Emergency Fund
-
అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్రావుఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్‌తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికఅత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్‌సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నంఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్‌సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్‌సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
మహిళా సూక్ష్మ సంస్థలకు సంక్షోభాల రిస్క్
న్యూఢిల్లీ: మహిళల ఆధ్వర్యంలో నడిచే మెజారిటీ సూక్ష్మ సంస్థల వద్ద అత్యవసర నిధులు లేవని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైతే వీటిపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఓ నివేదిక తెలిపింది. మహిళలు నిర్వహించే సూక్ష్మ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ‘మైక్రోసేవ్ కన్సల్టింగ్’ (ఎంఎస్సీ) అనే సంస్థ సాధాన్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల పరిధిలో ఇది జరిగింది. 1,460 కంప్యూటర్ ఆధారిత వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించింది. వ్యాపార నిర్వహణ పరంగా ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకునేది, సవాళ్లు, ప్రేరణల గురించి మహిళలు తమ అంతరంగాన్ని ఈ సంస్థతో పంచుకున్నారు. ముఖ్య అంశాలు.. → ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం కావాల్సిన నిధులు లేవని 45 శాతం మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు. → వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక అంశాలను వేర్వేరుగా నిర్వహించే విషయంలో చాలా మంది సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో న గదు నిర్వహణ సంక్లిష్టంగా మా రడమే కాకుండా, కచ్చితమై న ఆర్థిక రికార్డుల నిర్వహణ లో రాజీపడాల్సి వస్తోంది. → 60 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు తమ సంస్థలకు సంబంధించి లిఖితపూర్వక రికార్డులు నిర్వహించడం లేదు. లాభాలు, వ్యాపార కార్యకలాపాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున ప్రత్యేకమైన రికార్డుల నిర్వహణ అవసరం లేదని వీరిలో 55 శాతం మంది భావిస్తున్నారు. మిగిలిన వారు రికార్డుల నిర్వహణలో ఉన్న సంక్లిష్టతలను వ్యక్తపరిచారు. రికార్డులు నిర్వహించకపోవడంతో వ్యాపార పనితీరు, ఆర్థిక సామర్థ్యాలను సమీక్షించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. → ఇక ఈ సంస్థల్లో 55% మంది ఎలాంటి ఉద్యోగులను కలిగి లేవు. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఉపా ధి కల్పనకు ఇవి ఏమంత తోడ్పడడం లేదు. -
గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు
సాక్షి, అమరావతి: తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అంతా సిద్ధం తాడేపల్లి: గోదావరి వరద ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్ధ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ‘‘ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 13.63 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. గోదావరి వరద ప్రభావం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎఎస్ఆర్ , కోనసీమ, ఏలూరు జిల్లాలలో ఎక్కువగా ఉంది. అల్లూరి జిల్లాలో ఐదు మండలాలలో 155 గ్రామాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలలో 49 గ్రామాలు, కోనసీమలో 20 మండలాలలో 141 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలలో 47 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, 17 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం ఉంది. వరద ప్రభావిత సహాయ చర్యలకోసం సీఎం జగన్ రూ. 12 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరద ప్రభావిత మండలాలలో, జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రానికి భద్రాచలంలో గోదావర వరద పెరిగే అవకాశాలున్నాయి. ఈనెల 30 నుంచి గోదావరి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాం. వరద సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. వరద సహాయక చర్యల కోసం మూడు NDRF, నాలుగు SDRF బృందాలు పనిచేస్తున్నాయి అని వెల్లడించారాయన. -
భారతీయుల అత్యవసర నిధి ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువులు... వారి పెళ్లిళ్లు, రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా జీవిత బీమా, పోస్టాఫీస్ సేవింగ్స్, ఎఫ్డీ, ఆర్డీ తదితర మార్గాల్లో పొదుపు చేయడంలో దిట్టలైన భారతీయులు అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాత్రం చేతులెత్తేస్తారట! కోవిడ్ తరహాలో ఏదైనా అత్యవసరాలకు 75 శాతం భారతీయుల వద్ద నిధులు అందుబాటులో ఉండటం లేదని ఓ అధ్యయనం పేర్కొంది. అనూహ్యంగా ఉద్యోగాలు ఊడినా, ఉన్నపళంగా తీవ్ర అనారోగ్యం పాలైనా ఎదుర్కొనేందుకు కేవలం 25 శాతం మందే సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థికంగా సిద్ధమయ్యేలా వ్యవహరిస్తున్నా ‘ఎమర్జెన్సీ ఫండ్ ప్లానింగ్’పై మాత్రం అంతగా ముందుచూపుతో వ్యవహరించడం లేదని వివరించింది. ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ఫినోలాజీ సంస్థ ‘ఇండియన్ మనీ హాబిట్స్’పై జరిపిన పరిశీలనలో ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అత్యవసర నిధి ఉంచుకోవాలి.. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ ఫండ్ అందుబాటులో ఉంచుకోవడంతోపాటు కుటుంబం మొత్తం కవరయ్యేలా నాణ్యమైన మెడికల్ కవర్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం కష్టపడి ఆదా చేసిన మొత్తంలో సింహభాగం ఆసుపత్రి ఖర్చులకే వ్యయంచేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెబుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా మరేది అందుబాటులో లేకపోతేనే ఈ ఫండ్‌ను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. లిక్విడ్ ఫ్యూచర్ ఫండ్స్ అనేవి మరో ఆప్షన్‌గా నిలుస్తాయని, సేవింగ్స్ ఖాతా కంటే వాటిలోనే ఎక్కువ రిటర్న్స్ రావడంతోపాటు కేవలం ఒక రోజులోనే ఈ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. నెలకు ఎంత మొత్తం ఆదా చేస్తున్నారనే సంబంధం లేకుండా కనీసం నెలకు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు తక్కువ మొత్తాల్లోనైనా క్రమం తప్పకుండా ఆదా చేయడం అలవాటు చేసుకొవాలని చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు విడిగా పెట్టే మొత్తమే ఎమర్జెన్సీ ఫండ్. ఉద్యోగం నుంచి ఉద్వాసన, అనారోగ్యం, ఏదైనా పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఉపయోగపడేదే ఈ నిధి. ఇది అందుబాటులో లేనిపక్షంలో ఇతర ఆర్థిక అవసరాల కోసం విడిగా ఉంచిన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి రావడం, అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది – పైసా బజార్ సీఈవో నవీన్ కుక్రేజా అధ్యయనంలోని ముఖ్యాంశాలు.. ♦ తమ తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులను ‘అత్యవసర నిధి’ కింద భారతీయులు పరిగణిస్తారు. ♦ఉద్యోగం కోల్పోవడం లేదా ఏదైనా అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యను ఎదుర్కోవడంలో భాగంగా వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐ కట్టలేకపోతున్నారు. ♦ప్రతి ముగ్గురిలో ఒకరికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ లేదా ఎమర్జెన్సీ ఫండ్ అనేది అందుబాటులో లేదు. ♦తమ శాలరీ మొత్తం 15 రోజుల్లోనే ఖర్చయిపోతోందంటున్న 29 శాతం మంది. -
పాకిస్తాన్ వరద బాధితులుగా... 1.6 కోట్ల చిన్నారులు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంభవించిన భీకర వరదల ధాటికి 1.6 కోట్ల మంది చిన్నారులు బాధితులుగా మారారని, వీరిలో 34 లక్షల మందికి తక్షణమే సాయం అందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే పోషకాహార లేమిని ఎదుర్కొంటున్న బాలలు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో పోరాడుతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(యునిసెఫ్) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్లో సింధ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇటీవలే రెండు రోజులపాటు పర్యటించారు. పాకిస్తాన్లో వరదలు 528 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్నాయని చెప్పారు. ఇవన్నీ నివారించగలిగే మరణాలే అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ఆక్షేపించారు. ఆవాసం లేక చిన్నపిల్లలు కుటుంబాలతో కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారని, ఆహారం, నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూలిపోయాయని అన్నారు. బాధితులను ఆదుకొనేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణం ముందుకు రావాలని అబ్దుల్లా ఫాదిల్ విజ్ఞప్తి చేశారు. -
గృహ రుణం కోసం అప్లై చేసే ముందు.. ఇవీ తప్పక తెలుసుకోండి!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడం కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. తమ దగ్గర ఉన్న కొంత సొమ్ముతో పాటు గృహ రుణం కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. గృహ రుణం అనేది ఒక అతిపెద్ద రుణం. గృహ రుణం తీసుకొనే ముందు ఒకసారి భవిష్యత్ గురుంచి ఆలోచించాలి. ఎందుకంటే, ఈ రుణం తీసుకున్న తర్వాత ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే కష్టాల్లోకి కూరుకొని పోవాల్సి వస్తుంది. అందుకే, గృహ రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ దరఖాస్తుదారులు గృహ రుణం కోసం అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి. డౌన్ పేమెంట్: గృహ రుణం అనేది ఆ ఇంటి ఆస్తి విలువలో 60 శాతం కంటే ఎక్కువ మించకూడదు. వాస్తవానికి దరఖాస్తుదారులకు 70-80 శాతం ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. కానీ, గృహ కొనుగోలుదారాలు 60 శాతం లోపు రుణం తీసుకుంటే మంచిది. మిగతా 40 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా గృహ రుణం రావడంతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే, భవిష్యత్‌లో ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే, తట్టుకునే సామర్ధ్యం మన దగ్గర ఉంటుంది. క్రెడిట్ స్కోరు: ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయాలి అనుకున్నప్పుడు, మొదటగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు చెక్ చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి(ఉదా:750 పైన) సాధారణంగా రుణ ఆమోదానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు తక్కువ వడ్డీకె రుణాలను ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. ఇల్లు కొనడానికి ముందు మన క్రెడిట్ స్కోరు మెరుగు పరుచుకోవడం మంచిది. (చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..) ఈఎమ్ఐ: రుణగ్రహీత నెలవారీ ఆదాయంలో కొత్త గృహ రుణం కోసం తీసుకునే ఈఎమ్ఐ 50-60 శాతం లోపు గల దరఖాస్తుదారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒకవేల మీకు ఇతర రుణాలు ఉంటే అవి పూర్తిగా చెల్లించిన తర్వాత లేదా కొంత మేరకు(50 శాతం వరకు) చెల్లించి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. అలాగే, మీకు ఇతర ఖర్చులు గనుక ఉంటే సుదీర్ఘ రుణ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. అత్యవసర నిధి: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఒక ఆర్ధిక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, భవిష్యత్‌లో ఎలాంటి ఊహించని కరోనా మహమ్మారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైనా కావచ్చు. అందుకే, ఈ నిదిలో ఎల్లపుడూ 6-12 నెలల ఈఎమ్ఐలకు సరిసమానమైన నగదు ఉంటే మంచిది. మీరు గనుక ఒక ఈఎమ్ఐను చెల్లించకపోయిన అది మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ అత్యవసర నిధి వల్ల అటువంటి తీవ్రమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. (చదవండి: ఆహా ఏమి అదృష్టం!.. లక్షకు రూ.55 లక్షలు లాభం) -
అత్యవసర నిధి ఎంత ఉండాలి? ఎలా మేనేజ్ చేయాలి?
పోర్ట్‌ఫోలియోలో ఈఎస్జీ ఫండ్స్‌కు చోటివ్వాలా? ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఈఎస్జీ ఫండ్స్ కూడా ఉండాలా? మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌కు ఇవి ఏ రకంగా భిన్నంగా ఉంటాయి? – రాజుగోపాల్ శ్రీధర్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ఈఎస్జీ) ఫండ్స్‌కు ఇప్పుడు ఆరంభదశ. ఇందులో విశ్వసనీయమైన ఎంపికలు ప్రస్తుతానికి లేవన్నది నా అభిప్రాయం. ప్రధాన ఫండ్స్‌లోనూ ఈఎస్‌జీకి చోటు కీలకంగా మారుతోంది. సమాజానికి, పర్యావరణానికి అనుకూలమైన కంపెనీలు వ్యాపారానికి కూడా మంచివే. భారత్‌లో దీర్ఘకాలంలో విజేతలైన కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ పరిపాలన ఎంతో కీలకంగా ఉంటోంది. మన దేశంలో ఈఎస్జీ ఫండ్స్ ఇంకా ప్రధాన విభాగంగా పరిణమించలేదు. ఈ దశలో ఇన్వెస్టర్లకు ఈ విభాగంలో విస్తృతమైన ఎంపికలు లేవు. ఈక్విటీల్లో పెట్టుబడులపై రాబడులను డెట్ ఫండ్స్‌కు మళ్లించడాన్ని మీరు సూచిస్తారా? ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు సంబంధించి ఇలా చేయవచ్చా? – మోతి రాజేంద్రన్ రక్షణాత్మక ధోరణితో ఉండే ఇన్వెస్టర్లు స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ మీరు స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, వాటిపై మంచి లాభాలు కనిపిస్తుంటే, వాటిని కాపాడుకునేందుకు వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్ పథకాలు) ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పూర్తి భద్రత లభించినట్టు కాదు. ఎందుకంటే మీరు కేవలం లాభాలను మాత్రమే వెనక్కి తీసుకుని, అసలు పెట్టుబడిని అందు లోనే కొనసాగిస్తారు కనుక.. మార్కెట్లు దిద్దుబాటుకు లోనయితే పెట్టుబడుల విలువ గణనీయంగా క్షీణించే అవకాశం లేకపోలేదు. మీదైన అస్సెట్ అలోకేషన్ విధానాన్ని అనుసరించండి. దీనికి బదులు వివిధ రకాల ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు కనిపిస్తుంటే.. కరెక్షన్ వచ్చినా లాభాలు కాపాడుకోవాలని భావిస్తుంటే మొత్తం పెట్టుబడుల్లో ఒక వంతును స్థిరాదాయ పథకాల్లోకి మార్చుకోవచ్చు. ఇది మరింత అర్థవంతంగా ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ పెట్టుబడుల కాలాన్ని అనుసరించి వచ్చిన లాభాలు వేర్వేరుగా ఉంటుంటాయి. ఉదాహరణకు 15–20 ఏళ్ల క్రితం నాటి పెట్టుబడులు కూడా నాకు కొన్ని ఉన్నాయి. ఈ పెట్టుబడుల విలువలో 90 శాతం లాభాల రూపంలో సమకూరిందే. ఒకవేళ మీరు ఒక నెల క్రితమే లేదా సంవత్సరం క్రితమే ఇన్వెస్ట్ చేసి, 50 శాతం పెరిగి ఉంటే.. అందులో మీ లాభం మూడింట ఒక వంతుగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఐదేళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే మొత్తం విలువలో మీ లాభాలు 75 శాతంగా ఉండొచ్చు. కనుక పెట్టుబడుల కాలాన్ని అనుసరించి ఈ లాభాల పరిమా ణం వేర్వేరుగా ఉంటుంది. మార్కెట్ల పట్ల ఆందోళనగా ఉంటే, గణనీయంగా పడిపోతాయని భావిస్తుంటే.. మీరు అస్సెట్ అలోకేషన్ (వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను విభజించడం)ను అనుసరించాలి. అత్యవసర నిధిగా ఎంత మొత్తం ఉండాలన్నది ఎలా నిర్ణయించుకోవాలి? అసలు ఎంత సరిపోతుంది?– కరణ్ అత్యవసర నిధికి సంబంధించి కచ్చితమైన, ప్రామాణిక సూత్రం అంటూ ఏదీ లేదు. మీ అంతట మీరే దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే.. వారికి సంబంధించి వైద్య అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాల్లో మీకు అధిక మొత్తంలో అత్యవసర నిధి అవసరం అవుతుంది. మీకు పిల్లలు ఉంటే అప్పుడు అత్యవసర నిధి అవసరం వేరుగా ఉంటుంది. అలాగే, మీ ఉద్యోగానికి భద్రత ఎంత మేరకు? మీ ఆదాయంలో స్థిరత్వం ఏ మేరకు అన్నది కూడా అత్యవసర నిధిని నిర్ణయించుకోవడంలో ముఖ్య అంశాలు అవుతాయి. ఆదాయంలో స్థిరత్వం లేకపోతే అత్యవసర నిధి మరింత మొత్తం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత మేరకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకునేందుకు ఈ అంశాలన్నీ కీలకమవుతాయి. - ధీరేంద్రకుమార్,సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్ -
అప్పులపాలు కాకుండా కాపాడే మార్గం ఇది!
రమేశ్ ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నాడు. అప్పటిదాకా హాయిగా నడిచిపోతున్న బతుకు బండి.. కరోనాతో కుదేలు అయ్యింది. ఉద్యోగం పోయింది. చేతిలో చిల్లిగవ్వలేక అప్పులవైపు అడుగులేశాడు. ఆశ్చర్యంగా రమేశ్ పరిస్థితే సురేష్‌కు ఎదురైనా.. అప్పులను ఆశ్రయించలేదు. మరో ఉద్యోగం దొరికేదాకా కుటుంబ అవసరాలను సజావుగా తీర్చుకుంటూ పోయాడు. అత్యవసర నిధి ఆవశ్యకతను గుర్తించాడు కాబట్టే రమేశ్‌లా సురేష్ కష్టపడలేదు. అత్యవసర నిధి.. సింపుల్‌గా చెప్పాలంటే ఆకస్మిక నిధి. ఊహించని పరిస్థితులు, సంక్షోభాల ప్రభావం వచ్చేఆదాయంపై పడినప్పుడు ఉపయోగపడే సేవింగ్స్ అనుకోవచ్చు. వైద్య ఖర్చులు, తప్పనిసరి గృహ మరమ్మతులు, ఆకస్మికంగా ఉపాధి కోల్పోవడం, యుద్ధాలు, కరోనా వైరస్ వంటి మహమ్మారులు, అంటువ్యాధులాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. అప్పులు చేయకుండా వ్యక్తుల్ని నిలువరించగలుగుతుంది. క్లిక్: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటర్ అంటే.. ఎంత మొత్తం కావాలి? సాధారణంగా అత్యవసర పరిస్థితులు రోజులు, వారాలు, నెలలు కొనసాగొచ్చు. కాబట్టి ఆరు నుంచి ఏడాది ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అఫ్కోర్స్.. అందిరికీ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకనే ఉద్యోగంలో మొదలైనప్పటి నుంచే కొంత డబ్బును పక్కనపెట్టుకుంటూ వెళ్లాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు, భాద్యతలు పెరుగుతాయి. అలాంటప్పుడు దశల వారీగా ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలి. రాబట్టుకోవచ్చు కూడా.. అవసరానికి అందుబాటులో డబ్బును ఇంట్లో ఉంచుకోవడం లేదంటే బ్యాంక్ అకౌంట్లో దాచుకోవడం చేస్తుంటారు. అలాగని దాచిన డబ్బు.. అలాగే మూలుగుతుంటే ఏం లాభం? అందుకే డబ్బు అందుబాటులో ఉండడంతోబాటు, దానిపై రాబడి ఉండడమూ ముఖ్యమే. ఇందుకోసం సేఫ్ సైడ్ అప్పులివ్వడం, పొదుపు ఖాతా లేదంటే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచొచ్చు. తద్వారా డబ్బు అవసరమైనప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా విత్‌డ్రా చేసుకునేందకు వీలుంటుంది. విత్‌డ్రా సమయంలో ఎటువంటి పెనాల్టీలు పడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే రాబడి తగ్గిపోతుంది. ఇక ఏటీఎంల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. డిజిటల్ పే తలనొప్పులు లేకుండా చూసుకోవాలంటే కొంత డబ్బును ఇంట్లోనే దాచుకోవడం ఉత్తమం. మ్యానేజ్ ముఖ్యం అత్యవసర నిధిలో వైద్య ఖర్చులు, చిన్న చిన్న ప్రమాదాలు/ కారు మరమ్మతు ఖర్చులు వంటి వాటి కోసం కేటాయించే మొత్తంపై పునరాలోచించాలి. ఎందుకంటే హెల్త్, మోటారు వంటి వాటికి ఇన్సురెన్స్ (బీమా) ఉంటుంది. తిరిగి బీమా ద్వారా పొందే అవకాశం ఉన్నప్పుడు, అత్యవసర నిధిలో ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన అవసరం ఏముంది?. అందుకే అత్యవసర నిధిని ప్రాధాన్యం ఉన్న వాటికి, చాలా ప్లాన్డ్గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ ఏర్పాటు చేసుకున్నాం.. ఖర్చు పెట్టేశాం అని కాకుండా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించుకోవాలి. ఈ పునఃసమీక్ష ఏడాదిలో ఒకసారైనా ఉంటే మరీ మంచిది. అలాగే పిల్లలకు సేవింగ్స్ అలవాటు చేయడం ద్వారా.. భవిష్యత్‌లో ఎమర్జెన్సీ ఫండ్ ఆవశ్యకత తెలిసి వస్తుంది. -కేజీ, ఆర్థిక నిపుణుడు చదవండి: రాబడులు, రక్షణ ఒకే పథకంలో.. -
మార్పును ఆహ్వానిద్దాం..!
జీవితం పట్ల దృక్పథాన్ని మార్చేసింది కరోనా. మహమ్మారి కారణంగా చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఆర్థిక వ్యవహారాలను ప్రణాళికాయుతంగా నిర్వహించే వారు పెద్దగా ఇబ్బంది పడలేదు.. కానీ, ముందుచూపు లేని వారికి జీవితం పట్ల వాస్తవం బోధపడింది. నగదు కోసం కష్టాలు ఎదుర్కొన్న వారు ఎందరో.. ఆస్తులు ఉన్నా వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం అన్ని వేళలా సాధ్యపడుతుందని భావించలేము. దీంతో అప్పుతో గట్టెక్కే ప్రయత్నం చేసిన వారున్నారు. విల్లు రాయకుండా అకాల మరణం పాలైతే.. వారి పేరిట ఉన్న ఆస్తులను కుటుంబ సభ్యులు వెంటనే పొందలేని పరిస్థితి. డబ్బుకు సంబంధించి, ఆర్థిక అంశాలకు సంబంధించి మన ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవాలన్న సందేశాన్ని ఈ మహమ్మారి ఇచ్చింది. మార్పు దిశగా అడుగులు వేసేందుకు ఏం చేయాలన్నదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. అన్ని కాలాల్లోనూ అందుబాటులో కొంత మేర నిధిని ఉంచుకోవడం అవసరమని కరోనా మహమ్మారితో ఎక్కువ మందికి తెలిసొచ్చింది. చాలా మంది అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలేనన్న ఆలోచనతో ఉంటారు. కానీ, ముందు సన్నద్ధత లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నగదుకు బదులు ఆస్తులు ఉండొచ్చు. కానీ, అవసరం ఏర్పడితే వెంటనే ఆదుకునేది నగదు బ్యాలన్సే. ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉందనుకోండి. వెంటనే విక్రయించి సొమ్ము చేసుకోవడం కష్టసాధ్యం. అందుకే లిక్విడ్ ఆస్తుల రూపంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోగల సౌలభ్యం ఉండాలి. అలా అని లిక్విడిటీ లేని ఆస్తులు సమకూర్చుకోవద్దని కాదు. అవసరమైనంత మేర లిక్విడ్ ఆస్తులను సైతం కలిగి ఉండాలి. ‘‘పొదుపు చేస్తున్న మొత్తాన్ని తీసుకెళ్లి ఎగ్జిట్ ఆప్షన్ లేని (కాల వ్యవధి మధ్యలో పెట్టుబడులను వెనక్కి తీసుకోలేనివి) సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అవసరం ఏర్పడినప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని వీఆర్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో వివేక్ రెగే పేర్కొన్నారు. కనీసం 6 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి ఉంచుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంతకంటే ఎక్కువే సమకూర్చుకుంటే మంచిదే. ఉద్యోగాలు, ఆదాయాలకు దీర్ఘకాలం పాటు సమస్యలు ఏర్పడిన తరుణంలో కనీసం ఏడాది అవసరాలకు సరిపడా నిధిని పక్కన పెట్టుకోవాలని ఫిన్‌ఫిక్స్ రీసెర్చ్ అండ్ అనలైటిక్స్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రబ్లీన్ బాజ్‌పాయ్ సూచించారు. ఉద్యోగ భద్రత అంతగా లేని వారికి ఎక్కువ నిధి అవసరం పడుతుంది. ఒకే బుట్టలో పెట్టొద్దు ఉదాహరణకు నెలసరి అవసరాలకు రూ.50,000 కావాలనుకోండి.. ఏడాది కోసం రూ.6లక్షలు అవసరమవుతాయి. అప్పుడు దీన్ని మూడు భాగాలు చేసుకోవాలి. నెలసరి అవసరాలంటే ఈఎంఐలు, సిప్‌లు, ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఖర్చులు అన్నీ కలసి ఉండాలి. ► మొదటి రెండు నెలల అవసరాల కోసం రూ.లక్షను స్వీప్ఇన్ ఎఫ్డీ ఖాతాలో ఉంచుకోవాలి. అవసరం ఏర్పడిన వెంటనే నిమిషాల్లోనే ఈ నిధిని వెనక్కి తీసుకోగల వెసులుబాటు ఉంటుంది. ► తదుపరి నాలుగు నెలల అవసరాలకు గాను రూ.2లక్షలు తీసుకెళ్లి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆర్బిట్రేజ్, లిక్విడ్ ఫండ్స్‌ను ఇందుకు పరిశీలించొచ్చు. ఈ పెట్టుబడులను నాలుగు నుంచి ఐదు రోజుల్లో వెనక్కి పొందొచ్చు. ► తదుపరి ఆరు నెలల కోసం రూ.3లక్షలను ఇతర డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఊహల ఆధారంగా అడుగులు వేయొద్దు ‘ఇప్పుడు కొనేద్దాం.. తర్వాత చెల్లించొచ్చు’ ఈ విధానం మంచిది కాదు. వేతన కోతలు, ఆశావహంగా లేని వ్యాపారాలు.. ఫలితంగా భారీగా అప్పులు చేసిన వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనే చెప్పుకోవాలి. కొందరు అయితే రుణ వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే.. మరికొందరు ఉన్నదంతా అప్పులకే కట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెల్లింపుల సామర్థ్యానికి మించి అప్పులు చేసి చాలా మంది ఇక్కట్లు కొనితెచ్చుకున్నారు. మన చుట్టూ ఉన్నవారిలో చాలా మంది చేసే సాధారణ తప్పిదం.. భవిష్యత్తులో పెరిగే ఆదాయాన్ని చూసి ఎక్కువ మొత్తంలో ముందుగానే రుణంగా తీసుకోవడం. 2బీహెచ్‌కే ఇల్లు చాలినా.. కొన్ని రూ.లక్షలు అదనంగా చెల్లిస్తే 3బీహెచ్‌కే వస్తుంటే దానివైపే మొగ్గుచూపే వారే ఎక్కువ. తక్కువ బడ్జెట్లో వస్తున్న కారుకు బదులు ఖరీదైన సెడాన్‌ను ఈఎంఐలపై కొనుగోలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. భవిష్యత్తు ఆదాయంపై అంచనాలతో తçప్పటడుగులు వేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలతో జీవన వ్యయం పెరిగిపోయి.. మళ్లీ వెనక్కి దిగిరాలేని ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నెలవారీ చేతికి అందే నికర ఆదాయం నుంచి చేసే రుణ చెల్లింపులు (ఈఎంఐలు) 50% మించకూడదన్నది తప్పనిసరిగా అనుసరించాల్సిన సూత్రం. రుణం వస్తుంది కదా అని తీసుకోవద్దు. దీనివల్ల రుణఊబిలోకి చిక్కుకుపోవచ్చు. ఫలితంగా భవిష్యత్తు లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడుల్లో రాజీ పడా ల్సి వస్తుంది. సాధారణంగా జీవన వ్యయాలు అన్నవి ఏటేటా పెరుగుతుంటాయి. దీనికి తగ్గ ట్టు ఆదాయం పెరిగితే ఫర్వాలేదు. లేదంటే ఈఎంఐలకు చేసే చెల్లింపులతో జీవన వ్యయాల్లో రాజీపడాల్సి వస్తుంది. హెల్త్ ప్లాన్ ఒక్కటీ సరిపోదు.. సాధారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలు, చిన్న ప్రమాదాల వల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే బిల్లులు భారంగా అనిపించకపోవచ్చు. కానీ, పెద్ద ప్రమాదాలు, క్లిష్టమైన అనారోగ్య సమస్యలు.. కరోనా వంటి వైరస్ల బారిన పడిన సందర్భాల్లో బిల్లు ఎంతొస్తుందన్నది ఊహించలేము. అందుకే నామమాత్రపు కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్ని విధాలా రక్షణ అనిపించుకోదు. పైగా బీమా ప్లాన్‌లో కవర్ కానివి చాలా ఉంటాయి. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో రోగుల చికిత్స కోసం వినియోగించే పీపీఈ కిట్లు, శానిటైజర్లు ఇలా ఎన్నింటికో కంపెనీలు చెల్లింపులు చేయకుండా కోతలు విధిస్తున్నాయి. కోపేమెంట్, సబ్‌లిమిట్స్ వంటి షరతులున్న ప్లాన్లు తీసుకున్న వారు బిల్లులో నిర్ణీత మొత్తాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. నగదు రహిత చికిత్సలను తిరస్కరించిన సందర్భంలో సొంత నిధుల నుంచి చెల్లింపులు చేయాల్సి రావచ్చు. అందుకే హెల్త్‌ప్లాన్‌కు అదనంగా కొంత వైద్యనిధిని కూడా ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. విల్లు రాయాలి.. సవరించాలి కుటుంబానికి ఆధారంగా ఉన్న ఎందరినో కరోనా ఉన్నట్టుండి బలితీసుకుంది. అటువంటి కుటుంబాలు చాలా వరకు నిధుల పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారు తమ పేరిట ఆస్తులకు భవిష్యత్తు హక్కుదారులను విల్లు రూపంలో చట్టబద్ధం చేయలేదు. దీంతో ఆయా ఆస్తులను వారసులు చట్టపరంగా తమ పేరిట మార్చుకుంటే కానీ విక్రయించుకోలేరు. విల్లు లేని సందర్భాల్లో వారసులమని, హక్కుదారులమని నిరూపించుకున్న తర్వాతే వాటి విక్రయానికి వీలవుతుంది. అందుకే కుటుంబానికి ఆధారమైన ప్రతీ వ్యక్తి విల్లు రాసుకుని ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, పెట్టుబడులకు నామినీగా ఒకరిని నమోదు చేయించుకోవాలి. ‘‘ఇప్పటికిప్పుడు మీకున్న ఆస్తులను ప్రస్తావిస్తూ విల్లు రాసుకోవాలి. అదనపు ఆస్తులు సమకూరిన ప్రతీ సందర్భంలోనూ విల్లును అప్డేట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల వారసులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది’’ అని టీబీఎన్‌జీ క్యాపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ సూచించారు. అలాగే, కుటుంబంలో బాధ్యతాయుతమైన ఒకరికి డాక్యుమెంట్లు, అన్ని ఆధారాలను ఎక్కడ ఉంచేదీ తెలియజేయాలని పేర్కొన్నారు. రుణాలకు రక్షణ ఉండాల్సిందే కుటుంబం కోసం అప్పులు చేసి అకాల మరణం చెందితే.. అప్పుడు కుటుంబ సభ్యులపై చెల్లింపుల భారం పడుతుంది. మీ సామర్థ్యాల పరిధిలోనే రుణాలు తీసుకోవడమే కాదు.. ఆ రుణ విలువకు సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను కూడా తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ రుణం పూర్తిగా చెల్లించకుండానే రుణగ్రహీత మరణించినట్టయితే.. బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం రుణాన్ని తీరుస్తుంది. దాంతో కుటుంబ సభ్యులపై అదనపు ఆర్థిక భారం పడదు. సాధారణంగా గృహరుణాలకు టర్మ్ కవర్ అనుసంధానంగా వస్తుంది. అదే వ్యక్తిగత రుణాల్లో ఇలా ఉండదు. కనుక వ్యక్తిగత రుణానికి సమాన మొత్తంతో బీమా ప్లాన్‌ను తీసుకోవాలి. అప్పటికే టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కదా అనుకోవద్దు. కుటుంబ జీవన అవసరాల కోసం రక్షణగా తీసుకునేదే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. వ్యక్తి మరణం తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో వచ్చేదంతా రుణ చెల్లింపులకే పోతే ఆ కుటుంబం ఎలా జీవించాలి? అందుకే ప్రతీ రుణానికి విడిగా టర్మ్ కవర్ తప్పకుండా ఉండాలి. రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్లలో.. తగ్గుతున్న రుణానికి అనుగుణంగా కవరేజీ కూడా క్షీణిస్తుంటుంది. అయితే రుణానికి అనుసంధానంగా వచ్చే టర్మ్ ప్లాన్ల ప్రీమియం సాధారణంగా ఎక్కువ ఉంటుంది. కనుక రుణం ఇచ్చే సంస్థ నుంచి కాకుండా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. విదేశీ ఈక్విటీలు.. ఈక్విటీ ఇన్వెస్టర్లలో 99 శాతానికి పైగా దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్న వారే ఉన్నారు. ఆర్థికంగా రానున్న రోజుల్లో భారత్ దిగ్గజంగా మారుతుందన్న అంచనాలతో దేశీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేమీ కాదు. అయితే, నూరు శాతం పెట్టుబడులను దేశీయంగానే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు వైవిధ్యం కోసం కొంత మొత్తాన్ని విదేశీ ఈక్విటీలకూ కేటాయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు విదేశీ మార్కెట్ల వైపు చూసేందుకు మంచి అనుకూల సమయంగా పేర్కొంటున్నారు. ప్రతీ ఒక్కరి అస్సెట్ అలోకేషన్‌లో విదేశీ ఈక్విటీలకూ చోటు ఉండాలన్నది సూచన. ఎందుకంటే భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో ఎక్కువగా అస్థిరతలు ఉంటుంటే.. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఈక్విటీలు బలంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కరోనా రెండు దశల తర్వాత అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు భారీ ప్యాకేజీల మద్దతుతో వేగంగా కోలుకుంటున్నాయి. ‘‘ప్రతికూల పరిస్థితులను వివిధ దేశాలు భిన్నంగా ఎదుర్కొంటాయన్నది కరోనా చూపించింది. భౌగోళికంగా వైవిధ్యం అన్నది (వివిధ దేశాల ఈక్విటీల్లో పెట్టుబడులు) దేశం ఆధారిత రిస్క్‌లను తట్టుకునేందుకు అవసరం. పైగా ఒక్కో దేశానికి భిన్నమైన బలాలు, అవకాశాల దృష్యా అక్కడి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. తమ పెట్టుబడుల్లో 15–20 శాతం నిధులను విదేశీ ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఇది రాత్రికి రాత్రి కాకుండా క్రమంగా నిర్ణీత కాల వ్యవధిలో చేసుకోవాలి’’ అని గ్లోబలైజ్ ఇండియా సీఈవో విరాజ్నందా సూచించారు. అయితే ఆయా అంశాల్లో నిపుణుల సలహా అవసరం. -
మీకు ‘క్రిటికల్’ కవచం ఉందా?
ఉదయ్ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాడు. వయసు 46ఏళ్లు. అప్పటి వరకు ఎటువంటి అనారోగ్యాల్లేవు. ఓ రోజు తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు నిలిచాయి. కానీ, బిల్లు రూ.11 లక్షలు అయ్యింది. కానీ, ఉదయ్‌కు రూ.5లక్షల వరకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అందులోనూ రూ.40 వేల వరకు కవరేజీ రాలేదు. దీంతో రూ.6.40 లక్షలను తన జేబు నుంచి చెల్లించుకోవాల్సి వచ్చింది. మారుతున్న వైద్య ఖర్చులకు తగ్గ రక్షణ లేకపోతే పడే ఆర్థిక భారం ఎలా ఉంటుందన్నది ఈ ఉదాహరణ చూసి తెలుసుకోవచ్చు. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పని ఒత్తిళ్లు ఇవన్నీ కలసి ఎప్పుడు ఏ అనారోగ్యం బారిన పడతామో ఊహించలేకుండా ఉంది. అందుకే తమవంతుగా రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైన ఉంది. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.. కేన్సర్, మూత్రపిండాల వ్యాధులు, కాలేయం లేదా గుండె సంబంధిత తీవ్ర వ్యాధుల బారిన పడితే ఆ బాధ ఒక్కరికే పరిమితం కాదు. ఆ కుటుంబం మొత్తంపైనా ప్రభావం ఉంటుంది. ఆర్థికంగానే కాదు, శారీరకంగా, మానసికంగా నలిగిపోవాల్సి వస్తుంది. మంచి చికిత్స కోసం ఆస్పత్రిని ఎంపిక చేసుకోవడంతోపాటు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం శక్తికి మించిన పనిగా అనిపిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడితే అప్పటి వరకూ ప్రతీ నెలా వచ్చిన ఆదాయానికి కూడా బ్రేక్ పడొచ్చు. శాశ్వత ఉద్యోగ నష్టం ఏర్పడితే ఆర్థికంగా ఆ కుటుంబం సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ప్రతీ ఒక్కరికీ ముందు జాగ్రత్త, రక్షణ చర్యలు అవసరం. తీవ్ర అనారోగ్య సమస్యలన్నవి (క్రిటికల్ ఇల్నెస్) ఏ స్థాయిలో ఉంటాయో ఊహించలేము. ఉదాహరణకు కేన్సర్ మూడోదశలో ఉన్నవారికి దీర్ఘకాలం జీవించి ఉండే అవకాశాలు తక్కువ. కేన్సర్ రెండో దశలోనే బయటపడితే ఖర్చు ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది. గుండెపోటు తీవ్ర స్థాయిలో వస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మూ త్ర పిండాల సమస్యలు వెలుగు చూస్తే దీర్ఘకాలం పాటు కొనసాగొచ్చు. గుండెజబ్బులు కూడా దీర్ఘకాలం పాటు కొనసాగేవే అధికం. అందుకే వీటి విషయంలో సన్నద్ధత అవసరమని నిపుణులు సూ చిస్తుంటారు. కొన్ని వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరం ఏర్పడతాయి. గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం తదితర క్లిష్టమైన అనారోగ్యాలను మన దేశంలో ఎక్కువగా చూస్తున్నాం. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నివేదిక ప్రకారం.. దేశంలో కేన్సర్ కేసులు 2025 నాటికి 15.7 లక్షలకు (వార్షిక రేటు) పెరుగుతాయని అంచ నా. ప్రస్తుత 13.9 లక్షలతో పోలిస్తే 12% పెరగనున్నాయి. దేశంలో ప్రతీ నాలుగు మరణాల్లో ఒక టి గుండె జబ్బుల కారణంగానే నమోదవుతోంది. మనదేశంలో 2018 నాటికి 1.29 కోట్ల జనాభా తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టు అంచనా. ఆర్థిక భారం ఎంతో.. తీవ్ర అనారోగ్య సమస్యల్లో చికిత్సా వ్యయాలు కూడా అధికంగానే ఉంటుంటాయి. ఎందుకంటే ఈ తరహా వ్యాధుల్లో దీర్ఘకాలం పాటు చికిత్సలు అవసరంపడతాయి. ‘‘కేన్సర్ అయితే ఒక్క విడత శస్త్రచికిత్స లేదా కీమోథెరపీతో సరిపోదు. దీర్ఘకాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్రైటింట్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా తెలిపారు. కేన్సర్ చికిత్సల కోసం రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని.. అత్యాధునిక చికిత్సలు తీసుకునేట్టు అయితే ఈ వ్యయం రూ.కోటి వరకు కూడా పెరిగిపోవచ్చని చెప్పారు. ‘‘గుండె జబ్బులకు చికిత్స కోసం మెట్రో ల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.1.5–15 లక్షల వరకు ఖర్చవుతుంది. స్టెంట్, బైపాస్ సర్జరీ లేదా వాల్వ్ మార్చడంపై ఈ వ్యయం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది’’అని ఎడెల్వీజ్ టోకియో లైఫ్ ముఖ్య పంపిణీ అధికారి అనూప్శేత్ పేర్కొన్నారు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం 15 శాతానికి పైగా ఉంటోంది. అంటే చికిత్సల వ్యయాలు ఏటేటా ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. టైర్–2, టైర్ 3 పట్టణాలతో పోలిస్తే టైర్–1 పట్టణాల్లో చికిత్సల వ్యయాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కనుక 35 ఏళ్లు దాటిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యల చరిత్ర ఉన్న కుటుంబాల్లోని వారికి తప్పకుండా ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రణాళిక ప్రకారం.. ఆరోగ్యం విషయంలో ఊహించని ఖర్చులను తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరికీ ప్రణాళిక అవసరం. ‘‘తీవ్ర అనారోగ్యాల విషయమై ముందు జాగ్రత్త పడే వారు 3 రకాల వ్యయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది హాస్పిటలైజేషన్. ఆస్పత్రి లో చేరాల్సి వస్తే ఎదురయ్యే ఖర్చులను బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాయంతో గట్టెక్కవచ్చు. కొన్ని వ్యాధులకు దీర్ఘకాలం పాటు ఔషధాలు, పరీక్షలు అవసరంపడతాయి. కానీ, ఇండెమ్నిటీ ప్లాన్లు అన్నవి ఒక్కసారి ఒక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి క్లెయిమ్ చేశాక.. అదే ఏడాది మళ్లీ అదే అనారోగ్యానికి సంబంధించి పరిహారం అం దించవు. కనుక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అవసరం. మూడోది ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే ఎదురయ్యే నష్టాన్ని భర్తీ చేసుకునేలా ఉండాలి’’ అని ముంబైకి చెందిన ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్డే సూచన. అందుకే భిన్న రకాల బీమా ప్లాన్లకుతోడు అత్యవసర నిధి కూడా అవసరం అని గుర్తించాలి. హెల్త్ ఇన్సూరెన్స్.. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ప్లాన్లనే ఇండెమ్నిటీ ప్లాన్లు అని కూడా అంటారు. ఇవి ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలకు పరిహారం చెల్లిస్తాయి. జీవితంలో ఏ దశలో ఉన్నారు, ఏ పట్టణంలో నివసిస్తున్నారు, అక్కడ చికిత్సల వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా బేసిక్ ఇండెమ్నిటీ కవరేజీని నిర్ణయించుకోవాలి. ఢిల్లీ, ముంబై వంటి టైర్–1 పట్టణాల్లో అయితే రూ.20–25 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘ఈ కవరేజీ కూడా నూరు శాతం రక్షణనివ్వదు. ఎందుకంటే కొన్ని చికిత్సల ఖర్చులు భారీగా ఉన్నాయి. ఉదాహరణకు లివర్ మార్పిడి చికిత్సకు రూ.40–50లక్షలు అవుతుంది’’ అని ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్మాల్డే వివరించారు. టైర్–2, 3 పట్టణాల్లో ఉంటే కనీసం రూ.10 లక్షలు, అదే చిన్న పట్టణాల్లోని వారు కనీసం రూ.5లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవడం అవసరం. అధిక కవరేజీతో ప్లాన్ తీసుకోవాలంటే అందుకు ప్రీమియం కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు తక్కువ మొత్తంతో బేసిక్ ప్లాన్ తీసుకుని, అధిక కవరేజీనిచ్చే టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రూ.5 లక్షల ప్లాన్ తీసుకుని, రూ. 15 లక్షల టాపప్ జోడించ వచ్చు. లేకుండా వస్తుంటాయి. కొన్ని కంపెనీలు స్వల్ప ప్రీమియం ను కూడా వసూ లు చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఇండెమ్నిటీ ప్లాన్‌కు పూర్తి భిన్నమైనది. బీమా ప్లాన్ జాబితాలోని తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే అప్పుడు ఏకమొత్తంలో పరిహారాన్ని చెల్లించేదే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్. బేసిక్ హెల్త్ ప్లాన్‌లో కవర్ కాని ఖర్చులను ఈ ప్లాన్ ఆదుకుంటుంది. ఉద్యోగం ఆగిపోవడం లేదా కోల్పోవడం వల్ల ఆదాయ నష్టాన్ని ఈ రూపంలో కాస్తంత అయినా భర్తీ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి తన వార్షిక స్థూల ఆదాయానికి 5–10 రెట్ల వరకు కవరేజీతో క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకోవడం సూచనీయం. అయితే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌లో ఒక నిబంధన విషయమై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా క్రిటికల్ ఇల్నెస్ వెలుగు చూసిన తర్వాత సదరు రోగి కనీసం ఇన్ని రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం చెల్లిస్తామనే నిబంధన ఉంటుంది. సాధారణంగా 30 రోజుల కాలాన్ని బీమా సంస్థలు అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు స్ట్రోక్ వచ్చి చనిపోతే పరిహారం రాదు. స్ట్రోక్ వచ్చి 30 రోజులు ప్రాణాలతో ఉంటేనే ఈ ప్లాన్‌లో పరిహారం లభిస్తుంది. వాస్తవానికి తీవ్ర అనారోగ్యంతో జీవించి ఉన్న వారికే భారీగా ఖర్చు ఎదురవుతుందన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 30 క్రిటికల్ ఇల్నెస్ల వరకూ కవరేజీనిచ్చే ప్లాన్లు మార్కెట్లో ఉన్నాయి. కేన్సర్ లేదా గుండె జబ్బుల వంటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నవారు ఆయా వ్యాధులకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లను ఎంచుకోవాలి. ప్రతీ క్రిటికల్ ఇల్నెస్లోనూ విడిగా ఏఏ సమస్యలకు కవరేజీ ఉంటుందన్న వివరాలు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్లో వివరంగా ఉంటుంది. ఎక్కువ రిస్క్‌లు ఉండే గుండె జబ్బులు, కేన్సర్, స్ట్రోక్, కోమా, మూత్రపిండాల వైఫల్యం తదితర వాటికి కవరేజీ తప్పకుండా ఉండేలా ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. పరిశీలన తర్వాతే..: నియమ, నిబంధనలను కచ్చితంగా చదివిన తర్వాతే క్రిటికల్ఇల్నెస్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) మార్గదర్శకాలను చూస్తే.. కొన్ని రకాల తీవ్ర అనారోగ్య సమస్యలకే పూర్తి కవరేజీ లభిస్తుంది. కొన్నింటి విషయంలో చివరి దశలోనే పరిహారానికి అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు, లివర్ సమస్యల్లో అయితే క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ అన్నది కేవలం పనిచేయని, పూర్వపు స్థితికి తీసుకురాలేట్టయితేనే కవరేజీ లభిస్తుంది. అదే కేన్సర్, స్ట్రోక్, గుండెపోటు అయితే ఏ దశలో ఉన్నప్పటికీ క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో కవరేజీ లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు రైడర్ రూపంలో వచ్చే క్రిటికల్ ఇన్లెస్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటికంటే కూడా విడిగా ప్లాన్‌ను తీసుకోవడం వల్ల సమగ్రమైన కవరేజీతో వస్తాయి. వీటిల్లో పరిమితులు కూడా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కేన్సర్ మూడో దశలోనే పరిహారం చెల్లిస్తామన్న నిబంధన ఉంటే, స్టేజ్–2 బయటపడినప్పటికీ పరిహారం రాదు. అందుకే వైద్యం కోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ‘‘కనీసం రూ.3–5 లక్ష లు అయినా ఉండాలి. మెట్రోల్లో ఉండే వారికి రూ.8–10 లక్షలు అత్యవసర నిధిగా ఉంచుకోవడం అవసరం’’ అని మాల్డే సూచించారు. తీవ్ర వ్యాధులకు చికిత్సా వ్యయాలు కేన్సర్ ► శస్త్రచికిత్సకు రూ.3–6 లక్షలు ► కీమోథెరపీ ఒక్కో సెషన్‌కు రూ.50,000–2లక్షలు. సుమారు రూ.5–10 లక్షల వరకు ఖర్చు ► రేడియోథెరపీ రూ.2–20లక్షలు గుండె జబ్బులు ► యాంజియోగ్రఫీ రూ.20,000 ► యాంజియోప్లాస్టీ రూ.2.5–6.5లక్షలు ► వాల్వ్ సర్జరీ రూ.2.5–6లక్షలు ► బైపాస్ సర్జరీ రూ.2–5లక్షలు మూత్రపిండాల వైఫల్యం ► డయాలసిస్ రూ.2,000–5,000 ప్రతీ సెషన్‌కు (వారానికి మూడు పర్యాయాలు) ► మూత్రపిండాల మార్పిడి రూ.5–10లక్షలు ► బ్రెయిన్‌స్ట్రోక్ రూ.5–10 లక్షలు నోట్: ప్రాంతాలను బట్టి ఈ వ్యయాల్లో మార్పులు ఉంటుంటాయి. హెల్త్ ప్లాన్ ప్రీమియం ప్లాన్ కవరేజీ ప్రీమియం (రూ.లలో) (రూ.లలో) బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ 10 లక్షలు 8,265 క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ 30 లక్షలు 4,551 నోట్: 30 ఏళ్ల ఢిల్లీ నివాసికి సంబంధించిన అంచనాలు -
సంక్షోభాలను తట్టుకునేదెలా?
సంపాదించామా.. ఖర్చు చేశామా.. చాలా మంది ధోరణి ఇదే. ఆర్థిక సూత్రాలకు ఇది పూర్తి విరుద్ధం. ఆర్థిక భద్రతనూ ప్రశ్నార్థకంగా మారుస్తుంది ఇది. 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. సంక్షోభ సమయాల్లో ఆర్థిక సన్నద్ధత అవసరాన్ని మరోసారి అందరికీ తెలియజేసింది. ఆ సమయంలో ఏర్పడిన ఇబ్బందులు, ఎదురైన సవాళ్లను పరిశీలిస్తే ఎన్నో ఆర్థిక అంశాలు, పాఠాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అత్యవసర నిధి ఎంతో అవసరమని ఇది తెలియజేసింది. అంతేకాదు, ప్రభుత్వపరమైన లేదా కనీసం వ్యక్తిగతమైన ఆరోగ్య బీమా రక్షణ అయినా ఉండి తీరాల్సిన అవసరాన్ని అర్థమయ్యేలా చేసింది. గతేడాది సంక్షోభం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు... రిస్క్ నిర్వహణ కరోనా నామ సంవత్సరం తెలియజేసిన మరో పాఠం రిస్క్ నిర్వహణ. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఇది కూడా ఒక అంశం. ‘‘నా కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేయించేందుకు సరిపడా బీమా కవరేజీ ఉందా?.. నేను అకాల మరణం చెందితే నాపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు ఉన్నాయా?’’ అని ప్రతీ ఒక్కరు ప్రశ్నించుకోవాలి. సామాన్య, మధ్యతరగతి వాసులు అందరూ ఈ తరహా రిస్క్‌లను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికాయుతంగా అనుసరించాలని కరోనా తెలియజేసింది. ఎందుకంటే హెల్త్ కవరేజీ లేని వారు చికిత్స కోసం ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితిని చూశాము. ఎటువంటి లైఫ్ కవరేజీ లేకుండా కరోనాతో మరణించిన వారి కుటుంబాల కష్టాలు చూశాము. బీమా రక్షణ ఏర్పాటు చేసుకుని ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు. అయితే రిస్క్ అంటే ఇదే కాదు.. పెట్టుబడుల నిర్వహణలోనూ రిస్క్ ఉంటుంది. గుడ్లన్నింటినీ తీసుకువెళ్లి ఒకే బాక్స్‌లో పెట్టడం ఎలా మంచిది కాదో.. పెట్టుబడులు అన్నింటినీ ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయడం కూడా సరికాదు. తమ సామర్థ్యం, అవసరాలకు తగిన రిస్క్ నిర్వహణ ప్రణాళిక అవసరం. సంక్షోభం ఏదైనా కానీ, తమ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్న విధంగా అస్సెట్ అలొకేషన్‌ను కొనసాగించాలి. ఆర్థిక క్రమశిక్షణ అవసరం ఆర్థిక క్రమశిక్షణ ఏంటో కూడా కరోనా మహమ్మారి తెలియజేసింది. ప్రయాణాలు, బయట ఆహార పదార్థాలపై ఆంక్షలు అమలయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు రెండు నెలలకుపైగా తెరుచుకోలేదు. సినిమా థియేటర్ల తలుపులు తెరుచుకునేందుకు ఆరు నెలలకు పైనే సమయం పట్టింది. దీంతో వీటి రూపేణా తాము ఎంత ఖర్చు చేస్తున్నామన్న ఆలోచన కలిగింది. పొదుపులను పెంచుకుని, ఖర్చులను తగ్గించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలనూ నేర్పింది. దీనివల్ల అనూహ్యంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకునే నమ్మకాన్ని, మనో ధైర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నిజానికి ఆర్థిక క్రమశిక్షణ పాటించే వారు, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్న వారు కరోనా సంక్షోభంలో ధైర్యంగానే ఉన్నారు. ముఖ్యంగా ఆదాయాన్ని ఏ రూపంలో ఎలా ఖర్చు చేయాలన్న విషయమై మరింత అవగాహనకు కరోనా దారి చూపిందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ అనుభవ పాఠాన్ని ఆచరణలో పెట్టినప్పుడే ఫలితం ఒనగూరుతుంది. బాండ్లకూ ఉంది సత్తా.. ఈక్విటీల ర్యాలీ చూసి, బాండ్ల రాబడుల పట్ల నిర్లిప్తత తగదని 2020 ఉదంతం తెలియజేస్తోంది. కరోనా సవాళ్లతో ఈక్విటీల పతనం మొదలైంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లు మంచి ర్యాలీ చేశాయి. దీనివల్ల బాండ్లలో లాభాల స్వీకరణతో స్టాక్స్‌ను తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసుకోవడం ద్వారా రెండు విధాల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మొత్తం ఈక్విటీల్లోనే కాకుండా.. కొంత మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది. విల్లు ప్రాధాన్యం.. ప్రతీ కుటుంబ పెద్దకు విల్లు అవసరం. అకాల మరణానికి గురైతే.. ఆస్తుల పంపకాన్ని విల్లు ఎంతో సులభతరం చేస్తుంది. నామినేషన్ అన్నది సంబంధిత ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసే అర్హతనిస్తుంది. కానీ, విల్లు హక్కునిస్తుంది. బీమా ప్లాన్‌కు ఒకరిని నామినీగా ఏర్పాటు చేసి.. బీమా ప్లాన్ క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చిన సందర్భంలో దాన్ని ఎవరికి ఏ మేరకు పంపకం చేయాలన్నది విల్లులో పేర్కొంటే.. చట్ట ప్రకారం అదే నెరవేరుతుంది. రిటైర్మెంట్ ప్రాధాన్యం.. కోట్ల మంది భారతీయుల రిటైర్మెంట్పై కరోనా మహమ్మారి ప్రభావం పడింది. కరోనా కారణంగా గతంలో వేసుకున్న ప్రణాళికతో పోలిస్తే రిటైర్మెంట్ నిధి ఏర్పాటుకు తాము ఎక్కువ కాలమే కష్టపడాల్సి వస్తుందని ఇంత మంది భావిస్తున్నట్టు ఓ సర్వే రూపంలో తెలిసింది. కారణం.. కరోనా మాదిరి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వీరు తగిన సన్నద్ధులుగా లేకపోవడం వల్ల.. రిటైర్మెంట్ సేవింగ్‌ను సగటున మూడేళ్లపాటు పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘విలువ’ తెలిసొచ్చింది కాలం విలువను కూడా కరోనా తెలియజేసింది. కుటుంబ సభ్యులతో ఎంత సమయం వెచ్చించాలి, అందులోని ప్రయోజనాలు, కుటుంబ అవసరాల కోసం ఏ మేరకు కష్టపడాలి, ముఖ్యమైనవి ఏవి? అనవసరాలు ఏవి ఈ విషయాలన్నీ చాలా మందికి అవగాహనలోకి వచ్చాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం.. ఆర్థిక విజయంలో మొదటి సూత్రం. మూడు బకెట్ల విధానం ప్రతీ ఇన్వెస్టర్‌కు కరోనా వంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తగిన పెట్టుబడుల ప్రణాళిక, విధానం అవసరమని కరోనాతో అర్థమయ్యింది. అందుకే ప్రతీ ఇన్వెస్టర్‌కు మూడు బకెట్ల విధానం అవసరం. ఇందులో మొదటి బకెట్ అన్నది ఏడాది, రెండేళ్ల కాల అవసరాల కోసం ఉద్దేశించినది. లిక్విడ్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఉంచుకోవాలి. మధ్యకాలిక బకెట్‌ను రెండు నుంచి ఐదేళ్ల కాలంలో ఎదురయ్యే అవసరాల కోసం పక్కన పెట్టుకోవాలి. ఈ నిధిని మీడియం టర్మ్ ఫండ్స్, బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక అవసరాల కోసం మూడో బకెట్‌ను కేటాయించుకోవాలి. ఈ నిధిని ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. ఇటువంటి విధానంతో ఏ కాలంలో ఎదురయ్యే అవసరాలను అయినా సులభంగా అధిగమించొచ్చు. సంక్షోభాలే సంపదకు దారులు.. అందరూ భయపడుతున్న వేళే పెట్టుబడులకు అనుకూల సమయం అన్నది మరోసారి 2020 రుజువు చేసింది. గతేడాది మార్చిలో ఈక్విటీ మార్కెట్లు ఇన్వెస్టర్ల ఆందోళనతో కూడిన అమ్మకాలతో కుప్పకూలాయి. నిఫ్టీ 7,500 మార్క్ వరకు పడిపోయింది. కానీ, ఏప్రిల్ నుంచి మళ్లీ రికవరీ మొదలుపెట్టి దాదాపు తొమ్మిది నెలల్లో రెట్టింపయింది. అందరూ భయపడుతున్న సమయంలో ధైర్యం చేసి కొన్న కొద్ది మంది పెట్టుబడి రెట్టింపు, రెండింతలు అయ్యింది. మార్కెట్లు పడిపోతున్న సమయంలో అప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు.. వాటిని విక్రయించకుండా, ధైర్యంగా నిలబడిన వారి మొహాల్లోనూ ఇప్పుడు లాభాల కాంతులు కనిపిస్తాయి. చారిత్రకంగా చూస్తే మార్కెట్లు 30 శాతానికి మించి పడిపోయిన ప్రతీసారీ పెట్టుబడులపై మంచి లాభాల వర్షం కురిపించాయి. రీబ్యాలన్స్ అవసరం ఇక అస్సెట్ అలోకేషన్‌లో భాగంగా రీబ్యాలన్స్ కూడా ముఖ్యం. గతేడాది మార్చిలో స్టాక్స్ పెట్టుబడుల విలువ పడిపోయి, డెట్ పోర్ట్‌ఫోలియో, బంగారం విలువ పెరిగి ఉంటుంది. ఒకవేళ ఈక్విటీలకు 50% అని నిర్ణయించుకుని ఉంటే, మార్కెట్లు పడిపోవడం కారణంగా ఈక్విటీల విలువ 30 శాతానికి తగ్గి ఉంటుంది. దాంతో ఇతర బకెట్ల నుంచి ఈక్విటీలకు మరో 20 శాతాన్ని భర్తీ చేసుకోవాలి. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చు. ఇందుకోసం వైద్య బీమా తీసుకోవడంతోపాటు ఇతరత్రా చర్యలు కూడా అవసరమేనని సూచించే కథనమే ఇది. ఆరోగ్య అత్యవసర నిధి 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు పాలసీలు అన్నింటిలోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఒక్కసారి నిధిని సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేసుకోవడం ద్వారా ప్రీమియం భారం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం పాటు కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానివేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన కవరేజీ.. వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికమవుతుంది. ‘‘మెట్రో నగరంలోనా లేక చిన్న పట్టణంలో నివసిస్తున్నారా?, మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. వీటి ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. కఠిన నిబంధనలు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు పాలసీల్లో రెండు రకాల వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఒకటి. పాలసీ తీసుకున్న అనంతరం రెండు నుంచి నాలుగేళ్లు గడిచిన తర్వాతే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్న అనంతరం రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాలి. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు పాలసీల్లో ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం చేస్తాయి. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే ఆ మొత్తాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. ఈ పరిమితులతో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ► 18 శాతం తల్లిదండ్రులకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ► 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతులు మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ► 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. కొన్ని పాలసీలను చూస్తే... బీమా కంపెనీ ప్లాన్ పేరు వార్షిక ప్రీమియం రెలిగేర్ హెల్త్ కేర్ సీనియర్ రూ.39,374 స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్ రెడ్‌కార్పెట్ రూ.43,135 ఆదిత్యబిర్లాహెల్త్ యాక్టివ్కేర్స్టాండర్డ్ రూ.55,598 అపోలోమ్యునిక్హెల్త్ ఆప్టిమారీస్టోర్ రూ.61,312 హెడీఎఫ్సీ ఎర్గో హెల్త్సురక్షా గోల్డ్స్మార్ట్ రూ.65,785 నోట్: మెట్రోలో నివసించే 63 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల ఆయన జీవిత భాగస్వామికి రూ.10 లక్షల కవరేజీ కోసం ప్రీమియం వివరాలు ఇవి.. కో పేమెంట్ ఎంత..? పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కో పేమెంట్ ఆప్షన్ ఉంటోంది. అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30% మధ్య ఉండొచ్చు. -
కరోనా కోసం 2 బిలియన్ డాలర్ల నిధి
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి 2 బిలియన్ డాలర్ల అత్యవసర నిధిని ప్రకటించింది. ‘ఊహించని ముప్పును ప్రపంచం ఎదుర్కొంటోంది. కోట్లాది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తోంది. ఇది ప్రపంచ మానవాళి అంతటికీ ఎదురైన సమస్య. కాబట్టి మానవాళి అంతా కలసి దీంతో పోరాడాలి. దీని కోసం మేము రెండు బిలియన్ డాలర్ల ప్రపంచ మానవత్వ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలోని పేద దేశాలకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే, ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే పెనుముప్పుగా మారుతుంది. అన్ని దేశాలకు మేము చెప్పేది ఒక్కటే. ఈ హెచ్చరికను ఆలకించండి’ యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. -
అత్యవసర నిధి ఏర్పాటు చేద్దాం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై యుద్ధానికి సార్క్ దేశాలు నడుం బిగించాయి. కరోనాను కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు సార్క్ దేశాల నేతలు ఆదివారం వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనాపై పోరుకు ‘కోవిడ్–19 ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రధాని మోదీ ప్రతిపాదనకు సభ్య దేశాల నేతలు ఏకీభావం తెలిపారు. భారత్ తరఫున ఈ ఫండ్ కోసం కోటి డాలర్లను(రూ.73.95 కోట్లు) మోదీ విరాళంగా ప్రకటించారు. ‘మనం ముందు కోవిడ్–19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నా. మొదట, భారత్ తరఫున కోటి డాలర్లను ఆ ఫండ్ కోసం ప్రకటిస్తున్నా. ఇతర సభ్య దేశాలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించాలి’ అని మోదీ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. వైద్య నిపుణులతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇతర వైద్య పరికరాలను, నిర్ధారణ పరీక్షలు జరిపే కిట్స్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. అవసరమైతే, సార్క్ సభ్య దేశాలకు కూడా వాటిని సమకూర్చగలమన్నారు. వైరస్ వ్యాప్తిని సమీక్షించేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందించామన్నారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను కూడా సార్క్ దేశాలకు ఇస్తామన్నారు. ‘మన దేశాల్లో మొత్తంగా 150 కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. అయినా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని హెచ్చరించారు. వేరువేరుగా కాకుండా, ఒక్కటిగా కరోనా వైరస్‌పై పోరు సాగించాలని సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. భయాందోళనలకు గురికాకుండా, వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలని సూచించారు. వీడియో కాన్ఫెరెన్స్‌లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్, బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, పాక్ ప్రధానికి ఆరోగ్య రంగంలో ప్రత్యేక సలహాదారు జాఫర్ మీర్జా పాల్గొన్నారు. కరోనా నిర్మూలన లక్ష్యంతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలోనూ పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. కశ్మీర్లో నిర్బంధాలను తొలగించాలని కోరింది. వైరస్‌ను అరికట్టడంలో చైనా గొప్పగా వ్యవహరించిందని పాక్ ప్రశంసించింది. వైరస్‌పై పోరును సమన్వయం చేసేందుకు సార్క్ దేశాలు ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాజపక్స సూచించారు. ప్రధాని మోదీ సూచనలను, వైరస్ కట్టడికి భారత్ చేపట్టిన చర్యలను సభ్య దేశాల నేతలు ప్రశంసించారు. -
వృద్ధి బాటలో చిన్న మందగమనమే!
ముంబై: భారత్ ప్రస్తుత మందగమన పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తక్కువ చేసి చూపించింది. భారీ వృద్ధికి ముందు చిన్న మందగమన పరిస్థితులను భారత్ ఎదుర్కొంటోందని పేర్కొంది. దీనిని సైక్లికల్ ఎఫెక్ట్ (ఎగువ దిగువ)గా పేర్కొంది. వినియోగం, ప్రైవేటు పెట్టుబడుల పునరుద్ధరణ కేంద్రం, విధాన నిర్ణేతల అధిక ప్రాధాన్యత కావాల్సిన అవసరం ఉందని వివరించింది. 2018–19 (జూలై–జూన్) వార్షిక నివేదికను ఆర్బీఐ గురువారం ఆవిష్కరించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది ఏమిటి అన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే సమస్యలు వ్యవస్థాపరమైనవి కావు. భూ, కార్మిక, వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్ రంగాల్లో మాత్రం సంస్కరణలు అవసరం. ► భారీ వృద్ధికి ముందు చిన్న కుదుపా లేక అప్ అండ్ డౌన్స్‌లో భాగమా? లేక వ్యవస్థాగత మందగమనమా? అన్నది ప్రస్తుతం ప్రశ్న. అయితే భారీ వృద్ధికి ముందు మందగమనం, సైక్లింగ్ ఎఫెక్ట్ అని మాత్రమే దీనిని చెప్పవచ్చు. తీవ్ర వ్యవస్థాగత అంశంగా దీనిని పేర్కొనలేము. ► వరుసగా నాలుగు ద్వైమాసికాలాల్లో ఆర్బీఐ 1.10 శాతం రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.40 శాతం) లక్ష్యం వృద్ధి మందగమన నిరోధమే. 2019–20లో వృద్ధి 6.9 శాతంగా భావించడం జరుగుతోంది. ► బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలను పటిష్టం చేయాలి. మౌలిక రంగ వ్యయాలకు భారీ మద్దతు నివ్వాల్సిన అవసరం ఉంది. కార్మిక చట్టాలు, పన్నులు, ఇతర న్యాయ సంస్కరణల అంశాల్లో వ్యవస్థాగత సంస్కరణల అమలు అవసరం. ► దేశీయ డిమాండ్ పరిస్థితులు ఊహించినదానికన్నా బలహీనంగా ఉన్నాయి. దీని పునరుద్ధరణకు వ్యవస్థలో తగిన చర్యలు తీసుకోవాలి. ► వ్యాపార పరిస్థితులు మెరుగుపరచాలి. ► రైతుల రుణ మాఫీ, ఏడవ వేతన కమిషన్ నివేదిక అమలు, వివిధ ఆదాయ మద్దతు పథకాలు ఆర్థిక క్రమశిక్షణా పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఆయా పరిస్థితులతో ఆర్థిక ఉద్దీపన అవకాశాలకూ విఘాతం. ► ఆర్థిక వ్యవస్థలో సానుకూలతలూ ఉన్నాయి. తగిన వర్షపాతంతో అదుపులో ఉండే ధరలు, ద్రవ్యలోటు కట్టుతప్పకుండా చూసే పరిస్థితులు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి వంటివి ప్రధానం. ► బ్యాంకింగ్‌లో వేగంగా విలీనాల ప్రక్రియ. ► ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వైఫల్యం నేపథ్యంలో– వాణిజ్య రంగానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) రుణం 20 శాతం పడిపోయింది. 2017–18లో రుణ పరిమాణం రూ.11.60 లక్షల కోట్లు ఉంటే, 2018–19లో ఈ మొత్తం రూ.9.34 లక్షల కోట్లు. ► అమెరికా–చైనాల మధ్య వాణిజ్య సంబంధ అంశాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది అంతర్జాతీయ మందగమన పరిస్థితులకు దారితీసి, ఫైనాన్షియల్ మార్కెట్లపై సైతం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ► బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గాయి. 2017–18లో మొత్తం రుణాల్లో మొండిబాకాయిలు 11.2 శాతం ఉంటే, ఇది 2018–19లో 9.1 శాతానికి తగ్గాయి. మొండిబకాయిల సమస్య తగ్గడంలో దివాలా చట్టం కూడా కీలకం. ► బ్యాంక్ మోసాల విలువ 2018–19లో రూ.71,543 కోట్లకు చేరాయి. 2017–18 నుంచి చూస్తే ఈ విలువ 73.8 శాతం (రూ.41,167.04 కోట్లు) పెరిగింది. ఇక కేసులు, 15% పెరుగుదలతో 5,916 నుంచి 6,801కి చేరాయి. ► ప్రైవైటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల చీఫ్‌ల వేతనాల విషయంలో సవరించిన నిబంధనలు త్వరలోనే విడుదల. ► యువతకు ఆర్బీఐ పట్ల అవగాహన పెంచేం దుకు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలను విస్తృతంగా ఉపయోగించుకోవడం. రూ.1.96 లక్షల కోట్లకు ఆర్బీఐ అత్యవసర నిధి కేంద్రానికి మిగులు నిధులు రూ.52,000 కోట్ల బదలాయింపుల నేపథ్యంలో ఆర్బీఐ వద్ద అత్యవసర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గుతోంది. ఆర్బీఐ 2018–19 వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. 2019 జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఆర్బీఐ గురువారం ఆవిష్కరించింది. మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను సోమవారంనాడు ఆర్బీఐ బోర్డ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. బ్యాలెన్స్ షీట్లో ఆర్బీఐ క్యాపిటల్ రిజర్వ్స్ బఫర్స్ పరిమాణం 5.5 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. ఎటువంటి ఆర్థిక సవాళ్లనైనా ఎదుర్కొనగల అత్యున్నత స్థాయి కలిగిన సెంట్రల్ బ్యాంకుల్లో ఆర్బీఐ ఒకటని 2018–19 వార్షిక నివేదిక పేర్కొంది. 2018 జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వద్ద అత్యవసర నిధి పరిమాణం రూ. 2,32,108 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రానికి అందివచ్చిన 52,000 కోట్లు ఆర్బీఐకి సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరం లెక్కలో వేస్తే, ప్రభుత్వానికి వచ్చే సరికి ఈ నిధులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి అందినట్లు అవుతుంది. -
మ్యూచువల్ ఫండ్‌పై రుణం కావాలా?
పర్సనల్ లోన్కన్నా తక్కువ వడ్డీకే లభ్యం దాదాపు అన్ని బ్యాంకులూ, ఎన్బీఎఫ్సీలలో లభ్యం ఎంపిక చేసిన మ్యూచువల్ ఫండ్లకు మాత్రమే వర్తింపు ఫండ్ యూనిట్లు తనఖాలో ఉన్నా... డివిడెండ్లు మీకే అత్యవసర నిధి అందరికీ అవసరమే. ఇది జీతానికి ఎన్ని రెట్లు ఉండాలనే విషయమై నిపుణులు రకరకాలుగా చెబుతుంటారు. మరి ఇలా బ్యాంకులో అత్యవసర నిధి కోసం కొంత మొత్తం దాచుకోవాల్సిందేనా? నిజానికి అప్పటికప్పుడు రుణాన్నిచ్చే పెట్టుబడి సాధనాల్ని కూడా అత్యవసర నిధిగానే భావించవచ్చు. అలాంటి వాటిలో మ్యూచ్‌వల్ ఫండ్లు కూడా ఒకటి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్) ద్వారా పెట్టుబడి పెడుతున్నా... లేక ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేసినా చాలు. అత్యవసరంగా డ బ్బులు కావాల్సి వచ్చినపుడు వీటిని అమ్మేయాల్సిన పనిలేదు. తనఖా పెట్టి కూడా ఏ బ్యాంకు నుంచో, ఎన్బీఎఫ్సీ నుంచో తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు. అదెలాగో చెప్పేదే ఈ కథనం... మీరు గనక మ్యూచు వల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నట్లయితే ఆ పత్రాల్ని త నఖా పెట్టుకుని రుణమో, లేకపోతే ఓవర్డ్రాఫ్టో కావాలని మీ దగ్గర్లోని బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీని అడగొచ్చు. ఇలా రుణమివ్వటానికి ముందు బ్యాంకులు ఆ యూని ట్లను తాత్కాలికంగా తమ పేరిట ‘లీన్’లో ఉంచుకుంటాయి. లీన్ అంటే... ఒకరకంగా యాజమాన్య హక్కుల్ని సదరు బ్యాంకుల పేరిట బదలాయించటమే. మీరు రుణం తీర్చలేని సందర్భంలో వాటిని విక్రయించే హక్కు వాటికుంటుందన్న మాట. సదరు ఫండ్ యూనిట్ల విలువను బట్టి మీకు ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తాయి. ఆ రుణాన్ని తిరిగి చెల్లించేశాక ‘లీన్’ను ఎత్తివేసి, యాజమాన్య హక్కుల్ని మీ పేరిట బదలాయిస్తాయి. అయితే లీన్ కోసం మీకు మ్యూచ్‌వల్ ఫండ్లు జారీ చేసిన ఫండ్ హౌస్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. బ్యాంకు పేరిట సదరు యూనిట్లను లీన్ ఇవ్వాల్సిందిగా అడగాలి. ఈ మేరకు యూనిట్ల హక్కుదారు సంతకం చేసిన లేఖను ఫండ్‌హౌస్‌కు సమర్పించాలి. రుణంగా ఎంతిస్తారు? మీ దగ్గరున్న యూనిట్లను, వాటి విలువను బట్టే కాక... ఏ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తనఖా పెడుతున్నారన్న దానిపై కూడా రుణం విలువ ఆధారపడి ఉంటుంది. సహజంగా అప్పటికి ఉన్న విలువలో 50 శాతాన్ని రుణంగా పొందే అవకాశముంటుంది. కొన్ని బ్యాంకులైతే కనిష్ఠం- గరిష్ఠం ఎంతిస్తామనేది ఒక పరిమితి విధించుకుంటాయి. వాటిని బట్టి రుణం ఇస్తుంటాయి. చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు షేర్లపై రుణాలిస్తుంటాయి. ఆ పరిధిలోనే మ్యూచువల్ ఫండ్లపై కూడా రుణాలిస్తాయి. వడ్డీ సాధారణంగా పర్సనల్ లోన్ రేటు కంటే తక్కువే ఉంటుంది. అయితే సదరు ఫండ్లలోని రిస్కును బట్టి బ్యాంకులు ఈ వడ్డీని నిర్ణయిస్తుంటాయి. రుణం తీసుకోవటానికి ముందు... అన్ని ఫండ్ యూనిట్లపైనా రుణం రాదు. బ్యాంకులు ఎంపిక చేసిన జాబితాలోని ఫండ్ యూనిట్లపై మాత్రమే రుణమిస్తూ ఉంటాయి.అనుమతించిన ఈక్విటీ, డెట్ ఫండ్ యూనిట్ల రెండింటిపైనా రుణమిస్తారు.బ్యాంకులైతే అన్నీ ఈ రుణాలివ్వవచ్చు. ఎన్‌బీఎఫ్‌సీల దగ్గరకు వచ్చేసరికి 100 కోట్ల పైబడి ఆస్తులున్నవి మాత్రమే ఈ రుణాలివ్వవచ్చని ఆర్బీఐ చెబుతోంది.రుణం తీరేదాకా ఈ యూనిట్లను విక్రయించజాలరు. కానీ వీటిపై వచ్చే డివిడెండ్ నేరుగా మీకే అందుతుంది. రుణం తిరిగి చెల్లించటంలో విఫలమైతే... లీన్‌ను ఉపయోగించుకుని వాటిని విక్రయించి డబ్బులివ్వాల్సిందిగా ఫండ్ హౌస్‌ను బ్యాంకులు కోరుతాయి. నిజానికి మ్యూచువల్ ఫండ్లపై రుణాలు తీసుకోవచ్చని చాలామందికి తెలియదు. దీంతో ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటం లేదని, దీనివల్ల కాస్త తక్కువ వడ్డీకే రుణాలొస్తాయని బ్యాంకులు చెబుతున్నాయి. -
రూ.100కోట్ల అత్యవసర నిధి
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్ల సదస్సు తొలిరోజున శుక్రవారం రాష్ర్ట ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పనులకు, తక్షణావసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లా కలెక్టరు వద్ద రూ. 10 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మొత్తం రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక విభాగం వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. సదస్సులో సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆసరా పెన్షన్లు అర్హులందరికీ అందిస్తూ, అనర్హులను తొలగించాలి. బోగస్ కార్డులను తీసేయాలి. పట్టణాలకు తరలించిన గ్రామీణ బ్యాంకులను మళ్లీ గ్రామాల్లోనే నెలకొల్పాలి. పట్టణ, గ్రామీణ అంశాల సమగ్ర సమీక్షకు నెలలో ఒక రోజు అర్బన్ డే, మరోరోజు రూరల్ డే పాటించాలి. పట్టణాల్లోని ప్రభుత్వ భూములను ప్రజావసరాలకే వాడాలి. ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో ప్రత్యేక తహశీల్దార్‌ను నియమించాలి. పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంటు ఇవ్వాలి. ప్రతి ఇంటిలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనకు స్వస్తి పలకాలి. కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలి. వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.12 వేలు, సామూహిక మరుగుదొడ్లకు రూ.65 వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. రాష్ర్టంలో ప్రస్తుతం 41.6 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, కూరగాయల మార్కెట్లు, మాంసాహార, చేపల మార్కెట్లు నిర్మించాలి. రైతు బజార్లు, పార్కులను ఏర్పాటు చేయాలి. పట్టణాల్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వం తరఫున తడి, పొడి చెత్తను సేకరించడానికి డస్ట్ బిన్స్‌ను కొనివ్వాలి. ఇళ్ల నుంచే చెత్తను సేకరించాలి. కామన్ డంప్ యార్డ్సు సంఖ్యను పెంచాలి. మురికి కాల్వల నిర్వహణ, వీధిలైట్ల నిర్వహణ సరిగా ఉండాలి. ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాల్లో వేర్వేరు చోట్ల డంప్ యార్డును ఏర్పాటు చేయాలి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను వెంటనే పంపాలి. 33% పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాలి. హరితహారం వారోత్సవాన్ని జూలై రెండో వారం లో ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహించాలి. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టాలి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతోపాటు రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలి. వాటి కోసం బోర్లు వేయాలి. హరిత హారానికి ఎమ్మెల్యేలు రూ.10 లక్షల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధిని కేటాయించాలి. హైదరాబాద్‌ను 400 జోన్లుగా విభజించి మొక్కలు నాటాలి. గవర్నర్, సీఎంతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కో జోన్లో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షిస్తారు. జిల్లాల్లోనూ అదే పద్ధతి పాటించాలి. అటవీ శాఖ భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలి. గుడుంబా, కల్తీ కల్లు నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. గుడుంబా వాడకానికి దారి తీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేయాలి. అరికట్టే చర్యలకు రెవెన్యూ, ఎక్సైజ్ విభాగాలు ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపించాలి. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు టాయిలెట్లు నిర్మించాలి. మహిళలను వేధిస్తున్న ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అంగన్వాడీ కేంద్రాలు గ్రామం మధ్యలో ఉంచాలి. ప్రభుత్వం వంట పాత్రలు కొనివ్వాలి. హైదరాబాద్‌లో పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. నూతన పారిశ్రామిక విధానం రూపొం దించాలి. జిల్లాల్లో పరిశ్రమలకు అనువుగా ఉన్న భూములను గుర్తించి.. ప్రభుత్వానికి వెంటనే వివరాలు పంపాలి. సదస్సు సైడ్ లైట్స్ గుడుంబాపై గంటసేపు చర్చ కలెక్టర్ల సదస్సులో గుడుంబాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. నిజామాబాద్ ఎస్పీ మాట్లాడుతూ, గుడుంబాతోనే కాకుండా కల్తీ కల్లుతో ప్రాణాలు పోతున్నాయన్నారు. ‘‘ఇటీవల కొందరు కల్తీకల్లు బానిసలను స్టేషన్లకు తీసుకొస్తే సాయంత్రం ఐదవగానే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. వాళ్లను నియంత్రించేందుకు మేమే కల్లు తెప్పించి పోయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుడుంబా తయారీదారులపై దాడులు చేస్తుంటే, తమ బతుకుదెరువు మాటేమిటంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. తమ జిల్లాలో కల్తీ కల్లుతో చాలామంది చనిపోతున్నారని మంత్రి పోచారం కూడా చెప్పారు. దాంతో, గుడుంబా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వమే చౌక ధరకు మద్యం విక్రయించాలా అంటూ దాదాపు గంట సేపు గుడుంబాపైనే చర్చ జరిగింది. ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు కలెక్టర్ల సదస్సులో తెలుగు మాటలు సరదా పుట్టిం చాయి. సదస్సు ప్రారంభంలో పలువురు కార్యదర్శులు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని అంతా తెలుగులోనే మాట్లాడాలన్నారు. దాంతో వచ్చీ రాని తెలుగులో మాట్లాడేందుకు పలువురు ఉన్నతాధికారులు నానా తంటాలు పడ్డారు. దాంతో సదస్సులో పలుమార్లు నవ్వులు విరిశాయి. మరోసారి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి మీనా ‘ప్లీజ్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు..’ అని ఇతర అధికారులనుద్దేశించి అన్నారు. మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని, తెలుగులో మాట్లాడమని కూడా ఇంగ్లిష్‌లోనే చెప్పాలా అనడంతో అంతా నవ్వుకున్నారు. -
అదనపు ఆదాయం .. ఇలా ఉపయోగిద్దాం..!
కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే బోనస్‌లో, జీతాల పెంపు రూపంలోనో లేదా మరో రూపంలో వచ్చే అదనపు ఆదాయాన్ని సద్వినియోగపర్చుకోవచ్చు. పొదుపు మొత్తాన్ని పెంచండి: జీతంలో ఇంత మొత్తం అని కాకుండా ఇంత శాతాన్ని పొదుపు చేయాలని నిర్దేశించుకుంటే దానికి తగ్గట్లుగా ఖర్చులను నియంత్రించుకోవచ్చు. భవిష్యత్ కోసం జాగ్రత్తపడొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్: అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు డబ్బుల కోసం తడుముకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇప్పటిదాకా ఇలాంటి ఏర్పాటు చేసుకోకపోతే.. కొత్తగా చేతికొచ్చే అదనపు ఆదాయాన్ని ఇందుకోసం ఉపయోగించండి. మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య, మీ వయస్సు, ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇందులో ఉంచడం మంచిది. అప్పులుంటే తీర్చేయండి: అప్పుల భారం మోయగలిగే స్థాయిని మించి ఉంటే.. ఆర్థిక పరిస్థితులు తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది. పెపైచ్చు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంటే భారం మరింత పెరిగిపోతుంది. కాబట్టి.. ముందుగా అప్పులను క్లియర్ చేసేందుకు ప్రయత్నించాలి. తద్వారా వడ్డీ భారం తగ్గుతుంది. మిగిలిన దానిని ప్రయోజనకరమైన పెట్టుబడులకు మళ్లించవచ్చు. ఇన్వెస్ట్మెంట్: స్టాక్‌మార్కెట్లు, వాటి అనుబంధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు పరిజ్ఞానం లేనివారికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. నెలకు రూ. 500 కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయచ్చు. -
ఆర్థిక ఆరోగ్యానికి నవ సూత్రాలు
ఆర్థిక పరిస్థితులు బాగుండాలన్నా, ఆర్థికంగా పురోగమించాలన్నా ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. ప్రణాళిక రూపొందించుకోవడమే కాదు..దాన్ని పాటించడమూ ముఖ్యమే. ఆర్థిక ప్రణాళికకు సంబంధించి కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి: ఖర్చులెప్పుడూ ఆదాయానికన్నా తక్కువగానే ఉండాలన్నది ఒక బండగుర్తు. అయితే, ఇది చెప్పడం ఎంత సులువో .. ఆచరించడం అంత కష్టం. అయినా సరే అందుబాటులో ఉన్న పొదుపు మార్గాలను ప్రయత్నించి చూడాలి. ఆదాయాన్ని పెంచుకోవడం కష్టం కానీ.. కాస్త ప్రయత్నిస్తే ఖర్చులు తగ్గించుకోవడం సులువే. మరో విషయం.. ఉద్యోగంలో జీతానికి సంబంధించి కూడా మీ నైపుణ్యాలను సమీక్షించుకుని, ఉద్యోగ బాధ్యతలను బట్టి సదరు ఉద్యోగానికి ఎంత జీతం అందుకోవాలన్నది లెక్క వేసుకోవాలి. ఏడాదికి కనీసం వెయ్యి రూపాయలు తగ్గినా.. మీరు తక్కువ జీతానికి పనిచేస్తున్నట్లే. బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలి: దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలియకపోతే.. పొదుపు లక్ష్యాలను సాధించలేం కదా. అందుకే, ఖర్చులపై నియంత్రణ సాధించేందుకు బడ్జెట్ అంటూ ఉండాలి. ఆదాయంలో నుంచి ముందుగా కొంత మొత్తం పొదుపునకు కేటాయించండి. మిగిలిన దాంట్లో తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులు, నిత్యావసరాల ఖర్చులు వంటివి చూసుకోవాలి. అప్పటికీ ఇంకా మిగిలితే అప్పుడు మిగతా లగ్జరీలవైపు చూడొచ్చు. చిన్న మొత్తమైనా అసలు పొదుపు చేయడం అన్నది ముఖ్యం. ఎంత త్వరగా ప్రారంభిస్తే.. అంత సంపద సమకూరుతుంది. క్రెడిట్ కార్డు వాడకం తగ్గాలి: ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే ప్రధాన అడ్డంకులు క్రెడిట్ కార్డులపై చేసే వ్యయాలు, పేరుకుపోయే రుణాలు. సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డు వినియోగాన్ని తగ్గించడం వల్ల నెల నెలా నగదుపరమైన ఖర్చులు కాస్త పెరిగినట్లు అనిపించినా అంతిమంగా మాత్రం ఎంతో కొంత చేతిలో మిగులుతుంది. పొదుపు వృథా కావొద్దు: మీ ఆదాయాన్ని అత్యంత తక్కువ వడ్డీనిచ్చే సేవింగ్స్ అకౌంట్లలో వృథాగా మురిగిపోనివ్వొద్దు. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ రేట్లను మించి ధరలు పెరిగిపోతుంటాయి. పెపైచ్చు ఈ రకంగా వచ్చే వడ్డీలపై పన్ను పోటు ఉంటుంది. పెట్టుబడుల్లో జాప్యం వద్దు: సాధారణంగా ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనం మెచ్యూర్ అయిన తర్వాత వచ్చిన మొత్తాన్ని మరోదాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మధ్యలో బోలెడంత జాప్యం జరుగుతుంటుంది. దీని వల్ల సదరు మొత్తంపై రావాల్సిన రాబడులను కోల్పోతుంటాం. అత్యవసర నిధి ఉండాలి: ఏ ఆర్థిక అవసరం ఎప్పుడు ముంచుకొస్తుందో ఊహించలేము. కనుక మొత్తం డబ్బంతా ఏదో ఒకదాంట్లో ఇన్వెస్ట్ చేసేయడమో లేదా ఖర్చు చేసేయడమో చేయకుండా.. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా కనీసం 3 నుంచి ఆరు నెలల అవసరాలకు తగిన ంత డబ్బు ఈ ఫండ్‌లో ఉండేలా చూసుకోవాలి. బీమా తప్పనిసరి: కుటుంబ పెద్దగా తమకేదైనా అనుకోనిది జరిగితే.. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతనూ విస్మరించకూడదు. ఇందుకోసం ఎప్పటికప్పుడు తగినంత బీమా కవరేజీ ఉందా లేదా అన్నది సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలి. వీలునామా: కూడబెట్టినది ఎంతైనా సరే.. తమపై ఆధారపడి ఉన్న వారు ఎవరైనా ఉంటే వారికోసం కచ్చితంగా వీలునామా రిజిస్టరు చేయించి ఉంచాలి. అలాగే, ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటే.. వారసులకు తగిన న్యాయం చేసినట్లవుతుంది. ప్రతి దానికీ రికార్డు ఉండాలి.. జమా, ఖర్చులేవైనా సరే ప్రతి దానికీ కచ్చితంగా రికార్డు పాటించాలి. అప్పుడే పన్ను పరమైన డిడక్షన్స్ తీసుకోవడానికి సాధ్యపడుతుంది. -
అనుకోని ఆదాయంతో అత్యవసర నిధి...
అనుకోకుండా బోనస్‌ల రూపంలోనో, గిఫ్టుల్లాగానో లేదా వారసత్వంగా ఆస్తిపాస్తులో వచ్చి పడితే? ఊహించుకోవడానికి బాగానే ఉన్నా, నిజంగానే వచ్చి పడితే ఆ డబ్బును ఏ విధంగా ఉపయోగిస్తాం అన్నది ముఖ్యం. సాధారణంగానైతే ఊహించని విధంగా వచ్చింది కాబట్టి అదనపు ఆదాయం కింద లెక్కేసుకుని అడ్డదిడ్డంగా అనవసరమైన వాటన్నింటిపైనా ఖర్చు చేసేస్తుంటాం. అలా కాకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ డబ్బును సద్వినియోగం చేసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి.. ఎమర్జెన్సీ ఫండ్‌కు కొంత మొత్తం అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం అటూ, ఇటూ పరుగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఫండ్ అంటూ ఉండటం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే .. కొత్తగా చేతికొచ్చిన అదనపు సొమ్మును ఇందుకోసం ఉపయోగించవచ్చు. ఈ నిధి పరిమాణం ఎంత ఉండొచ్చనేది మీ వయసు, ఆర్థిక పరిస్థితులు, మీ కుటుంబసభ్యుల సంఖ్య తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీపై ఆధారపడిన వారెవరూ లేకుండా.. మీరు సింగిల్ అయిన పక్షంలో కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఈ అత్యవసర నిధిలో ఉంచుకోవాలి. అదే, కుటుంబం.. ఇతర బాధ్యతలు ఉన్న పక్షంలో ఇది 6 నెలలకు పెరుగుతుంది. ఇక రిటైర్మెం ట్కి దగ్గరవుతున్నా లేదా రిటైరయిపోయినా.. కనీసం రెండేళ్లకు సరిపడా ఖర్చులైనా ఫండ్‌లో ఉండాలి. అప్పులు తీర్చేయొచ్చు పరిమితికి మించి అప్పుల భారం ఎక్కువగా ఉండటం ఆర్థిక పరిస్థితికి ఎప్పుడూ ముప్పే. అది కూడా వ్యక్తిగత రుణాలపై ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంటే మరింత కష్టం. కనుక, అనుకోకుండా వచ్చిన డబ్బుతో సాధ్యమైనంత మేర అప్పులను తీర్చేసి, భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అత్యవసర నిధి, కొంతైనా అప్పులు తీర్చివేయడం.. ఇవన్నీ చూసుకున్నాక ఇంకా కాస్త మిగిలిన పక్షంలో పెట్టుబడులవైపు చూడొచ్చు. స్టాక్‌మార్కెట్లు, షేర్లు వంటి వాటిల్లో ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయకపోయినట్లయితే ఇకపైనైనా కొద్దో గొప్పో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఎందుకంటే ఓర్పుగా ఉండగలిగితే దీర్ఘకాలికంగా షేర్లు మంచి రాబడులే ఇస్తుంటాయి. అయితే, స్టాక్‌మార్కెట్ పరిజ్ఞానం లేకుండా నేరుగా షేర్లలో పెట్టడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మంచి రాబడులు అందిస్తున్న ఫండ్స్‌ని చూసి కావాలంటే నెలవారీగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) అంటూ ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి కూడా. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత రిస్కు తీసుకోగలరు అన్నదాన్ని బట్టి అత్యంత తక్కువగా రూ. 500- రూ.1,000 నుంచి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది.