social media You tube
-
ఎవరీ మేఘన కౌర్?.. దేశంలో ఆమెకు ఎందుకంత క్రేజ్?
ముంబైకి చెందిన మేఘన కౌర్ సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన యూట్యూబ్ ఛానల్ ‘షీ ట్రుబుల్మేకర్’ బాగా ΄పాపులర్ అయింది. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, సిందీ భాషలు మాట్లాడే మేఘనకు ప్రయాణాలు చేయడం, బ్యాడ్మింటన్ ఆడడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అమెరికన్ సింగర్ జస్టిన్ బీబర్ పాటలు వినడం అంటే బోలెడు ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉత్సాహం చూపే మేఘన జంతుప్రేమి. సామాజిక సేవ కార్యక్రమాల్లో ΄పాల్గొంటుంది. ‘క్రియేటర్ ఎకనామీ ఊపందుకున్న ఈ సమయంలో మీదైన సొంత శైలి ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేస్తారు?’ అని అడిగితే ‘నా నుంచి ఆడియెన్స్ ఏం ఆశిస్తున్నారనే దాని గురించి ఆలోచించడంతో పాటు, నేను ఆడియెన్స్‌లో ఒకరిగా మారి నన్ను నేను విశ్లేషించుకుంటాను. సబ్జెక్ట్ విషయంలో రెలవెంట్‌గా ఉండడం అనేది ముఖ్యమైనది. అందుకే ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతాను. మారుతున్న ట్రెండ్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతాను. సబ్జెక్ట్ విషయానికి వస్తే అతి తెలివి ఎప్పుడూ ప్రదర్శించవద్దు. ఎందుకంటే ఆడియెన్స్ మనకంటే తెలివైన వాళ్లు’ అంటుంది మేఘన. ఎంతవారికైనా ట్రోలింగ్ తప్పదు. సోషల్ మీడియా స్టార్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన మేఘన ట్రోలింగ్‌పై ఇలా అంటుంది.. ‘నేను ఎమోషన్ పర్సన్. చిన్న విషయాలకే చిన్నబుచ్చుకుంటాను. అలాంటి నేను ఇన్ఫ్లూయెన్సర్గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ట్రోలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అనిపించింది. అయితే ఆ తరువాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఒక్క హేట్ కామెంట్ ఉన్నచోట పది ప్రశంసలు కనిపిస్తాయి. మరి ఆ ఒక్క కామెంట్‌ను చూస్తూ బాధ పడడం ఎందుకు! అందుకే ΄పాజిటివ్ కామెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడతాను. వాటి ద్వారా శక్తిని గ్రహిస్తాను. సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్‌గా రాణించడానికి మొదట ఉండాల్సింది సహనం. ఆ తరువాతే ఏదైనా!’ -
ఎవరి ‘గోడ’ వారిదే!
మనం శబ్దాన్ని గుర్తిస్తాం, శబ్దానికి చెవినిస్తాం, ఫెళఫెళార్భాటంగా సాగే శబ్దవిప్లవాలకు స్పందిస్తాం. నీటిని గుర్తిస్తాం కానీ చాపకింద నీటిని చటుక్కున గుర్తించలేకపోతాం. వాస్తవం ఏమిటంటే, మనం వెంటనే పోల్చుకోలేని నిశ్శబ్దాలూ, నిశ్శబ్ద విప్లవాలూ; చాప కింద నీరు లాంటి నిరంతర పరిణామాలూ కూడా ఉంటాయి. సాధారణంగా అవే మనిషి జీవితాన్ని, అతని నమ్మకాల్ని తలకిందులు చేస్తాయి. అతనికి తెలియకుండానే అతని కరచరణాలను కట్టడి చేసి శాసిస్తాయి. సాంకేతికత అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం. ఎప్పుడో చరిత్రపూర్వయుగంలో మనిషి కనిపెట్టిన చక్రం, ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాలపాటు అతని భవిష్యత్తును నిర్దేశించింది; అతని జీవ నాన్ని, అతను కూడా ఊహించలేనన్ని కొత్త కొత్త మలుపులు తిప్పింది. చక్రం తిప్పనిదేముంది? ఉన్న సాంకేతికత పోయి కొత్త సాంకేతికత రావడానికీ, అది కొత్త కొత్త మార్పులు కొని తేవడానికీ నిన్నమొన్నటివరకూ ఎక్కువ సమయం పట్టేది. ఆ లోపల ‘పాత’ అనేది సంప్రదాయంగా ఘనీభవించిపోయి కొత్తను అడ్డుకునేది; కాలగమనాన్ని తన అరచేతులతో ఆపడానికి ప్రయత్నించేది. అలాంటి సంప్రదాయ శాసనం నుంచి బయటపడి తన ఉనికిని స్థాపించుకోవడానికి ‘కొత్త’ ఎంతో పెనుగులాడేది, ఆ ఘర్షణలో సంప్రదాయానిదే పై చేయి అయేది. కానీ ఆధునికకాలం దగ్గరికి వచ్చేసరికి సాంకేతికత ఒక మహావిజృంభణగా మారిపోయింది. ఒక మహావిప్లవరూపం ధరించింది. అప్పటికి కొత్త అనుకున్న సాంకేతికతకు అలవాటు పడే లోపలే దానిని పాతగా మార్చివేస్తూ అంతకన్నా కొత్తదైన సాంకేతికత అడుగుపెట్టడం ప్రారంభించింది. అందువల్ల పాతకు సంప్రదాయంగా ఘనీభవించే వ్యవధి బాగా తగ్గిపోయి, కొత్త సాంకేతికత ముందు అది కూడా తలవంచి దారినివ్వడం అనివార్యమైంది. ఆ విధంగా సంప్రదాయ, సాంకేతికతల బలాబలాలు తారుమారైపోయాయి. కొత్త సాంకేతికత రెండు మూడు తరాల కాలవ్యవధిలో అడుగుపెట్టడం కూడా పోయి ఒకే తరంలో, కళ్ళు మూసి తెరచే లోగానే ప్రత్యక్షం కావడం ఇప్పుడు సర్వసాధారణమైంది. ఏదైనా సమాచారాన్ని ‘రియల్ టైమ్’లో ప్రపంచవ్యాప్తం చేయడమూ; పుటలకు పుటలు మనం రాసినదానిని మనం కోరుకున్న భాషలోకి తక్షణం తర్జుమా చేసి ఇవ్వడమే కాదు; కీబోర్డుమీద చిటికెనవేలితో నొక్కితే చాలు, మన గురించిన మొత్తం సమాచారాన్ని మన కళ్ళముందు నిలిపే స్థాయికి సాంకేతికత చేరుకుంది. రోబోను సృష్టించిన మనిషి, సాంకేతికత చేతిలో తనే రోబోగా మారాడు. సమాచారమాధ్యమాల రంగానికే వస్తే ఈ సాంకేతిక మహావిప్లవం తెచ్చిన మార్పు ఎన్నో ఆసక్తికరమైన పరిస్థితులను çసృష్టించింది. సామాజిక మాధ్యమాల పేరిట ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వగైరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో అంతవరకూ ఆధిపత్యం చలాయించిన ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు సాంప్రదాయిక మాధ్యమాలుగా మారాయి. సామాజిక, సాంప్రదాయిక మాధ్యమాల సహజీవనం వినూత్న పరిణామాలకు దారి తీసింది. అంతవరకు స్థలకాలాల నిర్ణయాధికారం సాంప్రదాయిక మాధ్యమాల నిర్వాహకుల చేతుల్లో ఉండేది. ఇప్పుడా అధికారం స్మార్ట్ ఫోన్, లేదా ల్యాప్ టాప్ దగ్గరున్న ప్రతి వ్యక్తికీ బదిలీ అయింది. అతను తాను కోరుకున్నంత స్థలంలో, తను ఎప్పుడనుకుంటే అప్పుడు తన అభిప్రా యాన్ని ప్రచురించుకునే వెసులుబాటు వచ్చింది. ఫేస్బుక్ పరిభాషలో చెప్పాలంటే ‘గోడ’ రూపంలో తను సృష్టించుకున్న తన పత్రికకు, తన ఛానెల్‌కు తనే సంపాదకుడు. తన వాల్ మీద ఏది పోస్టు చేయాలో నిర్ణయించుకునే అధికారం తనదే. ‘వెనకటి మహాభారతం పద్దెనిమిది పర్వాలు కావచ్చు, ఆధునిక మహాకావ్యం పద్దెనిమిది పేజీలే’ ననే అర్థంలో మహాకవి శ్రీశ్రీ చేసిన వ్యాఖ్య ఒకటి ప్రసిద్ధమే. ఇప్పుడు మన ఫేస్బుక్ వాల్ మీద, లేదా మన బ్లాగులో ఏకకాలంలో పద్దెనిమిది పంక్తుల్లో ఒక మినీ వ్యాసాన్ని, పద్దెనిమిది పుటల్లో ఒక కావ్యాన్నే కాదు, పద్దెనిమిది పర్వాల మహేతిహాసాన్ని కూడా రాయగలిగినంత జాగా అందుబాటులోకి వచ్చింది. సాంకేతికవిప్లవం ఆవిష్కరించే వింతలకు అంతే ఉండదు. కొత్త సాంకేతికత ఒక్కొక్కసారి సుదూరగతానికి చెందిన పాతపద్ధతులను కూడా కొత్త మెరుపుతో ముందుకు తేగలదు. పూర్వం, అచ్చుయంత్రం కాదు సరికదా, లిఖితసంప్రదాయం కూడా వేళ్లూనుకొనని రోజుల్లో పురాణశ్రవణం ఉండేది. పౌరాణికుడు, శ్రోతలు ఎదురెదురుగా ఉండేవారు. శ్రోతల అభిరుచులు, అభిప్రాయాలూ, అనుకూల, వ్యతిరేకస్పందనలు తక్షణమే పౌరాణికుని దృష్టికి వచ్చేవి. అవి కూడా పురాణ శ్రవణాన్ని, కథానిర్మాణాన్ని ప్రభావితం చేసేవి. ఆ విధంగా పురాణకథనం ద్వికర్తృకంగా, లేదా జంట నిర్మాణంగా రూపుదాల్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో మళ్ళీ అదే పద్ధతి పునరావృతమైంది. తను చదివిన, లేదా విన్న వాటిపై పాఠకుడు, శ్రోత అప్పటికప్పుడు స్పందించగలుగుతున్నాడు. ఆ విధంగా అది ఒక రచనను ‘రియల్ టైమ్’లో ప్రభావితం చేసి అవసరమైతే మార్చుకునే అవకాశా న్నిస్తున్నది. ప్రజాస్వామికమైన చర్చను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. సంపాదకుడనే అంకుశం లోపించినప్పుడు సామాజిక మాధ్యమాలు మదపుటేనుగుల స్వైర విహారానికి ఆటపట్టులవుతాయి. ఉచితానుచితాలు, సభ్యతా సంస్కారాల హద్దులు చెరిగిపోవ డమూ సంభవిస్తుంది. అయితే స్థలకాలాలు, శాస్త్రసాంకేతిక నూతనావిష్కారాలకు అతీతంగా ఎల్ల కాలాలకూ, ఎల్ల ప్రాంతాలకూ వర్తించే మన్నికైన మానవ విలువలు; విజ్ఞతావివేకాల కొలమానాలు ఎప్పుడూ సజీవంగా ఉంటూనే ఉంటాయి. సాంప్రదాయిక, సామాజిక మాధ్యమాల తేడా లేకుండా సంపాదక స్థానంలో ఉన్న ప్రతి ఒకరిపై జనాభిప్రాయమనే పెద్ద అంకుశం అజ్ఞాతంగా ఉండి నియంత్రిస్తూనే ఉంటుంది. ఆ జనాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించే పాఠకుడు అతిని ఒక కంట కనిపెట్టి చూస్తూ అవసరమనిపించిన సమయంలో కత్తెర ప్రయోగిస్తూనే ఉంటాడు. నిత్యజాగృతుడైన పాఠ కుడు, లేదా శ్రోత, లేదా ప్రేక్షకుడే అంతిమంగా ఏ మాధ్యమానికైనా ఎడిటర్– ఇన్– చీఫ్! -
భారతీయ చిన్నారులు బాగా ‘స్మార్ట్’
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ పరిపక్వతలో భారతీయ చిన్నారులు ముందంజలో నిలుస్తున్నారు. 10–14 ఏళ్ల వయసు పిల్లల్లో ఫోన్ వినియోగం 83 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే 7 శాతం అధికంగా నమోదవటం విశేషం. కాగా, ఇతర దేశాలతో పోలిస్తే ఆన్లైన్ అపాయాల(రిస్క్)కు గురవుతున్న చిన్నారుల్లో అత్యధికులు భారతీయులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్ వినియోగంలో 10నుంచి 14ఏళ్లలోపు భారతీయ చిన్నారులు 24 శాతం ఆన్లైన్ ముప్పునకు గురైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆన్లైన్ భద్రతపై అవగాహన లేమి దేశంలో 47 శాతం మంది తల్లిదండ్రుల్లో సైబర్ బెదిరింపులు, సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన పెరుగుతోంది. ఇక్కడ చిన్నారులు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నపుడు రక్షణ కల్పించడంలో అవగాహన లేమి ఆన్లైన్ ముప్పునకు కారణాలుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో 33 శాతం తల్లిదండ్రుల ఆన్లైన్ ఖాతాలు సైతం సైబర్ దాడికి గురైనట్టు గుర్తించారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల సగటుతో పోలిస్తే 13 శాతం ఎక్కువ. ప్రపంచ సగటులో 15 శాతం మంది చిన్నారులు ఆన్లైన్ ముప్పునకు గురైతే.. మన దేశంలో అది 28 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత సమాచారం చోరీ, ఆర్థిక సమాచారం లీకేజీలను అరికట్టడానికి చిన్నారులకు ఫోన్ ఇచ్చేముందు పాస్వర్డ్ ప్రొటెక్షన్ తప్పనిసరిగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్లలోనే షాపింగ్, అపరిచిత వ్యక్తుల సందేశాలకు దూరంగా ఉండటంపై తరచూ పిల్లలను హెచ్చరించాలని చెబుతున్నారు. చిన్నారులకు ప్రత్యేకంగా ఫోన్ ఇవ్వకపోవడం మంచిదని, తమ ఫోన్లలోనే వారికి అవసరమైన యాప్‌లు మాత్రమే ఓపెన్ అయ్యేలా పర్యవేక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. (చదవండి: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా!
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన అషూ రెడ్డి బిగ్‌బాస్‌తో పాపులారిటి తెచ్చుకుంది. ఈ రియాలిటీ షోతో సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న అషూ అప్పటి నుంచి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఈ మధ్యే రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్య్వూలో పాల్గొని బోల్డ్ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక అందాల ఆరబోతతో తరచూ ఫొటోషూట్లకు ఫోజుల ఇచ్చి.. వాటిని తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగోట్టే ఈ భామకు సంబంధించిన ఓ సంచలన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రేజ్ కోసం అషూ వీడియో చేసి తన యూట్యూబ్ చానల్లో షేర్ చేసింది. చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్ దీంతో వ్యూస్ కోసం, క్రేజ్ కోసం ఇంతగా దిగజారిపోతావా? అంటూ నెటిజన్లు ఆమెను తిట్టి పోస్తున్నారు. ఇంతకి ఆ వీడియో ఏంటంటే.. అషూ తన తల్లిని ఫ్రాంక్ చేసేందుకు ఓ పిచ్చి ఐడియాతో వీడియో చేసింది. ఈ నేపథ్యంలో అషూ సోఫాలో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంది. దీంతో ఆమె తల్లి కంగారుగా వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. ‘‘నాకు పిరియడ్స్ రాలేదు మమ్మీ. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది’’ అంటూ ఓపెన్ అయింది. ఈ విషయాన్ని ముందు తల్లి నమ్మలేదు కాని అషూ అదే పనిగా ఏడుస్తూ ఉండడంతో నిజమే అనుకుంది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆమె తల్లి అషుని కొట్టడమే కాకుండా కాలితో తన్నడం కూడా చేసింది. చదవండి: చిరు సినిమాలో రష్మీ స్పెషల్ సాంగ్‌కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ తర్వాత అషూ తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడుతూ తల్లిని మరింత ఆందోళనకు గురి చేసింది. ఇలా కాసేపటి వరకు తల్లిని భయపెట్టిన అషూ చివరకు ఇది ప్రాంక్ అంటూ అసలు విషయం చెప్పేసింది. ఇది నిజం కాదంటూ రూమ్‌లో పెట్టిన కెమెరాలను కూడా చూపించింది. దీంతో అషూ తల్లికి మరింత కోపం వచ్చింది. రెండు మొట్టికాయలు వేస్తూ.. ‘హార్ట్ ఎటాక్ తెప్పించినంత పని చేశావు’ అంటూ సీరియస్‌గా వెళ్లిపోయింది ఆమె. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. -
పైసా ఖర్చుండదు.. కానీ, డబ్బులే డబ్బులు
ముంబై: సోషల్ మీడియా వేదికలపై బ్రాండ్ల ప్రచారం గణనీయంగా జరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇన్ఫ్లుయెన్సర్ (ప్రభావితం చేసేవారు) మార్కెటింగ్ ఈ ఏడాది రూ. 900 కోట్లకు చేరనుంది. 2025 నాటికి ఇది 25 శాతం వార్షిక వద్ధి రేటుతో రూ. 2,200 కోట్లకు చేరనుంది. మీడియాలో ప్రకటనల స్పేస్‌ని కొనుగోలు చేసే సంస్థ గ్రూప్ఎం రూపొందించిన ఐఎన్సీఏ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం ఊపందుకోవడంతో .. కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల ప్రచారం కోసం ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకునే ధోరణి కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులతో ఈ తరహా మార్కెటింగ్ విధానాల్లో మార్పులు చోటు చేసు కుంటున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లపై ఫాలోవర్లకు ఉంటున్న నమ్మకాన్ని చూస్తున్న బ్రాండ్లు తమ ఉత్పత్తుల ప్రచారానికి వారితో జట్టు కట్టడంపై ఆసక్తి చూపుతున్నాయని గ్రూప్ఎం సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో సుమారు 70 శాతం వాటా నాలుగు కేటగిరీలది ఉంటోంది. వీటిలో పర్సనల్ కేర్ (25 శాతం), ఆహారం..