Is Ashu Reddy Pregnant? Video Viral On Social Media - Sakshi
Sakshi News home page

Ashu Reddy: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్‌, ఇంతగా దిగజారిపోయావా!

Dec 8 2021 8:30 PM | Updated on Dec 9 2021 1:56 PM

Ashu Reddy Pregnant Prank Video With Her Mother Goes Viral - Sakshi

జూనియ‌ర్ స‌మంతగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన అషూ రెడ్డి బిగ్‌బాస్‌తో పాపులారిటి తెచ్చుకుంది. ఈ రియాలిటీ షోతో సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న అషూ అప్పటి నుంచి సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంత కాదు. ఈ మధ్యే రామ్‌ గోపాల్‌ వర్మతో బోల్డ్‌ ఇంటర్య్వూలో పాల్గొని బోల్డ్‌ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక అందాల ఆరబోతతో తరచూ ఫొటోషూట్‌లకు ఫోజుల ఇచ్చి.. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేస్తూ కుర్రకారు మతిపోగోట్టే ఈ భామకు సంబంధించిన ఓ సంచలన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రేజ్‌ కోసం అషూ వీడియో చేసి తన యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేసింది.

చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్‌ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్‌ గిఫ్ట్స్‌

దీంతో వ్యూస్‌ కోసం, క్రేజ్‌ కోసం ఇంతగా దిగజారిపోతావా? అంటూ నెటిజన్లు ఆమెను తిట్టి పోస్తున్నారు. ఇంతకి ఆ వీడియో ఏంటంటే.. అషూ తన తల్లిని ఫ్రాంక్‌ చేసేందుకు ఓ పిచ్చి ఐడియాతో వీడియో చేసింది. ఈ నేపథ్యంలో అషూ సోఫాలో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంది. దీంతో ఆమె తల్లి కంగారుగా వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. ‘‘నాకు పిరియడ్స్ రాలేదు మమ్మీ. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది’’ అంటూ ఓపెన్ అయింది. ఈ విష‌యాన్ని ముందు త‌ల్లి న‌మ్మ‌లేదు కాని అషూ అదే ప‌నిగా ఏడుస్తూ ఉండ‌డంతో నిజమే అనుకుంది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆమె తల్లి అషుని కొట్టడమే కాకుండా కాలితో తన్నడం కూడా చేసింది.

చదవండి: చిరు సినిమాలో రష్మీ స్పెషల్‌ సాంగ్‌కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఆ తర్వాత అషూ తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు చెప్పొద్దమ్మా అని బ్రతిమిలాడుతూ తల్లిని మరింత ఆందోళనకు గురి చేసింది. ఇలా కాసేపటి వరకు తల్లిని భయపెట్టిన అషూ చివ‌ర‌కు ఇది ప్రాంక్ అంటూ అసలు విషయం చెప్పేసింది. ఇది నిజం కాదంటూ రూమ్‌లో పెట్టిన కెమెరాలను కూడా చూపించింది. దీంతో అషూ త‌ల్లికి మ‌రింత కోపం వ‌చ్చింది. రెండు మొట్టికాయ‌లు వేస్తూ..  ‘హార్ట్ ఎటాక్ తెప్పించినంత ప‌ని చేశావు’ అంటూ సీరియ‌స్‌గా వెళ్లిపోయింది ఆమె. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement