unboxing
-
షాకింగ్ ఘటన: ఐ ఫోన్ బుక్ చేసి.. ఎంత దారుణం చేశాడంటే..
యశవంతపుర(కర్ణాటక): ఆన్లైన్లో ఐ ఫోన్ బుక్ చేసిన యువకుడు డబ్బులు ఎగ్గొట్టాలని ఏకంగా డెలివరీ బాయ్‌ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా అరసికెరెలో జరిగింది. వివరాలు.. పట్టణంలోని లక్ష్మీపురకు చెందిన హేమంత్ దత్త (20) నిందితుడు. ఇతడు ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ను బుక్ చేశాడు. డెలివరీ సమయంలో నగదు ఇచ్చే ఆప్షన్ పెట్టాడు. అరసికెరె తాలూకాకు చెందిన డెలివరీ బాయ్ హేమంత్ నాయక్ (23) ఈ నెల 11న ఫోన్‌ను తీసుకుని దత్త ఇంటికి వెళ్లాడు. అతడు ఫోన్‌ను తీసుకుని, ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తానని బాయ్‌ను కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం హేమంత్‌దత్త వెనుక వైపు నుంచి వచ్చి నాయక్‌పై కత్తితో పొడిచాడు. బలమైన గాయాలై రక్తస్రావంతో కుప్పకూలి అక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంట్లోనే మూడురోజులు తరువాత మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి 14వ తేదీన గోనెసంచిలో శవాన్ని మూటగట్టి స్కూటర్‌పై తీసుకెళ్లి సమీపంలోని కొప్పలు రైల్వేగేట్ సమీపంలో పడేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు హేమంత్ నాయక్ కనిపించడం లేదని తల్లిదండ్రులు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రైల్వేగేటు వద్ద కాలిన శవం ఉందని తెలిసి పోలీసులు వెళ్లి పరిశీలించగా అది హేమంత్ నాయక్ మృతదేహంగా గుర్తించారు. నాయక్ మొబైల్‌కు వచ్చిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా వెంటనే హేమంత్‌దత్తను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు నోరు విప్పాడు. కఠినంగా శిక్షించాలి పోలీసులు అతని ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా హేమంత్‌దత్త స్కూటర్‌పై బంక్ వద్దకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లిన దృశ్యాలను కనుగొన్నారు. హత్య చేసి, ఆపై సాక్ష్యాలను నాశనం చేయడానికి హేమంత్‌దత్త అన్ని ప్రయత్నాలు చేశాడని ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు. ఈ దురాగతం స్థానికంగా సంచలనం కలిగింది. ఇటువంటి హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. చదవండి: భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. డబ్బు కొట్టేయాలని ప్లాన్ -
ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్!
ఫిబ్రవరి 9 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో అదరగొట్టేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సిద్దమవుతున్నాడు. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. అయితే ఆ ట్వీట్ బిజినెస్ ప్రమోషన్లో భాగమేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఎండార్స్ మెంట్లతోనే కాదు ట్వీట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంపై విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారని అనుకుంటున్నారా? విరాట్ కోహ్లీ ఓ కొత్త ఫోన్ కొన్నాడట. ఆ ఫోన్‌ను పోగొట్టుకున్నాడట. ఇంకేముంది. అన్ బాక్సింగ్ చేయకుండా ఫోన్ పోగొట్టుకోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కొన్న ఫోన్ ఎలా ఉందో చూడకుండా (అన్ బాక్సింగ్) పోగొట్టుకుంటే అంతకు మించిన బాధ మరొకటి ఉండదేమో...మీలో ఎవరైనా ఆ ఫోన్‌ను చూశారా..? అని విరాట్ కోహ్లీ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాత్రం విచిత్రంగా స్పందించింది. ‘వదిన ఫోన్ నుంచి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేందుకు మొహమాటం పడొద్దు. ఇప్పుడు అదే మీకు సాయపడుతుంది’ అని జొమాటో కామెంట్ పెట్టింది. దీంతో కోహ్లీ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా.. కొందరు అభిమానులు మాత్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని ట్యాగ్ చేస్తూ వెంటనే కోహ్లీకి మీ కంపెనీ మొబైల్ పంపించండి’ అని సూచిస్తున్నారు. Nothing beats the sad feeling of losing your new phone without even unboxing it ☹️ Has anyone seen it? — Virat Kohli (@imVkohli) February 7, 2023 feel free to order ice cream from bhabhi's phone if that will help 😇 — zomato (@zomato) February 7, 2023 -
జియోఫోన్ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో..!
-
జియోఫోన్ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో..!
సాక్షి న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో. తన సరికొత్త ఫోన్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరెగిత్తిస్తోంది. ఆగస్టు 24వ తేదీ ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే దాదాపు 30లక్షల ఫోన్లు అమ్ముడై మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో వెబ్సైట్ క్రాష్ కూడా అయ్యింది. కేవలం 36 గంటల్లోనే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను ఒక్కసారిగా కంపెనీ నిలిపివేసింది. ఈ నిలుపుదలతో పాటు బుక్ చేసుకున్న వారికి ఫోన్ల డెలివరీ కూడా ఆలస్యం కానున్నట్లు తాజా సమాచారం. అయితే తాజాగా జియోఫోన్‌పై సోషల్ మీడియాలో ఓవీడియో హల్ చల్ చేస్తోంది. ఫోన్‌పై జియో అని పేరు ఉంది. అంతే కాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు అందులో జియోకు చెందిన మై జియో , జియో టీవీ, జియో మ్యూజిక్, కాల్ లాగ్ వంటి అప్లికేషన్లు ఉన్నాయి. జియో స్టోర్ పేరిట ప్రత్యేకమైన ప్లేస్టోర్ కూడా ఉంది. కెమెరా, ఆడియో, వీడియో ప్లేయర్కూడా ఇన్‌బిల్ట్‌గా వచ్చేశాయి. సెట్టింగ్స్‌లో డివైస్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ మోడల్ ఎల్ఎఫ్-2403 అని, సాఫ్ట్వేర్ వెర్షన్ కైఓస్ 2.0 అని చూపిస్తోంది. ఈ వీడియోపై మీరు ఓలుక్ వేయండి.