ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు కొత్త గుబులు మొదలైందా? ఒపెరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్.. ఒకప్పుడు నెట్ సామాజ్రాన్ని ఏలాయి. గూగుల్ రాగానే పైవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గూగుల్ గుత్తాధిపత్యం దెబ్బకు మిగిలిన సెర్చింజన్లు తట్టాబుట్టా సర్దేసుకున్నాయి. అలాంటి గూగుల్ ఇప్పుడు అప్రమత్తం కావల్సిన దశ వచ్చిందా? ఆన్‌లైన్ సమాచార శోధనలో ఏళ్లుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సెర్చింజన్‌కు చాట్‌జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.
చాట్‌జీపీటీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ తెరతీసిన యుద్ధం ఇప్పుడు గూగుల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది? ముఖ్యంగా ఏ సమాచారం కావాలన్నా క్లుప్తంగా సమాధానం ఇస్తుండడంతో ఇప్పుడు యూజర్లు చాట్‌జీపీటీ వైపు మళ్లుతున్నారు. పనిలో పనిగా మైక్రోసాఫ్ట్ తన సొంత సెర్చింజన్ బింగ్‌లో చాట్‌జీపీటీని విస్తరించింది. దీంతో యూజర్లు వారికి ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌కు బదులు బింగ్‌ను అడగడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలో ఇతర టెక్ సంస్థలు తమ గాడ్జెట్స్‌లో డిఫాల్ట్ సెర్చింజన్‌గా గూగుల్‌కు బదులు బింగ్‌ను జతచేయాలని భావిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (idc) నివేదిక ప్రకారం..2022లో శాంసంగ్ 261 మిలియన్లు (26.1కోట్లు) స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేసింది. ఈ ఫోన్‌లు గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లో పనిచేస్తాయి.అంతేకాదు వినియోగదారులకు అందించే ముందే గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు యాప్స్‌ను, ఇతర సేవల్ని శాంసంగ్ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ అందిస్తున్నాయి.
తాజాగా సెర్చింజన్ విషయంలో శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఫోన్‌లలో ఉన్న గూగుల్ సెర్చింజన్ బదులు మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్‌ను డీఫాల్ట్ సెర్చింజన్‌గా ఇచ్చే విధంగా చర్చలు జరుపుతున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఒకవేళ అదే జరిగితే గూగుల్‌కు 3 బిలియన్ల నష్టం (రూ.300కోట్లు) వాటిల్లే ప్రమాదం ఉందని హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి శాంసంగ్.. మైక్రోసాఫ్ట్తో చర్చలు జరుపుతుందని, అప్పటి వరకు గూగుల్‌నే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment