![Google Expands AI Chatbot Bard To Apps Like Gmail, Drive And YouTube - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/20/google-bard.jpg.webp?itok=IuL-TzYK)
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్‌బాట్‌ను గూగుల్‌కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది.
జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్‌టెన్షన్స్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్‌ఏఐ ప్లాట్‌ఫాం చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను గూగుల్ రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment