మీరు కొత్తగా జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ కొనాలని చూస్తునారా? అయితే మీకు ఒక తీపికబురు. ఇక నుంచి జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ కొనడానికి ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను నేరుగా రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఫోన్ కొనడానికి ఇప్పటి వరకు వినియోగదారులు వాట్సప్ ద్వారా లేదా అధికారిక జియో వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేయాల్సి వచ్చేది.
అయితే, ఇప్పుడు సులభంగా రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ ద్వారా రూ. 6,499 చెల్లించి కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ కొనడానికి వినియోగదారులు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మొబైల్ కొనడానికి ముందుగా ఫుల్ల పేమెంట్ చేయాల్సి ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు. ఎవరైనా గ్రామ ప్రజలు ఈ ఫోన్ బుక్ చేస్తే, మీ దగ్గరలోని జియో స్టోర్ కి వెళ్లి తీసుకోవచ్చు.
జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు
- డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 )
- స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్
- ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్
- ర్యామ్,స్టోరేజ్: 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు
- కెమెరా: 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
- బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
- కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్‌బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం
- సెన్సార్లు: యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్
(చదవండి: విద్యార్థినులకు గూగుల్ గుడ్‌న్యూస్!)
Comments
Please login to add a commentAdd a comment