అన్ని స్మార్ట్‌ఫోన్లలో అందిస్తున్న పాపులర్ గూగుల్ సర్వీసులు త్వరలో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్, జియోఫోన్‌లోకి రాబోతున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్‌లను జియో ఫోన్‌లో అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జియో ఫీచర్ ఫోన్ ప్రస్తుతం అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్‌కు చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కిఓఎస్ ఈ యాప్స్‌ను త్వరలో తన యూజర్లకు అందించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి కిఓఎస్ టెక్నాలజీస్ సంస్థకు 22 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టబడులను తర్వాతి తరం యూజర్లకు ఇంటర్నెట్‌ను అందించడానికి ఉపయోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
గూగుల్ నుంచి వచ్చిన ఈ నిధులను ఫాస్ట్-ట్రాక్ అభివృద్ధికి ఉపయోగిస్తామని, కిఓఎస్ ఆధారంగా రూపొందిన స్మార్ట్ ఫీచర్‌ఫోన్లను గ్లోబల్‌గా అందిస్తామని కిఓఎస్ చెప్పింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని ఎమర్జింగ్ మార్కెట్లలో వీటిని ఉపయోగిస్తామని కిఓఎస్ టెక్నాలజీస్ సీఈవో సెబాస్టియన్ చెప్పారు. జియోఫోన్లు విజయవంతం కావడంతో, గూగుల్‌కు చెందిన పలు పాపులర్ యాప్స్‌ను ఈ యూజర్లకు అందించాలని కిఓఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. కిఓఎస్ అనేది వెబ్ ఆధారిత ప్లాట్‌పామ్. జియోఫోన్‌కు వెల్లువెత్తిన భారీ డిమాండ్‌తో ఈ ఓఎస్ మొబైల్ ఓఎస్ మార్కెట్‌లో ఆపిల్ ఓఎస్‌ను బీట్‌ను చేసి మరీ 15 శాతం లాభాలనార్జించింది.
Comments
Please login to add a commentAdd a comment