కరోనా కారణంగా ఆన్ లైన్ మనీ ఎర్నింగ్స్ కోసం పెద్దసంఖ్యలో జనాలు యూట్యూబ్ ను ఆశ్రయిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్సే కాకుండా టెక్నాలజీపై అవగాహన, అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ను ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. అందుకే యూట్యూబ్ సైతం తన క్రియేటర్స్ కు అనుగుణంగా మార్పులు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మే నెలలో కొన్ని అప్ డేట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైంది. గూగుల్ అకౌంట్ ఛేంజ్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ నేమ్ తో పాటు ప్రొఫైల్ నేమ్ మార్చుకునే సౌలభ్యం.వాస్తవానికి జీమెయిల్ అకౌంట్ సాయంతో యూట్యాబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. అదే అకౌంట్ ను ఇతర యాప్స్ లలో వినియోగించడం ద్వారా హ్యాకర్స్, వ్యక్తిగత డేటా భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ కొత్త అప్ డేట్ ను పరిచయం చేసింది. ఈ అప్ డేట్ వల్ల నార్మల్ క్రియేట్స్ కంటే వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న ఛానల్స్ క్రియేటర్స్ ఇబ్బంది పడుతున్నారు.
యూట్యూబ్ వెరిఫైడ్ అకౌంట్ అంటే?
యూట్యూబ్ లో క్రియేటర్స్ లక్షమంది సబ్ స్కైబర్స్ ను సొంతం చేసుకుంటే యూట్యూబ్ టిక్ మార్క్ తో వెరిఫైడ్ అకౌంట్ అందిస్తుంది. అయితే తాజా అప్ డేట్ తో వెరిఫైడ్ అకౌంట్స్ ను కోల్పోవాల్సి వస్తుంది. చదవండి : YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి!
కొత్త అప్ డేట్ ఏంటంటే?
జీమెయిల్ అకౌంట్ మార్చకుండా ఛానల్ నేమ్ మార్చుకోవచ్చు. దీని వల్ల నార్మల్ క్రియేటర్స్ కు పెద్ద నష్టం లేదు. కానీ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్న క్రియేటర్లు ఛానల్ పేరు మార్చుకుంటే, ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోల్పోవాల్సి ఉంటుంది. ఛానల్ పేరు మార్చిన తరువాత బ్యాడ్జి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి యూట్యూబ్ యూజర్లు కొత్త అప్‌డేట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ ఛానల్ పేరును ఎలా మార్చాలి?
• యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకునేందుకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. డెస్క్ టాప్ అవసరం లేదు.
• ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫోటో పై ట్యాప్ చేయాలి
• ట్యాప్ చేసిన తరువాత ఛానల్ లో ఎడిట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
• ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లిన తరువాత ఛానల్ కొత్త నేమ్‌ను ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
• దీంతో ఛానల్ నేమ్ మారిపోతుంది. ఛానల్ తో పాటు ఫోటో మార్చుకోవచ్చు.
ఫోటో మార్చాలంటే ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేస్తే న్యూ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది
ఆ న్యూ ఫోటో ఆప్షన్ ను క్లిక్ చేసి ఫోటో అప్ లోడ్ చేయాలి. ఆ పై సేవ్ చేస్తే ఫోటో కూడా మారిపోతుంది
Comments
Please login to add a commentAdd a comment