
సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. సునీతారావు ఆరోపించారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను మభ్య పెట్టేందుకే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల బిల్లు తెరపైకి తెచ్చారని, జనగణన జరగకుండా, మహిళల జనాభా తెలియకుండా ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
మంగళవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, మహి ళా బిల్లును వెంటనే అమలు చేసే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే జనగణన పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. తక్షణం జరగబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మోదీని నమ్మే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఇదో కొత్త నాటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.