Bard
-
Generative AI Battle: చాట్‌జీపీటీకి పోటీగా జెమినీ
భవిష్యత్తంతా కృత్రిమ మేధదే. ఇది అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఆ రంగంపై పట్టు బిగించేందుకు ఐటీ దిగ్గజాలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఓపెన్ఏఐ యాజమాన్యంలోని చాట్‌జీపీటీ ప్రాజెక్టులో మెజారిటీ భాగస్వామి కావడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేసింది. గడచిన ఏడాది కాలంలో మరెన్నో ఏఐ మోడళ్లు తెరపైకి వచ్చినా ఓపెన్ ఏఐ తాలూకు జీపీటీ మోడళ్లతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి పోటీగా జెమినీ పేరుతో గూగుల్ తాజాగా కొత్త ఏఐ మోడల్‌ను ప్రకటించింది. దీనిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది... మొగ్గు జెమినీకే కనిపిస్తున్నా... అవడానికి చాట్‌జీపీటీ, జెమినీ రెండూ జెనరేటివ్ ఏఐ మోడళ్లే. ఇవి ఇన్పుట్ ట్రైనింగ్ డేటా తాలూకు ప్యాట్రన్ల ఆధారంగా పిక్చర్లు, పదాలు, ఇతర మీడియా వంటి కొత్త డేటాను కోరిన విధంగా జెనరేట్ చేస్తాయి. చాట్‌జీపీటీ ప్రధానంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం). ఇది టెక్స్ట్ జెనరేట్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలాగే జీపీటీ ఆధారిత వెబ్ సంభాషణల యాప్‌గా కూడా పని చేస్తుంది. గూగుల్‌కు కూడా బార్డ్ పేరుతో ఇలాంటి యాప్ ఇప్పటికే ఉంది. ఇది గతంలో లాఎండీఏ లాంగ్వేజ్ మోడ్‌పై ఆధారపడేది. ఇప్పుడు జెమినీ కోసమని పీఏఎల్‌ఎం2 మోడ్‌గా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తోంది గూగుల్. ఇది మల్టీ మోడల్ తరహా మోడల్ కావడమే చాట్‌జీపీటీతో పాటు ఇతర అన్ని ఏఐల కంటే జెమినీని ఇప్పుడు ప్రత్యేకంగా నిలుపుతోంది. ఎందుకంటే ఇది మలి్టపుల్ ఇన్పుట్, ఔట్పుట్ మోడ్లతో నేరుగా పని చేయగలదు. అంతేగాక టెక్స్ట్, ఆడియో, వీడియోలను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ ఏఐ కూడా ఇలాంటి సామర్థ్యంతో కూడిన జీపీటీ–4 విజన్ మోడల్‌ను ప్రకటించినా అది జెమినీ మాదిరిగా పూర్తిస్థాయి మలీ్టమోడల్ కాదు. ఎందుకంటే ఇది ప్రధానంగా టెక్స్ట్ పైనే ఆధారపడుతుంది. ఉదాహరణకు ఆడియో ఇన్‌పుట్స్‌ను స్పీచ్ ఔట్పుట్గా మార్చేందుకు విష్పర్ అనే స్పీచ్ టు టెక్స్ట్ ఇన్పుట్ లెరి్నంగ్ మోడల్ సాయం తీసుకుంటుంది. ఇమేజీలను అందించాలన్నా అంతే. అది జెనరేట్ చేసే టెక్స్ట్ ప్రాంప్్టలను డాల్–ఈ2 అనే మరో డీప్ లెరి్నంగ్ మోడల్ ఇమేజీలుగా మారుస్తుంది. కానీ గూగుల్ మాత్రం జెమినీని ఇలా కాకుండా పూర్తిస్థాయి మల్టీ మోడల్ ఏఐగా తీర్చిదిద్దుతోంది. ఇతర లెరి్నంగ్ మోడళ్ల సాయంతో నిమిత్తం లేకుండా నేరుగా ఆడియో, ఇమేజీలు, వీడియో, టెక్స్ట్ వంటి ఇన్పుట్ టైప్లను అది తనంత తానే కావాల్సిన ఔట్పుట్లుగా మార్చేస్తుంది. జీపీటీ–4తో పోలిస్తే జెమినీ పనితీరు ఎలా ఉంటుందో ఇప్పటికి తెలియకపోయినా దాన్ని చాలా హెచ్చు సామర్థ్యంతో రూపొందిస్తున్నట్టు గూగుల్ ప్రకటించుకుంది. దానికిప్పటికే జెమినీ 1.0 అల్ట్రా అని కూడా పేరు పెట్టింది. ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో ఇది జీపీటీ–4 కంటే మిన్నగా తేలిందని చెబుతోంది కూడా. ఇందుకు రుజువుగా ఓ వీడియో కూడా విడుదల చేసింది. కాకపోతే అందులో చూపించిన టాస్‌్కలను రియల్‌టైమ్‌లో చేయడంలో జెమినీ ఏ మేరకు కృతకృత్యమవుతుందో చూడాల్సి ఉంది. అంతిమ లబ్ధి యూజర్లకే... ఈ సందేహాల మాట ఎలా ఉన్నా జెమినీ వంటి భారీ మలీ్టమోడల్ మోడళ్లు జెనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా టెక్స్ట్ ఆధారితమైన జీపీటీ–4 ఇప్పటికే ఏకంగా 500 బిలియన్ పదాలపై శిక్షణ పొందింది! అంటే, పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పదాలన్నీ దానికిప్పటికే చిరపరిచితమని చెప్పవచ్చు. ఇలాంటి ట్రైనింగ్ డేటాతో పాటు మోడల్ తాలూకు సంక్లిష్టత ఎంత ఎక్కువగా ఉంటే దాని పనితీరు అంత ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఇలాంటి అన్ని రకాల డేటాను నేరుగా వాడగల జెమినీ వంటి ఏఐ మోడళ్లు మున్ముందు మరింత సామర్థ్యం సంతరించుకోవడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో దీనికి పోటీగా ఓపెన్ ఏఐ కూడా అప్‌గ్రేడెడ్ జీపీటీ–5 వెర్షన్‌పై ఇప్పటికే ముమ్మరంగా కృషి చేస్తోంది. ఈ నిరంతర పోటీ అంతిమంగా యూజర్లకే మరింత లబ్ధి చేకూరుస్తుందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్‌బాట్‌ను గూగుల్‌కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్టెన్షన్స్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ ప్లాట్‌ఫాం చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను గూగుల్ రూపొందించింది. -
‘Bard’పై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్!
ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌పై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో గూగుల్ యూకే మేనేజింగ్ డైరెక్టర్ డెబ్బీ వైన్స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ బార్డ్ ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు పనిచేయదు. ఇందుకోసం యూజర్లు బార్డ్‌కు బదులుగా గూగుల్‌లో సెర్చ్ చేసి కావాల్సిన సమాచారం గురించి తెలుసుకోవాలని సూచించారు. ‘గూగుల్ బార్డ్ ఓ ప్రయోగమని, యూజర్లకు కావాల్సిన నిర్ధిష్టమైన సమాచారాన్ని అందించేందుకు తయారు చేసింది కాద’ని ఆమె స్పష్టం చేశారు. బీబీసీ టుడే ప్రోగ్రామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘AI hallucinations with Google's in-house chatbot Bard’ అనే అంశంపై పలు వెయిన్ స్టీన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్దతిలో గూగుల్‌లో సెర్చ్ చేసి కావాల్సిన సమాచారం గురించి తెలుసుకోవడం కంటే బార్డ్‌ను అడిగి తెలుసుకోవడం విభిన్నంగా ఉంటుంది. బార్డ్‌ను లార్జ్ లాంగ్వెజ్ మోడల్‌తో ఎలా వినియోగించాలి అనే తెలుసుకునేందుకు జరిపిన ఓ ప్రయోగం మాత్రమే. సమస్యకు పరిష్కారం, ఆలోచనలు, ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందే తప్పా నిర్ధిష్టమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే పొందలేమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ చాట్‌బాట్ బార్డ్ విశ్వసనీయ సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ గూగుల్ సంస్థ బార్డ్‌ను యూజర్లకు ఎందుకు అందిస్తుందనే ప్రశ్నపై స్పందించిన ఆమె..బార్డ్‌లో మీకు కావాల్సిన సమాచారం దొరకలేదు. వెంటనే గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకునేందుకు ఓ ఆప్షన్‌ను సైతం అందుబాటులోకి తెచ్చాం. ఆ ఆప్షన్ ఉపయోగించి మీరు ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారో దాని గురించి తెలుసుకోవచ్చని సూచించారు. అంతేకాదు, ఖచ్చితమైన సమాచారం కోసం యూజర్లు గూగుల్‌పై ఆధారపడతారని మాకు తెలుసు. కాబట్టి పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, గూగుల్ యూకే మేనేజింగ్ డైరెక్టర్ డెబ్బీ వైన్స్టెయిన్ చేసిన కామెంట్స్ టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. చదవండి👉 గూగుల్‌లో జీతాల పంచాయితీ.. సుందర్ పిచాయ్‌ను విమర్శిస్తున్న ఉద్యోగులు! -
నీళ్లను తెగ తాగేస్తున్న చాట్ జీపీటీ!
చాట్‌జీపీటీ సాంకేతిక రంగంలో అద్భుతాలే సృష్టిస్తోంది. మనుషుల మాదిరిగా ప్రశ్నలకు జవాబులిస్తూ ‘ఔరా’ అనిపిస్తోంది. అయితే ఇప్పుడీ టెక్ బాట్ పీపాలకు పీపాలకు నీళ్లు తాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే నీటి కరువుకు దారి తీస్తుందేమోనని అమెరికన్ సైంటిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టేలా సమాధానం చెప్పే చాట్‌జీపీటీ నిర్వహణ భారం ఎక్కువగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, ఒక యూజర్ అడిగిన 20 నుంచి 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే అరలీటర్ (500 ఎంఎల్) నీటిని వినియోగిస్తుంది. విద్యుత్తు ఉత్పత్తికి, సర్వర్లను చల్లబరిచేందుకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది కృత్రిమ మేధ (AI) నీరు లేకపోతే ఉనికిని కోల్పోతుంది. భారీ సర్వర్ గదులను చల్లబరచడానికి నేరుగా నీటిని ఉపయోగిస్తుంది. ఆ సర్వర్లకు పవర్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను పరోక్షంగా ఉపయోగిస్తుంది. అలా నీరు వినియోగం భారీ స్థాయిలో కొనసాగుతున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. నీటి వినియోగంలో ముందంజ సాంకేతిక విభాగంలో ప్రాచుర్యం పొందిన కృత్తిమ మేధ చాట్ బాట్ ‘చాట్‌జీపీటీ, బార్డ్‌లు నీరు లేకుండా పనిచేయలేవు. అవి పని చేయాలంటే సర్వర్లు 10-27 డిగ్రీల సెల్సియస్ కూలింగ్ ఉండాలి. ఆ కూలింగ్‌ను కొనసాగించేందుకు సర్వర్ల వద్ద కూలింగ్ టవర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. సర్వర్లు వినియోగించే ప్రతి యూనిట్ (కిలోవాట్) విద్యుత్ కోసం, కూలింగ్ టవర్లు ఒక గాలన్ (3. 8 లీటర్లు) నీటిని ఉపయోగిస్తాయి. కూలింగ్ టవర్లు ఎలా పనిచేస్తాయి కూలింగ్ టవర్లు గదిలోని ఉష్ణోగ్రత ఆధారంగా పనిచేస్తాయి. నీరు ఆవిరైనప్పుడు పరిసరాల నుండి వేడిని గ్రహిస్తుంది. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కూలింగ్ టవర్ లోపల నీటి ఆవిరి పెరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది. ఫలితంగా, డేటా సెంటర్లు ఉపయోగించే నీరు తగ్గిపోతుంది. ఆ నీటిని రీసైకిల్ చేసేందుకు వీలు లేదు. దీంతో నీటి వినియోగం భారీగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. మరిన్ని విశేషాలు ►20 - 50 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే చాట్ జీపీటీ కనీసం అరలీటర్ మంచినీరు వినియోగించాల్సి వస్తుంది ►టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా నిర్వహించే డేటా సెంటర్లో 7లక్షల లీటర్ల మంచి నీటి వినియోగం జరుగుతోంది. ఆ కేంద్రంగా ఓపెన్ ఏఐ సంస్థ జీపీటీ-3 మోడల్‌పై పనిచేస్తోంది. కరెంట్ వినియోగం కారణంగా 2.8 మిలియన్ లీటర్ల నీళ్లను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ►ఒక్క అమెరికాలో జీపీటీ-3 ‘3.5 మిలియన్ లీటర్ల నీటిని ఉపయోగిస్తుండగా.. ఏసియా, పసిపిక్ దేశాలతో కలిసి 4.9 లీటర్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ►జీపీటీ-3 కంటే తాజాగా విడుదలైన చాట్‌జీపీటీ - 4 నీటి అవసరం ఎక్కువగా ఉంది చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు
ఛాట్ జీపీటీ, బార్డ్, బింగ్, డాల్–ఈ! ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీల పేర్లు ఇవి. వాణిజ్యం, భద్రత విషయాల్లో ఈ సాఫ్ట్వేర్ల ప్రభావం ఏమిటన్న విషయంపై ఇప్పుడు విస్తృత∙చర్చ జరుగుతోంది. జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు ఎంత పురోగతి సాధించినా... వాటికి మనిషికున్న విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి వాటంతట అవే మనిషికి చెడు చేయలేకపోవచ్చు కానీ... చెడుబుద్ధి కలిగిన మనిషి వల్ల మాత్రం జరిగే ప్రమాదం ఉంది. కంప్యూటర్ల రాకతో మేలూ జరిగింది, సైబర్ మోసాలూ పెరిగాయి. జనరేటివ్ ఏఐ విషయంలోనూ రాగల అపార అవకాశాలకు రానున్న తరాలను సిద్ధం చేయడం, ఎదురుకాగల ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించడం ఇప్పుడు మనం చేయాల్సిన పని! సాధారణంగా మనం ఉపయోగించే సాఫ్ట్ వేర్ ఏదైనా సొంతంగా సృష్టించేది ఏమీ ఉండదు. అయితే కొన్ని సాధారణ కృత్రిమ మేధ(ఏఐ) సాఫ్ట్వేర్లు మన రాతల్లోని తప్పులను దిద్దడమే కాకుండా... తరువాత ఉపయోగించగల పదాలను సూచించగలవు. ఛాట్‌జీపీటీ వంటివి వీటికంటే అత్యాధునికమైనవి. సొంతంగా వ్యాసాలు, కవితలు రాసి పెట్ట గలవవు. ఈ లాంగ్వేజ్ జనరేటెడ్ కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లు మనం వేసిన ప్రశ్నలను సమర్థంగా అర్థం చేసుకోవడమే కాకుండా ఇంట ర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని మధించి సవివ రమైన సమాధానాన్ని సిద్ధం చేయగలవు. ఇతరుల గొంతులను అనుకరించేందుకు, గ్రాఫిక్స్ కోసం కూడా వీటిని వాడుకోవచ్చు. గత ఏడాది అక్టోబరులో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిన ఛాట్ జీపీటీ చాలా తక్కువ కాలంలో వ్యాప్తి చెందింది. సెకన్ల కాలంలోనే సంక్లిష్టమైన ప్రశ్నలకూ జవాబులు చెబుతూ అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో చాలామందిలో కృత్రిమ మేధపై ఆందోళన వ్యక్తమయ్యేందుకూ కారణమైంది. ఈ నేపథ్యంలో నేనూ ఛాట్ జీపీటీకి ఒక ప్రశ్న సంధించా. ఉద్యో గాలపై అత్యాధునిక కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ల ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఛాట్ జీపీటీ సంతులనంతో కూడిన జవాబిచ్చింది. డేటా ఎంట్రీ, అసెంబ్లీ లైన్, కస్టమర్ కేర్ వంటి రంగాల్లోని రిపిటీటివ్ పనులు (ఒకే పనిని పదేపదే చేయడం) చేయడంలో కృత్రిమ మేధకు అపారమైన సామర్థ్యముందని చెబుతూనే... గ్రాఫిక్ డిజైనింగ్, అడ్వ రై్టజ్మెంట్, కంటెంట్ క్రియేషన్ వంటి సృజనాత్మక విషయాల్లోనూ జనరేటివ్ ఏఐ మంచి ప్రభావం చూపగలదని తెలిపింది. ఈ సమాధానంలోనే ఛాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ధనిక, పేద అంతరాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం. నైపుణ్య లేమి లేదా మధ్యమ స్థాయి నైపుణ్యాలు మాత్రమే ఉన్న పనివారికి నష్టం జరిగే అవకాశముందని తేల్చి చెప్పింది. మెషీన్ లెర్నింగ్, డేటా అనా లసిస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి కొత్త, వినూత్న ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం కూడా జనరేటివ్ ఏఐకి ఉందని వివరించింది. సాంకేతిక పరిజ్ఞానంలో జరిగే మార్పులు అప్పటికే ఉన్న ఉద్యో గాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అదే సమయంలో కొత్త కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయి. ఎడ్లబండ్ల స్థానంలో మోటారు వాహనాలు వచ్చినట్లు అన్నమాట! భారతదేశంలో జనరేటివ్ ఏఐ దానికున్న సృజనాత్మక సామర్థ్యాన్ని బట్టి చూస్తే బిజినెస్ ప్రాసెసింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లోని ఉద్యోగాలపై కచ్చితంగా ప్రతి కూల ప్రభావం చూపనుంది. ఈ రంగాల్లోని పనులను జనరేటివ్ ఏఐ ప్రోగ్రామ్స్ చాలా సులువుగా చేయగలవు. కాకపోతే వీటితో పని చేయించేందుకు కొంత సాయం, ప్రాంప్టింగ్ అవసరం. మన ఐటీ, బీపీవో కంపెనీలు ఈ సామర్థ్యాలను అందుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... జనరేటివ్ ఏఐ ఈ విషయంలోనూ మనకు సాయపడగలదు. తక్కువ నైపుణ్యం ఉన్నవారికి తగిన శిక్షణ ఇవ్వగలదు. ఉదాహరణకు ఇంగ్లీషు భాషా నైపుణ్యాన్ని పెంచు కునేందుకు, తద్వారా మార్కెటింగ్ లేదా మరే ఇతర రంగంలోనైనా రాణించేందుకు ఏఐని వాడుకోవచ్చు. ఇప్పుడు చర్చ మొత్తం భద్రత పైనే... జనరేటివ్ ఏఐ విషయంలో ఇప్పుడు చర్చ మొత్తం భద్రతాంశాల పైనే. ఛాట్ జీపీటీ రాక నేపథ్యంలో ఇది మరింత ముదురుతోంది. మనుషుల ప్రమేయం లేకుండానే ఈ జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు ఇమే జెస్, వీడియో, టెక్ట్స్‌లను సృష్టించగలవు. ప్రఖ్యాత రచయిత యువాన్ హరారి అభిప్రాయం ప్రకారం, మానవ సంస్కృతికి భాష అనేది ప్రాథమిక ప్రాతిపదిక. భాష విషయంలో ప్రావీణ్యం కలిగి ఉన్న జనరేటివ్ ఏఐ... సంస్కృతి వృద్ధి, విశ్వాసాలను తన చేతుల్లోకి తీసు కోలదని యువాన్ అంటారు. అయితే జనరేటివ్ ఏఐకి తనదైన చేతన ఉండదు. ఏదో సాధించాలన్న కాంక్ష కూడా కరవు. స్పష్టంగా చెప్పా లంటే... కొంతమంది మనుషులు ఇతరులపై తమ ప్రభవాన్ని మరింత పెంచుకునేందుకు జనరేటివ్ ఏఐ వంటివాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు చాలా వరకూ ఓపెన్ సోర్స్. అంద రికీ అందుబాటులో ఉండేవి. అంటే రకరకాల అభిప్రాయాలు, నమ్మకాలు ప్రచారంలోకి వచ్చేందుకు అవకాశమున్నవి. కాబట్టి సమస్య అంత పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. కానీ అసలైన సవాలు కృత్రిమ మేధను మానసిక ప్రకోపాలతో ఉపయోగించడంతోనే ఉంది. ఛాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ప్రకారమే... కృత్రిమ మేధ ఆధారంగా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సంప్రదాయ భద్రత ఏర్పాట్లను తప్పించుకుని సైబర్ దాడులకు తెగబడేలా ఏఐని వాడు కోవడం, కృత్రిమ మేధను ఉపయోగించుకుని మానవులపై ఆయుధ దాడి చేయడం వంటివాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా... నకిలీ వార్తలు, మోసాల వంటివాటిని మరింత తీవ్రతరం చేసేందుకు కూడా ఈ జనరేటివ్ ఏఐ అక్కరకొచ్చే ప్రమాదముంది. గొంతులను అను కరించే సామర్థ్యం కూడా ఉండటం వల్ల భవిష్యత్తులో మన కుటుంబ సభ్యుల గొంతులోనే డబ్బులడిగే మోసాలకు తెరలేవవచ్చు. దుర్వినియోగాన్ని అరికట్టడం ఎలా? జనరేటివ్ ఏఐ కారణంగా ఒకవేళ ఉద్యోగాలు తగ్గిపోతే సార్వత్రిక కనీస ఆదాయం వంటి వాటి ద్వారా జరిగే నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చునని ఛాట్ జీపీటీ çసృష్టికర్త సామ్ ఆల్ట్‌మ్యాన్ అంటారు. కానీ భద్రతపరమైన అంశాలతోపాటు ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడం ఎలా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కృత్రిమ మేధ వాడకానికి, నియంత్రణకు ప్రత్యేక సంస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలన్న ఏకాభిప్రాయం కూడా ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. ఈ విషయమై జీ7 దేశాలు ఓ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూండగా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే నియంత్రణ మార్గదర్శకాల తయారీలో నిమ గ్నమైంది. అయితే ఈ నియంత్రణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగితే రాజకీయ దుర్వినియోగమన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కృత్రిమ మేధ అభివృద్ధిపై చైనా ఇప్పటికే కొన్ని నియంత్రణలను అమల్లో పెట్టిన విషయం ప్రస్తావనార్హం. భారత్ సిద్ధం కావాలి దశాబ్దాల క్రితం కంప్యూటరీకరణ మాదిరిగానే... జనరేటివ్ ఏఐ రేపటితరం టెక్నాలజీ అన్న విషయాన్ని భారత్ అంగీకరించాల్సిన అవసరముంది. కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్లను స్థానికంగా అభివృద్ధి చేయాలి, వాడటాన్ని ప్రోత్సహించాలి. జనరేటివ్ ఏఐకి భాషే ప్రాతి పదిక కాబట్టి.. బోలెడన్ని భాషలు మాట్లాడే భారత్‌లో వాటి వినియోగం పెద్ద సవాలే. పైగా ఏఐ సర్వీసులకు పెద్ద పెద్ద సర్వర్ వ్యవస్థల అవసరం ఉంటుంది. ఇది పెద్ద పెద్ద కంపెనీలకు అనుకూ లమైన అంశం. అలాగే... వీలైనంత తొందరగా ఇన్ఫోటెక్ పరిశ్రమను, ఏఐని అనుసంధానించాల్సిన అవసరముందని... తద్వారా మాత్రమే ఏఐ మార్కెట్లో స్థానం సంపాదించవచ్చునని తాజా అంచనా. కంప్యూటర్ల రాకతో కష్టతరమైన లెక్కలు వేసే బాధ తప్పి అంతకంటే ఎక్కువ ప్రయోజనకరమైన పనులపై దృష్టి పెట్టడం సాధ్యమైంది. సైబర్ మోసాలూ పెరిగాయి. ఇదే విధంగా జనరేటివ్ ఏఐ కూడా భవిష్యత్తు తరాలకు కూడా కొంత మంచి, కొంత చెడు అనుభవాలను చూపించనుంది. ఈ పరిణామాలకు, రాగల అపార అవకాశాలకు రానున్న తరాలను సిద్ధం చేయడం... ఎదురు కాగల ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించడం ఇప్పుడు మనం చేయాల్సిన పని! నితిన్ దేశాయి ,వ్యాసకర్త ఆర్థికవేత్త (‘ద బిజినెస్ స్టాండర్డ్’ సౌజన్యంతో) -
గూగుల్‌కు భారీ షాక్ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు కొత్త గుబులు మొదలైందా? ఒపెరా, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్.. ఒకప్పుడు నెట్ సామాజ్రాన్ని ఏలాయి. గూగుల్ రాగానే పైవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గూగుల్ గుత్తాధిపత్యం దెబ్బకు మిగిలిన సెర్చింజన్లు తట్టాబుట్టా సర్దేసుకున్నాయి. అలాంటి గూగుల్ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చిందా? ఆన్లైన్ సమాచార శోధనలో ఏళ్లుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సెర్చింజన్‌కు చాట్‌జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. చాట్‌జీపీటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధం ఇప్పుడు గూగుల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది? ముఖ్యంగా ఏ సమాచారం కావాలన్నా క్లుప్తంగా సమాధానం ఇస్తుండడంతో ఇప్పుడు యూజర్లు చాట్‌జీపీటీ వైపు మళ్లుతున్నారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్ తన సొంత సెర్చింజన్ బింగ్‌లో చాట్‌జీపీటీని విస్తరించింది. దీంతో యూజర్లు వారికి ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌కు బదులు బింగ్‌ను అడగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇతర టెక్ సంస్థలు తమ గాడ్జెట్స్‌లో డిఫాల్ట్ సెర్చింజన్‌గా గూగుల్‌కు బదులు బింగ్‌ను జతచేయాలని భావిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (idc) నివేదిక ప్రకారం..2022లో శాంసంగ్ 261 మిలియన్లు (26.1కోట్లు) స్మార్ట్ఫోన్లను సరఫరా చేసింది. ఈ ఫోన్లు గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లో పనిచేస్తాయి.అంతేకాదు వినియోగదారులకు అందించే ముందే గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు యాప్స్‌ను, ఇతర సేవల్ని శాంసంగ్ ఫోన్లలో ఇన్స్టాల్ అందిస్తున్నాయి. తాజాగా సెర్చింజన్ విషయంలో శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఫోన్లలో ఉన్న గూగుల్ సెర్చింజన్ బదులు మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌ను డీఫాల్ట్ సెర్చింజన్‌గా ఇచ్చే విధంగా చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఒకవేళ అదే జరిగితే గూగుల్‌కు 3 బిలియన్ల నష్టం (రూ.300కోట్లు) వాటిల్లే ప్రమాదం ఉందని హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి శాంసంగ్.. మైక్రోసాఫ్ట్‌తో చర్చలు జరుపుతుందని, అప్పటి వరకు గూగుల్‌నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే? -
'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీ (chatgpt) వంటి టెక్నాలజీలతో ఉద్యోగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ సైతం స్పష్టం చేసింది. ఆ సంస్థ నిర్వహించిన పరిశోధనల్ని ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరుతో పలు అంశాలు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ఈ తరుణంలో కేసీ న్యూటన్, కెవిన్ రూస్లతో జరిగిన న్యూయార్క్ టైమ్స్ హార్డ్ ఫోర్క్ పాడ్‌కాస్ట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘ఏఐతో ప్రమాదంలో ఉద్యోగాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ గూగుల్ బార్డ్, చాట్‌జీపీటీలపై సానుకూలంగా స్పందించారు. గూగుల్‌లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాలా? అని అడిగినప్పుడు.. ఎవరైనా టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందేనని పిచాయ్ అన్నారు. ఏఐ సాంకేతికత కారణంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఉత్పాదకత విషయంలో ఏఐల పనితీరును ప్రశంసించారు. ‘ఏఐ వినియోగంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల విషయంలో రెండు విషయాలు నిజమవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ప్రోగ్రామింగ్‌లో మీ పని తీరు మరింత మెరుగుపడుతుంది. చాట్‌జీపీటీ, బార్డ్ వంటి ఏఐ టూల్స్ కారణంగా ప్రోగ్రామింగ్ అనేది అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి లేదంటే సృష్టించడానికి వినియోగదారులకు అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూగుల్ బార్డ్ కాలక్రమేణా మెరుగుపడుతుందని చెప్పారు. ఓపెన్ ఏఐ పనితీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? అని అడిగినప్పుడు.. పిచాయ్ వారి విజయాన్ని చూసి తాను ఆశ్చర్యపోలేదని పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న (ఓపెన్ ఏఐ) వ్యక్తుల క్యాలిబర్ మాకు తెలుసు. కాబట్టే తాను ఆశ్చర్యపోలేదని తెలిపారు. చదవండి👉 చాట్‌జీపీటీ జాబ్.. జీతం ఏడాదికి రూ.2.7కోట్లు -
గూగుల్ ‘బార్డ్’ మళ్లీ ఫెయిల్.. ఈ సారి ఏకంగా
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్ పేరిట గూగుల్ తీసుకొచ్చిన చాట్‌బాట్ వరుస షాకులిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలో జరిగిన తప్పిదంతో గూగుల్ భారీగా నష్టపోయింది. తాజాగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బార్డ్ మరోసారి ఫెయిల్ అయ్యింది. ‘బార్డ్’ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్డ్‌ను పరిచయం చేస్తూ గూగుల్ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలో బార్డ్ విఫలమైంది. దీంతో గూగుల్‌కు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. చదవండి👉 చాట్‌జీపీటీకీ భారీ షాక్.. బ్యాన్ దిశగా ప్రపంచ దేశాల అడుగులు? తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బార్డ్ శాట్ పరీక్షలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే శాట్ (sat) అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు సంబంధిత కాలేజీల్లో సీటు దొరుకుతుంది. ఫార్చ్యూన్ సంస్థ ఆ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బార్డ్‌ను అడిగింది. అందుకు బార్డ్ స్పందించింది. 75 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తప్పుగా ఇచ్చింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చినప్పటికీ.. మళ్లీ అదే ప్రశ్న వేసినప్పుడు గతంలో ఇచ్చిన సమాధానం కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చినట్లు తేలింది. రిటర్న్ లాంగ్వేజ్ ఎగ్జామ్‌లో 30 శాతం మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చింది. దీనిపై గూగుల్ ప్రతినిధి ఫార్చ్యూన్‌తో మాట్లాడుతూ..బార్డ్ టెస్టింగ్ దశలో ఉంది. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. బార్డ్ పనితీరు మెరుగుపడుతోంది. వినియోగంలోకి తెచ్చేందుకు వేలాది మంది టెస్టర్లు దీనిపై పని చేస్తున్నారని అన్నారు. చదవండి👉 త్వరలో ‘చాట్‌జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే! బార్డ్ పనితీరుపై అనుమానాలు మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ తప్పుడు సమాధానం ఇచ్చింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్ వెబ్ స్పేస్ తీసిందని పేర్కొంది. వాస్తవానికి 2004లోనే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను తీసింది. గూగుల్ విడుదల చేసిన జిఫ్ వీడియోలో ఈ పొరపాటును గుర్తించడంతో దీని సామర్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. అప్ గ్రేడ్ చేస్తున్నాం ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పాడ్‌కాస్ట్ లో బార్డ్ పనితీరుపై సుందర్ పిచాయ్ స్పందించారు. బార్డ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్డ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన టెస్టర్లతో ప్రయోగాలు నిర్వహించాక పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్‌జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి!