ముంబై : టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో, తన సరికొత్త ఫీచర్ ఫోన్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరెగిత్తిస్తోంది. ఈ ఫోన్ డెలివరీని కూడా ప్రారంభించేసింది. ప్రస్తుతం వినియోగదారుల చేతుల్లో ఈ ఫోన్లు అలరిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచింగ్ తేదీ నుంచి డెలివరీ వరకు ప్రతి వార్త సంచలనంగానే మారుతోంది. తాజాగా జియో ఫోన్ అసల ఖరీదెంతో? సబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఫోన్ అసెంబుల్ ఖర్చు సుమారు 2,500 రూపాయలైనట్టు సంబంధిత వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. కానీ ఈ అసెంబుల్ ఖర్చు కంటే వెయ్యి రూపాయలు తక్కువగా అంటే రూ.1,500కే జియో ఫోన్‌ను రిలయన్స్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని కూడా మూడేళ్ల తర్వాత కంపెనీ రీఫండ్ చేయబోతుంది. అయితే ఖర్చు పరంగా రూ.2,500కు విక్రయించాల్సిన ఈ ఫోన్‌ను కేవలం రూ.1,500కే ఎందుకు విక్రయిస్తుందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్లను ఆకట్టుకుని, తన పెట్టుబడులను రికవరీ చేసుకోవడానికి ధరను తగ్గించి అమ్ముతున్నట్టు ఈ విషయం తెలిసిన వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే రెండేళ్లలో కంపెనీ తన సబ్‌స్క్రైబర్ల బేస్‌ను 250 మిలియన్ నుంచి రూ.300 మిలియన్ యూజర్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నాయి. ధర తగ్గించి అమ్మడం వల్ల సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవచ్చని జియో చూస్తుందని తెలిసింది. అయితే ఈ విషయంపై రిలయన్స్ ఇంకా స్పందించలేదు. అంతేకాక స్మార్ట్‌ఫోన్‌కు వెచ్చించలేని 500 మిలియన్ల మంది ప్రేక్షకులను ఇది టార్గెట్‌గా పెట్టుకుంది. దేశీయ ఫీచర్ ఫోన్ యూజర్లతో వినియోగదారు సగటు ఆదాయం( ఆర్పూ) 50 రూపాయలు లేదా అంతకంటే తక్కువగా ఉందని మెజార్జీ విశ్లేషకులు అంచనావేశారు. జియో ప్రస్తుతం తీసుకొచ్చిన ఫోన్ నెలవారీ రూ.153 ప్లాన్‌తో ఈ ఆర్పూను పెంచుకోనుందని తెలిసింది.