
జియోఫోన్ ఫస్ట్ అన్‌బాక్సింగ్ వీడియో..!
సాక్షి న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో. తన సరికొత్త ఫోన్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరెగిత్తిస్తోంది. ఆగస్టు 24వ తేదీ ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్‌సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే దాదాపు 30లక్షల ఫోన్‌లు అమ్ముడై మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో వెబ్‌సైట్ క్రాష్ కూడా అయ్యింది. కేవలం 36 గంటల్లోనే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది. ఈ నిలుపుదలతో పాటు బుక్ చేసుకున్న వారికి ఫోన్ల డెలివరీ కూడా ఆలస్యం కానున్నట్లు తాజా సమాచారం.
అయితే తాజాగా జియోఫోన్‌పై సోషల్ మీడియాలో ఓవీడియో హల్ చల్ చేస్తోంది. ఫోన్‌పై జియో అని పేరు ఉంది. అంతే కాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు అందులో జియోకు చెందిన మై జియో , జియో టీవీ, జియో మ్యూజిక్, కాల్ లాగ్ వంటి అప్లికేషన్లు ఉన్నాయి. జియో స్టోర్ పేరిట ప్రత్యేకమైన ప్లేస్టోర్ కూడా ఉంది. కెమెరా, ఆడియో, వీడియో ప్లేయర్‌కూడా ఇన్‌బిల్ట్‌గా వచ్చేశాయి. సెట్టింగ్స్‌లో డివైస్ ఇన్ఫర్‌మేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ మోడల్ ఎల్‌ఎఫ్-2403 అని, సాఫ్ట్‌వేర్ వెర్షన్ కైఓస్ 2.0 అని చూపిస్తోంది. ఈ వీడియోపై మీరు ఓలుక్ వేయండి.