‘మాన్‌సూన్ హంగామా’తో మరింత కిక్ | JioPhone Leads Indian Mobile Market In 'Fusion' Segment | Sakshi
Sakshi News home page

‘మాన్‌సూన్ హంగామా’తో మరింత కిక్

Published Sat, Aug 4 2018 5:25 PM | Last Updated on Sat, Aug 4 2018 5:36 PM

JioPhone Leads Indian Mobile Market In 'Fusion' Segment - Sakshi

జియో ఫోన్ మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. 2018 సంవ‌త్స‌రంలో మొద‌టి త్రైమాసికంలో 27% మార్కెట్ వాటాను జియో ఫోన్‌ కైవ‌సం చేసుకుంద‌ని సైబ‌ర్ మీడియా రీసెర్చ్ చేసిన అధ్య‌య‌నం వెల్లడించింది. ఇండియన్‌ మొబైల్‌ మార్కెట్‌లోని ఫ్యూజ‌న్ సెగ్మెంట్‌లో జియో ఫోన్ చరిత్ర సృష్టించింద‌ని ఈ నివేదిక‌ విశ్లేషించింది. 4జీ క‌నెక్టివిటీ క‌లిగి ఉండి వినియోగ‌దారుల‌కు నచ్చే యాప్‌లను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉందని వివరించింది.  2018 రెండో త్రైమాసికంలో స్వ‌ల్ప‌కాలంలో మార్కెట్‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసిన రెండు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ తెలిపింది.

``అందులో ఒకటి జియో ప్ర‌వేశ‌పెట్టిన సంచ‌ల‌న మాన్‌సూన్ ఆఫ‌ర్. ఈ ఆఫ‌ర్ వ‌ల్ల అన్ని ప్ర‌ముఖ‌ హ్యాండ్‌సెట్ల బ్రాండ్ల‌కు అనియ‌త‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. రెండో అంశం చిన్న త‌ర‌హా విభాగానికి చెందిన వారు సీకేడీ మాన్యూఫాక్చ‌రింగ్ వైపు దృష్టి సారించారు. దీంతోపాటుగా వారి సొంత ఎస్ఎంటీ లైన్ల ద్వారా ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని కొన‌సాగించారు`` అని సీఎంఆర్ ఇండ‌స్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) హెడ్ ప్ర‌భురామ్ తెలిపారు.

ఫీచ‌ర్ ఫోన్లు మ‌రియు ఫ్యూజన్ ఫోన్లు క‌లిపి 2020 నాటికి స్మార్ట్ ఫోన్ల‌ను దాటివేస్తాయని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ నివేదిక వెల్ల‌డించింది. జియో ప్ర‌క‌టించిన ఎక్సేంజ్ స్కీమ్`జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా`కు తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించిందని నివేదిక తెలిపింది. ఈ ఆఫ‌ర్‌తో విప‌ణిలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోవ‌డ‌మే కాకుండా.. జియో ఫోన్ అమ్మ‌కాల‌లో విశేష వృద్ధి స్ప‌ష్టంగా క‌నిపించిందని పేర్కొంది. ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన కేవ‌లం ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌లాది జియోఫోన్ల అమ్మ‌కాలు జ‌రిగాయని చెప్పింది. 

జియోఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫ‌ర్‌లో భాగంగా వినియోగ‌దారులు ఏదైనా ఫీచ‌ర్ ఫోన్ (ఏ బ్రాండ్ కు చెందిన‌ది అయినా) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ ( ప్ర‌స్తుతం ఉన్న మోడ‌ల్‌)ను కేవ‌లం రూ.501 సెక్యురిటీ డిపాజిట్ రుసుముతో పొంద‌వ‌చ్చు. వాస్త‌వ సెక్యురిటీ డిపాజిట‌ల్ రూ.1500 కాగా, ఈ ఆఫ‌ర్‌లో రూ. 999 త‌గ్గింపు కావ‌డం విశేషం. ఫీచ‌ర్ ఫోన్‌ను అందించే ఈ ప‌థ‌కంలో భాగంగా వినియోగ‌దారులు రూ. 594(రూ.99 x 6) చెల్లించ‌డం ద్వారా 6 నెల‌ల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్, డేటాను పొంద‌వ‌చ్చు. అంటే వినియోగ‌దారుడు రూ. 1,095 (రూ.501 తిరిగి చెల్లించే సెక్యురిటీ మొత్తం+ రూ.594 రీచార్జీ మొత్తం) చెల్లించ‌డం ద్వారా ఆరునెల‌ల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా అందించే జియో ఫోన్‌ను త‌మ పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌లో సొంతం చేసుకోవ‌చ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement