ఆకాశంలో సగం అన్నారు స్త్రీలను. బిడ్డకు జన్మనిచ్చి ΄పౌరుడిగా దేశానికి ఇస్తుంది స్త్రీ. కుటుంబ నిర్మాణంలో సమాజ ముందడుగులో ఆమె భాగస్వామ్యం సగం.
జనాభాలో ఆమె సగం. కాని బడ్జెట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆమెప్రాధాన్యం వెనక్కు వెళ్లి ఇతరప్రాధాన్యాలు ముందుకొస్తాయి. ‘ఇది పేదవాడి బడ్జెట్’, ‘రైతు బడ్జెట్’, ‘మధ్యతరగతి బడ్జెట్’ లాంటి మాటలు వినిపిస్తాయి తప్ప ‘ఇది స్త్రీ సంక్షేమం కోరిన బడ్జెట్’ అనే మాట వినపడదు. ఇప్పుడు రానున్నది బడ్జెట్ కాలం.
దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఆయా సభలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నాయి. ఈ సందర్భంగా స్త్రీలు ఏం కోరుతున్నారు? ఆర్థిక మంత్రులకు ఏం సందేశం ఇస్తున్నారు?
ఆదాయం పెంచుకునేలా చూడాలి
దివ్యాంగులు, సీనియర్ మహిళలు, ఒంటరి మహిళల గురించి బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి సారించాలి. వారు స్వయంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి. కుటీర పరిశ్రమలతోపాటు హోమ్‌మేడ్ ఇండస్ట్రీలలో ప్రోత్సహించాలి. విద్య, నైపుణ్యావృద్ధి, ఉపాధి సంబంధించి నోడల్ డిపార్ట్‌మెంట్‌లు కొత్త కొత్త ప్రయోగాల్లో మహిళలను భాగస్వాములు చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందించాలి. సాఫ్ట్‌వేర్, మెడిసిన్, రేడియోగ్రఫీ తదితర అత్యంత నైపుణ్యం కలిగిన రంగాలలో స్త్రీల కోసం బడ్జెట్‌లో నిధులు వెచ్చించి ప్రోత్సహించాలి. వెల్‌బీయింగ్, కేర్ ఎకానమిలతో స్త్రీలు ఆదాయం పెంచుకునేలా చూడాలి.
– చిత్రామిశ్ర, ఐఏఎస్, పీఓ, ఐటీడీఏ, ఏటూరునాగారం
విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
బాలికల విద్యకుప్రాధాన్యత ఇవ్వాలి. శాస్త్ర, సాంకేతికరంగాల్లో బాలికలు రాణించేలా కార్యక్రమాలు నిర్వహించాలి.ప్రాథమిక పాఠశాల సమయంలో డ్రా΄పౌట్స్‌ను నిరోధించాలి. వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలి. పనిచేసే తల్లుల పిల్లలను చూసుకునేందుకు పని స్థలాల్లో కేర్‌టేకర్లను ఏర్పాటు చేయాలి. పాఠశాల, కళాశాల రోజుల్లో వైద్యశిబిరాల ద్వారా వివిధ వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు పరీక్షలు చేయాలి.
– శేషాద్రిని రెడ్డి, ఏఎస్పీ, వేములవాడ
కుటీర పరిశ్రమల ఏర్పాటు
పురుషులతో సమానంగా మహిళలు విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదిగితేనే ప్రపంచ దేశాలతో ΄ోల్చి నప్పుడు గర్వపడేలా దేశాభి వృద్ధిని సాధించగలం. మహిళల ఎదుగుదలకు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. అడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు అందోళనకు గురి కాకుండా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. యువతులు ఇంటర్, డిగ్రీతోనే చదువు మానేసి వివాహం చేసుకోవడం వల్ల పురుషులతో సమానంగా ఎదగలేక΄ోతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించాలి. స్కూల్స్, జూనియర్, సాంకేతిక కళాశాలలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి. బాలికలు, మహిళలకు ఉచిత వ్యాక్సిన్‌లు ఇచ్చేలా బడ్జెట్ నిధులు కేటాయించాలి.
– ఇంజారపు పూజ, ఎస్పీ (ఐపీఎస్ అధికారి), పీటీసీ, మామునూరు
రక్షణకు నిధులు పెంచాలి
పెరుగుతున్న మహిళా జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు పెంచాలి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసే వివిధ శాఖలకు ఆ నిధులను ఖర్చు చేయాలి. వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు గ్రామాల్లో ప్రత్యేక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి. ప్రత్యేకమైన పథకాలు రూ΄÷ందించాలి. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు అనుకూలంగా మౌలిక వసతులు కల్పించడం ముఖ్యం. మహిళలపై రాక్షసంగా వ్యవహరించేవారికి కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాల్లో మార్పు తీసుకురావాలి. రాజకీయపరంగా అన్ని విభాగాల్లో మహిళలు తన కలలను సాకారం చేసుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
– విజయలక్ష్మి, జడ్పీ సీఈఓ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
వ్యాపార రంగంలో భాగస్వామ్యం
అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. మన దేశంలోనూ అన్ని రంగాల్లోప్రాతినిధ్యం పెరిగింది. ఉన్నత చదువుల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు వ్యాపారరంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచాలి. వైద్యం, శారీరక దృఢత్వం కోసం అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్ఠం చేయాలి. మహిళలు విభిన్న రంగాల్లో రాణించేలా రిజర్వేషన్లు కల్పించాలి. మొత్తంగా రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, విద్య, వైద్యం అన్నింటా మహిళలనుప్రొత్సహించాలి.
– లక్ష్మీకిరణ్, అదనపు కలెక్టర్, కరీంనగర్
విద్య వైద్యం రవాణా ప్రభుత్వానిదే
ఇది గ్లోబలైజేషన్ కాలం. గ్లోబలైజేషన్‌కి హ్యూమన్‌ఫేస్ ఉండదని ఆర్థిక వేత్త అమర్త్యసేన్ అన్న మాటలు ఈ మూడు దశాబ్దాల్లో స్త్రీల పట్ల సాగుతున్న వివక్ష చూసినప్పుడు సత్యమని తేలాయి. కనీసం విద్య, వైద్యరంగాలనైనా ప్రభుత్వం స్వయంగా నిర్వహించినప్పుడు మాత్రమే ఆ సేవలకు మానవముఖం ఉంటుంది. విద్య, వైద్యంతోపాటు ప్రజా రవాణా, ఉపాధి... ఈ నాలుగూ ప్రభుత్వరంగంలో ఉన్నప్పుడే మహిళలకు రాజ్యాంగంలో సూచించిన విధంగా జీవనోపాధి పరస్పర గౌరవంతో కూడిన జీవితం సాధ్యమవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగిలిన ఏ రంగంలోనూ మగవాళ్లకు, మహిళలకు సమాన పనికి సమానవేతనం లభించడం లేదు. ప్రజల సంక్షేమమే ప్రధానంగా లేని బడ్జెట్‌లో మహిళల సంక్షేమం దుర్భిణీతో చూసినా దొరకదు. ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరంలో నిర్దేశించిన మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌లో సంపూర్ణ మహిళ అక్షరాస్యత, ప్రసవ మరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యాలు. ఆ లక్ష్యాలను చేరడానికి నామమాత్రపు చర్యలు తప్ప చిత్తశుద్ధితో ప్రణాళికలు చేపట్టలేదు.
‘ఇలాగే కొనసాగితే భారతదేశం 2040 నాటికి కూడా మహిళల అక్షరాస్యత సంపూర్ణంగా సాధించలేదు’ అని తదుపరి సమీక్షలో ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించిన విషయాన్ని మర్చి΄ోకూడదు. నిర్భయ ఘటన నేపథ్యంలో జస్టిస్ వర్మ కమిటీ ‘ప్రజారవాణా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి’ అన్నది. ఆర్‌టీసీ బస్సులో ఎప్పుడైనా నిర్భయ ఘటనలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయా? మహిళకు క్షేత్రస్థాయిలో అందాల్సిన కనీస అవసరాల్లో అందడం లేదు. మొక్కకు నీరు ΄ోయకుండా చెట్టుకు అంటుకడతానంటే దానిని అభివృద్ధి అనలేం.
– తోట జ్యోతిరాణి, ఎకనమిక్స్ ప్రొఫెసర్ (రిటైర్డ్), కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment