అత్యవసర నిధుల లేమి
ఆర్థిక ఒడిదుడుకుల ప్రభావం ఎక్కువ
మైక్రోసేవ్ కన్సల్టింగ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: మహిళల ఆధ్వర్యంలో నడిచే మెజారిటీ సూక్ష్మ సంస్థల వద్ద అత్యవసర నిధులు లేవని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైతే వీటిపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఓ నివేదిక తెలిపింది. మహిళలు నిర్వహించే సూక్ష్మ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ‘మైక్రోసేవ్ కన్సల్టింగ్’ (ఎంఎస్‌సీ) అనే సంస్థ సాధాన్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాల పరిధిలో ఇది జరిగింది. 1,460 కంప్యూటర్ ఆధారిత వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించింది. వ్యాపార నిర్వహణ పరంగా ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకునేది, సవాళ్లు, ప్రేరణల గురించి మహిళలు తమ అంతరంగాన్ని ఈ సంస్థతో పంచుకున్నారు.
ముఖ్య అంశాలు..
→ ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం కావాల్సిన నిధులు లేవని 45 శాతం మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు.
→ వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక అంశాలను వేర్వేరుగా నిర్వహించే విషయంలో చాలా మంది సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో న గదు నిర్వహణ సంక్లిష్టంగా మా రడమే కాకుండా, కచ్చితమై న ఆర్థిక రికార్డుల నిర్వహణ లో రాజీపడాల్సి వస్తోంది.
→ 60 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు తమ సంస్థలకు సంబంధించి లిఖితపూర్వక రికార్డులు నిర్వహించడం లేదు. లాభాలు, వ్యాపార కార్యకలాపాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున ప్రత్యేకమైన రికార్డుల నిర్వహణ అవసరం లేదని వీరిలో 55 శాతం మంది భావిస్తున్నారు. మిగిలిన వారు రికార్డుల నిర్వహణలో ఉన్న సంక్లిష్టతలను వ్యక్తపరిచారు. రికార్డులు నిర్వహించకపోవడంతో వ్యాపార పనితీరు, ఆర్థిక సామర్థ్యాలను సమీక్షించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
→ ఇక ఈ సంస్థల్లో 55% మంది ఎలాంటి ఉద్యోగులను కలిగి లేవు. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఉపా ధి కల్పనకు ఇవి ఏమంత తోడ్పడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment