పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్..! ఏప్రిల్ 1, 2022 నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, టర్మ్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీని నగదు రూపంలో చెల్లించడాన్ని నిలిపివేస్తాయని పోస్ట్ డిపార్ట్‌మెంట్ సర్క్యులర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వీటికి అందించే వడ్డీలను ఖాతాదారుడి పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే వడ్డీ జమ చేయబడుతుందని పోస్ట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఖాతాదారుడు పొదుపు ఖాతాను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ , టర్మ్ డిపాజిట్ ఖాతాల ఖాతాలతో లింక్ చేయలేకపోతే ఇబ్బందులు తలెత్తనున్నాయి.
గ్రామీణ ప్రాంత ప్రజలకు, వృత్తి వ్యాపారాలు చేసేవారు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసేవారికి పోస్టాఫీసులు అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్స్‌ను అందిస్తున్నాయి. వాటిలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ వంటి పథకాలు ఎక్కువగా ఆదరణను పొందాయి. ఈ పథకాల్లో సేవింగ్స్ చేయడం ద్వారా ఖాతాదారులు వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతారు. ఈ వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా కూడా చేసుకునే సదుపాయం ఉంది. అయితే, ఈ వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కు సంబంధించిన వడ్డీ ఆదాయాన్ని అనుసంధానిత పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంకు ఖాతాకు మాత్రమే జమ చేస్తామని పోస్టల్ శాఖ ప్రకటించింది. సదరు స్కీమ్‌కు సంబంధించిన వడ్డీ నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, లేదా బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. మార్చి 31వ తేదీలోపు వారి ఖాతాలను పోస్టాఫీసు పొదుపు ఖాతా, బ్యాంక్ అకౌంట్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ తేదీలోపు అనుసంధానించకపోతే వడ్డీ ఆదాయాన్ని సంబంధిత సండ్రీ అకౌంట్‌కు బదిలీ చేయనుంది. అయితే, ఏప్రిల్ 1 నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా నగదు రూపంలో చెల్లింపులు ఉండవని, ఔట్ స్టాండింగ్ వడ్డీ ఆదాయాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతా, చెక్ ద్వారా మాత్రమే చెల్లిస్తామని పోస్టల్ శాఖ. స్పష్టం చేసింది.
చదవండి: ఎన్‌ఎస్‌సీ, పీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్‌లలో వడ్డీరేట్లు.. పన్ను రాయితీలు ఇలా
Comments
Please login to add a commentAdd a comment