న్యూఢిల్లీ: నగదు బదిలీ సర్వీసులకు ఉపయోగపడే తమ టిప్ జార్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పేమెంట్ గేట్‌వే సంస్థ రేజర్‌పేతో జట్టు కట్టినట్లు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్ వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్లు మొదలైన విధానాల్లో రేజర్‌పే ఇంటర్‌ఫేస్ ద్వారా దేశీయంగా నగదు పంపడం, అందుకోవడానికి సంబంధించి లావాదేవీలు జరపవచ్చని పేర్కొంది.
రాబోయే రోజుల్లో మరిన్ని పేమెంట్ ప్రొవైడింగ్ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ట్విటర్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవారు, దాని ద్వారా ఆదాయం పొందడానికి టిప్ జార్ ఫీచర్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పరిమిత సంఖ్యలో క్రియేటర్లు, జర్నలిస్టులు, లాభాపేక్ష రహిత సంస్థలు మొదలైన వర్గాలకు చెందిన యూజర్లకు ట్విటర్ దీన్ని గత నెల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను తమ ప్రొఫైల్‌కు జోడించడం ద్వారా యూజర్లు .. టిప్‌లను స్వీకరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment