస్హెచ్ఓగా సదరు అధికారిణి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒకప్పుడు పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది, అధికారిణిల సంఖ్య తక్కువగా ఉండేది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కేటాయించారు. దీంతో నానాటికీ వీరి సంఖ్య పెరుగుతోంది. అదనపు డీజీ నుంచి కానిస్టేబుళ్ల వరకు కలిపి ప్రస్తుతం 3803 మంది ఉన్నారు. హోంగార్డులు వీరికి అదనం. ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వారి సంఖ్యే 31గా ఉంది. అయితే వీరిలో ఏ ఒక్కరూ శాంతిభద్రతల విభాగం ఠాణాకు ఎస్హెచ్ఓగా లేరు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు ఇలాంటి నియామకం జరగలేదు. అటవీ, ఎక్సైజ్, ఆర్టీఏ, రెవెన్యూల్లో మహిళలను దీనికి సమానమైన హోదాల్లో నియమిస్తున్నా... పోలీసుల్లో మాత్రం జరగలేదు. కేవలం మహిళ ఠాణాలు, ఉమెన్ సేఫ్టీ, భరోస, లేక్ పోలీస్ స్టేషన్ వంటి వాటికే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావానికి కారణం అవుతోందని, ఫలితంగా ప్రతిభ ఉన్న వారికీ తమ పనితీరు ప్రదర్శించే అవకాశం ఉండట్లేదని సీపీ భావించారు. ఒక మహిళకు ఎస్హెచ్ఓగా అవకాశం ఇస్తే ఆ స్ఫూర్తితో ప్రస్తుతం డిపార్ట్మెంట్లో ఉన్న, భవిష్యత్‌లో అడుగుపెట్టనున్న వాళ్లూ సమర్థవంతంగా పని చేస్తారని భావించారు. దీంతో ఉమెన్స్‌డే నేపథ్యంలో నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌కు మహిళను ఎస్హెచ్ఓగా నియమిస్తున్నారు. దీనికి సంబంధించి కమిషనరేట్ అధికారులు దాదాపు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. నగరంలో ఉన్న ఉమెన్ ఇన్స్పెక్టర్ల ప్రొఫైల్, వారు గతంలో పని చేసిన ప్రాంతాల్లో, పోస్టులు, సామర్థ్యం తదితరాలను తెలుసుకున్నారు. దాదాపు ప్రతి అధికారిణినీ కమిషనరేట్‌కు పిలిచిన అధికారులు శాంతిభద్రతల విభాగంలో ఉండే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సమర్థత తదితరాలను వివరించారు. ఈ కసరత్తు తర్వాత మహిళ ఇన్స్పెక్టర్ను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. మహిళ అధికారిణుల ప్రతిభ ఆధారంగా ఎస్‌హెచ్‌ఓల్లోనూ 33 శాతం వీరే ఉండేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. (చదవండి: గోల్డెన్...ఫైట్) -
50 శాతం ఉద్యోగాలు మహిళలకే
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఖాళీగా ఉన్న 9,000 పోస్టుల్లో మహిళలకు సగం అంటే 4,500 పోస్టులు దక్కనున్నాయి. ‘ప్రస్తుతం ఆర్పీఎఫ్లో మహిళా కానిస్టేబుళ్లు 2.25 శాతం మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఖాళీల్లో ఎక్కువగా మహిళలను నియమించాలని మోదీ నిర్ణయించారు’ అని గోయల్ బదులిచ్చారు. బిహార్ ప్రభుWత్వం మాదిరి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కేంద్రం పరిశీలిస్తుందా? అన్న ప్రశ్నకు ‘ఇప్పటివరకైతే అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు..’ అని మంత్రి చెప్పారు. ఇక రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు వంటి ప్రీమియం రైళ్లతో పాటు రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశమేమీ కేంద్రానికి లేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు సురేంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. -
అతివకు అర్ధభాగం
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు ఇంటికే పరిమితంకాకుండా రాజకీయాల్లో రాణించేలా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికలకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్ మండలాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్ల కోటా ప్రకటించడంతో పల్లెపోరు సిద్ధమైంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రచారాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచే రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా నూతన పంచాయతీరాజ్ చట్టం మహిళలకు పెద్దపీఠ వేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరిలో 50శాతం కోటాను మహిళలకు కేటాయించింది. మిగితా స్థానాల్లో కూడా పురుషులతో సమానంగా పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో.. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావల మండలంలో మూడు గ్రామపంచాయతీలు, ఆదిలాబాద్‌రూరల్ మండలంలో 34 జీపీలు, జైనథ్ మండలంలో 42, బేల మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామపంచాయతీల్లో యాభైశాతం మహిళలకు రిజర్వేషన్ చేయగా, మిగతా యాభైశాతం జనరల్‌స్థానాల్లో మహిళలు, పురుషులు పోటీలో ఉండనున్నారు. అతివలకే సగం స్థానాలు పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు సగం స్థానాలు దక్కడంతో నారీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మహిళలపట్ల శ్రద్ధ కనబర్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. మహిళలకు 50 శాతం స్థానాలు దక్కడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీలో సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు పలువురు మహిళలు ఆసక్తిచూపుతున్నారు. వచ్చేనెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయా గ్రామపంచాయతీల్లో మహిళలే సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 50శాతం రిజర్వేషన్ ప్రకటించడం గతంలో సర్పంచ్‌గా పని చేసిన పలువురు మహిళా సర్పంచ్‌లు, మహిళా సంఘాల నాయకురాళ్లు, మహిళా ఉద్యోగులు పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఖరారైన జైనథ్ సర్పంచు రిజర్వేషన్లు జైనథ్: మండలంలోని 29పాత, 13 కొత్త గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 42 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు శనివారం రాత్రి ఖరారయ్యాయి. జనరల్ : మాంగుర్ల, పిప్పర్వాడ, పూసాయి, కామాయి, దీపాయిగూడ, కంఠ, సాంగ్వి(కే), రాంపూర్(టి), బెల్గాం. జనరల్ మహిళ: పెండల్వాడ, మాండగాడ, ఆకోలి, బహదూర్‌పూర్, పిప్పల్‌గావ్, ఖాప్రి, కరంజి, కూర, భోరజ్, మాకోడ. బీసీ జనరల్ : బాలాపూర్, హషీంపూర్, గిమ్మ(కే), అడ, కౌఠ, సిర్సన్న. బీసీ మహిళ : లేకర్వాడ, సావాపూర్, ఆకుర్ల, నిరాల, తరోడ, కోర్ట. ఎస్సీ జనరల్ : గూడ, జైనథ్. ఎస్సీ మహిళ : పార్డి(కే), లక్ష్మీపూర్. ఎస్టీ జనరల్ : కాన్ప మేడిగూడ(సి), పార్డి(బి), సుందరగిరి, మార్గూడ. ఎస్టీ మహిళ : కాన్పమేడిగూడ(ఆర్), జామ్ని, బెల్లూరి. 42 పంచాయతీలకు 19 స్థానాలు జనరల్‌కు, 12 స్థానాలు బీసీలకు, నాలుగు స్థానా లు ఎస్సీలకు, ఏడు స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. దీంట్లో 50శాతం స్థానాలు(21 జీపీలు) మహిళలకు కేటాయించారు. 50శాతం రిజర్వేషన్ హర్షణీయం ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో మహిళలకోసం అమలు చేస్తున్న 50శాతం రిజర్వేషన్ హర్షించదగిన విషయం. ఇదే సమయంలో గ్రా మాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందే మహిళలను వారి కుటుంబ సభ్యులు రాజకీయంగా ప్రోత్సహించాలి. ప్రభుత్వం మహిళల ప్రాముఖ్యతను గుర్తించి రాజకీయంగా రిజర్వేషన్ వర్తింపజేస్తుంది. రాజకీయంగానే కాకుం డా కుటుంబ సభ్యులు అన్నిరంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. – ఏదుల్లా శోభ, బట్టిసావర్గాం -
