Google applications
-
గూగుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ యాప్స్ ఇక మరింత సులువు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో పనిచేసే ‘బార్డ్’ చాట్‌బాట్‌ను గూగుల్‌కు చెందిన మ్యాప్స్, డాక్స్, డ్రైవ్ వంటి మరిన్ని యాప్స్‌తో అనుసంధానం చేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ (Google) వెల్లడించింది. అలాగే మరిన్ని దేశాల్లో, మరిన్ని భాషల్లో క్వెరీల ఫలితాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. జీమెయిల్, డాక్స్, గూగుల్ డ్రైవ్ వ్యాప్తంగా గల వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి యూజర్లు అడిగే ప్రశ్నలకు బార్డ్ సమాధానాలు ఇవ్వగలదు. ఈ ఎక్స్టెన్షన్స్ డీఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటాయని, కావాలంటే వాటిని ఎప్పుడైనా డిజేబుల్ చేయొచ్చని గూగుల్ తెలిపింది. ఓపెన్ సోర్స్ జెన్ఏఐ ప్లాట్‌ఫాం చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్‌ను గూగుల్ రూపొందించింది. -
ప్రపంచవ్యాప్తంగా మొరాయిస్తున్న ఇన్స్టాగ్రామ్
న్యూఢిల్లీ, సాక్షి: సోషల్ మీడియా అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ కొద్ది రోజులుగా మొరాయిస్తోంది. దేశీయంగానూ సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బగ్ కారణంగా ఇలా జరుగుతూ ఉండవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు ఇన్స్టాగ్రామ్ ఖాతాలను వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ అంశంపై ఇన్స్టాగ్రామ్ స్పందించకపోవడం గమనార్హం! రెండు రోజులుగా సమస్యలు ఎదురవుతున్నప్పటికీ పరిష్కారం ఎప్పుడన్న అంశాన్ని ఇన్స్టాగ్రామ్ వెల్లడించకపోవడంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్తువెత్తుతున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం నుంచీ డౌన్‌డిటెక్టర్ డేటా ప్రకారం శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచీ ఇన్స్టాగ్రామ్ సాంకేతిక సమస్యలపై 800 రిపోర్ట్స్ నమోదయ్యాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాకపోవడంపై సుమారు 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఫిర్యాదులు 8 గంటలకల్లా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల గూగుల్ సంబంధిత ప్లాట్‌ఫామ్స్ సైతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగినట్లు టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గత సోమవారం యూట్యూబ్, గూగుల్, జీమెయిల్, గూగుల్ డాక్స్ తదతర యాప్స్ వినియోగంలో అటు ఫోన్లు, ఇటు కంప్యూటర్లలో ఇబ్బందులు తలెత్తిన విషయం విదితమే. కొత్త ఫీచర్స్ ఇన్స్టాగ్రామ్ ఇటీవల రెండు కొత్త ఫీచర్స్‌ను జత చేసుకుంది. కోవిడ్-19పై యూజర్లకు తగిన సమాచారాన్నిఅందించేందుకు వీలుగా వీటిని అభివృద్ధి చేసింది. వైరస్ కేసులు పెరుగుతున్న ప్రాంతాలలో లింక్ ద్వారా స్థానిక ఆరోగ్య అధికారిక సంస్థకు సంబంధించిన వివరాలను అందిస్తోంది. వ్యాక్సినేషన్ల సమాచారం, తదితర వివరాలు తెలుసుకునేందుకు దారి చూపుతోంది. అంతేకాకుండా వెర్జ్ వివరాల ప్రకారం వ్యాక్సిన్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని బ్లాక్ చేసేందుకూ తాజా ఫీచర్స్‌ను రూపొందించింది. -
మొరాయించిన గూగుల్ సేవలు
న్యూఢిల్లీ: జీమెయిల్‌తో సహా ఇతర గూగుల్ సేవల్లో సోమవారం సాయంత్రం 5.17 గంటలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ డాక్స్, క్యాలెండర్, డ్రైవ్, మీట్ వంటి వాటిలోకి లాగిన్ అయినవారికి స్క్రీన్‌పై టెంపరరీ ఎర్రర్ అంటూ మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. దాదాపు 45 నిమిషాలపాటు గూగుల్ సేవలు నిలిచిపోయాయి. ‘ఇంటర్నల్ స్టోరేజీ కోటా’లో సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు గూగుల్ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. సాయంత్రం 6.02 గంటలకల్లా సేవలను పునరుద్ధరించగలిగామని తెలిపారు. అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఇబ్బంది పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్ సేవలు నిలిచిపోవడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. జీమెయిల్ డౌన్, యూట్యూబ్ డౌన్ అంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్లో షేర్ చేశారు. మరికొందరు ‘ఇది యుగాంతం’ అంటూ సరదాగా కామెంట్లు చేయడం విశేషం. -
ఈ యాప్ తో వేలల్లో సంపాదించండి
టెక్ దిగ్గజం గూగుల్ నుండి మరో కొత్త యాప్ రాబోతుంది. ప్రస్తుతం బీటా పరీక్షా దశలో ఉన్న ఈ "గూగుల్ టాస్క్స్ మేట్" యాప్ తో చిన్న చిన్న తేలికైన పనులు చేయడం ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు. ఈ యాప్ లో రెస్టారెంట్ యొక్క చిత్రాన్ని క్లిక్ చేయడం, వ్యక్తిగత ప్రాధాన్యతల గురించి సర్వేలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదా వాక్యాలను ఇంగ్లీష్ నుండి ఇతర భాషలకు అనువదించడం వంటివి ఉన్నాయి. బీటా టెస్టింగ్ దశలో కొందరు ఎంపిక చేసిన టెస్టర్లకు మాత్రమే రెఫరల్ కోడ్ వ్యవస్థ ద్వారా యాప్ లో ప్రవేశించడానికి అనుమతి వస్తుంది. వినియోగదారులు వారు పూర్తి చేసిన పనులకు స్థానిక కరెన్సీలో డబ్బులు చెల్లిచబడుతాయి. ఈ గూగుల్ సర్వీస్ ఇప్పుడు ఇండియాలోనూ అందుబాటులోకి వచ్చినట్లు ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, మీకు రిఫెరల్ కోడ్ ఉంటే తప్ప దాన్ని ఉపయోగించలేరు. (చదవండి: వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!) ఎలా పని చేస్తుంది? ఇందులో దగ్గరలోని పనులను గుర్తించి, వాటిని పూర్తి చేయడం ద్వారా డబ్బు సంపాందించే అవకాశం ఉంటుంది. ఇందులోని పనులను సిట్టింగ్ లేదా ఫీల్డ్ టాస్క్‌లుగా విభజించారు. ఉదాహరణకు, ఫీల్డ్ టాస్క్‌లో భాగంగా మీరు మీ సమీపంలోని రెస్టారెంట్ యొక్క ఫోటో తీసి, ఆ రెస్టారెంట్ కి సంబందించి మీ ప్రాధాన్యతల గురించి అడిగే సర్వే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా సంపాదించవచ్చు. దీని ద్వారా తన మ్యాపింగ్ వివరాలను మరింత బలోపేతం చేయడానికి గూగుల్ ప్రయత్నిస్తోంది. అలాగే సిట్టింగ్ అంటే ట్రాన్స్‌స్క్రైబింగ్, ఇంగ్లిష్ నుంచి మీ భాషలోకి అనువదించడం లాంటి పనులు చేయడం ద్వారా సంపాదించవచ్చు. ఏదైనా పనుల చేసి సంపాదించిన డబ్బును ఇ-వాలెట్‌కు రిజిస్టర్ చేసుకోవడం లేదా ఇన్-యాప్ పేమెంట్ పార్ట్నర్ ద్వారా చెల్లిస్తుంది. -
జీమెయిల్ సర్వీసులకు అంతరాయం
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన జీమెయిల్ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి చాలాసేపు జీమెయిల్ సహా గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్స్, గూగుల్ మీట్ మొదలైన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడింది. లాగిన్ కాలేకపోవడం, అటాచ్మెంట్స్ చేయలేకపోవడం, మెసేజ్‌లు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. జీమెయిల్ హ్యాష్‌ట్యాగ్ చాలాసేపు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిల్చింది. మరోవైపు, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఉదయం వెల్లడించిన గూగుల్ ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించినట్లు సాయంత్రానికి ప్రకటించింది. ‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఓర్పు వహించినందుకు, మద్దతుగా నిల్చినందుకు ధన్యవాదాలు. వ్యవస్థ విశ్వసనీయతకు గూగుల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఎప్పటికప్పుడు మా వ్యవస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకుంటున్నాం‘ అని పేర్కొంది. సర్వీసులకు అంతరాయం కలగడంపై దర్యాప్తు చేస్తున్నట్లు తమ సేవల వివరాలను తెలియజేసే ’జీ సూట్’ స్టేటస్ డ్యాష్‌బోర్డు ద్వా రా ఉదయమే గూగుల్ వెల్లడించింది. కొందరు యూజర్లకు సర్వీసులను పునరుద్ధరించినట్లు, మిగతా యూజర్ల సమస్యలనూ సత్వరం పరిష్కరించనున్నట్లు పేర్కొంది. గూగుల్ వివరణ ప్రకారం.. ఈ–మెయిల్స్, మీట్ రికార్డింగ్, డ్రైవ్‌లో ఫైల్స్ క్రియేట్ చేయడం, గూగుల్ చాట్‌లో మెసేజ్‌లు పోస్ట్ చేయడం వంటి అంశా ల్లో సమస్యలు తలెత్తాయి. అయితే, సేవల అంతరాయానికి కారణమేంటన్నది తెలియరాలేదు. కంపెనీ నిర్దిష్టంగా వివరాలు వెల్లడించనప్పటికీ డౌన్‌డిటెక్టర్ (వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంల సేవల్లో అంతరాయాల వివరాలను తెలిపే సంస్థ) డేటా ప్రకారం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా యూజర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. -
జియోఫోన్‌కు త్వరలో పాపులర్ గూగుల్ ఫీచర్లు
అన్ని స్మార్ట్ఫోన్లలో అందిస్తున్న పాపులర్ గూగుల్ సర్వీసులు త్వరలో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్, జియోఫోన్‌లోకి రాబోతున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్‌లను జియో ఫోన్లో అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జియో ఫీచర్ ఫోన్ ప్రస్తుతం అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్‌కు చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కిఓఎస్ ఈ యాప్స్‌ను త్వరలో తన యూజర్లకు అందించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి కిఓఎస్ టెక్నాలజీస్ సంస్థకు 22 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టబడులను తర్వాతి తరం యూజర్లకు ఇంటర్నెట్ను అందించడానికి ఉపయోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గూగుల్ నుంచి వచ్చిన ఈ నిధులను ఫాస్ట్-ట్రాక్ అభివృద్ధికి ఉపయోగిస్తామని, కిఓఎస్ ఆధారంగా రూపొందిన స్మార్ట్ ఫీచర్ఫోన్లను గ్లోబల్‌గా అందిస్తామని కిఓఎస్ చెప్పింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని ఎమర్జింగ్ మార్కెట్లలో వీటిని ఉపయోగిస్తామని కిఓఎస్ టెక్నాలజీస్ సీఈవో సెబాస్టియన్ చెప్పారు. జియోఫోన్లు విజయవంతం కావడంతో, గూగుల్‌కు చెందిన పలు పాపులర్ యాప్స్‌ను ఈ యూజర్లకు అందించాలని కిఓఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. కిఓఎస్ అనేది వెబ్ ఆధారిత ప్లాట్పామ్. జియోఫోన్‌కు వెల్లువెత్తిన భారీ డిమాండ్‌తో ఈ ఓఎస్ మొబైల్ ఓఎస్ మార్కెట్లో ఆపిల్ ఓఎస్‌ను బీట్‌ను చేసి మరీ 15 శాతం లాభాలనార్జించింది. -
కొత్త యాప్.. పక్కా లోకల్!
ఇరుగు పొరుగు సమాచారం, సందేహాలకు ఎక్కడికక్కడే పరిష్కారం లభించే రీతిలో ఓ కొత్త యాప్ వచ్చేసింది. ఇప్పటికే ముంబైలో ప్రవేశించిన ఈ యాప్ త్వరలోనే దేశంలోని అన్ని నగరాలకు విస్తరించబోతోంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల పోటీలో కాస్త వెనుకబడిన గూగుల్ ఇప్పుడీ కొత్త యాప్‌తో వివిధ ప్రాంతాల్లో నివసించేవారిని ఇరుగుపొరుగును అనుసంధానం చేయడం ద్వారా పెద్ద ఎత్తున మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. రెండేళ్ల పరిశోధన,సర్వేల ద్వారా రూపొందించిన ఈ యాప్ పేరు ‘నైబర్లీ’. దాని ద్వారా తమ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా ఎప్పుడు ఏ సందేహం వచ్చినా వెంటనే ఈ యాప్ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందే ఛాటింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది. జీపీఎస్ ద్వారా యూజర్ ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకుని సమీపంలోనే ఉన్న అవసరమైన సమాచారం అందుబాటులోకి తెస్తుంది. వంటింటి సామాగ్రి నుంచి దుకాణాలు, ఆసుపత్రులు వంటి అన్ని రకాల సమాచారానికి పరిసర ప్రాంతాల్లోనే పొందే సౌలబ్యం కల్పిస్తుంది. ఇటీవల ముంబైలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏ విధంగా ఆదుకోవాలో చెప్పాలంటూ ఓ లోకల్రైలు ప్రయాణీకుడు తన స్మార్ట్‌ఫోన్‌లో అడిగిన వెంటనే వచ్చే స్టేషన్లో స్టేషన్‌మాస్టర్‌ను కలవాలని, ప్రథమ చికిత్స కోసం టికెట్కలెక్టర్ను అడగాలని, అత్యవసర సహాయం కోసం 138కు ఫోన్ చేయాలంటూ వెంటనే రకరకాల సలహాలు వచ్చేశాయి. గూగుల్ సెర్చ్ ఆప్షన్, డిజిటల్ అసిస్టెంట్, వాయిస్ బేస్డ్ సెర్చ్‌లకు ఆదరణ పెరగడంతో ఈ యాప్ ద్వారా తమ ప్రాంతీయభాషల్లో ప్రశ్నలు కూడా అడిగే సౌలభ్యముంది. ఫలానా వస్తువు ఎక్కడ లభిస్తుంది ? ఫలానా సాంకేతిక సమస్య ఎవరు సమర్థంగా పరిష్కరిస్తారు ? ఫలానా వస్తువు కోసం ఏమి తీసుకోమంటారు వంటివి యాప్‌లోనే టైప్ చేసి సిద్ధంగా ఉంచడం వల్ల వెంటనే వాటిని ఎంచుకుని పంపించే ఏర్పాటుంది. ఏమిటీ యాప్...? ఏదైన సమస్యపై లేదా అవసరమైన సమాచారంపై బృంద చర్చల్లో పాల్గొనకుండానే యూజర్లకు సూటిగా సమాధానమిచ్చేందుకు ‘నైబర్లీ’ (పొరుగు) యాప్ ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది. దీని యూజర్ల తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండానే బ్రౌజ్ చేయడంతో పాటు ప్రశ్నలు వేయొచ్చు లేదా సమాధానాలు ఇవ్వొచ్చు. ఈ యాప్‌లో వినియోగదారుల ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. వారి పూర్తిపేరు, ఫోన్‌నెంబర్, ఇతర సమాచారం రహస్యంగా ఉంచుతారు. మిగతా యాప్‌లలో మాదిరిగా యూజర్ ప్రొఫైల్ ఫోటోను పెద్దది చేయడం, స్టోర్ చేసుకునే వీలుండదు. దీనిని ఉపయోగించడం మొదలుపెట్టినపుడు చుట్టుపక్కల వారి భద్రతకు కట్టుబడి ఉంటామని, సంబంధంలేని విషయాలు లేదా స్పామ్ మెసేజ్‌లు పెట్టమని ప్రతీ ఒక్కరూ వాగ్దానం చేయాల్సి ఉంటుంది.ఇది కేవలం 7 ఎంబీల కంటే తక్కువ సైజులో ఉండడంతో పాత లేదా ధర తక్కువ స్మార్ట్ఫోన్లలో కూడా ఉపయోగించే వీలు ఏర్పడింది. మనదేశంలో దాదాపు 50 కోట్ల మంది స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నందున సోషల్ నెట్వర్కింగ్, సెర్చ్, పేమెంట్స్లకు (వివిధ సేవలకు ఫోన్ ద్వారా చెల్లింపులు) ఒకే గమ్యస్థానంగా ఈ యాప్ నిలుస్తుందనే ఆశాభావంతో గూగుల్ ఇండియా సంస్థ ఉంది. -
గుడ్డిగా యాప్స్ వాడితే అంతే సంగతి..!
వాషింగ్టన్: ప్రస్తుతం ఎక్కువగా టెక్నాలజీ మీదే ఆధారపడి పనులు లాగించేస్తున్నారు. అయితే కొన్నిసార్లు అది మన ప్రాణాల మీదకి తెస్తుందనడానికి అమెరికాలో ఇటీవల ఓ ప్రమాదం ఘటన నిదర్శనమని చెప్పవచ్చు. అసలేమైందంటే.. ఓ వ్యక్తి వద్ద ఇద్దరు మిత్రులు కారు అద్దెకు తీసుకున్నారు. ఈశాన్యరాష్ట్రం వెర్మాంట్ లోని బర్లింగ్టన్ నగరంలో ఎస్యూవీ కారును ఈ వ్యక్తుల డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ డ్రైవర్ ట్రాఫిక్ తగ్గుతుందని భావించి తరచుగా జీపీఎస్ మ్యాప్ ఫాలో అయ్యేవాడు. అందులో భాగంగానే తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న వేజ్ యాప్ (Waze app)ను వాడాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశానికి రాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, రద్దీ తక్కువగా ఉండే రూట్ కోసం వేజ్ యాప్‌లో జీపీఎస్ మ్యాప్‌ను ఫాలో అవుతూ కాస్త ముందుకు నడపగానే మంచుతో గడ్డకట్టి ఉన్న చిన్న సరసులోకి కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. భయబ్రాంతులకు లోనవడం కారులోని వారి వంతయింది. మంచుగడ్డలు చూపిన నరకం కన్నా యాప్ చూపిన నరకమే ఆ ముగ్గురు బాధితుల్ని తెగ ఇబ్బంది పెట్టిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ప్రమాదం విషయం తెలియగానే యజమాని టారా గుర్టిన్ షాకయ్యారు. కారులోని వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఎస్యూవీ జీపును నీటి మడుగు నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. గూగుల్ అధికార ప్రతినిధి జూలీ మోస్లర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వేజ్ యాప్‌లో ఇప్పటికే కొన్ని లక్షలసార్లు మార్పులు చేశాం. నిత్యం రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజూ అప్డేట్ చేస్తుంటాం. డ్రైవర్లు యాప్‌తో పాటు రోడ్డుపై ఓ కన్నేసి ఉంచి వాహనాలు నడిపితే కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. -
సేవ్ డేటా.. గూగుల్ సరికొత్త యాప్
సాక్షి : గూగుల్ మరో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. మొబైల్ డేటా వాడకం నియంత్రణ కోసం డేటాల్లీని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు ఎంత డేటాను వాడాడో తెలుసుకుని.. తద్వారా డేటాను సేవ్ చేసుకోవచ్చు. పైగా దీనిద్వారా మరో కీలక సమస్య కూడా పరిష్కారం అవుతుందని గూగుల్ ప్రకటించింది. కొన్ని కొన్నిసార్లు వాడకపోయినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్లో కొన్ని యాప్‌లు డేటాను ఆటోమేటిక్‌గా వినియోగించుకుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకే డెటాల్లీ యాప్ బాగా సహకరిస్తుంది. తద్వారా దాదాపు 30 శాతం మొబైల్ డేటాను సేవ్ చేసే సదుపాయం కలుగుతుంది. అలాగే ఈ యాప్ ద్వారా దగ్గరలో ఉన్న వైఫై నెట్‌వర్క్‌లను కనిపెట్టవచ్చు. నాణ్యమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించే నెట్‌వర్క్‌లను ఈ యాప్ ద్వారా ఎంచుకోవచ్చు. గూగుల్ సంబంధిత నెక్స్ట్ బిలియన్ యూజర్స్ దీనిని సృష్టించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వర్షన్ ఉన్న ఫోన్లలో.. ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. -
నిఘా నీడలో నెటిజన్లు!
అమెరికాలానే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ పౌరుల వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్‌కు దరఖాస్తులు పంపుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్ నుంచి గూగుల్‌కు 2,691 దరఖాస్తులు వెళ్లాయి. వాటిలో 64శాతం దరఖాస్తుల వివరాలను గూగుల్ అందజేసింది. భారత్ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్ ఉన్నాయి. పక్కవారి జీవితాల్లోకి తొంగిచూడడం కొందరికి సరదా.. కొందరికి అలవాటు.. ఇంకొందరికి అదో వ్యసనం... ఎవ రెంత గోలచేసినా వారికి పట్టదు. తమ ధోరణి తమదే. వ్యక్తిగత విషయాలు, అలవాట్లు, బలహీనతలు, ఆలోచన లు, ప్రణాళికలు.. ఇలా అవతలివారికి సంబంధించిన అన్ని వివరాలూ తెలుసుకుని తాము ఏదో సాధించామని సంబరపడుతుంటారు. వ్యక్తుల సంగతలా ఉంచితే ఇలాం టి వ్యసనం ప్రభుత్వాలకే ఉంటే.. ఇక ఆ దేశాలలోని పౌరుల పరిస్థితి ఏమిటో...! అంతులేని అభద్రతాభావం వెంటాడుతుంటే వారి మనఃస్థితి ఎలా ఉంటుందో.. ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వ్యక్తుల (నెటిజన్లు) వ్యక్తి గత సమాచారాన్ని అనేక దేశాలు అవసరానికి మించి తెలు సుకోవడం ఇటీవల పెరిగిపోయింది. ఉగ్రవాద బూచిని ఇందుకు సాకుగా చూపిస్తున్నాయి. ఇలాంటి దేశాలలో అగ్రరాజ్యం అమెరికా అందరికన్నా ముందుంది. ఆ తర్వాతి స్థానం మనదే. ఈ విషయాన్ని ఇటీవలే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ వెల్లడించింది. పారదర్శక నివేదిక పేరుతో గూగుల్ సంస్థ ఈ వివరాలను బైటపెట్టింది. ఇలా నివేదికలు వెల్లడించడం గూగుల్ 2010లో మొదలు పెట్టింది. తాజా నివేదిక (2013 జనవరి-జూన్) ఆ క్రమం లో 8వది. దేశాలు నెటిజన్ల వివరాలు అడగడం, తాము వాటిని ఇవ్వడం గురించి గూగుల్ ఎందుకు బయటపెడు తుందన్న సందేహం మనకు కలగవచ్చు. వారడిగిన సమా చారం ఇచ్చి ఊరుకుంటే సరిపోతుంది కదా అని కూడా అనిపించవచ్చు. కానీ తాము నెటిజన్ల పక్షమని నిరూపిం చుకునేందుకు గూగుల్ అనుక్షణం తపిస్తుంటుంది. తమ సేవలను ఉపయోగించుకుంటున్న వారి పక్షానే తాము పనిచేస్తున్నామని, ప్రభుత్వాలకు ఏజెంట్ కాదని చెప్పు కునేందుకు గూగుల్ ఈ పారదర్శక నివేదికలను ఉప యోగించుకుంటున్నది. ఇక నివేదికలోని అంశాలను పరిశీలిద్దాం... నెటిజన్ల వివరాలను ప్రభుత్వాలు కోరడం గతంతో పోల్చితే ఇపుడు 100శాతం పెరిగింది. 2013 తొలి ఆరునెలల్లో అమెరికా ప్రభుత్వం గూగుల్‌కు 10,918 అభ్యర్థనలను పంపించింది. వాటిలో 83శాతం దరఖాస్తులకు గూగుల్ నుంచి సమా ధానాలు అందాయి కూడా. అమెరికా రాజమార్గంలో ఇలా సమాచారాన్ని అడిగి తీసుకోవడమే కాదు... రహస్యంగా గూగుల్ ఫైబర్ లైన్లను ట్యాప్ చేసి కూడా చాలా సమా చారాన్ని దొంగిలిస్తున్నదని ఇటీవలే బైటపడింది. అమెరికాకు చెందిన ఫెడరల్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ దుర్మార్గానికి ఒడిగట్టిందని తేలింది. అమెరికా మాజీ గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ విషయాలను మీడియాకు ససాక్ష్యంగా వెల్లడించారు. అందరికీ నీతులు చెప్పే అమెరికా ఇలా అక్రమాలకు తెగబడడం కొత్తేమీ కాదు గానీ ప్రభుత్వాలే సక్రమ, అక్రమ పద్ధతులన్నీ ఉప యోగించుకుని సామాన్యుల వివరాలిలా కాజేయడం క్షమార్హం కాదు. అమెరికాలానే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ పౌరుల వ్యక్తిగత సమాచారం కోసం గూగుల్‌కు దరఖాస్తులు పంపుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్ నుంచి గూగుల్‌కు 2,691 దరఖాస్తులు వెళ్లాయి. వాటిలో 64శాతం దరఖాస్తుల వివ రాలను గూగుల్ అందజేసింది. భారత్ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బ్రెజిల్ ఉన్నాయి. గూగుల్ మాత్రమే కాదు ఫేస్‌బుక్‌కు కూడా ప్రభుత్వాల నుంచి ఇలాంటి దరఖాస్తులు అందుతున్నాయి. ఇం దులోనూ అమెరికా తర్వాత స్థానంలో భారత్ ఉంది. భార త ప్రభుత్వం సమాచారం కోసం 3,245 దరఖాస్తులను, యూజర్లు/అకౌంట్ల వివరాల కోసం 4,144 దరఖాస్తులను పంపించిందట. అందులో 50 శాతం దరఖాస్తులకు ఫేస్ బుక్ సమాధానాలు అందజేసింది. అలాగే ఫలానా వీడి యోలు తీసేయాలంటూ యూట్యూబ్‌కి కూడా భారత ప్రభుత్వం నుంచి ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయి. గూగుల్ పారదర్శక నివేదిక (2012 జనవరి-జూన్) ప్రకా రం యూట్యూబ్‌కు దరఖాస్తుల సంఖ్య 100కి లోపే ఉం డగా అదే ఏడాది జులై-డిసెంబర్ మధ్య 2540 దరఖా స్తులు అందాయి. ఆ కాలంలో ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ఇస్లాం’ సినిమా విడుదల ఈ హాఠాత్ పెరుగుదలకు కారణం. ఆ సినిమాకి సంబంధించిన క్లిప్పింగులు, వీడియోలు తీసే యాలంటూ దరఖాస్తులు ఎక్కువ వెళ్లాయి. 2011తో పోల్చితే 2012లో యూట్యూబ్‌కి భారత్ నుంచి అందిన దరఖాస్తుల సంఖ్య 90శాతం పెరిగింది. ప్రజల భద్రత కోసం, ఉగ్రవాద ముష్కరుల ఆనుపా నులు తెలుసుకోవడం కోసం ఆయా దేశాలు ఇంటర్నెట్లో వ్యక్తుల సమాచారం సేకరించడం అర్దం చేసుకోవలసిన అంశమే. అయితే ఇలా సేకరించిన సమాచారాన్ని ఏ విధం గా ఉపయోగిస్తున్నారో.. దానిని ఉపయోగించుకుని ఏఏ ఫలితాలను సాధించారో వెల్లడించకపోతే అనుమానించ డం సహజమేకదా..? ఏ దేశమూ ఈ సమాచారం విష యంలో పారదర్శకంగా వ్యవహరించక పోవడం ఆందోళ న కల్గించే అంశం. ప్రజాస్వామ్యవ్యవస్థ ఉన్న దేశాలు కూ డా తమ పౌరుల ప్రాథమిక హక్కులను గుర్తించకపోవ డం, వారిపై కనీస విశ్వాసముంచకపోవడం విచారకరం. గూగుల్ లీగల్ డెరైక్టర్ రిచర్డ్ సల్గాడో కోరుతున్నట్లు ఇప్ప టికైనా ప్రభుత్వాలు సామాన్యుల వ్యక్తిగత సమాచారం వి షయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాలి. సేక రించిన సమాచారాన్ని సమాజహితానికే ఉపయోగించాలి. - పోతుకూరు సాయిచరణ్