
న్యూఢిల్లీ: వాట్సాప్ ఫీచర్‌తో నోకియా 8110 మోడల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. నోకియా 8110 ఫోన్‌లో వాట్సాప్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చని, ఈ ఫోన్ ఎంతో స్టయిలిష్‌గా కనిపించేలా రూపొందించినట్టు నోకియా బ్రాండ్ యాజమాన్య సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ ఇండియా కంట్రీ హెడ్ అజయ్ మెహతా తెలిపారు. ఈ ఫోన్‌లో ఇంకా హాట్‌స్పాట్, వైఫై తదితర ఫీచర్లు సైతం ఉన్నట్టు చెప్పారు. నోకియా 8110లో వాట్సాప్ ఫీచర్ సదుపాయం ముందుగా భారతీయ వినియోగదారులకే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.
నోకియా ఫోన్‌లోని స్టోర్ నుంచి వాట్సాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది 4జీ ఫీచర్‌ఫోన్. ఈ ఫోన్‌లో ఇంకా గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్, ఫేస్‌బుక్ తదితర యాప్స్ ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. బ్లాక్, బనానా ఎల్లో రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రముఖ రిటైల్ స్టోర్లు, నోకియా డాట్ కామ్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ పోర్టళ్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment