jiophone
-
జియో నుంచి మరో సంచలనం..! అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్..!
జియో రాకతో భారత టెలికాం రంగంలో పెను సంచలనాలు నమోదైన విషయం తెలిసిందే. భారత్‌లో డిజిటల్ సాధికారితను సాధించేందుకు గాను అత్యంత తక్కువ ధరకే జియోఫోన్ నెక్ట్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్ జియో తెర తీయనుంది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్..! భారత్‌లో 5G విప్లవం ఈ ఏడాది నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5జీ విస్తరణలో రిలయన్స్ జియో ముందంజలో నిలుస్తోంది. అందుకు తగ్గట్టుగా 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసే పనిలో రిలయన్స్ నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధర ఎంతంటే..? 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో అధిపత్యాన్ని చెలాయిస్తోన్న రియల్మీ, రెడ్మీ స్మార్ట్‌ఫోన్స్‌కు పోటీగా రిలయన్స్ జియో 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ప్రస్తుతం 5జీ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో రూ. 13 వేలకు అందుబాటులో ఉంది. దీని కంటే తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ దాదాపు రూ. 10 వేలకు లభించనుంది. రిలయన్స్ జియోఫోన్ 5జీ స్పెసిఫికేషన్స్ (అంచనా) 6.5-అంగుళాల హెచ్డీ LCD డిస్ప్లే క్వాలకం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్ ప్రగతి ఓఎస్ బదులుగా ఆండ్రాయిడ్ ఓఎస్ 4GB RAM+ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ 13-ఎంపీ+2-ఎంపీ రియర్ కెమెరా 8-ఎంపీ సెల్ఫీ కెమెరా మైక్రో SD కార్డ్ స్లాట్ N3, N5, N28, N40, N78 బ్యాండ్ సపోర్ట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5000mAh బ్యాటరీ USB-C సపోర్ట్ చదవండి: బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ ఇదేనేమో..! -
తప్పిన తిప్పలు.. ఆన్లైన్లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్!
మీరు కొత్తగా జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ కొనాలని చూస్తునారా? అయితే మీకు ఒక తీపికబురు. ఇక నుంచి జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ కొనడానికి ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను నేరుగా రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఫోన్ కొనడానికి ఇప్పటి వరకు వినియోగదారులు వాట్సప్ ద్వారా లేదా అధికారిక జియో వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు సులభంగా రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ ద్వారా రూ. 6,499 చెల్లించి కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ కొనడానికి వినియోగదారులు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మొబైల్ కొనడానికి ముందుగా ఫుల్ల పేమెంట్ చేయాల్సి ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు. ఎవరైనా గ్రామ ప్రజలు ఈ ఫోన్ బుక్ చేస్తే, మీ దగ్గరలోని జియో స్టోర్ కి వెళ్లి తీసుకోవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ర్యామ్,స్టోరేజ్: 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు కెమెరా: 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం సెన్సార్లు: యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ (చదవండి: విద్యార్థినులకు గూగుల్ గుడ్‌న్యూస్!) -
'జియో ఫోన్ నెక్ట్స్'నే ఎందుకు కొనాలి, లెక్కలతో ఏకిపారేస్తున్న నెటిజన్లు..!
దీపావళి సందర్భంగా జియో సంస్థ ప్రపంచంలోనే అత్యంత చవక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జియో సంస్థ ఫోన్ ఫీచర్లు, ధరల్ని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో నెటిజన్లు తమదైన స్టైల్ స్పందిస్తున్నారు. లెక్కలేసి మరి ఫోన్ ధర రూ.6,499 కాదని, అంతకంటే ఎక్కువగానే ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్లో ట్రోల్స్ ట్రెండ్ అవుతుండగా.. ఫోన్ ధర తాము ఊహించినదానికంటే ఎక్కువగానే ఉందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో జియో ఫోన్ పై ట్రోల్స్ జీరో సీఎంఏ స్టూడెంట్ అనే ట్విట్టర్ యూజర్.. నేను జియో ఫోన్ నెక్ట్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి? జియో సంస్థ ప్రకటించిన ధర ఒకలా ఉంది. కానీ ప్లాన్లను కౌంట్ చేస్తే కాస్ట్ ఎక్కువైతుందని ట్వీట్ చేశాడు. Hello @reliancejio @JioCare @GoogleIndia Can u tell me pls,why should I choose ur Jio next phone? 1999+501+(18*500)= 10800+2500 =13,300 When compared to other best brand than jio next phone cost will be =6100+(18*199) = 9700Rs. Where is affordability in your product? pic.twitter.com/YvOieFSkg8 — Zero (@CMA_Student_21) October 30, 2021 జియో సంస్థ చెప్పిన కాస్ట్ ఇలా ఉంటే.. ఫోన్ అసలు ధర ఇలా ఉందని మరో నెటిజన్ ఉత్సవ్ టెక్కీ కామెంట్ చేశాడు. This is How Much Jio Phone Next will actually cost: Phone Down Payment 1999 Processing Fee 501 Total initially 2500 5GB per Months 24 Month 7200 Total 9700 18 Month 6300 Total Rs. 8800 1.5GB/Day 24 months 10800 Total 13,300 18 months 9000 Total 11500 pic.twitter.com/UUDulYf6HQ — Utsav Techie (@utsavtechie) October 29, 2021 చదవండి: జియో ఫోన్ కంటే ధర తక్కువగా ఉన్న ఫోన్ ఇదే -
తిరుపతి కేంద్రంగా ‘జియో నెక్ట్స్’.. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ..
‘సమర్థవంతమైన నాయకత్వం, నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రపంచస్థాయి మౌలిక వసతులు.. రాకపోకలకు, ఎగుమతులకు అనుకూలత, మదుపరులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానంతో తిరుపతి నగరం వ్యాపారాభివృద్ధికి దేశంలోనే అత్యంత అనుకూలమైన ప్రాంతాల జాబితాలో నిలిచింది. ►ప్రముఖ పారిశ్రామిక నగరంగా ఎదుగుతోంది.. ►ఇందుకు ఉదాహరణే ఇప్పుడు జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ల తయారీకి జియో సంస్థ తిరుపతి కేంద్రంగా శ్రీకారం చుట్టింది. ►రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్–2లోని నియోలింక్స్ ప్లాంట్‌లో ఇప్పటికే ఫోన్ల తయారీ చేపట్టింది. ►రానున్న దీపావళికి, లేదా నవంబర్ నెలాఖరులోగా లాంఛనంగా ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. సాక్షి, తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్(ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్–2)లో ఉన్న యునైటెడ్ టెలీలింక్స్ నియోలింక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జియో నెక్ట్స్ ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టింది. ప్రాథమికంగా రూ.20కోట్ల పెట్టుబడి పెట్టిన రిలయన్స్ సంస్థ త్వరలోనే భారీ పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది. మొబైల్ ఫోన్లు, టెలికాం, కంప్యూటర్ పరికరాలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తుల తయారీని చేపట్టనున్నట్టు సంస్థ పేర్కొంది. 2023 మార్చి నాటికి భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ఫోన్ మొత్తం తయారీ ఇక్కడే.. జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఆండ్రాయిడ్ ఆధారిత అత్యాధునిక ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్‌తో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేసింది. క్వాల్కామ్ ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్ ఫోన్లో పొందుపరిచారు. 10 భాషలను అనువదించే ఫీచర్ ఈ ఫోన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇందులోని రీడ్ అలౌడ్ ఫంక్షన్ స్క్రీన్‌పై తెరచిన యాప్‌లో ఉన్న కంటెంట్‌ను బిగ్గరగా చదువుతుంది. వాయిస్ అసిస్టెంట్‌తో ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ నుంచి కావాల్సిన సమాచారం పొందవచ్చు. సాఫ్ట్వేర్ దానంతట అదే అప్డేట్ అవుతుందని సంస్థ వెల్లడించింది. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ వద్ద ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన నియో లింక్స్ ప్లాంట్‌లో మదర్బోర్డ్ ఒక్కటే తయారవుతుండగా, రేణిగుంటలోని ప్లాంట్‌లో మదర్బోర్డ్ సహా ఫోన్ మొత్తం తయారవుతుండడం విశేషం. నెలకు ఐదు లక్షల ఫోన్ల తయారీ జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ దీపావళి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. తిరుపతిలోని ప్లాంట్‌లో నెలకు సగటున ఐదులక్షల ఫోన్లను తయారు చేస్తున్నామని నియోలింక్స్ ప్లాంట్ జనరల్ మేనేజర్ సాయి సుబ్రమణ్యం తెలిపారు. ఫోన్ల తయారీలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న ట్లు వెల్లడించారు. ఇప్పుడేమంటారు తమ్ముళ్లూ.. తిరుపతి సమీపంలోని రేణిగుంట, ఏర్పేడుల్లో ఎల్రక్టానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్‌ను భూసేకరణ వివాదంతో గత టీడీపీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. 2018లో భూసేకరణ సందర్భంగా జరిగిన అవకతవకలు, అక్రమాల కారణంగా ఇక్కడ రిలయన్స్ పెట్టుబడులు పెట్టేందుకు ఒకింత జాప్యం చేసింది. కానీ టీడీపీ వర్గాలు, పచ్చమూకలు ఆ నెపాన్ని 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపాలని చూశాయి. వైఎస్సార్సీపీ సర్కారు రాకతోనే ఆ సంస్థ వెనక్కి మళ్లిందని ఇష్టానుసారం విషం చిమ్మాయి. ఇప్పుడు ఆ భూసేకరణ వ్యవహారాన్ని కాస్త పక్కనపెడితే.. టీడీపీ విషప్రచారం మాత్రం వందశాతం ఒట్టిదేనని నిర్ధారణైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ ప్రతిష్టాత్మక జియో ఫోన్ నెక్ట్స్ తయారీకి తిరుపతినే ఎంచుకుని అన్ని దుష్ప్రచారాలను పటాపంచలు చేసింది -
జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..!
భారత మొబైల్ నెట్‌వర్క్‌లో జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌తో జియో మరో సంచలనాన్ని నమోదు చేయనుంది. ప్రపంచంలో అత్యంత చౌకైన ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ త్వరలోనే రిలీజ్ కానుంది. దీపావళి రోజున జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు...! జియోఫోన్ నెక్ట్స్ లాంచ్ భారత్‌లో ఈ దీపావళి పండుగకు భారతీయుల ముందుకు వస్తోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ధృవీకరించారు. ఈ సందర్భంగా సుందర్‌పిచాయ్ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో జియోఫోన్ నెక్ట్స్ నాయకత్వం వహిస్తోందని సుందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ రాకతో భారత్‌లో డిజిటల్ పరివర్తన కోసం ఒక పునాది చూపబడుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్-రీచ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోందని అన్నారు. జియోఫోన్ నెక్ట్స్తో భారతీయులు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ లాంటి దేశాలు ఆసియా-పపిఫిక్ రిజియన్లో గూగుల్‌కు ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించారు. జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్..! 5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్ అడ్రినో 306 జీపీయు 2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్ ధర - రూ.3,499 చదవండి:ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్ -
జియో ఫోన్‌పై మరో రూమర్, అదే నిజమైతే..!
బడ్జెట్ ఫోన్ 'జియోనెక్ట్స్'పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పటికే జియో ఫోన్ వినాయక చవితికి విడుదల కావాల్సి ఉండగా..సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుంది? పెరిగిన ఫోన్ కాంపోనెట్స్ ధరల కారణంగా..గతంలో అనౌన్స్ చేసిన ధరకే వస్తుందా? లేదంటే ప్రైస్ తగ్గుతుందా? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయనే' విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. జియో ఫోన్ పై రూమర్స్ జియో - గూగుల్ భాగస్వామ్యంలో అతి తక్కువ ధరకే విడుదల కానున్న ఆండ్రాయిడ్ ఫోన్‌పై మరోసారి కొన్ని రూమర్స్ వెలుగులోకి వచ్చాయి. గతంలో (సెప్టెంబర్ 10 రిపోర్ట్ ప్రకారం) ఈ ఫోన్ ధర రూ.5వేలని ప్రచారం జరిగింది. ఈటి టెలికామ్ రిపోర్ట్ ప్రకారం..ఫోన్లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్) ధర సుమారు 20శాతం పెరిగాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్ ధరలతో జియో ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని, రూ.5వేలకే వచ్చే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజా రూమర్స్‌తో ఫోన్ ధర రూ.3,499కే లభించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తొలిసారి భారతీయలు అతితక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే అవకాశం లభించినట్లవుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్స్ సంగతి ఎలా ఉన్నా..ఈ ఫోన్ ధర ఎంత అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంది. ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయ్ కాంపాక్ట్ డిస్ప్లేతో రానున్న ఈ ఫోన్ 5.5 అంగుళాలు ఉండనుంది. క్వాల్కమ్ క్యూఎం 215 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, 2500ఎంఏహెచ్ బ్యాటరీ, 2జీబీ అండ్ 3జీబీ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ రేర్ కెమెరా, స్నాప్ చాట్ లెన్సెస్, వాయిస్ కమాండ్ కోసం గూగుల్ అసిస్టెంట్స్, గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్,ఇతర ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. -
జియోకు కొత్త చిక్కులు,పెరగనున్న 'జియో నెక్ట్స్' ఫోన్ ధరలు?
సెమీ కండక్టర్ల కొరత రిలయన్స్ జియోకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుందా? ప్రపంచంలో అత్యంత చవకైన 'జియో నెక్ట్స్' ఫోన్ ధర మరింత పెరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంచనా ప్రకారం..ఈ ఫోన్ ధర రూ.5వేలు ఉండగా.. ఫోన్లో తప్పనిసరిగా ఉండాల్సిన సెమీకండక్టర్ ధర పెరగడంతో..ఆ ప్రభావం జియో నెక్ట్స్ ధరపై పడనున్నట్లు తెలుస్తోంది. గూగుల్-జియో ఆధ్వర్యంలో వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో ఫోన్..దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫోన్ విడుదల వాయిదా వేయడంతో ధర మరింత పెరగనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటి టెలికామ్ రిపోర్ట్ ప్రకారం..ఫోన్లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్) ధర సుమారు 20శాతం పెరిగింది. పెరిగిన ధరతో సెమీకండక్టర్ల లభ్యత లోటు 8 నుండి 20 వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్ ధరలతో జియో ఫోన్ పై ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ధరకే వచ్చే అవకాశం లేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. దీంతో దిపావళికి జియో ఫోన్ విడుదలైనా విస్తృతంగా కాకుండా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండన్నుట్లు తెలుస్తోంది.కాగా,ధర పెరుగుదల, పూర్తి స్థాయిలో ఫోన్ అందుబాటులోకి తెస్తుందా? లేదంటే పరిమిత సంఖ్యలోనే విడుదల చేస్తుందా' అన్న ప్రచారంపై జియో స్పందించాల్సి ఉంది. చదవండి : జియోకి పోటీగా విడుదల కానున్న నోకియా బడ్జెట్ ఫోన్ -
జియోఫోన్‌కు పోటీగా...ఎయిర్టెల్ కొత్త ప్లాన్...!
ముంబై: టెలికాం రంగంలో జియో రాకతో పలు సంస్థలకు కంటిమీద కునుకులేకుండాపోయింది. జియో మొబైల్ టారిఫ్ చార్జీలను గణనీయంగా తగ్గించడంతో ఇతర టెలికాం సంస్థలు కూడా టారిఫ్ ఛార్జీలను తగ్గించాల్సి వచ్చింది. భారత టెలికాం రంగంలో తనదైన ముద్రను వేయడం కోసం జియో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్‌ను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్స్ కొరతతో జియోఫోన్ నెక్ట్స్ లాంచ్‌కు బ్రేకులు పడింది. జియోఫోన్ నెక్ట్స్‌ను దీపావళికి రిలీజ్ చేస్తోందని రిలయన్స్ ప్రకటించింది. చదవండి: రష్యాలో ఏమైంది..! దిగ్గజ టెక్ కంపెనీలపై వరుసగా... కొత్త ప్లాన్‌తో ఎయిర్టెల్...! జియోఫోన్ నెక్ట్స్‌ను ఎదుర్కొనేందుకుగాను ఎయిర్టెల్ కొత్తప్లాన్‌తో ముందుకు వస్తోంది. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో ఎయిర్టెల్ ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై బండిల్ డేటా ప్యాక్‌లను, వాయిస్ ఆఫర్లను అందించాలని ఎయిర్టెల్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికతో ఎయిర్‌టెల్‌కు చెందిన 2జీ సబ్‌స్రైబర్స్ బేస్‌ను రక్షించుకోవాలనే లక్ష్యాన్ని కంపెనీ పెట్టుకుంది. పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో చర్చలను జరిపేందుకు ప్రతిపాదనలను ఎయిర్టెల్ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది. లావా, కార్బాన్, హెచ్ఎమ్డీ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో ఎయిర్టెల్ చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్టెల్ పలు కంపెనీల హ్యాండ్సెట్ బ్రాండ్లతో పొత్తుతో పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై ఎయిర్టెల్ పలు ఆఫర్లను అందించాలని భావిస్తోంది. చదవండి: Paytm : మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై పేటీఎమ్ బంపర్ ఆఫర్...! -
జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10న ముఖేష్ అంబానీ మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ కొనేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్‌కి సంబంధించి డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఫోన్‌కి ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆరోజు చెప్పిన ముఖేష్ జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈఫోన్ ఫీచర్లు, కాస్ట్ ఎంత అనే అంశాలపై ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు మొబైల్‌మార్కెట్ ఎక్స్పర్ట్స్ దృవీకరించారు. ఫీచర్స్ ఎలా ఉన్నాయి 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. జియో మార్కెట్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఏప్రిల్-2021 లెక్కల ప్రకారం.. మే 2021 నాటికి జియో యూజర్లు 431,23 మిలియన్ల యూజర్లతో ప్రథమస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో 189.49 మిలియన్లతో ఎయిర్ టెల్ , 119.63 మిలియన్లతో వొడాఫోన్ - ఐడియా, 16.44 మిలియన్ యూజర్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే టెలికాం రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న జియో యూజర్లను పెంచేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో రూరల్ ఇండియాని టార్గెట్ చేస్తూ గూగుల్‌తో కలిసి ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది. -
జియోఫోన్ యూజర్లకు అదిరిపోయే కొత్త ఉచిత ఆఫర్స్!
ఎప్పటిలాగే రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.జియో ఫోన్ ప్రీ పెయిడ్ యూజర్లు కళ్లు చెదిరేలా 'బై వన్ గెట్ ఫ్రీ వన్' ఆఫర్లను ప్రకటించింది. ఉదాహరణకు జియో ఫోన్ యూజర్లు రూ.125తో రిఛార్జ్ చేసుకుంటే రూ.125 విలువ గల డేటా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో ఎయిర్టెల్ 46.13 లక్షల మంది యూజర్స్‌ను కోల్పోయింది. అదే సమయంలో రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో జియో మొత్తం యూజర్లు 43.12 కోట్లకు చేరుకున్నారు. అయితే వీరి సంఖ్యను మరింతగా పెంచేందుకు జియో ఆఫర్లను ప్రకటిస్తుంది. ఈ సారి ముఖ్యంగా గ్రామాల్ని టార్గెట్ చేస్తూ కొత్త కొత్త ఆఫర్లతో ఊరిస్తుంది. మరి ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జియో రీఛార్జ్ ప్లాన్స్ జియో ఫోన్ వినియోగదారులకు జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి. అందులో రూ.39,రూ.69,రూ.75,రూ.125 రూ.155,రూ.185గా ఉంది. రూ.39 రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్,14 రోజుల పాటు 100ఎంబీ డేటా అందిస్తుంది. ఆఫర్లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 100 ఎంబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.69 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14రోజుల పాటు ప్రతీ రోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 1 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.75 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటాను అందిస్తుంది. ఆఫర్లో భాగంగా 6జీబీ డేటాను పొందవచ్చు. రూ.125 రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. రూ.155 రీఛార్జ్ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్,28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుండగా అదనంగా రోజుకు 2జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. రూ.185 రీఛార్జ్ ప్లాన్ తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 2జీబీడేటాను అందిస్తుండగా ఆఫర్లో భాగంగా ప్రతి రోజు 4జీబీ డేటాను వినియోగించుకునేలా రిలయన్స్ జియో ఆఫర్లను ప్రకటించింది. -
రిలయన్స్ జియో యూజర్లకు బంపర్ అఫర్
కొత్త జియో ఫోన్ కొనుగోలు చేసే యూజర్లకు, ఇప్పటికే జియోఫోన్ కలిగిఉన్న యూజర్ల కోసం బంపర్ ఆఫర్‌ను రిలయన్స్ జియో తీసుకొచ్చింది. జియోఫోన్ 2021 ఆఫర్ కింద యూజర్లు రెండేళ్ల వరకు ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి నెల 2జీబీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్ సంస్థ జియో రూ.1999లతో జియో ఫోన్ కొనుగోలు చేస్తే 24 నెలల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ను ప్రతి రోజూ 2జీబీ డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్ ను ఎంచుకునే చందారులకు డేటా, అపరిమిత కాల్స్ సహా అనేక ప్రయోజనాలు అందుతాయి. ఇది ముఖ్యంగ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. రిలయన్స్ జియో యొక్క జియోఫోన్ 2021 ఆఫర్ కింద ఒక సంవత్సరం ప్లాన్ కూడా అందిస్తోంది. దీనికోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు జియోఫోన్ తో పాటు 12 నెలల ఆన్ లిమిటెడ్ సర్వీస్ అందుకోవచ్చు. అలాగే ఇప్పటికే జియోఫోన్ కలిగి ఉన్న వినియోదారుల కోసం మరో కొత్త ఆఫర్ ని ప్రకటించింది. ప్రతి నెల 2జీబీ డేటాతో పాటు, ఉచిత వాయిస్ కాల్స్ ను కేవలం రూ.749 అఫర్ ధరకే పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ తో జియోఫోన్ మాత్రం రాదు. ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పుడు, రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. “భారతదేశం లో జియోకు 300 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారని వారికి డేటా సేవలు మరింత దగ్గరగా తీసుకుని వెళ్లడం కోసమే తమ ప్రయత్నమని చెప్పారు. అలాగే ప్రస్తుతం 2జీ, 3జీ ఫోన్ లు వాడుతున్న వారికి 4జీ సేవలు అందించడమే తమ లక్ష్యమని" పేర్కొన్నారు. చదవండి: ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు 2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం -
నోకియా 8110లో వాట్సాప్..
న్యూఢిల్లీ: వాట్సాప్ ఫీచర్‌తో నోకియా 8110 మోడల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. నోకియా 8110 ఫోన్లో వాట్సాప్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చని, ఈ ఫోన్ ఎంతో స్టయిలిష్‌గా కనిపించేలా రూపొందించినట్టు నోకియా బ్రాండ్ యాజమాన్య సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా కంట్రీ హెడ్ అజయ్ మెహతా తెలిపారు. ఈ ఫోన్లో ఇంకా హాట్‌స్పాట్, వైఫై తదితర ఫీచర్లు సైతం ఉన్నట్టు చెప్పారు. నోకియా 8110లో వాట్సాప్ ఫీచర్ సదుపాయం ముందుగా భారతీయ వినియోగదారులకే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. నోకియా ఫోన్లోని స్టోర్ నుంచి వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 4జీ ఫీచర్‌ఫోన్. ఈ ఫోన్లో ఇంకా గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, ఫేస్బుక్ తదితర యాప్స్ ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. బ్లాక్, బనానా ఎల్లో రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రముఖ రిటైల్ స్టోర్లు, నోకియా డాట్ కామ్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ పోర్టళ్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. -
జియో ఫోన్ -2 ముచ్చటగా మూడోసారి
సాక్షి, ముంబై: రిలయెన్స్ జియో ఫోన్ హై-ఎండ్ మోడల్ జియో ఫోన్ 2 ఫ్లాష్ సేల్ ముచ్చటగా మూడోసారి కస్టమర్లను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు (సెప్టెంబరు12, బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు జియో ఫోన్2 ఫ్లాష్‌సేల్ ప్రారంభం కానుంది. మొదటి, రెండు ఫ్లాష్‌సేల్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే రికార్డు అమ్మకాలను నమోదు చేసి ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచింది. ఈ సేల్‌ద్వారా జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు. జియో 4జీఫోన్లు రెండింటిలోనూ వాట్సాప్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు నిన్న ప్రకటించింది. దీంతో వాట్సాప్, ఫేస్బుక్,యూట్యుబ్లాంటి పాపులర్ యాప్‌లన్నీ జియో ఫోన్లలో అందుబాటులోకి వచ్చాయి. కాగా ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ, అట్టహాసంగా లాంచ్ చేసిన జియో మొదటి ఫోన్‌కు మంచి స్పందన రావడంతో, హై-ఎండ్ మోడల్ జియో ఫోన్-2 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో ఫోన్ 2 ధర రూ.2,999 మాత్రమే. క్వెర్టీ కీప్యాడ్, 2.4 అంగుళాల హారిజాంటల్ డిస్ప్లే, 4జీ సపోర్ట్‌తోపాటు స్టోరేజ్ కెపాసిటీని 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం. జియో ఫోన్-2 ఫీచర్లు 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకువిస్తరించుకునే అవకాశం 2 ఎంపీ రియర్ కెమెరా వీజీఏ ఫ్రంట్ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోఫోన్: యూట్యూబ్ వస్తోంది, మరి వాట్సాప్..
జియోఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఇదో అద్భుతం. స్మార్ట్‌ఫోన్ ప్రముఖ యాప్స్ అయిన వాట్సాప్, యూట్యూబ్‌లను ఈ ఫీచర్ ఫోన్లో అందించడానికి కంపెనీ సిద్ధమైన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ యాప్స్ జియోఫోన్‌లో అందుబాటులోకి వస్తాయని 41వ వార్షిక జనరల్ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ నేటి నుంచి జియోఫోన్‌లో యూట్యూబ్ యాప్ మాత్రమే అందుబాటులోకి వస్తోంది. జియోఫోన్ యూజర్లు ఎంతో కాలంగా వేచిచూస్తున్న వాట్సాప్ యాప్ మాత్రం అందరికీ అందుబాటులోకి రాదని తెలిసింది. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేసి, ఆ అనంతరం కొన్ని రోజుల తర్వాత మిగతా వారికి అందించాలని కంపెనీ చూస్తోందని వెల్లడైంది. దీని కోసం జియోఫోన్ యూజర్లు కొంతకాలం పాటు వేచిచూడాల్సిందేనని గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. బ్యాచ్‌ల వారీగా వాట్సాప్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. యూట్యూబ్‌ను మాత్రం జియో యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు జియోఫోన్ హై ఎండ్ మోడల్ జియోఫోన్ 2 ను కూడా నేటి నుంచే బుక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఈ ఫీచర్ ఫోన్ జియో.కామ్‌లో ఫ్లాష్ సేల్‌లో లభ్యమవుతుంది. జియోఫోన్ యూజర్ల కోసం గూగుల్ అసిస్టెంట్‌ను కూడా కొన్ని నెలల కిందటే గూగుల్ తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్స్ వెర్షన్‌ను కూడా ఈ ఫీచర్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లను మీ వాయిస్ కమాండ్, టెక్ట్స్‌తో ఎలా వాడాలో రిలయన్స్ జియో డైరెక్టర్లు ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. యూట్యూబ్‌లో వీడియోను సెర్చ్ చేసుకునేందుకు మీ వాయిస్‌తో సెర్చ్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన్‌గా చూసుకోవడానికి డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం మాత్రం లేదు. టీ9 కీప్యాడ్‌ను వాడుతూ యూజర్లు వాట్సాప్‌లో మెసేజ్‌ను టైప్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫోన్ యూజర్లకు వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులో లేదు. -
‘మాన్సూన్ హంగామా’తో మరింత కిక్
జియో ఫోన్ మరో ప్రత్యేకతను సంతరించుకుంది. 2018 సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 27% మార్కెట్ వాటాను జియో ఫోన్ కైవసం చేసుకుందని సైబర్ మీడియా రీసెర్చ్ చేసిన అధ్యయనం వెల్లడించింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లోని ఫ్యూజన్ సెగ్మెంట్లో జియో ఫోన్ చరిత్ర సృష్టించిందని ఈ నివేదిక విశ్లేషించింది. 4జీ కనెక్టివిటీ కలిగి ఉండి వినియోగదారులకు నచ్చే యాప్‌లను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉందని వివరించింది. 2018 రెండో త్రైమాసికంలో స్వల్పకాలంలో మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని సైబర్ మీడియా రీసెర్చ్ తెలిపింది. ``అందులో ఒకటి జియో ప్రవేశపెట్టిన సంచలన మాన్సూన్ ఆఫర్. ఈ ఆఫర్ వల్ల అన్ని ప్రముఖ హ్యాండ్సెట్ల బ్రాండ్లకు అనియతమైన డిమాండ్ ఏర్పడింది. రెండో అంశం చిన్న తరహా విభాగానికి చెందిన వారు సీకేడీ మాన్యూఫాక్చరింగ్ వైపు దృష్టి సారించారు. దీంతోపాటుగా వారి సొంత ఎస్ఎంటీ లైన్ల ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించారు`` అని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) హెడ్ ప్రభురామ్ తెలిపారు. ఫీచర్ ఫోన్లు మరియు ఫ్యూజన్ ఫోన్లు కలిపి 2020 నాటికి స్మార్ట్ ఫోన్లను దాటివేస్తాయని సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. జియో ప్రకటించిన ఎక్సేంజ్ స్కీమ్`జియో ఫోన్ మాన్సూన్ హంగామా`కు తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించిందని నివేదిక తెలిపింది. ఈ ఆఫర్‌తో విపణిలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా.. జియో ఫోన్ అమ్మకాలలో విశేష వృద్ధి స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. ఈ పథకం ప్రవేశపెట్టిన కేవలం పదిరోజుల వ్యవధిలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది జియోఫోన్ల అమ్మకాలు జరిగాయని చెప్పింది. జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్లో భాగంగా వినియోగదారులు ఏదైనా ఫీచర్ ఫోన్ (ఏ బ్రాండ్ కు చెందినది అయినా) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ ( ప్రస్తుతం ఉన్న మోడల్)ను కేవలం రూ.501 సెక్యురిటీ డిపాజిట్ రుసుముతో పొందవచ్చు. వాస్తవ సెక్యురిటీ డిపాజిటల్ రూ.1500 కాగా, ఈ ఆఫర్లో రూ. 999 తగ్గింపు కావడం విశేషం. ఫీచర్ ఫోన్‌ను అందించే ఈ పథకంలో భాగంగా వినియోగదారులు రూ. 594(రూ.99 x 6) చెల్లించడం ద్వారా 6 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్, డేటాను పొందవచ్చు. అంటే వినియోగదారుడు రూ. 1,095 (రూ.501 తిరిగి చెల్లించే సెక్యురిటీ మొత్తం+ రూ.594 రీచార్జీ మొత్తం) చెల్లించడం ద్వారా ఆరునెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్, డేటా అందించే జియో ఫోన్‌ను తమ పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌లో సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. -
రిలయన్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
టెలికాం మార్కెట్ స్పేస్‌లో ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్న సంస్థ ఏదైనా ఉందా అంటే అది రిలయన్స్ జియోనే. రిలయన్స్ జియోను చూసి, ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లకు భలే ఆఫర్ తీసుకొచ్చింది. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్తగా యాడ్-ఆన్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతమున్న ప్యాక్‌లపైనే అదనంగా రోజుకు 2 జీబీ డేటాను ఆఫర్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఇది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమేనట. ఈ అదనపు డేటా పొందడానికి అర్హత ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. మైజియో యాప్‌లో ద్వారా ఆటోమేటిక్‌గా యాడ్-ఆన్ ప్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిసింది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ 2018 జూలై 31 వరకే వాలిడ్‌లో ఉండనుందని తెలిసింది. జియో ప్యాక్ యాక్టివ్‌తో... ఒకవేళ జియో యూజర్ రూ.399 ప్రీపెయిడ్ ప్యాక్‌పై రోజుకు 1.5 జీబీ డేటాను పొందుతూ ఉంటే, ఇక నుంచి రోజుకు 2 జీబీ అదనపు డేటాతో, మొత్తం 3.5 జీబీ 4జీ డేటాను పొందనున్నారు. ఈ ప్యాక్ వాలిడిటీ జూలై 31 వరకు ఉంటుందని తెలిసినప్పటికీ, కొంతమంది యూజర్లకు ఆగస్టు 2 వరకు ఆఫర్ చేస్తుందని టెలికాం టాక్ రిపోర్టు చేసింది. కాగ, ఈ నెల ప్రారంభంలోనే రిలయన్స్ జియో, జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కింద పాత ఫీచర్ ఫోన్లను ఇచ్చేసి, కొత్త జియోఫోన్‌ను కేవలం రూ.501కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా ఫుల్ రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్. అయితే ఈ డీల్ పొందడానికి ఆరు నెలల పాటు రూ.99 ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీఛార్జ్ చేయించుకోవాల్సినవసరం ఉంది. అయితే ఈ మొత్తం రూ.594ను కూడా ముందే పొందాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.501 ప్లస్ రూ.594 అంటే రూ.1095ను చెల్లించి జియోఫోన్‌ను కస్టమర్లు కొనుగోలు చేయాలి. -
జియో ఎక్స్‌క్లూజివ్ రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో కంపెనీ తన జియోఫోన్ యూజర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 99 రూపాయలతో ఈ కొత్త జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నట్టు తెలిపింది. దీని కింద 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ డేటాను కస్టమర్లకు జియో ఆఫర్ చేయనుంది. ప్రస్తుతమున్న 49 రూపాయల, 153 రూపాయల ప్యాక్‌లకు ఈ ప్లాన్ అదనం. ఈ ప్లాన్‌ను, కంపెనీ జియోఫోన్ మాన్సూన్ హంగామా ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు తీసకొచ్చింది. కొత్త రూ.99 జియోఫోన్ రీఛార్జ్, యూజర్లు నెలవారీ ఖర్చులను సుమారు 50 శాతం తగ్గించింది. డేటాతో పాటు ఎస్ఎంఎస్లను జియో 300కు పెంచింది. వాయిస్ కాల్స్‌ను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా రూ.594 రీఛార్జ్ ప్యాక్‌ను కూడా జియో ఆఫర్ చేస్తోంది. దీని కింద ఆరు నెలల పాటు అపరిమిత డేటాను, అపరిమిత కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్యాక్‌లో ఎలాంటి టెక్ట్స్ మెసేజ్‌లు రావడం లేదు. కాగ, జియో తీసుకొచ్చిన మాన్సూన్ హంగామా ఆఫర్ కింద, రూ.501 రీఫండబుల్ డిపాజిట్ కింద కొత్త జియోఫోన్‌ను తీసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ చేసే ఫీచర్ ఫోన్, వర్కింగ్ కండీషన్లో ఉండి, మూడేళ్ల కంటే తక్కువ వాడినదై ఉండాలి. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎవరైతే పొందాలనుకుంటున్నారో, వారికి 101 రూపాయల విలువైన 6 జీబీ కాంప్లిమెంటరీ డేటాను జియో ఆఫర్ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌తో పాటు, కొత్త జియో సిమ్ కూడా కస్టమర్లకు వస్తుంది. అయితే పాత నెంబర్‌ను మొబైల్ పోర్టబులిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. -
జియో మాన్సూన్ ఆఫర్ : రూ.1095 చెల్లించాలి
జియోఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్.. అదేనండి మాన్సూన్ హంగామా ఆఫర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ నెల ప్రారంభంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి జియోస్టోర్లు, అధికారిక రిటైల్ పార్టనర్ల వద్ద ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. వర్కింగ్ కండీషన్లో ఉన్న పాత ఫీచర్ ఫోన్‌ను ఇచ్చేసి, జియోఫోన్‌ను కేవలం రూ.501కే కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ మొత్తాన్ని కూడా మూడేళ్ల తర్వాత రీఫండ్ చేయనున్నామని కూడా పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌పై ఇంకా ఎక్కువ వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు. అయితే దీనికోసం కస్టమర్లు మొత్తంగా ఎంత చెల్లించాలి అనేది ప్రస్తుతం కంపెనీ అధికారిక కమ్యూనికేషన్లో తెలిపింది. కొత్త జియోఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందాలంటే కచ్చితంగా రూ.594ను కూడా చెల్లించాలట. ఈ మొత్తం ఆరు నెలల పాటు డేటా, వాయిస్ కాల్స్ పొందడం కోసం ఉపయోగపడుతుంది. ఈ మొత్తాన్ని కూడా కొత్త జియోఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడే చెల్లించాలని తెలిసింది. దీంతో మొత్తంగా కొత్త జియోఫోన్ ధర 1095 రూపాయల నుంచి 501 రూపాయలకు పెరుగుతుంది. ఈ అదనపు రూ.594 మొత్తంతో.. 99 రూపాయలతో ఆరు బ్యాక్-టూ-బ్యాక్ రీఛార్జ్‌లు పొందవచ్చు. రూ.99 ప్యాక్‌పై అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 0.5జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ మెసేజ్‌లను 28 రోజుల వాలిడిటీలో పొందనున్నారు. దీంతో పాటు రూ.101 విలువైన 6 జీబీ బోనస్ డేటా ఓచర్ కూడా కస్టమర్లకు లభిస్తుంది. దీంతో మొత్తంగా 6 నెలల పాటు 90 జీబీ డేటా ప్రయోజనాలు పొందనున్నారు. ప్రస్తుతం రెండు జియోఫోన్ ప్లాన్లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. ఒకటి 49 రూపాయలు. రెండు 153 రూపాయలు. 153 రూపాయల ప్లాన్ అత్యధిక అమ్ముడుపోతున్న ప్లాన్. -
జియో మాన్సూన్ హంగామా ఆఫర్ : వివరాలివే!
ముంబై : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రకటించిన మాన్సూన్ హంగామా ఆఫర్ నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఒక్క రోజు ముందుగానే మాన్సూన్ ‘హంగామా’ ఆఫర్‌ను రిలయన్స్ జియో లాంచ్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద కేవలం 501 రూపాయలకే జియోఫోన్‌ను కస్టమర్లకు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షికోత్సవ సమావేశంలో రిలయన్స్ జియో ఈ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 21 నుంచి ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తామని తెలిపింది. అయితే ఒక్క రోజు ముందుగానే అంటే నేటి నుంచే ఈ స్కీమ్‌ను రిలయన్స్ ప్రారంభిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం 5.01 గంటల నుంచి ఈ స్కీమ్ ప్రారంభమవుతుందని, ఇది జియోఫోన్ ఆఫర్ ధరను ప్రతిబింబిస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే ఈ కొత్త జియోఫోన్ రిజిస్ట్రేషన్లను సైతం కంపెనీ తన అధికారి వెబ్సైట్లో ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి కొత్త, పాత జియోఫోన్ యూజర్లకు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ యాప్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్ గూగుల్ మ్యాప్స్‌ను కూడా సపోర్టు చేస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న ఈ స్కీమ్ కింద మొబైల్ సబ్స్క్రైబర్లు తాము వాడే ఏ బ్రాండ్‌కు చెందిన ఫీచర్ ఫోన్‌నైనా ఎక్స్చేంజ్ చేసుకుని, కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. కాగ, ఇప్పటి వరకు 25 మిలియన్ ప్రజలు జియోఫోన్‌ను కొనుగోలు చేశారని రిలయన్స్ నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. జియోఫోన్ 100 మిలియన్ కన్జ్యూమర్లను చేరుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ స్కీమ్ వివరాలను రిలయన్స్ జియో ప్రకటించింది. అవేమిటో ఓ సారి చూద్దాం.. మాన్సూన్ హంగామా ఆఫర్ కింద కొత్త జియోఫోన్ కోసం యూజర్లు చెల్లించే రూ.501ను మూడేళ్ల తర్వాత రీఫండ్ చేయనున్నారు. ఎక్స్చేంజ్ చేసే ఫీచర్ ఫోన్ ఛార్జర్‌తో సహా, మంచి వర్కింగ్ కండిషన్లో ఉండాలి. కొత్త జియోఫోన్ కొనుగోలు చేసేటప్పుడు, పాత ఫీచర్ ఫోన్‌ను రిటైలర్‌కు ఇచ్చేయాలి. జియోఫోన్... జియోఫోన్‌తో పాటు జియో సిమ్ కస్టమర్లకు వస్తుంది. పాత నెంబర్‌నే కొనసాగించాలనుకునే వారు మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ) పెట్టుకోవాలి. ఎంఎన్‌పీ పెట్టుకున్నాక, మాన్సూన్ హంగామా ఆఫర్ పొందాల్సి ఉంటుంది. స్పెషల్ రీఛార్జ్ ప్లాన్... మాన్సూన్ హంగామా కింద స్పెషల్ జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్‌ను జియో ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ ప్లాన్ కింద రూ.594 చెల్లిస్తే, అపరిమిత వాయిస్, డేటా ప్రయోజనాలు ఆరు నెలల పాటు పొందనున్నారు. అదనంగా మాన్సూన్ హంగామా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.101 విలువైన 6 జీబీ స్పెషల్ ఎక్స్చేంజ్ బోనస్ లభ్యం. ఆరు నెలల పాటు మొత్తంగా 90 జీబీ డేటా పొందనున్నారు. జియోఫోన్ కొనుగోలు చేసేటప్పుడు తీసుకెళ్లాల్సినవి.. వర్కింగ్ కండీషన్లో ఉన్న పాత మొబైల్ ఫోన్ పాత ఫోన్ బ్యాటరీ అండ్ ఛార్జర్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ పెట్టుకుంటే, కొత్త ఎంఎన్‌పీ జియో నెంబర్ -
మాన్సూన్ హంగామా ఆఫర్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కంపెనీ పెద్ద పెద్ద ప్రకటనలో చేసింది. జియో గిగాఫైబర్ లాంచింగ్, జియో ఫోన్ హై ఎండ్ మోడల్ జియో ఫోన్2 విడుదల, జియోఫోన్‌లో వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ యాప్‌లు అందుబాటు వంటి వాటిని ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్ కూడా ఒకటి. అత్యంత తక్కువ ధరకు ఎవరైతే జియోఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికే ఈ జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్. పాత ఫీచర్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే పొందవచ్చు. జూలై 21 నుంచి జియో మాన్సూన్ హంగామా ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ రిజిస్ట్రేషన్లను కంపెనీ ప్రారంభించింది. ‘రిజిస్టర్ యువర్ ఇంటరెస్ట్’ గా జియో ఈ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. ఈ ఆఫర్‌ను రిజిస్ట్రర్ చేయాలనుకునే వారు, జియో.కామ్ లేదా మైజియో యాప్‌లోకి లాగిన్ అయి, ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దానిలో అడిగిన వివరాలను నమోదు చేసిన అనంతరం, నియమ, నిబంధనలను అంగీకరించి, వ్యాపారం లేదా వ్యక్తిగతం అనే దాన్ని క్లిక్ చేయాలి. ఆ అనంతరం సబ్మిట్ బటన్ నొక్కాలి. ఈ ప్రక్రియ అనంతరం జియో మాన్సూన్ హంగామా ఆఫర్‌ను రిజిస్టర్ చేసుకున్నట్టు మీ ఈ-మెయిల్‌కు లేదా ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది. జియో తొలుత మార్కెట్లో సిమ్ కార్డులను లాంచ్ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియను అనుసరిస్తోంది. ఎవరైతే ముందస్తు బుకింగ్ లేదా రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఇతరుల కంటే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. జియోఫోన్ కూడా ఇదే ప్రక్రియను రిలయన్స్ అనుసరించింది. అయితే తాజాగా చేపడుతున్న రిజిస్ట్రేషన్లు కస్టమర్లను క్యూలైన్ల నుంచి కాపాడలేవని తెలుస్తోంది. ఇది, కేవలం ఆఫర్ అందుబాటులోకి రావడానికి ముందే ఎన్ని డివైజ్‌లు అందుబాటులో ఉంటున్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్‌తో ఆఫర్ లైవ్‌లోకి వచ్చే సమయంలో యూజర్లకు నోటిఫికేషన్ అలర్ట్‌ను కంపెనీ పంపిస్తుందని, దీంతో స్టోర్ వద్దకు వెళ్లి త్వరగా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుందని తెలిసింది. ఆధార్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జియో స్టోర్‌కు తీసుకెళ్తే, మాన్సూన్ ఆఫర్లో జియోఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. -
జియో ‘మాన్సూన్ హంగామా’ ఆఫర్‌పై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ముంబైలో జరిగిన కంపెనీ 41 వార్షిక సమావేశంలో జియోఫోన్ 'మాన్సూన్ హంగామా' ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కింద వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పాత ఫీచర్ ఫోన్ ఇచ్చి కొత్తగా జియో ఫోన్‌ని కేవలం 501 రూపాయలకే పొందవచ్చని ముఖేష్ అంబానీ తెలిపారు. అయితే అదే సమయంలో జియోఫోన్ 2ను కూడా రిలయన్స్ ఆవిష్కరించింది. దీంతో వినియోగదారులందరూ ఈ ఆఫర్ జియోఫోన్ 2పై అనుకున్నారు. కానీ మాన్సూన్ హంగామా ఆఫర్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న జియోఫోన్‌పై అని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఏదైనా పాత ఫీచర్ ఫోన్‌ను ఇచ్చి రూ.501 చెల్లిస్తే జియోఫోన్(ప్రస్తుతం మార్కెట్లో ఉన్నది) కొనుగోలు చేయవచ్చని జియో ప్రతినిధులు ప్రకటించారు. ఈ ఆఫర్ జులై 21 న అందుబాటులోకి రానుందని తెలిపారు. దీంతో జియోఫోన్‌పై ఏర్పడిన గందరగోళం వీడింది. జియోఫోన్ ‘మాన్సూన్ హంగామా’ ఆఫర్‌పై గందరగోళం ఏర్పడటంతో, కొంతమంది వినియోగదారులు జియో స్టోర్లలో ప్రతినిధులను ఆరా తీశారు కూడా. ఆగస్టు 15 నుంచి ప్రస్తుతమున్న జియోఫోన్‌లోనూ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కాగా, కంపెనీ కొత్తగా ప్రకటించిన జియోఫోన్2 ఆగస్టు 15 నుంచి మార్కెట్లోకి రానుంది. ప్రారంభ ఆఫర్ కింద దీనిని రూ.2,999కే విక్రయించనున్నారు. -
జియో ఎఫెక్ట్ : ఆ నోకియా ఫోన్లోకి వాట్సాప్
న్యూఢిల్లీ : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కంపెనీ తన జియోఫోన్‌లో మూడు పాపులర్ యాప్స్ వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను అందించనున్నట్టు ప్రకటించగానే.. మిగతా ఫీచర్ ఫోన్ యూజర్లు కూడా జియోతో పోటీకి సిద్ధమవుతున్నాయి. జియో దెబ్బకు హెచ్ఎండీ గ్లోబల్ కూడా తన బనానా ఫోన్ నోకియా 8110 4జీ లో వాట్సాప్ అందించనున్నట్టు తెలిపింది. త్వరలోనే వాట్సాప్ సపోర్టును ఇవ్వనున్నట్టు తెలుపుతూ నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ల తయారీదారి హెచ్ఎండీ గ్లోబల్ టీజ్‌చేసింది. నోకియా ఈ ఫోన్ కూడా.. జియో ఫోన్ మాదిరి కిఓఎస్తో పనిచేస్తోంది. 2018 ఎండబ్ల్యూసీ ఈ ఫోన్ హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసింది. గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, లెజెండరీ స్నేక్ గేమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ అప్పడు వాట్సాప్ సపోర్టును ఈ బనానా ఫోన్ అందించలేకపోయింది. తాజాగా జియో తన ఫీచర్ ఫోన్‌కు వాట్సాప్ సపోర్టు తేవడంతో, ఇది కూడా తమ నోకియా ఫోన్‌కు త్వరలోనే వాట్సాప్ అందివ్వనున్నట్టు సంకేతాలిచ్చింది. ‘చూడండి. కిఓఎస్‌లో వాట్సాప్. ‘బనానా’స్లోకి వెళ్లడానికి చూస్తోంది’ అని హెచ్ఎండీ గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో సర్వికాస్ ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే నోకియా 8110 4జీ లోకి వాట్సాప్ వస్తున్నట్టు తెలిసింది. నోకియా 8110 4జీ ఫీచర్లు... డ్యూయల్ సిమ్ కిఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.45 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే 1.1గిగాహెడ్జ్ డ్యూయల్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్ 512 ఎంబీ ర్యామ్ 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డు ద్వారా మరింత విస్తరణ 2 ఎంపీ రియర్ కెమెరా 1500 ఎంఏహెచ్ బ్యాటరీ Oh look, #Whatsapp on #KaiOS! Looking forward to going 🍌s! https://t.co/Av6gW3T2M0 — Juho Sarvikas (@sarvikas) July 5, 2018 -
జియోఫోన్ 2 ఫీచర్లు ఇవే!
ముంబై : ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జియోఫోన్‌కు సక్ససర్‌గా హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పాత ఫోన్‌కు స్మార్టర్‌గా ఈ కొత్త జియోఫోన్ 2ను మార్కెట్లోకి వచ్చింది. అత్యాధునిక స్పెషిఫికేషన్లు, మెరుగైన డిజైన్‌తో జియోఫోన్ 2ను రిలయన్స్ రూపొందించింది. 25 మిలియన్ పాత జియోఫోన్లను విక్రయించినట్టు ప్రకటించిన అనంతరం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా, కొడుకు ఆకాశ్ జియోఫోన్ 2ను లాంచ్ చేశారు. జియోఫోన్ 2 స్పెషిఫికేషన్లు.. డిస్ప్లే : అంతకముందు జియోఫోన్‌కు ఉన్న డిస్ప్లే మాదిరిగానే 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే. కీప్యాడ్ ఏరియాలో మార్పు. బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్ సాఫ్ట్వేర్ : జియోఫోన్ 2, అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్ చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది ర్యామ్ : 512 ఎంబీ ర్యామ్ స్టోరేజ్ : 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ బ్యాటరీ : 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కనెక్టివిటీ : వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో వెనుక కెమెరా : 2 మెగాపిక్సెల్ సెన్సార్ ముందు కెమెరా : వీజీఏ సెన్సార్ స్పెషల్ ఫీచర్లు... క్వర్టీ కీప్యాడ్ కొత్త జియోఫోన్ 2లో కీలక ఫీచర్. జియోఫోన్‌తో పోలిస్తే మొత్తం డిజైన్‌ను రిలయన్స్ మార్చింది. జియోఫోన్ బేసిక్ ఫీచర్ ఫోన్ మాదిరి ఉంటే, జియోఫోన్ 2 ఎంట్రీ-లెవల్ ఫోన్ల మాదిరిగా ఉంది. జియోఫోన్‌కు హై-ఎండ్ వెర్షన్ జియోఫోన్ 2గా కంపెనీ అభివర్ణించింది. జియోఫోన్ 2 డ్యూయల్ సిమ్ కార్డు సపోర్టుతో మార్కెట్లోకి వచ్చింది. ప్రైమరీ సిమ్ కార్డు స్లాట్ లాక్ చేసి ఉంటుంది. దాన్ని స్పెషల్‌గా జియో సిమ్ కోసమే రూపొందించారు. రెండో సిమ్ కార్డు స్లాట్ అన్‌లాక్‌తో ఉంది. దీనిలో ఇతర నెట్‌వర్క్‌లు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సిమ్‌లు వేసుకోవచ్చు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ పాపులర్ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌ను ఈ ఫోన్లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 15 నుంచి జియోఫోన్ 2 విక్రయాలు కమర్షియల్‌గా ప్రారంభమవుతాయి. జియోఫోన్ 2 లో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. జియోఫోన్ కోసం మాన్సూన్ హంగామా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. ఈ ఆఫర్ జూన్ 21 నుంచి ప్రారంభమవుతుంది. జియోఫోన్ 2 ధర : రూ.2999కే ఈ ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. బ్లాక్ రంగులో ఈ ఫోన్ లభ్యమవుతుంది. జియోఫోన్ 2 రిటైల్ పార్టనర్లు ఎవరన్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించలేదు. -
రిలయన్స్ 41వ వార్షిక సమావేశం
-
ముఖేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్
ముంబై : జియో ఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ కోసం ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. జియోఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి మాన్సూన్ హంగామా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్ ఫోన్ల ఎక్స్చేంజ్లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. జూలై 21 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయితే కమర్షియల్‌గా ఈ కొత్త జియోఫోన్ 2 విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.2,999గా ముఖేష్ అంబానీ చెప్పారు. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో పలు సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశపెట్టింది. జియోఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఫీచర్లను కూడా ఇషా, ఆకాశ్‌లు ప్రవేశపెట్టారు. జియోఫోన్ 20 కోట్లకు పైగా వాయిస్ కమాండ్లను సృష్టిస్తుందని తెలిపారు. 100 మిలియన్ యూజర్ల టార్గెట్‌గా అడ్వాన్స్ ఫీచర్లతో ఈ జియోఫోన్ 2ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే జియోఫోన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జీరోకే జియో ఫీచర్‌ఫోన్‌ను రిలయన్స్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు అడ్వాన్స్డ్ గా మరిన్ని ఫీచర్లను జతచేరుస్తూ జియోఫోన్ 2ను రిలయన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. చదవండి : ‘జియో గిగాఫైబర్’ను ప్రవేశపెట్టిన రిలయన్స్ -
జియోఫోన్‌కు త్వరలో పాపులర్ గూగుల్ ఫీచర్లు
అన్ని స్మార్ట్ఫోన్లలో అందిస్తున్న పాపులర్ గూగుల్ సర్వీసులు త్వరలో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్, జియోఫోన్‌లోకి రాబోతున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్‌లను జియో ఫోన్లో అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జియో ఫీచర్ ఫోన్ ప్రస్తుతం అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్‌కు చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. గూగుల్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కిఓఎస్ ఈ యాప్స్‌ను త్వరలో తన యూజర్లకు అందించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి కిఓఎస్ టెక్నాలజీస్ సంస్థకు 22 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టబడులను తర్వాతి తరం యూజర్లకు ఇంటర్నెట్ను అందించడానికి ఉపయోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గూగుల్ నుంచి వచ్చిన ఈ నిధులను ఫాస్ట్-ట్రాక్ అభివృద్ధికి ఉపయోగిస్తామని, కిఓఎస్ ఆధారంగా రూపొందిన స్మార్ట్ ఫీచర్ఫోన్లను గ్లోబల్‌గా అందిస్తామని కిఓఎస్ చెప్పింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని ఎమర్జింగ్ మార్కెట్లలో వీటిని ఉపయోగిస్తామని కిఓఎస్ టెక్నాలజీస్ సీఈవో సెబాస్టియన్ చెప్పారు. జియోఫోన్లు విజయవంతం కావడంతో, గూగుల్‌కు చెందిన పలు పాపులర్ యాప్స్‌ను ఈ యూజర్లకు అందించాలని కిఓఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. కిఓఎస్ అనేది వెబ్ ఆధారిత ప్లాట్పామ్. జియోఫోన్‌కు వెల్లువెత్తిన భారీ డిమాండ్‌తో ఈ ఓఎస్ మొబైల్ ఓఎస్ మార్కెట్లో ఆపిల్ ఓఎస్‌ను బీట్‌ను చేసి మరీ 15 శాతం లాభాలనార్జించింది. -
గ్లోబల్‌గా కూడా జియోదే రాజ్యం..!
రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తూ తీసుకొచ్చిన జియోఫోన్ ఇటు భారత్‌లోనే కాక, అటు ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారుమ్రోగించుకుంటోంది. 2018 తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో రిలయన్స్ జియోఫోనే అగ్రస్థానంలో నిలిచింది. 15 శాతం షేరుతో రిలయన్స్ జియోఫోన్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. జియోఫోన్ అనంతరం నోకియా హెచ్ఎండీ, ఇంటెల్, శాంసంగ్, టెక్నో కంపెనీలు నిలిచినట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. రిలయన్స్ జియోఫోన్ బలమైన షిప్మెంట్లతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో వార్షికంగా 38 శాతం వృద్ధి సాధించినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. గ్లోబల్ ఫీచర్ ఫోన్ మార్కెట్లో నోకియా హెచ్ఎండీ 14 శాతం మార్కెట్ షేరును సంపాదించుకోగా, ఇంటెల్ 13 శాతం, శాంసంగ్ 6 శాతం, టెక్నో 6 శాతం మార్కెట్ షేరును పొందినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. ప్రతేడాది 50 కోట్ల ఫీచర్ ఫోన్లు విక్రయమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల ఫీచర్ ఫోన్లు అవసరం ఉందని ఈ మార్కెట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఓ వైపు మొబైల్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్నప్పటికీ, ఫీచర్ ఫోన్లు మాత్రం తన సత్తా చాటుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది స్మార్ట్ఫోన్ల కంటే ఫీచర్ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. 2018 తొలి త్రైమాసికంలో భారత్ ఒక్క దేశమే మొత్తం ఫీచర్ ఫోన్ షిప్మెంట్లలో సుమారు 43 శాతం స్థానాన్ని సంపాదించుకుంది. కొంతమంది ఫీచర్ ఫోన్ కొనుగోలుదారులు డిజిటల్, ఎకనామిక్, అక్షరాస్యత వంటి విషయాల్లో వెనుకబడి ఉండటం, ఖరీదైన స్మార్ట్ఫోన్లను, వాటి డేటా ప్లాన్లను అందిపుచ్చుకునే స్థాయి లేకపోవడమే ఫీచర్ ఫోన్ వృద్ధికి సహకరిస్తుందని రీసెర్చ్ సంస్థ తెలిపింది. మొబైల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫీచర్ ఫోన్ సెగ్మెంట్‌కు భారీ అవకాశాలున్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. -
జియో ఫోన్లు ఎన్ని అమ్ముడుపోయాయో తెలుసా?
న్యూఢిల్లీ : రిలయన్స్ జియోఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ఓ సంచలనం. కంపెనీ వృద్ధిలో కూడా ఈ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు రిపోర్టులు ప్రకటించాయి. క్రెడిట్ స్యూజ్ చేపట్టిన అధ్యయనంలో 2018 జనవరి-మార్చి క్వార్టర్లో ఫీచర్ ఫోన్ మార్కెట్ షేరులో జియోఫోన్ 36 శాతం షేరును తన సొంతం చేసుకుందని తెలిసింది. తన మార్కెట్‌బేస్‌ను విస్తరించుకోవడానికి ఇది ఎంతో దోహదం చేసిందని పేర్కొంది. ఈ క్వార్టర్లో 2.1 కోట్ల జియోఫోన్ విక్రయాలు జరిగాయని అంటే నెలకు 70 లక్షల జియోఫోన్లు అమ్ముడుపోయినట్టు సర్వే పేర్కొంది. రిపోర్టు ప్రకారం జనవరిలో కంపెనీ అత్యంత చౌకగా రూ.49తో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో భారీ ఎత్తున్న జియోఫోన్ విక్రయాలు కూడా నమోదుతున్నాయని రిపోర్టు తెలిపింది. మొత్తంగా జియో వృద్ధికి అత్యంత కీలకమైన పాత్రను జియోఫోన్ పోషిస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. లాంచింగ్ నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు రిపోర్టు వెల్లడించింది. అయితే జియో ఫోన్ ఇతర ఫోన్ల మార్కెట్ షేరును తినేస్తోందా? లేదా జియో ఫోన్‌ను కస్టమర్లు రెండో డివైజ్‌లాగా కొనుగోలు చేస్తున్నారా? అని తెలుసుకోవడం మాత్రం కష్టతరంగా మారినట్టు సర్వే పేర్కొంది. ఇంక్యూబెంట్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను ఇది తన వైపుకు లాగేసుకోవడం ప్రారంభించిందని నివేదించింది. -
జియోఫోన్ ఇక ఆ వెబ్సైట్లో కూడా...
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియోఫోన్‌కు, వినియోగదారుల్లో ఫుల్ క్రేజీ ఉంది. విడుదల చేసిన ప్రారంభంలోనే ఈ ఫోన్‌కు భారీ మొత్తంలో ఆర్డర్లు కూడా వచ్చాయి. ఆ డిమాండ్ తట్టుకోలేక ఒకానొక సమయంలో కంపెనీ బుకింగ్స్‌ను కూడా ఆపివేసింది. ఆ ఫోన్ ఇప్పటివరకు రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ జియోవెబ్సైట్, మైజియో యాప్, జియో రిటైల్ పార్టనర్ స్టోర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇక ఇప్పటి నుంచి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో కూడా లభ్యమవుతుందట. రిలయన్స్ జియో, అమెజాన్ ఇండియా శుక్రవారం తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాయి. ఈ భాగస్వామ్యంలో జియోఫోన్‌ను ఈ-కామర్స్ వెబ్సైట్లో కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నాయి. ఈ వారం ప్రారంభంలో మొబిక్విక్ ద్వారా కూడా జియోఫోన్ బుకింగ్‌లను చేపట్టవచ్చని కంపెనీ చెప్పింది. రూ.1500కు జియోఫోన్‌ను అమెజాన్ ఇండియా లిస్ట్చేసింది. ముందస్తు మాదిరిగానే జియోఫోన్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి, యూజర్లు తమ డివైజ్, దాని ఒరిజినల్ బాక్స్, ఆధార్ నెంబర్‌తో పాటు రిలయన్స్ డిజిటల్ స్టోర్ లేదా రిలయన్స్ జియో పార్టనర్ స్టోర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు దీనిపై ప్రత్యేక లాంచ్ ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచుతోంది. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా జియో ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, కస్టమర్లకు 50 రూపాయల క్యాష్‌బ్యాక్ అందిస్తామని కంపెనీ చెప్పింది. అదేవిధంగా ఈ ఫోన్‌కు రీఛార్జ్‌ను కూడా అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారానే చేపడితే, ఫ్లాట్ 50 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నారు. గతేడాది జూలైలో ఈ ఫోన్‌ను లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ మాదిరి ఇంటర్నెట్ డివైజ్‌గా దీన్ని వాడుకునే అవకాశాన్ని రిలయన్స్ జియో కల్పించింది. 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈని ఇది ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్‌కు 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉంది. మెమరీ కార్డు ద్వారా దీన్ని128జీబీ వరకూ పెంచుకోవచ్చు. వెనుక భాగంలో 2 మెగాపిక్సెళ్ల కెమెరా, ముందు వైపు వీజేఏ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా వల్ల వీడియో కాల్స్‌కు అనుమతి ఉంది. అలాగే అందరూ తరచుగా వాడే యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్‌క్రోమ్, ఫైర్ఫాక్స్వంటి వెబ్ బ్రౌజర్లు కూడా ఉన్నాయి. జియోటీవీ, జియోసినిమా, జియోమ్యూజిక్, జియోఎక్స్‌ప్రెస్ న్యూస్ వంటి యాప్స్ ప్రీలోడెడ్‌గా వచ్చిన తొలి జియో-బ్రాండెట్ ఫోన్ ఇందే. జియోటీవీ యాప్ ద్వారా 450 ప్లస్ వరకూ లైవ్ టీవీ ఛానెళ్లని చూడొచ్చు. అలాగే జియోమ్యూజిక్ ద్వారా వివిధ భాషల్లో కోటి పాటల వరకూ యాక్సెస్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్‌తో తెలుగుతో సహా 22 భాషల్లో సహకారం. -
జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్ వాలెట్
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మొబైల్ వాలెట్ మొబిక్విక్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై జియోఫోన్‌ను విక్రయించనున్నట్టు మొబిక్విక్ ప్రకటించింది. '' జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్ వాలెట్ మాదే కావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. నాలుగు సులభతరమైన స్టెప్స్‌తో యూజర్లు జియోఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పలు గ్రేట్ ప్రయోజనాలను అందించనున్నాం'' అని మొబిక్విక్ బిజినెస్ హెడ్ బిక్రమ్ బిర్ సింగ్ తెలిపారు. దీంతో జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి ప్లాట్‌ఫామ్ తమదేనని మొబిక్విక్ పేర్కొంది. ఫోన్ నెంబర్ల ద్వారా కూడా జియోఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఎలా బుక్ చేసుకోవాలి... మొబిక్విక్ కస్టమర్లు హోమ్ పేజీలో రీఛార్జ్ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం ''రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్'' కేటగిరీలో ఉన్న ఫోన్ బుకింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు జియోఫోన్‌ను ఎంపిక చేసుకోని, అవసరమైన వివరాలు నమోదుచేయాలి. గతేడాది జూలైలో రిలయన్స్ ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 500 మిలియన్ మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ లైఫ్ ఆఫర్ చేయడానికి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తెలుగుతోపాటు 22 ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది. ఇందులో 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (128జిబిలకు పెంచుకోవచ్చు) ఉంది. 2.4 అంగుళాల స్ర్కీన్, 512 ఎంబీ ర్యామ్, వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా, ముందు వీజీఏ కెమెరా, 2000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ముందు కెమెరా ఉండటం వల్ల వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ మాప్స్, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ వంటి అప్లికేషన్లు కూడా ఉన్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. జియో అందిస్తున్న యాప్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. -
జియో రూ.49 ఆఫర్‌పై గుడ్‌న్యూస్
అపరిమిత వాయిస్ కాల్స్, ఉచితంగా 4జీ డేటా ప్రకటనతో రెండేళ్ల క్రితం రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చౌకైన టారిఫ్ ప్లాన్లతో టెల్కోలను ముప్పు తిప్పలు పెడుతోంది. అచ్చం అలాంటి సంచలన ప్రకటన మాదిరిగానే జియో ఇటీవల టెల్కోలకు మరో షాకిచ్చింది. అదే రూ.49 ప్లాన్. ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్‌ను, 1జీబీ డేటాను వాడుకోవచ్చని పేర్కొంది. ఇంత చౌకైన రెంటల్ ప్లాన్‌ను మరే ఇతర కంపెనీ కూడా ఆఫర్ చేయడం లేదు. కానీ ఇది కేవలం జియోఫోన్ యూజర్లకేనని అధికారికంగా ప్రకటించడంతో, జియో వినియోగదారుల్లో కాస్త నిరాశవ్యక్తమైంది. ఆ నిరాశను పారదోలుతూ.. మరో గుడ్‌న్యూస్ వెలువడింది. ఈ ప్లాన్‌ను జియోసిమ్ వాడే ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని తెలిసింది. అయితే అదెలా అంటే...? జియోఫోన్ యూజర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా రిలయన్స్ రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అవి రూ.153 ప్లాన్, రూ.49 ప్లాన్. ఈ ప్లాన్లను ఇతర ఫోన్లలో కూడా వాడుకోవడానికి తొలుత మీ జియోసిమ్‌ను జియోఫోన్‌లో వేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియోఫోన్ ద్వారా ఈ ప్లాన్లను కొనుగోలు చేసి, యాక్టివేట్ చేసుకోవాలి. జియోఫోన్‌పై ఈ ఆఫర్లను యాక్టివేట్ చేసుకున్న అనంతరం, సిమ్‌ను బయటికి తీసి, మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌లో వేసుకోవాలి. కేవలం జియోఫోన్‌లో మాత్రమే ఈ ప్లాన్లను వాడుకోవాలనే నిబంధననేమీ లేదు. దీంతో ఈ రెండు ప్లాన్లకు ఇది వాలిడ్‌లో ఉంటుంది. అంటే జియో తీసుకొచ్చిన సంచలన ఆఫర్ రూ.49ను ప్రతి ఒక్క జియో సిమ్ వినియోగదారులు వాడుకోవచ్చన మాట. కానీ ముందుగా ఈ ప్లాన్‌ను జియోఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే చేయాలి. అనంతరం ఏ ఫోన్లోనైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. -
టాప్ బ్రాండుగా జియో ఫోన్
50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియోఫోన్ మార్కెట్లో దూసుకుపోతోంది. భారత్‌లో టాప్ ఫీచర్ ఫోన్ బ్రాండుగా పేరు తెచ్చేసుకుంది. 27 శాతం మార్కెట్ షేరుతో గతేడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్ జియోఫోన్ దిగ్గజ టాప్ ఫీచర్ ఫోన్ బ్రాండుగా నిలిచినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్‌లో తెలిసింది. క్వార్టర్ చివరిలో ఈ ఫోన్ సరఫరా అత్యధికంగా నమోదైనట్టు తెలిపింది. డిమాండ్, సప్లై గ్యాప్‌ను ఇది సమర్థవంతంగా నిర్వహించిందని కౌంటర్‌పాయింట్ పేర్కొంది. ఇంత భారీ మొత్తంలో ఈ ఫోన్ అమ్ముడుపోవడానికి ప్రధాన కారణం రికార్డు స్థాయిలో ప్రీ-ఆర్డర్లు, విలువైన నవీకరణగా చాలా మంది ఫీచర్ ఫోన్ యూజర్లు గుర్తించడమేనని కౌంటర్‌పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పథక్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ స్థాయిలో జియోఫోన్ ఉండటం, ఉచితంగా అందించడం కంపెనీకి బాగా కలిసి వచ్చిందన్నారు. అదనంగా కొన్నేళ్ల తర్వాత ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్ ప్రకటించిన వ్యూహం కూడా ఫలించిందని చెప్పారు. కాగ, గతేడాది జూలై 21న లాంచ్ చేసిన ఈ ఫీచర్ ఫోన్ 4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది. తొలుత రూ.1500 చెల్లించినప్పటికీ, ఇది ఉచితమే. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేయనుంది. 2.4 అంగుళాల డిస్ప్లే, 2000ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ నానో-సిమ్ స్లాట్, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఫీచర్లు. జియోఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, నెలవారీ రూ.153 ప్యాక్‌పై ఎక్కువ డేటాను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీనిలోనే ఏడాది పాటు రూ.99 ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. జనవరి 26 నుంచి రోజుకు 1జీబీ బదులు జియోఫోన్‌పై 1.5జీబీ డేటా లభించనుంది. -
జియో ఫోన్లో విరివిగా వాడే ఫీచర్ అదే
జియో ఫోన్.. ఫీచర్ ఫోన్ మార్కెట్లో ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఈ ఫోన్ నూతన శకాన్ని ఆరంభించింది. కేవలం వాయిస్ నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించే ఫీచర్ ఫోన్ వినియోగదారులు.. జియోఫోన్‌తో డేటాను కూడా వాడటం ప్రారంభించారు. సరసమైన ధరలో లభించే జియో ఎల్టీఈ టారిఫ్ ప్లాన్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ అంతులేని మధురానుభూతికి లోనవుతున్నారు. దీంతో పాటు జియోఫోన్ అందిస్తున్న మరో స్పెషల్ ఫీచర్ గ్రామీణ ప్రజానీకానికి విపరీతంగా ఉపయోగపడుతోంది. అదే వాయిస్ కమాండ్. పెద్ద వాళ్లతోపాటు గ్రామీణ భారతంలోని వినియోగదారులు దీన్ని విరివిగా వినియోగిస్తున్నారని కంపెనీ తెలిపింది. జియోఫోన్‌లో విప్లవాత్మకమైన కొత్త వాయిస్ కమాండ్ ఫీచర్, వినియోగదారులకు ఎంతో సులువుగా ఉండటంతో పాటు యాక్సెస్ సౌలభ్యంగా ఉండటమే దీని ప్రత్యేకతని పేర్కొంది.. ఇప్పుడు వినియోగదారులు వాయిస్ కమాండ్‌తో కాల్స్ చేయడంతోపాటు, ఎస్ఎంఎస్ పంపవచ్చని కంపెనీ ప్రకటించింది. వాయిస్ కమాండ్‌తో పాటు వినోదాన్ని పంచే ఎన్నో యాప్స్‌ను కూడా వాడుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ ఇంటర్ఫేస్ 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుందని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఉండే వినియోగదారులు తమకిష్టమైన భాషలో ఫోన్‌ను పొందే సౌలభ్యాన్ని సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. జియోటీవీ, జియోసినిమా, జియో మ్యూజిక్ తదితర యాప్స్ ద్వారా దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు టీవీ ప్రసారాలను ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నారని వివరించింది. అపరిమితంగా ఉన్న సినిమాలను, వివిధ భాషల్లోని అంతులేని సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారని తెలిపింది. తమ చుట్టూ సంగతులతోపాటు నిత్యం ప్రపంచంలో ఏం జరుగుతుందో అని తెలుసుకునేందుకు ఉత్సుకత కనపరిచే వారికి జియోఫోన్ జియోఎక్స్ప్రెస్న్యూస్ అనే యాప్‌ను అందిస్తోందని... దీంతో రోజువారీ వార్తావిశేషాలను అందిస్తామని వెల్లడించింది. అంతేకాక జియోఫోన్ జియోపే యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహిస్తోంది. ఇది ప్రభుత్వ డిజిటల్ ఎజెండాలో భాగమయ్యేందుకు ఎంతగానో ప్రేరణగా నిలుస్తోందని కంపెనీ తెలిపింది. -
జియోకు కౌంటర్ : ఎయిర్టెల్ మరో కొత్త ఫోన్
రిలయన్స్ జియో ఫోన్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరో కౌంటర్ ఇచ్చింది. అత్యంత తక్కువ ధరలో మరో 4జీ స్మార్ట్‌ఫోన్ ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎన్1ను లాంచ్ చేసింది. రూ.1,649కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంటెక్స్ భాగస్వామ్యంలో ఎయిర్టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ భాగస్వామ్యంలోనే మరో రెండు ఇతర స్మార్ట్ఫోన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. రూ.1999కు ఆక్వా ఏ4ను, రూ.4,379కు ఆక్వా ఎస్3ను లాంచ్ చేసింది. సెల్కాన్, కార్బన్లతో కూడా ఎయిర్టెల్ భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. ఇంటెక్స్ భాగస్వామ్యంతో 'మెరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' కార్యక్రమాన్ని ఎయిర్టెల్ మరింత విస్తరిస్తోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇంటెర్నెట్ ఎనాబుల్డ్ ఫీచర్ ఫోన్‌ను లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ కూడా దేశీయ మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారి మైక్రోమ్యాక్స్‌తో జతకట్టి, రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. జియోఫోన్ లాంచింగ్ అనంతరం దిగ్గజ టెలికాం కంపెనీలు, మొబైల్ మేకర్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి. నేడు లాంచ్ చేసిన ఈ ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 7.0 నోగట్, డ్యూయల్ సిమ్ కార్డులు, 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్ప్లే, 1.1గిగాహెడ్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వైఫై ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ఎంఆర్పీ 3,799 రూపాయలు. రూ.3,149 డౌన్‌పేమెంట్ కట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ మొత్తం నుంచి రూ.1500ను ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్ రూపంలో అందిస్తుంది. దీంతో అందుబాటులోకి వచ్చే ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్ ధర 1,649 రూపాయలు. -
జియోఫోన్ ఆ రెండింటికి ప్రతీక
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ జియో లాంచ్ చేసిన ఫీచర్ ఫోన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. కొత్తగా లాంచైన ఈ జియోఫోన్ 50 కోట్లకు పైగా ఫీచర్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా పెట్టుకుని మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ మన దేశ సమానత్వానికి, వైవిధ్యానికి ప్రతీకని టాప్ జియో ఎగ్జిక్యూటివ్ గురువారం పేర్కొన్నారు. ప్రతిఒక్కరికీ ఫోన్ స్థాయి, అనేది సమానత్వాన్ని నిర్వచిస్తే.. ఈ ఫోన్ సపోర్టు చేసే 22 భాషలు వైవిధ్యాన్ని సూచిస్తున్నాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ డివైజస్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ సునిల్ దత్ తెలిపారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో నేడు ఆయన పాల్గొన్నారు. జియోఫోన్‌ను తాము ఫీచర్ ఫోన్‌గా పిలువడం లేదని, దీన్ని తాము 'ఇండియా కా స్మార్ట్‌ఫోన్' గా పిలుస్తున్నట్టు చెప్పారు. ఫీచర్ ఫోన్ కంటే మంచి స్పెషిఫికేషన్లను ఈ ఫోన్లో ఎక్కువమందికి అందజేస్తున్నామని దత్ తెలిపారు. జూలై 21న లాంచ్ చేసిన జియోఫోన్, 4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈతో మార్కెట్లోకి వచ్చింది. రూ.1500 డిపాజిట్‌తో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేయనుంది. 2.4 అంగుళాల ఈ డివైజ్‌లో 2ఎంపీ రియర్ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ నానో-సిమ్ స్లాట్, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్లున్నాయి. -
జియోఫోన్ అసలు ఖరీదెంత?
ముంబై : టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో, తన సరికొత్త ఫీచర్ ఫోన్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరెగిత్తిస్తోంది. ఈ ఫోన్ డెలివరీని కూడా ప్రారంభించేసింది. ప్రస్తుతం వినియోగదారుల చేతుల్లో ఈ ఫోన్లు అలరిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచింగ్ తేదీ నుంచి డెలివరీ వరకు ప్రతి వార్త సంచలనంగానే మారుతోంది. తాజాగా జియో ఫోన్ అసల ఖరీదెంతో? సబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఫోన్ అసెంబుల్ ఖర్చు సుమారు 2,500 రూపాయలైనట్టు సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. కానీ ఈ అసెంబుల్ ఖర్చు కంటే వెయ్యి రూపాయలు తక్కువగా అంటే రూ.1,500కే జియో ఫోన్‌ను రిలయన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని కూడా మూడేళ్ల తర్వాత కంపెనీ రీఫండ్ చేయబోతుంది. అయితే ఖర్చు పరంగా రూ.2,500కు విక్రయించాల్సిన ఈ ఫోన్‌ను కేవలం రూ.1,500కే ఎందుకు విక్రయిస్తుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్లను ఆకట్టుకుని, తన పెట్టుబడులను రికవరీ చేసుకోవడానికి ధరను తగ్గించి అమ్ముతున్నట్టు ఈ విషయం తెలిసిన వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో కంపెనీ తన సబ్స్క్రైబర్ల బేస్‌ను 250 మిలియన్ నుంచి రూ.300 మిలియన్ యూజర్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నాయి. ధర తగ్గించి అమ్మడం వల్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవచ్చని జియో చూస్తుందని తెలిసింది. అయితే ఈ విషయంపై రిలయన్స్ ఇంకా స్పందించలేదు. అంతేకాక స్మార్ట్‌ఫోన్‌కు వెచ్చించలేని 500 మిలియన్ల మంది ప్రేక్షకులను ఇది టార్గెట్‌గా పెట్టుకుంది. దేశీయ ఫీచర్ ఫోన్ యూజర్లతో వినియోగదారు సగటు ఆదాయం( ఆర్పూ) 50 రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉందని మెజార్జీ విశ్లేషకులు అంచనావేశారు. జియో ప్రస్తుతం తీసుకొచ్చిన ఫోన్ నెలవారీ రూ.153 ప్లాన్‌తో ఈ ఆర్పూను పెంచుకోనుందని తెలిసింది. -
జియో ఫోన్ కోసం వేచిచూస్తున్నారా?
నవరాత్రికి జియో ఫోన్ తమ చేతుల్లోకి వచ్చేస్తుందంటూ ఎంతో ఆశగా.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. నేటి నుంచి డెలివరీ కావాల్సిన జియో ఫోన్ తేదీలను మరోసారి వాయిదా వేసినట్టు తెలిసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 1కి ఈ ఫోన్ డెలివరీ డేట్‌ను వాయిదా వేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ సమయంలో అనూహ్య స్పందన రావడంతో, డెలివరీ తేదీని కంపెనీ వాయిదా వేస్తూ వెళ్తున్నట్టు తెలిపాయి. ఆగస్టు 24న ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ భారీ ఎత్తున్న డిమాండ్ రావడంతో ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ప్రీ-బుకింగ్స్ నిలిపివేసింది. జులై 21న రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరించిన రోజే, సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఫోన్ల డెలవరీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కానీ డిమాండ్ అధికంగా రావడంతో, వీటి డెలివరీ మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. కానీ ఈ నవరాత్రికి కాకుండా... అక్టోబర్ మొదటి నుంచి దీన్ని అందించాలని కంపెనీ చూస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. తమకు జియో నుంచి మెసేజ్ వచ్చిందని, ఫోన్ల డెలివరీ అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు చెప్పారని ఓ రిటైలర్ వెల్లడించారు. ఇప్పటికే లక్షల మంది ఈ ఫోన్లను బుక్ చేసుకొని ఈ ఫోన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫోన్ల డెలివరీ వాయిదా పడటం కస్టమర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అయితే నిలిపివేసిన ప్రీ-బుకింగ్స్‌ను కంపెనీ త్వరలోనే మళ్లీ ప్రారంభించనుందట. ఈ ఫోన్ ఫ్రీ-అయినప్పటికీ, బుకింగ్ సమయంలో రూ.500, డెలివరీ సమయంలో రూ.1000 కట్టాల్సి ఉంటుంది. మూడేళ్ల అనంతరం ఈ మొత్తాన్ని కంపెనీ వినియోగదారులకు రీఫండ్ చేయనుంది. వీజీఏ కెమెరా, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2.4 అంగుళాల డిస్ప్లే, 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128జీబీ ఎక్స్‌పాండబుల్ జీబీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. -
జియో కస్టమర్లకు దసరా సంబరాలు
ముంబై: సంచలన రిలయన్స్ జియో 4 జీ ఫీచర్ ఫోన్ నవరాత్రికి కస్టమర్లను మురిపించనుంది. జియో వినియోగదారులు తన మొదటి ఫీచర్‌ఫోన్‌తో ఈ ఏడాది దసరా సంబరాలను జరుపుకునేలా ప్లాన్ చేసింది. ప్రీ బుకింగ్ చేసుకున్న 60 లక్షల మందికి సెప్టెంబర్ 21 నుంచి డెలివరీ చేయనున్నట్లు రిలయన్స్ జియో పేర్కొన్న సంగతి తెలిసిందే. అలాగే మరోగుడ్ న్యూస్ ఏమిటంటే. త్వరలోనే కొత్త ప్రీ బుకింగ్‌లను కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో ఫోన్ కోసం ఆగస్టు 24 న ముందస్తు బుకింగ్ మొదలుకాగా కేవలం మూడు గంల్లోనే సుమారు 60 లక్షల యూనిట్ల జయో ఫీచర్ ఫోన్లు బుక్ అయ్యాయి. దీంతో బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే వినియోగదారుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని, బుకింగ్ ప్రక్రియ పునఃప్రారంభించనుందని, ఈ సమాచారాన్ని కస్టమర్లకు అందించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ప్రాధాన్యత ఆధారంగా వీటిని అందించనుంది. కాగా జూలై 21, 2017 న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
జియోఫోన్ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో..!
-
జియోఫోన్ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో..!
సాక్షి న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో. తన సరికొత్త ఫోన్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరెగిత్తిస్తోంది. ఆగస్టు 24వ తేదీ ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే దాదాపు 30లక్షల ఫోన్లు అమ్ముడై మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో వెబ్సైట్ క్రాష్ కూడా అయ్యింది. కేవలం 36 గంటల్లోనే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది. ఈ నిలుపుదలతో పాటు బుక్ చేసుకున్న వారికి ఫోన్ల డెలివరీ కూడా ఆలస్యం కానున్నట్లు తాజా సమాచారం. అయితే తాజాగా జియోఫోన్‌పై సోషల్ మీడియాలో ఓవీడియో హల్ చల్ చేస్తోంది. ఫోన్‌పై జియో అని పేరు ఉంది. అంతే కాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు అందులో జియోకు చెందిన మై జియో , జియో టీవీ, జియో మ్యూజిక్, కాల్ లాగ్ వంటి అప్లికేషన్లు ఉన్నాయి. జియో స్టోర్ పేరిట ప్రత్యేకమైన ప్లేస్టోర్ కూడా ఉంది. కెమెరా, ఆడియో, వీడియో ప్లేయర్కూడా ఇన్‌బిల్ట్‌గా వచ్చేశాయి. సెట్టింగ్స్‌లో డివైస్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ మోడల్ ఎల్ఎఫ్-2403 అని, సాఫ్ట్వేర్ వెర్షన్ కైఓస్ 2.0 అని చూపిస్తోంది. ఈ వీడియోపై మీరు ఓలుక్ వేయండి. -
జియో ఫోన్ డెలివరీ ఆలస్యం?
సాక్షి, ముంబై : అనుకున్న తేదీలోనే జియో ఫోన్ ప్రీ-బుకింగ్స్ వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఆగస్టు 24నే కంపెనీ ఈ ఫోన్ బుకింగ్స్‌ను చేపట్టింది. అంచనాల కంటే అధికంగానే వినియోగదారుల నుంచి స్పందన కూడా వచ్చింది. 3 మిలియన్ నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు బుక్ అయ్యాయి. వినియోగదారుల నుంచి స్పందన అనూహ్యంగా ఉండటంతో, ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది. ఈ నిలుపుదలతో పాటు బుక్ చేసుకున్న వారికి ఫోన్ల డెలివరీని కూడా కంపెనీ జాప్యం చేయనున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. జియో ఫోన్ ఎప్పుడెప్పుడు తమ చేతిలోకి వస్తుందా? అంటూ ఎదురుచూస్తున్న వినియోగదారులు, ఈ ఫోన్ కోసం మరికొంత కాలం పాటు వేచిచూడాల్సిందేనట. డిమాండ్ విపరీతంగా రావడంతో, డెలివరీ తేదీలు ఆలస్యమయ్యే అవకాశముందని రిటైలర్లు చెప్పినట్టు ఇండియా టుడే టెక్ రిపోర్టు చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్ తెలిపారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్‌లో ఈ ఫోన్లను అందిస్తామని జియో అంతకముందే చెప్పింది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది. -
షాకింగ్: జియో ఫోన్ బుకింగ్స్ క్లోజ్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఫోన్‌కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఆగస్టు 24వ తేదీ ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే ఈ ఫోన్ 30 లక్షల మార్కును క్రాస్ చేసింది కూడా. అయితే ప్రస్తుతం జియో ఫోన్ బుకింగ్స్‌ను ఆ కంపెనీ నిలిపివేసినట్టు తెలిసింది. జియో సైట్లో ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నామని జియో ఫోన్ కావాలనుకునే వారు కేవలం ఇప్పుడు తమ ఆసక్తిని మాత్రమే రిజిస్ట్రర్ చేసుకోడంటూ రిలయన్స్ పేర్కొంది. ప్రీ-బుకింగ్స్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామో తర్వాత తెలుపుతామంటూ జియో సైట్లో తెలిపింది. తాత్కాలికంగా అయితే బుకింగ్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. '' థాంక్యూ ఇండియా! లక్షల మంది జియో ఫోన్‌ను బుక్ చేసుకున్నారు'' అని జియో.కామ్ హోమ్ పేజీలో కంపెనీ బ్యానర్‌గా ఈ విషయాన్ని తెలిపింది. జియో అకస్మాత్తుగా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేయడంతో, తర్వాత బుక్ చేసుకోవచ్చని భావించిన ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. జియో 4G ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమై, 26వ తేదీ ఉదయం వరకు కొనసాగాయి. అంటే 36 గంటలు మాత్రమే ఈ బుకింగ్స్‌కు అనుమతి ఇచ్చింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే కోటి ఫోన్లు బుక్ అయినట్టు తెలుస్తోంది. జియో ఫోన్‌ను ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్‌లో అందిస్తారు. అయితే సెప్టెంబర్‌లో ఏ తేదీని ఫోన్ల డెలివరీ ఉంటుంది, ఏ స్టోర్‌లో ఈ ఫోన్‌ను కలెక్ట్ చేసుకోవచ్చో తెలుపుతూ కంపెనీ మెసేజ్ పంపనుంది. -
బల్క్‌లో జియో ఫోన్‌ను బుక్ చేసుకోండి
రిలయన్స్ ప్రతేడాది నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన వార్షిక సాధారణ సమావేశంలో జీరోకే జియో ఫోన్‌ను ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్మార్ట్ స్పెషిఫికేషన్లతో ఈ ఫోన్ అందుబాటులోకి కూడా వస్తోంది. ఈ ఫోన్ కొనుక్కోవాలంటే తొలుత రూ.1500తో దీన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత మన నగదును మనకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. టెస్టింగ్‌కు కాస్త ముందుగానే అంటే ఆగస్టు 15 నుంచే జియో ఫోన్ అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ డివైజ్‌ను యూజర్లు బుక్ చేసుకోవడం మిస్ కాకూడదని కంపెనీనే స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఫోన్ పొందడానికి, దాని అప్డేట్లను తెలుసుకోవడం కోసం కంపెనీ తన వెబ్సైట్లో రిజిస్ట్రర్ పేజీని కూడా ప్రారంభించింది. కీప్ మి పోస్టెడ్ పేరుతో ఒక రిజిస్ట్రేషన్ పేజీని బ్యానర్‌గా తన వెబ్సైట్లో పొందుపరించింది. అయితే ఈ పేజీలో అంతకముందు కేవలం ఒక్క ఆప్షన్ మాత్రమే ఉండేది. ఒక వ్యక్తి మాత్రమే తమ ఆసక్తిని రిజిస్ట్రర్ చేసుకునే ఆప్షన్‌ను ఉంచిన జియో, ప్రస్తుతం రెండు ఆప్షన్లను పెట్టింది. బిజినెస్ అనే ఆప్షన్‌ను కూడా పెట్టింది. బిజినెస్ మోడ్‌లో కూడా ఈ ఫోన్‌ను ఎంటర్ప్రైజ్ యూజర్లు రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నేమ్, కంపెనీ పేరు, పిన్ కోడ్, పాన్ లేదా జీఎస్టీఎన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ చేయాల్సిన వ్యక్తి నెంబర్, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్ట్రర్ చేసుకుంటే, బల్క్‌గా ఆర్డర్లను పొందవచ్చు. 1-5 నుంచి 50 వరకు, ఆపైనా బల్క్ ఆర్డర్లను బిజినెస్ కస్టమర్లు చేపట్టవచ్చని జియో తన వెబ్సైట్లో పొందుపరిచింది. కేవలం జియో ఫోన్ మాత్రమే కాక, జియోఫైను కూడా యూజర్లు బల్క్ ఆర్డర్ చేయవచ్చు. ఒక్కసారి నియమ, నిబంధనలను అంగీకరించి, సబ్మిట్ నొక్కితే, రిజిస్ట్రర్ చేసుకున్నట్టు ఒక మెసేజ్ వస్తోంది. అంతేకాక ఈమెయిల్ ఐడీకి కూడా మెయిల్ పంపిస్తారు. -
జియో ఫోనంటే ఆసక్తి ఉందా?
న్యూఢిల్లీ : టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, మొబైల్ మార్కెట్లోనూ సంచలనాలు సృష్టించడానికి వచ్చేసింది. జీరోకే జియో ఫోన్‌ను ఇటీవల జరిగిన ఏజీఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లాంచ్ చేశారు. ఈ ఫోన్‌పై ఇప్పటికే వినియోగదారుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఫోన్ బుకింగ్స్, అప్డేట్లపై తెగ ఆసక్తి చూపుతున్నారు. జియో ఫోన్‌ను కొనుగోలుచేయాలని ఆసక్తి కలిగిన వినియోగదారుల కోసం రిలయన్స్ జియోనే ఓ స్పెషల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జియో వెబ్సైట్లో లాగిన్ అయి, తమ పేరు, ఈ-మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తే, ఈ డివైజ్ గురించి ప్రతి అప్డేట్ను కంపెనీనే డైరెక్ట్‌గా వినియోగదారులకు అందిస్తోంది. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్ బీటా-టెస్ట్‌కు వస్తోంది. ఆగస్టు 24 నుంచి రిలయన్స్ రిటైల్, జియో స్టోర్లు, ఆన్లైన్లో ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ కంపెనీనే జియో ఫోన్ మార్కెటింగ్ చేపడుతుందని దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. ఏ కస్టమర్లైతే, తమ ఇంటరెస్ట్ మేరకు వివరాలు నమోదు చేసుకుంటారో వారికి జియోఫోన్ బుకింగ్, అందుబాటులో ఉండే వివరాలు వంటి వాటిని అప్ డేట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రక్రియను ఈ-కామర్స్ కంపెనీలు చేపడుతున్నాయి. తమ వెబ్సైట్లో ప్రత్యేక ప్రొడక్ట్ కావాలని రిజిస్ట్రర్ చేసుకుంటే, దాని గురించిన సమాచారం అందిస్తూ ఉంటాయి. రిలయన్స్ జియో తాజాగా లాంచ్‌చేసిన ఈ ఫోన్, 4జీ ఎనాబుల్డ్ స్మార్ట్ ఫీచర్ ఫోన్. రూ.153తో రీఛార్జ్ చేయించుకున్న వారికి ఈ ఫోన్లో ఉచితంగా వాయిస్ సర్వీసులు, అపరిమిత డేటా అందించనుంది. అంతేకాక ఈ ఫోన్ పూర్తిగా ఉచితం. తొలుత రూ.1500 కట్టి దీన్ని కొనుగోలు చేస్తే, మూడేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని కంపెనీ రీఫండ్ చేసేస్తోంది. ఈ ప్లాన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. -
జియోఫోన్‌లో ఈ పాపులర్ యాప్ పనిచేయదు!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఫోన్ మార్కెట్లోకి ఆవిష్కరణమైంది. మరికొన్ని రోజుల్లో వినియోగదారుల ముందుకు కూడా వచ్చేస్తోంది. అయితే భారత్‌లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న ఒక యాప్ మాత్రం జియో ఫోన్లో పనిచేయదు. అదే వాట్సాప్. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఆ ఫోన్లో వాట్సాప్ లేనిదో ప్రస్తుతం యూజర్లు ఉండలేకపోతున్నారు. మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్ సంపాదించుకున్న స్థానం అంత విశిష్టమైనది. కానీ ఈ యాప్ ప్రస్తుతం జియో ఫోన్లో పనిచేయదని తాజా రిపోర్టులలో తెలిసింది. ప్రీ-లోడెడ్‌గా జియో యాప్స్, ఫేస్బుక్, యూట్యూబ్ సపోర్టుతో వస్తున్న జియో ఫోన్, వాట్సాప్‌ను సపోర్టు చేయకపోవడం యూజర్లకు కొంత నిరాసక్తికి గురిచేస్తోంది. అయితే ఏదైనా అప్డేట్ ఉండొచ్చని లేదా వాట్సాప్ సపోర్టు చేయడం కోసం ఈ ఫీచర్‌ని తర్వాత దశలో ప్రవేశపెడతారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌కు 200 మిలియన్ పైగా యూజర్లున్నారు. గతవారంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. భారతీయులందరికి ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. అయితే ఫీచర్ ఫోన్ తీసుకునే వారు సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నగదును మూడేళ్ల అనంతరం (36 నెలల తర్వాత) కస్టమర్లకు రిఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబానీ ప్రకటించారు. ఆగస్ట్ 24 నుంచి ఈ ఫీచర్ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 1నుంచి జియో ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జియో ఫోన్ వినియోగదారులకు వాయిల్ కాల్స్ పూర్తిగా ఉచితం. డేటా ప్యాక్ రూ.153కే నెల రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా అందుబాటులోకి ఉంటుంది. -
జీరోకే జియో ఫోన్: ట్విట్టర్ పేలిపోతుంది
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఎన్నిరోజుల నుంచో వేచిచూస్తున్న జియో ఫీచర్ ఫోన్‌ను అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ చేసేశారు. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్ టెస్టింగ్‌కు రానుంది. ఆగస్టు 24 నుంచి బుకింగ్స్ ప్రారంభమై, సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చేస్తోంది. భారతీయులందరికీ ఈ ఫోన్‌ను ఉచితంగా అందించనున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు.. ఈ ఫోన్ కొనుగోలుచేయాలనుకునేవారు, వన్-టైమ్ సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 కట్టి, ఈ ఫోన్‌ను పొందవచ్చు. మూడేళ్ల తర్వాత ఆ రూ.1500ను జియో రిటర్న్ చేయనుందని అంబానీ తెలిపారు.. ముఖేష్ అంబానీ ఈ ప్రకటన వెలువరించడగానే, ట్విట్టర్ కూడా లాంచింగ్ సెలబ్రేషన్స్‌లో పండుగ చేసుకుంటోంది. అంబానీకి కంగ్రాట్స్ చెబుతూ, మిగతా టెలికాం కంపెనీలపై ట్విట్టరియన్లు జోక్స్ పేలుతున్నారు. జియో ఎఫెక్ట్‌తో యూజర్లు ఎలా రీఛార్జ్ చేసుకోవాలో మర్చిపోయారని, భారతీ ఎయిర్టెల్, ఐడియాలను పాత సరుకులను అమ్మకునే సైట్ ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాలని అంటూ ట్విట్టర్ యూజర్లు నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. చైనా ఫేమస్ బ్రాండులు వివో, ఒప్పోలు కూడా బ్యాగ్స్ సర్దుకుని, వారి దేశానికి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ట్విట్టరియన్లు స్పందన ఎలా ఉందో మీరే ఓ సారి చూడండి.... #Oppo #Vivo and other mobile companies looking at #MukeshAmbani after #RILAGM2017 pic.twitter.com/raLo2smiHl — Krishna kundan (@KRISH_KUNDAN) July 21, 2017 Owners of Bharti Airtel & Idea selling their brands on OLX. Also Vivo & Oppo packing their bags and heading back to China. #JIOPhone — Parth Raval (@getparth) July 21, 2017 Feeling sorry for @VodafoneIN @airtelindia @ideacellular your about to get demolished by @reliancejio what a plan by #MukeshAmbani superb — Chirrag Shah (@chiragmafia) July 21, 2017 *buys a Reliance router* *Names it Bahubaali* *waits for someone to ask 'You have internet?'* *Screams 'JIO RE BAHUBAALI'* — Sahil Shah (@SahilBulla) July 21, 2017 Can't wait for Mukesh Ambani to give free monthly groceries to every family in India — EngiNerd. (@mainbhiengineer) July 21, 2017 People forgot how to recharge coz of #MukeshAmbani JIO effect Made biggest revolution in youth over internet — -
జియో ఫోన్ ఎఫెక్ట్: మీడియా, టెలికాం షేర్ల పతనం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ ఏజీఎం సందర్భంగా జియో ఫోన్ ప్రకటన తో మీడియా షేర్లు, టెలికాం షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఐడియా సెల్యులార్ ఏకంగా 6 శాతం, భారతి ఎయిర్ టెల్, 3.2, ఆర్‌కాం1.43 శాతం, డిష్ టీవీ, 6శాతం, హాత్వే కేబుల్ 2 శాతం పతనాన్ని నమోదు చేశాయి. మరోవైపు ఆర్ఐఎల్ 3 శాతం లాభాలతో కొనసాగుతోంది. రిలయన్స్ జియో ఎంట్రీతో దేశీయ టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఉచిత ఆఫర్లనుంచి తారిఫ్‌లను మార్చుకుంటూ వచ్చినా దేశీయ పత్యర్థి టెల్కోల నష్టాలు కొనసాగుతున్నాయి. దీనిపై మూడు ప్రధాన ఆపరేటర్ల ఆందోళన ఆరోపణలు కొనసాగుతుండగానే తాజా ప్రపంచంలోనే అతి చవకైన 4జీ ఫీచర్ ఫోన్ ప్రకటించడం వీటికి మరింత భారం కానుంది. ముఖ్యంగా జియో కస్టమర్లకు ఈ ఫోన్ పూర్తిగా ఉచితం. వాయిస్ కాల్స్ ఉచితం. దీంతో పాటు కేవలం రూ.153 లకే అన్ని సేవలను ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీంతో శుక్రవారం నాటి మార్కెట్లో మీడియా షేర్లు, టెలికాం షేర్లు కుదేలయ్యాయి. అటు ఎనలిస్టులు కూడా ఫోన్ మార్కెట్లోకి జియో ప్రవేశించడం టెలికం దిగ్గజాలపై భారీగా ప్రభావితం చేయనుందని వ్యాఖ్యానించారు.