ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్ పేరిట గూగుల్ తీసుకొచ్చిన చాట్‌బాట్ వరుస షాకులిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలో జరిగిన తప్పిదంతో గూగుల్ భారీగా నష్టపోయింది. తాజాగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బార్డ్ మరోసారి ఫెయిల్ అయ్యింది.
‘బార్డ్’ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్డ్‌ను పరిచయం చేస్తూ గూగుల్ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలో బార్డ్ విఫలమైంది. దీంతో గూగుల్‌కు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
చదవండి👉 చాట్‌జీపీటీకీ భారీ షాక్.. బ్యాన్ దిశగా ప్రపంచ దేశాల అడుగులు?
తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బార్డ్ శాట్ పరీక్షలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే శాట్ (sat) అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు సంబంధిత కాలేజీల్లో సీటు దొరుకుతుంది. ఫార్చ్యూన్ సంస్థ ఆ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బార్డ్‌ను అడిగింది.
అందుకు బార్డ్ స్పందించింది. 75 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తప్పుగా ఇచ్చింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చినప్పటికీ.. మళ్లీ అదే ప్రశ్న వేసినప్పుడు గతంలో ఇచ్చిన సమాధానం కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చినట్లు తేలింది. రిటర్న్ లాంగ్వేజ్ ఎగ్జామ్‌లో 30 శాతం మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చింది.
దీనిపై గూగుల్ ప్రతినిధి ఫార్చ్యూన్‌తో మాట్లాడుతూ..బార్డ్ టెస్టింగ్ దశలో ఉంది. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. బార్డ్ పనితీరు మెరుగుపడుతోంది. వినియోగంలోకి తెచ్చేందుకు వేలాది మంది టెస్టర్లు దీనిపై పని చేస్తున్నారని అన్నారు.
చదవండి👉 త్వరలో ‘చాట్‌జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే!
బార్డ్ పనితీరుపై అనుమానాలు
మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ తప్పుడు సమాధానం ఇచ్చింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్ వెబ్ స్పేస్ తీసిందని పేర్కొంది. వాస్తవానికి 2004లోనే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను తీసింది. గూగుల్ విడుదల చేసిన జిఫ్ వీడియోలో ఈ పొరపాటును గుర్తించడంతో దీని సామర్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి.
అప్ గ్రేడ్ చేస్తున్నాం
ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పాడ్‌కాస్ట్ లో బార్డ్ పనితీరుపై సుందర్ పిచాయ్ స్పందించారు. బార్డ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్డ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన టెస్టర్లతో ప్రయోగాలు నిర్వహించాక పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి!
Comments
Please login to add a commentAdd a comment