JioPhone delivery
-
తప్పిన తిప్పలు.. ఆన్లైన్లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్!
మీరు కొత్తగా జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ కొనాలని చూస్తునారా? అయితే మీకు ఒక తీపికబురు. ఇక నుంచి జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ కొనడానికి ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జియోఫోన్ నెక్ట్స్ మొబైల్ ను నేరుగా రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఫోన్ కొనడానికి ఇప్పటి వరకు వినియోగదారులు వాట్సప్ ద్వారా లేదా అధికారిక జియో వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేయాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు సులభంగా రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ ద్వారా రూ. 6,499 చెల్లించి కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ కొనడానికి వినియోగదారులు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మొబైల్ కొనడానికి ముందుగా ఫుల్ల పేమెంట్ చేయాల్సి ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు. ఎవరైనా గ్రామ ప్రజలు ఈ ఫోన్ బుక్ చేస్తే, మీ దగ్గరలోని జియో స్టోర్ కి వెళ్లి తీసుకోవచ్చు. జియో ఫోన్ నెక్ట్స్ ఫీచర్లు డిస్ప్లే: 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ రిజెల్యూషన్ (720 X 1440 ) స్క్రీన్ గ్లాస్: యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215, క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ర్యామ్,స్టోరేజ్: 2జీబీ ర్యామ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 512 జీబీ వరకు కెమెరా: 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 3500 ఎంఏహెచ్ కనెక్టివిటీ: వైఫై, బ్లూటూత్ వీ4.1, మైక్రో యూఎస్బీ, ఆడియో జాక్ స్టాండర్డ్ 3.5ఎంఎం సెన్సార్లు: యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్ (చదవండి: విద్యార్థినులకు గూగుల్ గుడ్‌న్యూస్!) -
జియో ఫోన్ కోసం వేచిచూస్తున్నారా?
నవరాత్రికి జియో ఫోన్ తమ చేతుల్లోకి వచ్చేస్తుందంటూ ఎంతో ఆశగా.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. నేటి నుంచి డెలివరీ కావాల్సిన జియో ఫోన్ తేదీలను మరోసారి వాయిదా వేసినట్టు తెలిసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 1కి ఈ ఫోన్ డెలివరీ డేట్‌ను వాయిదా వేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ సమయంలో అనూహ్య స్పందన రావడంతో, డెలివరీ తేదీని కంపెనీ వాయిదా వేస్తూ వెళ్తున్నట్టు తెలిపాయి. ఆగస్టు 24న ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ భారీ ఎత్తున్న డిమాండ్ రావడంతో ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ప్రీ-బుకింగ్స్ నిలిపివేసింది. జులై 21న రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆవిష్కరించిన రోజే, సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఫోన్ల డెలవరీ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కానీ డిమాండ్ అధికంగా రావడంతో, వీటి డెలివరీ మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. కానీ ఈ నవరాత్రికి కాకుండా... అక్టోబర్ మొదటి నుంచి దీన్ని అందించాలని కంపెనీ చూస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. తమకు జియో నుంచి మెసేజ్ వచ్చిందని, ఫోన్ల డెలివరీ అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు చెప్పారని ఓ రిటైలర్ వెల్లడించారు. ఇప్పటికే లక్షల మంది ఈ ఫోన్లను బుక్ చేసుకొని ఈ ఫోన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫోన్ల డెలివరీ వాయిదా పడటం కస్టమర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అయితే నిలిపివేసిన ప్రీ-బుకింగ్స్‌ను కంపెనీ త్వరలోనే మళ్లీ ప్రారంభించనుందట. ఈ ఫోన్ ఫ్రీ-అయినప్పటికీ, బుకింగ్ సమయంలో రూ.500, డెలివరీ సమయంలో రూ.1000 కట్టాల్సి ఉంటుంది. మూడేళ్ల అనంతరం ఈ మొత్తాన్ని కంపెనీ వినియోగదారులకు రీఫండ్ చేయనుంది. వీజీఏ కెమెరా, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2.4 అంగుళాల డిస్ప్లే, 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128జీబీ ఎక్స్‌పాండబుల్ జీబీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. -
జియో ఫోన్ల డెలివరీ అప్పటి నుంచే...
రిలయన్స్ జియో ఫోన్ ఆలస్యమయ్యే వార్త నిజమయ్యేటట్టే కనిపిస్తోంది. ఆగస్టు 24 ప్రారంభమైన ఈ ఫోన్ బుకింగ్స్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఫోన్ల డెలివరీ మరికొంతకాలం పాటు పట్టవచ్చని రిపోర్టులు వెలువడుతున్నాయి.. ఆగస్టు 24వ తేదీని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో బుకింగ్స్‌కు వచ్చిన ఈ ఫోన్‌కు అరవై లక్షలకు పైగా ప్రీబుకింగ్స్ వచ్చాయని తెలిసింది. ప్రీబుకింగ్స్ మరింత వెల్లువెత్తుతుండటంతో, ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోలేక కంపెనీ వాటిని నిలిపివేసింది కూడా. కేవలం వినియోగదారుల ఆసక్తిని మాత్రమే ప్రస్తుతం నమోదుచేసుకుంటుంది. ఈ అనూహ్య స్పందనతో జియోఫోన్ డెలివరీని నవరాత్రి పండుగ నుంచి ప్రారంభమవుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కస్టమర్లకే ఈ డెలివరీ తేదీలు సెప్టెంబర్ 25గా కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్లే చెప్పారు. సెప్టెంబర్ 24 తేదీల్లో స్టోర్లలోకి ఈ ఫోన్లు వస్తాయంటూ రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్ ప్రతినిధులు తెలిపారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్‌లో ఈ ఫోన్‌ను అందించనున్నారు. నగరాల్లో అందుబాటు కూడా భిన్నమైన తేదీల్లో రానున్నాయి. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది. -
జియోఫోన్ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో..!
-
జియోఫోన్ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో..!
సాక్షి న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో. తన సరికొత్త ఫోన్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరెగిత్తిస్తోంది. ఆగస్టు 24వ తేదీ ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే దాదాపు 30లక్షల ఫోన్లు అమ్ముడై మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో వెబ్సైట్ క్రాష్ కూడా అయ్యింది. కేవలం 36 గంటల్లోనే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది. ఈ నిలుపుదలతో పాటు బుక్ చేసుకున్న వారికి ఫోన్ల డెలివరీ కూడా ఆలస్యం కానున్నట్లు తాజా సమాచారం. అయితే తాజాగా జియోఫోన్‌పై సోషల్ మీడియాలో ఓవీడియో హల్ చల్ చేస్తోంది. ఫోన్‌పై జియో అని పేరు ఉంది. అంతే కాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు అందులో జియోకు చెందిన మై జియో , జియో టీవీ, జియో మ్యూజిక్, కాల్ లాగ్ వంటి అప్లికేషన్లు ఉన్నాయి. జియో స్టోర్ పేరిట ప్రత్యేకమైన ప్లేస్టోర్ కూడా ఉంది. కెమెరా, ఆడియో, వీడియో ప్లేయర్కూడా ఇన్‌బిల్ట్‌గా వచ్చేశాయి. సెట్టింగ్స్‌లో డివైస్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ మోడల్ ఎల్ఎఫ్-2403 అని, సాఫ్ట్వేర్ వెర్షన్ కైఓస్ 2.0 అని చూపిస్తోంది. ఈ వీడియోపై మీరు ఓలుక్ వేయండి. -
జియో ఫోన్ డెలివరీ ఆలస్యం?
సాక్షి, ముంబై : అనుకున్న తేదీలోనే జియో ఫోన్ ప్రీ-బుకింగ్స్ వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఆగస్టు 24నే కంపెనీ ఈ ఫోన్ బుకింగ్స్‌ను చేపట్టింది. అంచనాల కంటే అధికంగానే వినియోగదారుల నుంచి స్పందన కూడా వచ్చింది. 3 మిలియన్ నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు బుక్ అయ్యాయి. వినియోగదారుల నుంచి స్పందన అనూహ్యంగా ఉండటంతో, ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది. ఈ నిలుపుదలతో పాటు బుక్ చేసుకున్న వారికి ఫోన్ల డెలివరీని కూడా కంపెనీ జాప్యం చేయనున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. జియో ఫోన్ ఎప్పుడెప్పుడు తమ చేతిలోకి వస్తుందా? అంటూ ఎదురుచూస్తున్న వినియోగదారులు, ఈ ఫోన్ కోసం మరికొంత కాలం పాటు వేచిచూడాల్సిందేనట. డిమాండ్ విపరీతంగా రావడంతో, డెలివరీ తేదీలు ఆలస్యమయ్యే అవకాశముందని రిటైలర్లు చెప్పినట్టు ఇండియా టుడే టెక్ రిపోర్టు చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్ తెలిపారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్‌లో ఈ ఫోన్లను అందిస్తామని జియో అంతకముందే చెప్పింది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది.