ముంబైకి చెందిన మేఘన కౌర్ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. తన యూట్యూబ్ ఛానల్ ‘షీ ట్రుబుల్‌మేకర్’ బాగా ΄పాపులర్ అయింది. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, సిందీ భాషలు మాట్లాడే మేఘనకు ప్రయాణాలు చేయడం, బ్యాడ్మింటన్ ఆడడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అమెరికన్ సింగర్ జస్టిన్ బీబర్ పాటలు వినడం అంటే బోలెడు ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉత్సాహం చూపే మేఘన జంతుప్రేమి. సామాజిక సేవ కార్యక్రమాల్లో ΄పాల్గొంటుంది.
‘క్రియేటర్ ఎకనామీ ఊపందుకున్న ఈ సమయంలో మీదైన సొంత శైలి ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేస్తారు?’ అని అడిగితే ‘నా నుంచి ఆడియెన్స్ ఏం ఆశిస్తున్నారనే దాని గురించి ఆలోచించడంతో పాటు, నేను ఆడియెన్స్‌లో ఒకరిగా మారి నన్ను నేను విశ్లేషించుకుంటాను.
సబ్జెక్ట్ విషయంలో రెలవెంట్‌గా ఉండడం అనేది ముఖ్యమైనది. అందుకే ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతాను. మారుతున్న ట్రెండ్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతాను. సబ్జెక్ట్ విషయానికి వస్తే అతి తెలివి ఎప్పుడూ ప్రదర్శించవద్దు. ఎందుకంటే ఆడియెన్స్ మనకంటే తెలివైన వాళ్లు’ అంటుంది మేఘన. ఎంతవారికైనా ట్రోలింగ్ తప్పదు. సోషల్ మీడియా స్టార్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన మేఘన ట్రోలింగ్‌పై ఇలా అంటుంది..
‘నేను ఎమోషన్ పర్సన్. చిన్న విషయాలకే చిన్నబుచ్చుకుంటాను. అలాంటి నేను ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ట్రోలింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు అనిపించింది. అయితే ఆ తరువాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. ఒక్క హేట్ కామెంట్ ఉన్నచోట పది ప్రశంసలు కనిపిస్తాయి. మరి ఆ ఒక్క కామెంట్‌ను చూస్తూ బాధ పడడం ఎందుకు! అందుకే ΄పాజిటివ్ కామెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెడతాను. వాటి ద్వారా శక్తిని గ్రహిస్తాను. సక్సెస్‌ఫుల్ కంటెంట్ క్రియేటర్‌గా రాణించడానికి మొదట ఉండాల్సింది సహనం. ఆ తరువాతే ఏదైనా!’
Comments
Please login to add a commentAdd a comment