మహిళల పట్ల రాహుల్‌కూ చిన్న చూపే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఈసారి రాష్ట్ర అసెంబ్లీలో, అలాగే క్యాబినెట్లో ఎక్కువ మంది మహిళలను చూడదల్చుకున్నాను’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరులోని బీఎల్డీ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళా శక్తి సమ్మేళనంలో వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పరమేశ్వరల వైపు తిరిగి ఈసారి ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడంటూ సభా ముఖంగానే వారిని ఆదేశించారు. చివరకు కర్ణాటక అసెంబ్లీలో 244 సీట్లకుగాను 15 మంది మహిళలకు మాత్రమే పార్టీ టిక్కెట్లు లభించాయి. దాదాపు ఐదు నెలల అనంతరం రాహుల్ గాంధీ జూలై 17వ తేదీన 51 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాను విడుదల చేశారు. వారిలో 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 10 మంది ప్రత్యేక ఆహ్మానితులు ఉన్నారు. మొత్తం 51 శాతం సభ్యుల్లో ఏడుగురంటే ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మహిళలకు 13.7 శాతం ప్రాతినిధ్యం లభించింది. ఆ ఏడుగురు మహిళల్లో కూడా నలుగురు శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఆహ్వానితులను తీసివేస్తే మొత్తం 23 మంది సీడబ్ల్యూసీ సభ్యులో ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. వారు ఎవరంటే సోనియా గాంధీ, అంబికా సోని, కుమారి సెల్జా. ఈ రకంగా చూస్తే మహిళలకు 13 శాతమే ప్రాతినిధ్యం లభించినట్లు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, రజనీ పాటిల్, ఆశా కుమారిలను శాశ్వత ఆహ్వానితులుగా తీసుకోగా అఖిల భారత మహిళా కాంగ్రస్ అధ్యక్షురాలు సుశ్మితా దేవ్‌ను ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. అంతకు 72 గంటల ముందే రాహుల్ గాంధీ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు సత్వర ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇక్కడ గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వలేక పోయామని సమర్థించుకున్నారు. మరి పార్టీ విషయంలో ప్రాతినిధ్యం కల్పించక పోవడాన్ని రాహుల్ గాంధీ ఎలా సమర్థించుకుంటారు? -
'33శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే'
విజయవాడ: మహిళలకు 33శాతం రిజర్వేషన్లపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఘాటుగా స్పందించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని అందరూ అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. చంద్రబాబుకు ఒక్కటే విషయం స్పష్టంగా చెప్తున్నానంటూ.. ఎవరో ఇస్తే తీసుకునేది రిజర్వేషన్ కాదన్నారు. మహిళా రిజర్వేషన్ దేశానికి అవసరమని చెప్పారు. మహిళల జనాభా దేశంలో సగమే కావొచ్చు కానీ ప్రతి కుటుంబాన్ని నడిపిస్తుంది మాత్రం మహిళలేనని అన్నారు. మహిళా రిజర్వేషన్ అనగానే పార్లమెంటులో కొంతమంది పేపర్లు చించుతూ నినాదాలు ఇస్తున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ పట్ల మాత్రమే ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించగలుగుతామని అన్నారు. -
'33శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే'
-
అప్పటిదాకా పోరాటం ఆగదు: మందకృష్ణ
నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించేంత వరకు తమ పోరాటం ఆపబోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాదిగ, మాల, మహిళా ఎమ్మెల్యేలకు కేసీఆర్ తన మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30 వ తేదీలోపు తెలంగాణలోని 10 జిల్లాల్లో టీఆర్ఎస్ మాదిగ, మాల ఎమ్మెల్యేలు, మహిళ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రోజుకో నియోజకవర్గం చొప్పున దీక్షలు చేపడుతామని తెలిపారు. అయినా స్పందించని పక్షంలో ఆగస్టు 1 నుంచి 100 రోజులపాటు దీక్ష చేపడతామని హెచ్చరించారు. దళితుల కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్‌పై ఎలాంటి అణిచివేతకు పాల్పడినా కేసీఆర్‌పై యుద్ధం చేపట్టేందుకు అయినా సిద్ధమేనని సవాల్ విసిరారు. -
ఆమె?
అంతరిక్షంలోని అంగారక గ్రహం... హిమాలయాలలోని ఎవరెస్ట్ శిఖరం... పసిఫిక్ మహా సముద్రంలోని అట్టడగు పొరలు... కావేవీ మహిళాభ్యుదయానికి అవరోధం... అని చేతల్లో నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కొండకచో.. మేం మాత్రమే సాధించగలం... మేము కాక ఇంకెవరు సాధించగలరు?.. అంటూ ఛాలెంజింగ్‌గా ముందుకు కదిలివస్తున్న మహిళా సాహసికులు నేడు మునుముందుకు దూసుకువస్తున్నారు. మరో పక్క భ్రూణ హత్యలు... ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు... ‘నిర్భయ’ంగా కొనసాగుతున్న లైంగిక దాడులు.. సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలకవర్గాలు మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్లు అంటూ ఊకదంపుడు మానేసి మహిళాభ్యున్నతికి స్పష్టమైన హామీ కావాలని మహిళా దినోత్సవం ప్రశ్నిస్తోంది. మహిళా వివక్ష రద్దు కావాలని, మహిళాభ్యున్నతికి ఆకాశమే హద్దు కావాలి. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆనందంతో మహిళా ఉద్యోగులు, ఉద్యమకారులు, మేధావులు సిద్ధమయ్యారు. -
‘పురం’..అతివల పరం
‘మేం వంటింటి కుందేళ్లం’..! కాదని వారు తేల్చిచెప్పారు.. ఏ రంగంలోనూ తీసిపోమని నిరూపించుకున్నారు. కట్టుబాట్ల అడ్డుగోడలను ఛేదించుకుని రాజకీయరంగ ప్రవేశంచేశారు.. విమర్శలను స్వీకరించారు. ప్రతివిమర్శలను ఎక్కుపెట్టారు. పురుషులకు ధీటుగా తలపడ్డారు.. పాలనాసత్తా తమకు ఉందని చాటుకుటున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని పురపోరులో విజయఢంకా మోగించారు. అధికస్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు మహిళా‘మణులు’. జిల్లాలోని గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి మునిసిపాలిటీల్లో అధికస్థానాలను కైవసం చేసుకున్నారు. చైర్మన్‌గిరీ చేపట్టి అభివృద్ధి మాటేమిటో చూపిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు ఈ విజేతలు. వారి ఆకాంక్ష ఫలించాలని..ఆశయం సిద్ధించాలని ఆశిద్దాం..! గద్వాల, న్యూస్‌లైన్: మహిళా ప్రాతినిథ్యం రిజర్వేషన్ల ప్రకారం స్థానికసంస్థల్లో 50 శాతం స్థానాల్లో మహిళలకు పోటీచేసే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న గద్వాల పట్టణ మహిళలు రిజర్వేషన్ ద్వారా లభించిన స్థానాలతోపాటు అదనంగా మరో ఐదుస్థానాల్లో విజయం సాధించి తామేంటో నిరూపించుకున్నారు. 33 వార్డులు ఉన్న మునిసిపాలిటీలో 21 స్థానాల్లో విజయం సాధించారు. మాజీమంత్రి డీకే. అరుణ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వారిలో 23 మంది విజయం సాధించగా, వారిలో 14 మంది మహిళలే ఉన్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి 9 మంది విజయం సాధించగా, వారిలోనూ ఏడుగురు మహిళలు ఉన్నారు. గద్వాల పట్టణ పాలనకూడా మహిళల నేతృత్వంలోనే కొనసాగనుంది. దీనికి తోడు గద్వాల మునిసిపల్ చైర్మన్ పదవిని కూడా మహిళలకు కేటాయించడంతో చైర్మన్ పదవితోపాటు వార్డుల్లో మహిళల సేవలు పట్టణ ప్రజలకు అందనున్నాయి. గద్వాల మునిసిపల్ చైర్మన్‌గా ఇప్పటికే అక్కల రమాదేవి ఒక పర్యాయం పనిచేశారు. ప్రస్తుతం రిజర్వేషన్‌తో మరోసారి ఆ కుర్చీలో మహిళ కూర్చోనున్నారు. చైర్మన్‌తోపాటు మరో 20 మంది మహిళా కౌన్సిలర్లు పురపాలనలో కీలకపాత్ర పోషించనున్నారు. వనపర్తిలో..13 మంది వనపర్తిటౌన్, న్యూస్‌లైన్: వనపర్తి మునిసిపాలిటీలో తొలిసారిగా మహిళల ప్రాధాన్యం పురుషులకు ధీటుగా పెరగనుంది. వనపర్తిలో 26 వార్డుల్లో ఈ సారి 13స్థానాల నుంచి విజయం సాధించారు. గత కౌన్సిల్లో మహిళలు 9మంది ఉండగా, 17 మంది పురుషులు ఉన్నారు. ఈ ఏడాది 50 శాతం మహిళా రిజర్వేషన్‌తో మహిళలకు కూడా పురుషులతో సమానంగా అతివల ఖాతాలోకి సగం సీట్లు వెళ్లాయి. మహిళలకు కేటాయించిన స్థానాల్లో అత్యధికంగా టీడీపీ ఆరు కైవసం చేసుకోగా, స్వతంత్రులుగా ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రం చెరిరెండు స్థానాలను దక్కించుకున్నారు. పాలమూరులో మహిళల హవా మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: పట్టణ మునిసిపాలిటీలోని 41వార్డుల్లో రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు 20వార్డులను కేటాయించారు. ఈ వార్డుల్లో మహిళలు సమీప ప్రత్యర్థులపై భారీవిజయాన్ని నమోదుచేసుకున్నారు. ఇక చైర్మన్‌గిరీ మహిళకు కేటాయించడంతో అతివల విజయం కీలకంగా మారింది. 38వార్డు జనరల్ స్థానం కాగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అమర్ తన సతీమణిని బరిలో నిలిపి గెలిపించుకున్నారు. పట్టణంలోని ఏడువార్డుల్లో స్వల్పమెజార్టీ సాధించిన మహిళలు, ఇతరవార్డుల్లో తమసత్తాను చాటుకున్నారు. విజేతలు వీరే..! టీఆర్ఎస్ అభ్యర్థులు.. 2 వార్డు నుంచి పోటీచేసిన కోరమోని జ్యోతి, 3వార్డు నుంచి కోరమోని వనజ, 6వ వార్డు నుంచి అనిత, 8వ వార్డు నుంచి న్నీస్ సుల్తానా, 9వ వార్డు నుంచి రహమతున్నీసాబేగం, 12వ వార్డు నుంచి ప్రసన్న ఆనంద్ విజయం సాధించారు. 24 నుంచి బి.కల్పన, 41వ వార్డు నుంచి ఎ.జంగమ్మ, 20వ వార్డులో అలివేలమ్మ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు..18వ వార్డు నుంచి అక్తర్ బేగం, 21 నుంచి పద్మజ, 30వ వార్డు నుంచి ఈ.శ్రావణి, 31 నుంచి రేష్మ బేగం, 38 రాధఅమర్ విజయం సాధించారు. ఇతరులు.. 13వవార్డు నుంచి యశోద, 15 నుంచి ఫరీదా బేగం, 17వ వార్డులో జేబాఫాతిమా, 22 వార్డు నుంచి పద్మ, 23వ వార్డులో బాలీశ్వరి, 27వ వార్డు నుంచి అజియబేగం, 29 నుంచి ఎం.అలివేలు గెలుపొందారు. నిలిచారు.. సాధించారు షాద్‌నగర్ మునిసిపాలిటీలో 23 వార్డులు ఉండగా 12వార్డుల్లో మహిళలు గెలుపొంది తమ సత్తా చాటారు. 1వ వార్డు ఆభ్యర్థి ఎంఐఎం ఆసియా భేగం సమీప అభ్యర్థి సలీమాభీ కాంగ్రెస్ ఆభ్యర్థి, 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మాణెమ్మ స్వతంత్ర అభ్యర్థి వెంకటమ్మ, 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వన్నాడ లావణ్య టీడీపీ అభ్యర్థి ఉషారాణి, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భ్రమరాంబ స్వతంత్ర అభ్యర్థి ఇందిర, 11 వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణవేణి టీడీపీ అభ్యర్థి గోర్యానాయక్, 14వ వార్డు అభ్యర్థి రేటికల్ మీనా టీడీపీ అభ్యర్థి ప్రభావతి, 15 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మీనా టీడీపీ అభ్యర్థి శాంతి, 16వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ప్రమీళ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మమ్మ, 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరీ టీడీపీ అభ్యర్థి రఘునాథ్‌యాదవ్, 19 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజయశ్రీ టీడీపీ అభ్యర్థి నాగలక్ష్మి, 20 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మహమూదాభేగం స్వతంత్ర అభ్యర్థి కనకదుర్గ, 21 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న టీడపీ అభ్యర్థి పావని, 22 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రషిదా భేగం కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ పై విజయం సాధించారు. అయిజ నగరపంపచాయతీలో మొత్తం 20వార్డులు ఉండగా, రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా నగరపంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 10 వార్డులను కేటాయించారు. వాటిలో 1, 2 ,5,6,16 వార్డులను మహిళ జనరల్‌కు కేటాయించారు. అదేవిధంగా 7,8,15 వార్డులను బీసీ మహిళలకు, 12,13 వార్డులను ఎస్సీ మహిళలకు కేటాయించారు. వారిలో కాంగ్రెస్‌పార్టీనుంచి ముగ్గురు మహిళలు గెలుపొందగా టీఆర్ఎస్ పార్టీనుంచి ఏడుగురు మహిళలు గెలిచారు.