‘పురం’..అతివల పరం | womens josh in elections | Sakshi
Sakshi News home page

‘పురం’..అతివల పరం

Published Tue, May 13 2014 4:31 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

‘పురం’..అతివల పరం - Sakshi

‘పురం’..అతివల పరం

 ‘మేం వంటింటి కుందేళ్లం’..! కాదని వారు తేల్చిచెప్పారు.. ఏ రంగంలోనూ తీసిపోమని నిరూపించుకున్నారు. కట్టుబాట్ల అడ్డుగోడలను ఛేదించుకుని రాజకీయరంగ ప్రవేశంచేశారు.. విమర్శలను స్వీకరించారు. ప్రతివిమర్శలను ఎక్కుపెట్టారు. పురుషులకు ధీటుగా తలపడ్డారు.. పాలనాసత్తా తమకు ఉందని చాటుకుటున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని పురపోరులో విజయఢంకా మోగించారు. అధికస్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు మహిళా‘మణులు’. జిల్లాలోని గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి మునిసిపాలిటీల్లో అధికస్థానాలను కైవసం చేసుకున్నారు. చైర్మన్‌గిరీ చేపట్టి అభివృద్ధి మాటేమిటో చూపిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు ఈ విజేతలు. వారి ఆకాంక్ష ఫలించాలని..ఆశయం సిద్ధించాలని ఆశిద్దాం..!
 
 గద్వాల, న్యూస్‌లైన్:
మహిళా ప్రాతినిథ్యం రిజర్వేషన్ల ప్రకారం స్థానికసంస్థల్లో 50 శాతం స్థానాల్లో మహిళలకు పోటీచేసే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న గద్వాల పట్టణ మహిళలు రిజర్వేషన్ ద్వారా లభించిన స్థానాలతోపాటు అదనంగా మరో ఐదుస్థానాల్లో విజయం సాధించి తామేంటో నిరూపించుకున్నారు.  33 వార్డులు ఉన్న మునిసిపాలిటీలో 21 స్థానాల్లో విజయం సాధించారు. మాజీమంత్రి డీకే. అరుణ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వారిలో 23 మంది విజయం సాధించగా, వారిలో 14 మంది మహిళలే ఉన్నారు.

ఇక టీఆర్‌ఎస్ నుంచి 9 మంది విజయం సాధించగా, వారిలోనూ ఏడుగురు మహిళలు ఉన్నారు. గద్వాల పట్టణ పాలనకూడా మహిళల నేతృత్వంలోనే కొనసాగనుంది. దీనికి తోడు గద్వాల మునిసిపల్ చైర్మన్ పదవిని కూడా మహిళలకు కేటాయించడంతో చైర్మన్ పదవితోపాటు వార్డుల్లో మహిళల సేవలు పట్టణ ప్రజలకు అందనున్నాయి. గద్వాల మునిసిపల్ చైర్మన్‌గా ఇప్పటికే అక్కల రమాదేవి ఒక పర్యాయం పనిచేశారు. ప్రస్తుతం రిజర్వేషన్‌తో మరోసారి ఆ కుర్చీలో మహిళ కూర్చోనున్నారు. చైర్మన్‌తోపాటు మరో 20 మంది మహిళా కౌన్సిలర్లు పురపాలనలో కీలకపాత్ర పోషించనున్నారు.  
 
 వనపర్తిలో..13 మంది

 వనపర్తిటౌన్, న్యూస్‌లైన్: వనపర్తి మునిసిపాలిటీలో తొలిసారిగా మహిళల ప్రాధాన్యం పురుషులకు ధీటుగా పెరగనుంది. వనపర్తిలో 26 వార్డుల్లో ఈ సారి 13స్థానాల నుంచి విజయం సాధించారు. గత కౌన్సిల్‌లో మహిళలు 9మంది ఉండగా, 17 మంది పురుషులు ఉన్నారు. ఈ ఏడాది 50 శాతం మహిళా రిజర్వేషన్‌తో మహిళలకు కూడా పురుషులతో సమానంగా అతివల ఖాతాలోకి సగం సీట్లు వెళ్లాయి. మహిళలకు కేటాయించిన స్థానాల్లో అత్యధికంగా టీడీపీ ఆరు కైవసం చేసుకోగా, స్వతంత్రులుగా ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రం చెరిరెండు స్థానాలను దక్కించుకున్నారు.
 
 పాలమూరులో మహిళల హవా
 మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ, న్యూస్‌లైన్: పట్టణ మునిసిపాలిటీలోని 41వార్డుల్లో రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు 20వార్డులను కేటాయించారు. ఈ వార్డుల్లో మహిళలు సమీప ప్రత్యర్థులపై భారీవిజయాన్ని నమోదుచేసుకున్నారు. ఇక చైర్మన్‌గిరీ మహిళకు కేటాయించడంతో అతివల విజయం కీలకంగా మారింది. 38వార్డు జనరల్ స్థానం కాగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అమర్ తన సతీమణిని బరిలో నిలిపి గెలిపించుకున్నారు. పట్టణంలోని ఏడువార్డుల్లో స్వల్పమెజార్టీ సాధించిన మహిళలు, ఇతరవార్డుల్లో తమసత్తాను చాటుకున్నారు.

 విజేతలు వీరే..!
 టీఆర్‌ఎస్ అభ్యర్థులు.. 2 వార్డు నుంచి పోటీచేసిన కోరమోని జ్యోతి, 3వార్డు నుంచి కోరమోని వనజ, 6వ వార్డు నుంచి అనిత, 8వ వార్డు నుంచి న్నీస్ సుల్తానా, 9వ వార్డు నుంచి రహమతున్నీసాబేగం, 12వ వార్డు నుంచి ప్రసన్న ఆనంద్ విజయం సాధించారు.   24 నుంచి బి.కల్పన, 41వ వార్డు నుంచి ఎ.జంగమ్మ, 20వ వార్డులో అలివేలమ్మ గెలుపొందారు.

కాంగ్రెస్ అభ్యర్థులు..18వ వార్డు నుంచి అక్తర్ బేగం, 21 నుంచి పద్మజ,  30వ వార్డు నుంచి ఈ.శ్రావణి, 31 నుంచి రేష్మ బేగం,  38 రాధఅమర్ విజయం సాధించారు.

 ఇతరులు.. 13వవార్డు నుంచి యశోద, 15 నుంచి ఫరీదా బేగం, 17వ వార్డులో జేబాఫాతిమా, 22 వార్డు నుంచి పద్మ, 23వ వార్డులో బాలీశ్వరి, 27వ వార్డు నుంచి అజియబేగం, 29 నుంచి ఎం.అలివేలు గెలుపొందారు.  
 
 నిలిచారు.. సాధించారు

 
 షాద్‌నగర్ మునిసిపాలిటీలో 23 వార్డులు ఉండగా 12వార్డుల్లో మహిళలు గెలుపొంది తమ సత్తా చాటారు. 1వ వార్డు ఆభ్యర్థి ఎంఐఎం ఆసియా భేగం సమీప అభ్యర్థి సలీమాభీ కాంగ్రెస్ ఆభ్యర్థి, 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మాణెమ్మ స్వతంత్ర అభ్యర్థి వెంకటమ్మ, 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వన్నాడ లావణ్య టీడీపీ అభ్యర్థి ఉషారాణి, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భ్రమరాంబ స్వతంత్ర అభ్యర్థి ఇందిర, 11 వ వార్డు టీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణవేణి టీడీపీ అభ్యర్థి గోర్యానాయక్, 14వ వార్డు అభ్యర్థి రేటికల్ మీనా టీడీపీ అభ్యర్థి ప్రభావతి, 15 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మీనా టీడీపీ అభ్యర్థి శాంతి, 16వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ప్రమీళ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మమ్మ, 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరీ టీడీపీ అభ్యర్థి రఘునాథ్‌యాదవ్, 19 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజయశ్రీ టీడీపీ అభ్యర్థి నాగలక్ష్మి, 20 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి మహమూదాభేగం స్వతంత్ర అభ్యర్థి కనకదుర్గ, 21 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న టీడపీ అభ్యర్థి పావని, 22 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రషిదా భేగం కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ పై విజయం సాధించారు.

అయిజ నగరపంపచాయతీలో మొత్తం 20వార్డులు ఉండగా, రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా నగరపంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 10 వార్డులను కేటాయించారు. వాటిలో 1, 2 ,5,6,16 వార్డులను మహిళ జనరల్‌కు కేటాయించారు. అదేవిధంగా 7,8,15 వార్డులను బీసీ మహిళలకు, 12,13 వార్డులను ఎస్సీ మహిళలకు కేటాయించారు. వారిలో కాంగ్రెస్‌పార్టీనుంచి ముగ్గురు మహిళలు గెలుపొందగా టీఆర్‌ఎస్ పార్టీనుంచి ఏడుగురు మహిళలు గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement