టెక్కలిలో మహిళా సంఘాలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో మహిళల సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా చొరవ తీసుకున్న ప్రభుత్వం.. వీరు తీసుకున్న బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీని తాజాగా జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వరుసగా మూడో ఏడాది సొమ్మును వారి ఖాతాల్లో నేరుగా వేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి.
ఆదివారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే తొగూరు ఆర్థర్, పాణ్యం, గడివేముల మండలాల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. మహిళలకు చెక్కులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment