మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడం కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. తమ దగ్గర ఉన్న కొంత సొమ్ముతో పాటు గృహ రుణం కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. గృహ రుణం అనేది ఒక అతిపెద్ద రుణం. గృహ రుణం తీసుకొనే ముందు ఒకసారి భవిష్యత్ గురుంచి ఆలోచించాలి. ఎందుకంటే, ఈ రుణం తీసుకున్న తర్వాత ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే కష్టాల్లోకి కూరుకొని పోవాల్సి వస్తుంది. అందుకే, గృహ రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ దరఖాస్తుదారులు గృహ రుణం కోసం అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి.
డౌన్ పేమెంట్: గృహ రుణం అనేది ఆ ఇంటి ఆస్తి విలువలో 60 శాతం కంటే ఎక్కువ మించకూడదు. వాస్తవానికి దరఖాస్తుదారులకు 70-80 శాతం ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. కానీ, గృహ కొనుగోలుదారాలు 60 శాతం లోపు రుణం తీసుకుంటే మంచిది. మిగతా 40 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా గృహ రుణం రావడంతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే, భవిష్యత్‌లో ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే, తట్టుకునే సామర్ధ్యం మన దగ్గర ఉంటుంది.
క్రెడిట్ స్కోరు: ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయాలి అనుకున్నప్పుడు, మొదటగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు చెక్ చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి(ఉదా:750 పైన) సాధారణంగా రుణ ఆమోదానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు తక్కువ వడ్డీకె రుణాలను ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. ఇల్లు కొనడానికి ముందు మన క్రెడిట్ స్కోరు మెరుగు పరుచుకోవడం మంచిది.
(చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..)
ఈఎమ్ఐ: రుణగ్రహీత నెలవారీ ఆదాయంలో కొత్త గృహ రుణం కోసం తీసుకునే ఈఎమ్ఐ 50-60 శాతం లోపు గల దరఖాస్తుదారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒకవేల మీకు ఇతర రుణాలు ఉంటే అవి పూర్తిగా చెల్లించిన తర్వాత లేదా కొంత మేరకు(50 శాతం వరకు) చెల్లించి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. అలాగే, మీకు ఇతర ఖర్చులు గనుక ఉంటే సుదీర్ఘ రుణ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు.
అత్యవసర నిధి: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఒక ఆర్ధిక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, భవిష్యత్‌లో ఎలాంటి ఊహించని కరోనా మహమ్మారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైనా కావచ్చు. అందుకే, ఈ నిదిలో ఎల్లపుడూ 6-12 నెలల ఈఎమ్ఐలకు సరిసమానమైన నగదు ఉంటే మంచిది. మీరు గనుక ఒక ఈఎమ్ఐను చెల్లించకపోయిన అది మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ అత్యవసర నిధి వల్ల అటువంటి తీవ్రమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment