జీరోకే జియో ఫోన్‌: ట్విట్టర్‌ పేలిపోతుంది | Reliance JioPhone at Rs 0: Twitter rejoices launch of 4G-enabled handset | Sakshi
Sakshi News home page

జీరోకే జియో ఫోన్‌: ట్విట్టర్‌ పేలిపోతుంది

Published Fri, Jul 21 2017 4:22 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

జీరోకే జియో ఫోన్‌: ట్విట్టర్‌ పేలిపోతుంది

జీరోకే జియో ఫోన్‌: ట్విట్టర్‌ పేలిపోతుంది

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, ఎన్నిరోజుల నుంచో వేచిచూస్తున్న జియో ఫీచర్‌ ఫోన్‌ను అద్భుతమైన ఫీచర్లతో లాంచ్‌ చేసేశారు. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్‌ టెస్టింగ్‌కు రానుంది. ఆగస్టు 24 నుంచి బుకింగ్స్‌ ప్రారంభమై, సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చేస్తోంది. భారతీయులందరికీ ఈ ఫోన్‌ను ఉచితంగా అందించనున్నట్టు ముఖేష్‌ అంబానీ చెప్పారు.. ఈ ఫోన్‌ కొనుగోలుచేయాలనుకునేవారు, వన్‌-టైమ్‌ సెక్యురిటీ డిపాజిట్‌ కింద రూ.1500 కట్టి, ఈ ఫోన్‌ను పొందవచ్చు. మూడేళ్ల తర్వాత ఆ రూ.1500ను జియో రిటర్న్‌ చేయనుందని అంబానీ తెలిపారు.. ముఖేష్‌ అంబానీ ఈ ప్రకటన వెలువరించడగానే, ట్విట్టర్‌ కూడా లాంచింగ్‌ సెలబ్రేషన్స్‌లో పండుగ చేసుకుంటోంది. అంబానీకి కంగ్రాట్స్‌ చెబుతూ, మిగతా టెలికాం కంపెనీలపై ట్విట్టరియన్లు జోక్స్‌ పేలుతున్నారు. 
 
జియో ఎఫెక్ట్‌తో యూజర్లు  ఎలా రీఛార్జ్‌ చేసుకోవాలో మర్చిపోయారని, భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియాలను పాత సరుకులను అమ్మకునే సైట్‌ ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాలని అంటూ ట్విట్టర్‌ యూజర్లు నవ్వుల వర్షం కురిపిస్తున్నారు. చైనా ఫేమస్‌ బ్రాండులు వివో, ఒప్పోలు కూడా బ్యాగ్స్‌ సర్దుకుని, వారి దేశానికి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
 
ట్విట్టరియన్లు స్పందన ఎలా ఉందో మీరే ఓ సారి చూడండి....
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement