న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఖాళీగా ఉన్న 9,000 పోస్టుల్లో మహిళలకు సగం అంటే 4,500 పోస్టులు దక్కనున్నాయి. ‘ప్రస్తుతం ఆర్‌పీఎఫ్‌లో మహిళా కానిస్టేబుళ్లు 2.25 శాతం మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఖాళీల్లో ఎక్కువగా మహిళలను నియమించాలని మోదీ నిర్ణయించారు’ అని గోయల్ బదులిచ్చారు. బిహార్ ప్రభుWత్వం మాదిరి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కేంద్రం పరిశీలిస్తుందా? అన్న ప్రశ్నకు ‘ఇప్పటివరకైతే అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు..’ అని మంత్రి చెప్పారు.
ఇక రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు వంటి ప్రీమియం రైళ్లతో పాటు రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశమేమీ కేంద్రానికి లేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు సురేంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment