బల్క్‌లో జియో ఫోన్‌ను బుక్‌ చేసుకోండి | JioPhone will be available to enterprise users in bulk, registration starts from August 24 | Sakshi
Sakshi News home page

బల్క్‌లో జియో ఫోన్‌ను బుక్‌ చేసుకోండి

Published Wed, Aug 9 2017 11:56 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

బల్క్‌లో జియో ఫోన్‌ను బుక్‌ చేసుకోండి

బల్క్‌లో జియో ఫోన్‌ను బుక్‌ చేసుకోండి

రిలయన్స్‌ ప్రతేడాది నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన వార్షిక సాధారణ సమావేశంలో జీరోకే జియో ఫోన్‌ను ముఖేష్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ స్పెషిఫికేషన్లతో ఈ ఫోన్‌ అందుబాటులోకి కూడా వస్తోంది. ఈ ఫోన్‌ కొనుక్కోవాలంటే తొలుత రూ.1500తో దీన్ని బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  మూడేళ్ల తర్వాత మన నగదును మనకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. టెస్టింగ్‌కు కాస్త ముందుగానే అంటే ఆగస్టు 15 నుంచే జియో ఫోన్‌ అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ డివైజ్‌ను యూజర్లు బుక్‌ చేసుకోవడం మిస్‌ కాకూడదని కంపెనీనే స్వయంగా ప్రమోషన్‌ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఫోన్‌ పొందడానికి, దాని అప్‌డేట్లను తెలుసుకోవడం కోసం కంపెనీ తన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్‌ పేజీని కూడా ప్రారంభించింది. 
 
కీప్‌ మి పోస్టెడ్‌ పేరుతో ఒక రిజిస్ట్రేషన్‌ పేజీని బ్యానర్‌గా తన వెబ్‌సైట్‌లో పొందుపరించింది. అయితే ఈ పేజీలో అంతకముందు కేవలం ఒక్క ఆప్షన్‌ మాత్రమే ఉండేది. ఒక వ్యక్తి మాత్రమే తమ ఆసక్తిని రిజిస్ట్రర్‌ చేసుకునే ఆప్షన్‌ను ఉంచిన జియో, ప్రస్తుతం రెండు ఆప్షన్లను పెట్టింది. బిజినెస్‌ అనే ఆప్షన్‌ను కూడా పెట్టింది. బిజినెస్‌ మోడ్‌లో కూడా ఈ ఫోన్‌ను ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లు రిజిస్ట్రర్‌ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌ నేమ్‌, కంపెనీ పేరు, పిన్‌ కోడ్‌, పాన్‌ లేదా జీఎస్టీఎన్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, కాంటాక్ట్‌ చేయాల్సిన వ్యక్తి నెంబర్‌, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్ట్రర్‌ చేసుకుంటే, బల్క్‌గా ఆర్డర్లను పొందవచ్చు. 1-5 నుంచి 50 వరకు, ఆపైనా బల్క్‌ ఆర్డర్లను బిజినెస్‌ కస్టమర్లు చేపట్టవచ్చని జియో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కేవలం జియో ఫోన్‌ మాత్రమే కాక, జియోఫైను కూడా  యూజర్లు బల్క్‌ ఆర్డర్‌ చేయవచ్చు. ఒక్కసారి నియమ, నిబంధనలను అంగీకరించి, సబ్మిట్‌ నొక్కితే, రిజిస్ట్రర్‌ చేసుకున్నట్టు ఒక మెసేజ్‌ వస్తోంది. అంతేకాక ఈమెయిల్‌ ఐడీకి కూడా మెయిల్‌ పంపిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement