రిలయన్స్ జియో ఫోన్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మరో కౌంటర్ ఇచ్చింది. అత్యంత తక్కువ ధరలో మరో 4జీ స్మార్ట్‌ఫోన్ ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎన్1ను లాంచ్ చేసింది. రూ.1,649కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంటెక్స్ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ భాగస్వామ్యంలోనే మరో రెండు ఇతర స్మార్ట్‌ఫోన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. రూ.1999కు ఆక్వా ఏ4ను, రూ.4,379కు ఆక్వా ఎస్3ను లాంచ్ చేసింది. సెల్‌కాన్, కార్బన్‌లతో కూడా ఎయిర్‌టెల్ భాగస్వామ్యం ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే.
ఇంటెక్స్ భాగస్వామ్యంతో 'మెరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' కార్యక్రమాన్ని ఎయిర్‌టెల్ మరింత విస్తరిస్తోంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇంటెర్నెట్ ఎనాబుల్డ్ ఫీచర్ ఫోన్‌ను లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ కూడా దేశీయ మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారి మైక్రోమ్యాక్స్‌తో జతకట్టి, రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. జియోఫోన్ లాంచింగ్ అనంతరం దిగ్గజ టెలికాం కంపెనీలు, మొబైల్ మేకర్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి.
నేడు లాంచ్ చేసిన ఈ ఇంటెక్స్ ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 7.0 నోగట్, డ్యూయల్ సిమ్ కార్డులు, 4 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే, 1.1గిగాహెడ్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వైఫై ఫీచర్లున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ఎంఆర్‌పీ 3,799 రూపాయలు. రూ.3,149 డౌన్‌పేమెంట్ కట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ మొత్తం నుంచి రూ.1500ను ఎయిర్‌టెల్ క్యాష్‌బ్యాక్ రూపంలో అందిస్తుంది. దీంతో అందుబాటులోకి వచ్చే ఆక్వా లయన్స్ ఎన్1 స్మార్ట్‌ఫోన్ ధర 1,649 రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment