హార్డ్ వర్క్ చేయడమంటే చాలా ఫన్నీగా ఉంటుందట. ఈ విషయాన్ని నటి శాన్వీ శ్రీవాత్సవ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె వర్కవుట్లు చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూశాక ఎంతో మంది వర్కవుట్ చేయడం మొదలుపెడతారని ఆమె చెబుతోంది. వీడియో చూసినవాళ్లు తమ ఆరోగ్యం కోసం, ఫిట్‌గా ఉండేందుకు శారీరక శ్రమ చేస్తారని ట్వీట్లో రాసుకొచ్చింది నటి శాన్వీ. ఆమె పోస్ట్ చేసిన వీడియోకు విశేష స్పందన వస్తోంది.