ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ai) ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీ (chatgpt) వంటి టెక్నాలజీలతో ఉద్యోగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ సైతం స్పష్టం చేసింది.
ఆ సంస్థ నిర్వహించిన పరిశోధనల్ని ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరుతో పలు అంశాలు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది.
ఈ తరుణంలో కేసీ న్యూటన్, కెవిన్ రూస్‌లతో జరిగిన న్యూయార్క్ టైమ్స్ హార్డ్ ఫోర్క్ పాడ్‌కాస్ట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘ఏఐతో ప్రమాదంలో ఉద్యోగాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేస్తుందా? అన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ గూగుల్ బార్డ్, చాట్‌జీపీటీలపై సానుకూలంగా స్పందించారు.
గూగుల్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందాలా? అని అడిగినప్పుడు.. ఎవరైనా టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందేనని పిచాయ్ అన్నారు. ఏఐ సాంకేతికత కారణంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఉత్పాదకత విషయంలో ఏఐల పనితీరును ప్రశంసించారు.
‘ఏఐ వినియోగంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ల విషయంలో రెండు విషయాలు నిజమవుతాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ప్రోగ్రామింగ్‌లో మీ పని తీరు మరింత మెరుగుపడుతుంది. చాట్‌జీపీటీ, బార్డ్ వంటి ఏఐ టూల్స్ కారణంగా ప్రోగ్రామింగ్ అనేది అందరికి అందుబాటులోకి వస్తుంది. ఇది కొత్త విషయాలను తెలుసుకోవడానికి లేదంటే సృష్టించడానికి వినియోగదారులకు అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గూగుల్ బార్డ్ కాలక్రమేణా మెరుగుపడుతుందని చెప్పారు. ఓపెన్ ఏఐ పనితీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా? అని అడిగినప్పుడు.. పిచాయ్ వారి విజయాన్ని చూసి తాను ఆశ్చర్యపోలేదని పేర్కొన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న (ఓపెన్ ఏఐ) వ్యక్తుల క్యాలిబర్ మాకు తెలుసు. కాబట్టే తాను ఆశ్చర్యపోలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment