enterprise users
-
మహిళా సూక్ష్మ సంస్థలకు సంక్షోభాల రిస్క్
న్యూఢిల్లీ: మహిళల ఆధ్వర్యంలో నడిచే మెజారిటీ సూక్ష్మ సంస్థల వద్ద అత్యవసర నిధులు లేవని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైతే వీటిపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఓ నివేదిక తెలిపింది. మహిళలు నిర్వహించే సూక్ష్మ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ‘మైక్రోసేవ్ కన్సల్టింగ్’ (ఎంఎస్సీ) అనే సంస్థ సాధాన్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల పరిధిలో ఇది జరిగింది. 1,460 కంప్యూటర్ ఆధారిత వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించింది. వ్యాపార నిర్వహణ పరంగా ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకునేది, సవాళ్లు, ప్రేరణల గురించి మహిళలు తమ అంతరంగాన్ని ఈ సంస్థతో పంచుకున్నారు. ముఖ్య అంశాలు.. → ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం కావాల్సిన నిధులు లేవని 45 శాతం మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు. → వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక అంశాలను వేర్వేరుగా నిర్వహించే విషయంలో చాలా మంది సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో న గదు నిర్వహణ సంక్లిష్టంగా మా రడమే కాకుండా, కచ్చితమై న ఆర్థిక రికార్డుల నిర్వహణ లో రాజీపడాల్సి వస్తోంది. → 60 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు తమ సంస్థలకు సంబంధించి లిఖితపూర్వక రికార్డులు నిర్వహించడం లేదు. లాభాలు, వ్యాపార కార్యకలాపాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున ప్రత్యేకమైన రికార్డుల నిర్వహణ అవసరం లేదని వీరిలో 55 శాతం మంది భావిస్తున్నారు. మిగిలిన వారు రికార్డుల నిర్వహణలో ఉన్న సంక్లిష్టతలను వ్యక్తపరిచారు. రికార్డులు నిర్వహించకపోవడంతో వ్యాపార పనితీరు, ఆర్థిక సామర్థ్యాలను సమీక్షించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. → ఇక ఈ సంస్థల్లో 55% మంది ఎలాంటి ఉద్యోగులను కలిగి లేవు. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఉపా ధి కల్పనకు ఇవి ఏమంత తోడ్పడడం లేదు. -
బల్క్‌లో జియో ఫోన్‌ను బుక్ చేసుకోండి
రిలయన్స్ ప్రతేడాది నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన వార్షిక సాధారణ సమావేశంలో జీరోకే జియో ఫోన్‌ను ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్మార్ట్ స్పెషిఫికేషన్లతో ఈ ఫోన్ అందుబాటులోకి కూడా వస్తోంది. ఈ ఫోన్ కొనుక్కోవాలంటే తొలుత రూ.1500తో దీన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత మన నగదును మనకు తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. టెస్టింగ్‌కు కాస్త ముందుగానే అంటే ఆగస్టు 15 నుంచే జియో ఫోన్ అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ డివైజ్‌ను యూజర్లు బుక్ చేసుకోవడం మిస్ కాకూడదని కంపెనీనే స్వయంగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ఫోన్ పొందడానికి, దాని అప్డేట్లను తెలుసుకోవడం కోసం కంపెనీ తన వెబ్సైట్లో రిజిస్ట్రర్ పేజీని కూడా ప్రారంభించింది. కీప్ మి పోస్టెడ్ పేరుతో ఒక రిజిస్ట్రేషన్ పేజీని బ్యానర్‌గా తన వెబ్సైట్లో పొందుపరించింది. అయితే ఈ పేజీలో అంతకముందు కేవలం ఒక్క ఆప్షన్ మాత్రమే ఉండేది. ఒక వ్యక్తి మాత్రమే తమ ఆసక్తిని రిజిస్ట్రర్ చేసుకునే ఆప్షన్‌ను ఉంచిన జియో, ప్రస్తుతం రెండు ఆప్షన్లను పెట్టింది. బిజినెస్ అనే ఆప్షన్‌ను కూడా పెట్టింది. బిజినెస్ మోడ్‌లో కూడా ఈ ఫోన్‌ను ఎంటర్ప్రైజ్ యూజర్లు రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నేమ్, కంపెనీ పేరు, పిన్ కోడ్, పాన్ లేదా జీఎస్టీఎన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ చేయాల్సిన వ్యక్తి నెంబర్, ఎన్ని డివైజ్‌లు అవసరమో తెలుపుతూ రిజిస్ట్రర్ చేసుకుంటే, బల్క్‌గా ఆర్డర్లను పొందవచ్చు. 1-5 నుంచి 50 వరకు, ఆపైనా బల్క్ ఆర్డర్లను బిజినెస్ కస్టమర్లు చేపట్టవచ్చని జియో తన వెబ్సైట్లో పొందుపరిచింది. కేవలం జియో ఫోన్ మాత్రమే కాక, జియోఫైను కూడా యూజర్లు బల్క్ ఆర్డర్ చేయవచ్చు. ఒక్కసారి నియమ, నిబంధనలను అంగీకరించి, సబ్మిట్ నొక్కితే, రిజిస్ట్రర్ చేసుకున్నట్టు ఒక మెసేజ్ వస్తోంది. అంతేకాక ఈమెయిల్ ఐడీకి కూడా మెయిల్ పంపిస్తారు.