పానీయాలు (20 శాతం), ఫ్యాషన్..ఆభరణాలు (15 శాతం), మొబైల్.. ఎలక్ట్రానిక్స్ (10 శాతం) ఉన్నాయి. ఈ తరహా మార్కెటింగ్ ఆదాయాల్లో సెలబ్రిటీల వాటా 27 శాతం ఉండగా.. ఇతర ఇన్ఫ్లుయెన్సర్ల వాటా ఏకంగా 73 శాతంగా ఉండటం గమనార్హం. చదవండి: YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి! -
యూట్యూబ్‌ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్
న్యూఢిల్లీ: టీవీల్లోనూ యూట్యూబ్ వీక్షణం పెరుగుతోంది. మే నెలలో 20 కోట్లకు పైగా కుటుంబాలు టీవీ తెరపై యూట్యూబ్‌ను వీక్షించాయని కంపెనీ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 45 శాతం పెరుగుదల అని వివరించింది. ‘హిందీ, తెలుగు, తమిళం వంటి దేశీయ భాషల కంటెంట్‌ను ఆస్వాదించే వారి సంఖ్య అధికం అవుతోంది. యూట్యూబ్ వీక్షకుల్లో వీరి వాటా 93 శాతం. యూట్యూబ్‌ను చూసేందుకు మొబైల్ ఫోన్ నుంచి టీవీల వైపు మళ్లుతున్నారు. క్రితంతో పోలిస్తే కోవిడ్–19 సమయంలో యూట్యూబ్‌ను అధికంగా ఆస్వాదిస్తున్నట్టు 85 శాతం మంది వీక్షకులు తెలిపారు. వీడియోల ద్వారా తాము ఆసక్తి ఉన్న విభాగాల్లో నైపుణ్యం పెంచుకున్నట్టు 85 శాతం మంది చెప్పారు. మే నెలలో కెరీర్ సంబంధ వీడియోల వీక్షణ సమయం 60 శాతం పెరిగింది. వ్యవసాయం, ఆర్థిక, ఆహారం, ఇంజనీరింగ్ వంటి విభాగాలు కొత్తగా వృద్ధి చెందుతున్నాయి. సాంకేతికత, సౌందర్యం, హాస్యం వంటి విభాగాల్లో స్థానిక భాషల కంటెంట్ అధికం అవుతోంది. 140 చానెళ్లకు ఒక కోటికిపైగా, 4,000లకుపైగా చానెళ్లకు 10 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. షార్ట్స్ ప్లేయర్లో ప్రపంచవ్యాప్తంగా రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్ వ్యూస్ నమోదవుతున్నాయి’ అని యూట్యూబ్ తెలిపింది. చదవండి : యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి! -
రేజర్‌పేతో ట్విటర్ జట్టు
న్యూఢిల్లీ: నగదు బదిలీ సర్వీసులకు ఉపయోగపడే తమ టిప్ జార్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పేమెంట్ గేట్‌వే సంస్థ రేజర్‌పేతో జట్టు కట్టినట్లు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్ వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్లు మొదలైన విధానాల్లో రేజర్‌పే ఇంటర్ఫేస్ ద్వారా దేశీయంగా నగదు పంపడం, అందుకోవడానికి సంబంధించి లావాదేవీలు జరపవచ్చని పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని పేమెంట్ ప్రొవైడింగ్ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ట్విటర్లో కంటెంట్ క్రియేట్ చేసేవారు, దాని ద్వారా ఆదాయం పొందడానికి టిప్ జార్ ఫీచర్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పరిమిత సంఖ్యలో క్రియేటర్లు, జర్నలిస్టులు, లాభాపేక్ష రహిత సంస్థలు మొదలైన వర్గాలకు చెందిన యూజర్లకు ట్విటర్ దీన్ని గత నెల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను తమ ప్రొఫైల్‌కు జోడించడం ద్వారా యూజర్లు .. టిప్‌లను స్వీకరించవచ్చు. చదవండి: క్రెడిట్ కార్డ్ మంచిదా.. పర్సనల్ లోన్ మంచిదా! -
సోషల్ మీడియాలో నటి వీడియో వైరల్!