ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇప్పుడు చాలా కంపెనీలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లతో సంభాషించడానికి మానవ ప్రమేయం లేకుండా చాట్‌బాట్‌లను ( chatbot )ఉపయోగిస్తున్నాయి. అంటే కస్టమర్లు ఆయా కంపెనీలతో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు చాట్‌బాట్‌లు సమాధానమిస్తాయి. ఇక్కడే చిక్కంతా వస్తోంది.
చాట్‌బాట్ చేసిన తప్పునకు కెనడాకు ( Air Canada ) చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ కెనడా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.. 2022లో జేక్ మోఫాట్ అనే వ్యక్తి టొరంటోలో తన అమ్మమ్మ మరణించినప్పుడు అంత్య క్రియలకు వెళ్లేందుకు విమోచన ఛార్జీలకు తనకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిర్ కెనడా విమానయాన సంస్థను సంప్రదించాడు.
ఎయిర్ కెనడా సపోర్ట్ చాట్‌బాట్‌తో సంప్రదిస్తున్నప్పుడు, మోఫాట్ కూడా బీవ్‌మెంట్ ఛార్జీలను ముందస్తుగా మంజూరు చేస్తారా అని అడిగారు. ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా "మీ టిక్కెట్‌ను జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులలోపు" వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చాట్‌బాట్ మోఫాట్‌కి తెలిపింది. దీంతో బ్రిటిష్ కొలంబియా నివాసి అయిన మోఫాట్ టొరంటోలో తన అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేశాడు.
అయితే ఆ తర్వాత అతను బీవ్‌మెంట్ ఛార్జీ, సాధారణ ఛార్జీల మధ్య వ్యత్యాసం వాపసు కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఎయిర్ కెనడా అతనికి పూర్తి ప్రయాణానికి బీవ్‌మెంట్ రేట్లు వర్తించవని తెలియజేసింది. దీనికి తాను తీసుకున్న చాట్‌బాట్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను మోఫాట్ ఎయిర్ కెనడాకు షేర్ చేశారు. దీంతో నాలుక కరుచుకున్న ఎయిర్ కెనడా తమ చాట్‌బాట్ "తప్పుదోవ పట్టించే పదాలను" ఉపయోగించినట్లు అంగీకరించింది. సరైన సమాచారంతో బాట్‌ను అప్‌డేట్ చేస్తామని చెప్పింది. దీంతో మోఫాట్ ఎయిర్ కెనడాపై దావా వేశారు.
దీంతో బాధితుడికి రావాల్సిన ఛార్జీల వ్యత్యాసం 650.88 కెనేడియన్ డాలర్లు (సుమారు రూ.40 వేలు)తోపాటు వడ్డీ 36.14 కెనేడియన్ డాలర్లు, ఫీజు 125 కెనేడియన్ డాలర్లు చెల్లించాలని ఎయిర్ కెనడాను సివిల్ రిజల్యూషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే చాట్‌బాట్ ప్రత్యేక చట్టపరమైన సంస్థ అని, దాని చర్యలతో తమకు సంబంధం లేదని ఎయిర్ కెనడా వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment