Down Payment
-
Q & A: ఇల్లు కొందామనుకుంటున్నా.. డౌన్‌పేమెంట్ కోసం ఈక్విటీ ఫండ్స్ కరెక్టేనా?
నేను వచ్చే 15 ఏళ్లలో రూ.2.5–3 కోట్ల వరకు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. డౌన్‌పేమెంట్ సమకూర్చుకునేందుకు... టాటా స్మాల్‌క్యాప్ లేదంటే ఎడెల్వీజ్ స్మాల్‌క్యాప్, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అన్నవి మంచి ఎంపికలేనా? – ఆదిత్య బి మీరు ఇప్పటి నుంచి 10–15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికతో ఉంటే సరైన ట్రాక్‌లో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత వ్యవధి ఉంది. ఈక్విటీ ఫండ్స్‌లో మోస్తరు రాబడులకు ఇంతకాలం అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో మీ ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి కొనుగోలుకు అయ్యే ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అంచనా వేస్తునట్టు అయితే, దీనికి రియల్ ఎస్టేట్‌లో ఉండే సగటు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని జోడించాల్సి ఉంటుంది. అప్పుడు వాస్తవ కొనుగోలు ధరపై అంచనాకు రావాలి. దీనివల్ల డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు నెలవారీగా ఎంత మేర సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై స్ప ష్టత సాధించొచ్చు. సిప్ మొత్తాన్ని రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పథకాలను కూడా జోడించుకోవచ్చు. కాకపోతే వీటిల్లో 25–30 శాతానికి మించి కేటాయింపులు చేసుకోవద్దు. మీ రిస్క్ సామర్థ్యం, ఈక్విటీ ఫండ్స్ పట్ల మీకు ఉన్న గత అనుభవం ఆధారంగా కేటాయింపులపై నిర్ణయానికి రావాలి. గృహ రుణానికి చెల్లించే ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. ఇందుకు గాను కావల్సినంత డౌన్ పేమెంట్‌ను ముందే సమకూర్చుకోవాలి. మరోవైపు ఇంటిని పెట్టుబడిగా చూడడం మంచి ఆలోచన కాదు. రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ చాలా తక్కువ. ఇంటిని కొనుగోలు చేయడం, విక్రయించడం అంత సులభం కాదు. కనుక ఇంటి కొనుగోలు నివాసం కోణం నుంచే చూడాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
జోరుగా సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!
కర్నూలు(సెంట్రల్): అవసరాలకు అనుగుణంగా ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గతేడాది సెకండ్ హ్యాండ్ షోరూముల్లో దాదాపు 5 వేల కార్లు, 10 వేల బైక్‌ల వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ఏ కంపెనీ బైక్ తీసుకున్నా దాదాపు రూ.లక్షకు అటు ఇటుగా ధరలు ఉన్నాయి. ఈఎంఐల రూపంలో తీసుకుంటే వడ్డీ, ఇతర చార్జీలు కలుపుకొని రెండేళ్ల వ్యవధిలో రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సగం ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌లు లభిస్తుండడంతో చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకొని బతికేవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెకండ్స్లో రూ.50 వేల నుంచి రూ. 70 వేల మధ్య రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. విలాసవంతమైన జీవితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయి. ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్ని వర్గాల ప్రజల జీవన గమనంలో వృద్ధి కనిపిస్తోంది. ఇదే క్రమంలో సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో మంచి పంటలు పండుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటికి గిట్టుబాటు ధరలు ఇస్తుండడంతో రైతన్నల ఇంటా ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు విలాసవంతమైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అందులో అవసరాలకు తగ్గట్లుగా కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వెలుస్తున్న షోరూంలు.. సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండడంతో వ్యాపారులు అందుకు తగ్గట్లుగా షోరూంలను తెరుస్తున్నారు. కర్నూలులో 15 కారు, 20 బైక్ షోరూంలు ఉన్నాయి. ఆదోనిలో 5 కారు, 10 బైక్, నంద్యాలలో 5 కారు, 13 బైక్ షోరూంలు వెలిశాయి. వీటిని ఆయా పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆదరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సెకండ్ హ్యాండ్ షోరూముల్లో గతేడాది 5 వేల వరకు కార్లు, 10 వేల వరకు బైక్‌లు అమ్మకాలు జరిగాయి. ఈఎంఐ సదుపాయం సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌లకు కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తక్కువ వడ్డీ, తక్కువ డౌన్పేమెంట్స్తో ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వసతి కూడా ఉంది. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొనుగోలు చేసే వాహనాన్ని మొదట మెకానిక్కు చూపించి, దాని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రేటును నిర్ణయించుకోవాలి. తక్కువ దూరం తిరిగినవి మేలైన మన్నిక ఇస్తాయి. షోరూంలకు చిన్నపాటి మరమ్మతులకు గురైనవి అధికంగా వస్తుంటాయి. కొందరు అచ్చుబాటుకాక, మరికొందరు తక్షణ రుణావసరాల కోసం అమ్మి ఉంటారు. రికార్డులను పరిశీలించి, కొనుగోలు చేయడం ఉత్తమం. కార్లపై పెరిగిన ఆసక్తి... మార్కెట్లో పలు కంపెనీల కార్లు వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంది. సెకండ్స్లో రూ.లక్ష నుంచి సరసమైన ధరకు కార్లు లభిస్తున్నాయి. నాలుగైదు లక్షలు వెచ్చిస్తే మంచి కంపెనీ..రెండు, మూడేళ్ల సర్వీసు ఉన్న కార్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో సామాన్యులు సైతం కార్ల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సెకండ్స్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారిలో ఉద్యోగులు, రైతులు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఎక్కువగా ఉంటున్నారు. కార్లు ఎక్కువగా కొంటున్నారు కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో మా షోరూం ఉంది. ఇటీవల కాలంలో ప్రజలు ఎక్కువగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. మా దగ్గర అన్ని రికార్డులు సక్రమంగా ఉంటాయి. కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఏమీ ఇబ్బందులు ఉండవు. నెలలో కనీసం 10 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. – శ్రీనివాసులు సౌకర్యవంతంగా ఉంది మేం ఇటీవల సెకండ్ హ్యాండ్లో కారును కొనుగోలు చేశాం. దాని స్థితిగతి చాలా బాగుంది. మేము కొనుగోలు చేసిన వాహనం కొత్తదైతే రూ.10 లక్షల విలువ ఉంటుంది. సెకండ్స్లో దానిని రూ.4 లక్షలకే కొనుగోలు చేశాం. మా కుటుంబ అవసరాలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. – రజనీకాంత్‌రెడ్డి, కర్నూలు సగం ధరకే కొనుగోలు చేశా నేను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. స్కూలుకు సమయానికి వెళ్లేందుకు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించాను. అయితే మార్కెట్లో ఫస్టు హ్యాండ్ వాహనాలకు రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనిపించింది. సెకండ్స్లో చూస్తే మేము అనుకున్న ధరకే లభించింది. దాదాపు సగం ధరకే కారును కొనుగోలు చేశా. – శ్రీనివాసరెడ్డి, కర్నూలు -
గృహ రుణం కోసం అప్లై చేసే ముందు.. ఇవీ తప్పక తెలుసుకోండి!
మన దేశంలో ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. వారి కలల గృహం త్వరగా కట్టుకోవడం కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. తమ దగ్గర ఉన్న కొంత సొమ్ముతో పాటు గృహ రుణం కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు. గృహ రుణం అనేది ఒక అతిపెద్ద రుణం. గృహ రుణం తీసుకొనే ముందు ఒకసారి భవిష్యత్ గురుంచి ఆలోచించాలి. ఎందుకంటే, ఈ రుణం తీసుకున్న తర్వాత ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే కష్టాల్లోకి కూరుకొని పోవాల్సి వస్తుంది. అందుకే, గృహ రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ దరఖాస్తుదారులు గృహ రుణం కోసం అప్లై చేసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తు పెట్టుకోండి. డౌన్ పేమెంట్: గృహ రుణం అనేది ఆ ఇంటి ఆస్తి విలువలో 60 శాతం కంటే ఎక్కువ మించకూడదు. వాస్తవానికి దరఖాస్తుదారులకు 70-80 శాతం ఆర్థిక సహాయం చేయడానికి బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. కానీ, గృహ కొనుగోలుదారాలు 60 శాతం లోపు రుణం తీసుకుంటే మంచిది. మిగతా 40 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో చెల్లించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా గృహ రుణం రావడంతో పాటు వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే, భవిష్యత్‌లో ఏదైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే, తట్టుకునే సామర్ధ్యం మన దగ్గర ఉంటుంది. క్రెడిట్ స్కోరు: ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయాలి అనుకున్నప్పుడు, మొదటగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు చెక్ చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి(ఉదా:750 పైన) సాధారణంగా రుణ ఆమోదానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువ ఉన్న వ్యక్తులకు బ్యాంకులు తక్కువ వడ్డీకె రుణాలను ఇచ్చిన సందర్భాలు ఎక్కువ. ఇల్లు కొనడానికి ముందు మన క్రెడిట్ స్కోరు మెరుగు పరుచుకోవడం మంచిది. (చదవండి: ఎలన్ మస్క్‌పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..) ఈఎమ్ఐ: రుణగ్రహీత నెలవారీ ఆదాయంలో కొత్త గృహ రుణం కోసం తీసుకునే ఈఎమ్ఐ 50-60 శాతం లోపు గల దరఖాస్తుదారులకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఒకవేల మీకు ఇతర రుణాలు ఉంటే అవి పూర్తిగా చెల్లించిన తర్వాత లేదా కొంత మేరకు(50 శాతం వరకు) చెల్లించి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. అలాగే, మీకు ఇతర ఖర్చులు గనుక ఉంటే సుదీర్ఘ రుణ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. అత్యవసర నిధి: గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఒక ఆర్ధిక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, భవిష్యత్‌లో ఎలాంటి ఊహించని కరోనా మహమ్మారి ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురైనా కావచ్చు. అందుకే, ఈ నిదిలో ఎల్లపుడూ 6-12 నెలల ఈఎమ్ఐలకు సరిసమానమైన నగదు ఉంటే మంచిది. మీరు గనుక ఒక ఈఎమ్ఐను చెల్లించకపోయిన అది మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ అత్యవసర నిధి వల్ల అటువంటి తీవ్రమైన పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది. (చదవండి: ఆహా ఏమి అదృష్టం!.. లక్షకు రూ.55 లక్షలు లాభం) -
హోమ్ లోన్ అప్లై చేసే ముందు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి (స్పాన్సర్డ్)
ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు. అది దీర్ఘకాలిక ఆర్థిక కమిట్మెంట్ కాబట్టి హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఏళ్లలో వారి ఆదాయంలో పెద్ద మొత్తం దానికే పోతుంది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు ఇవి: 1. వడ్డీ చెల్లింపులు హోమ్ లోన్ తక్కువ వడ్డీరేట్లు పొందేందుకు ఆర్థిక సంస్థలను కంపేర్ చేయడం ముఖ్యం. అంతేకాదు రెండు రకాల వడ్డీరేట్లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం: ● ఫ్లోటింగ్ ● ఫిక్స్డ్ ఫ్లోటింగ్ రేట్లు అనేవి ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు, మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఎప్పుడు మారవు అన్నమాట. భవిష్యత్ లో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫార్సు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ రేట్లతో పోల్చితే ఫ్లోటింగ్ రేట్లు 1శాతం నుంచి 2 శాతం వరకు తక్కువుంటాయి. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు ఆర్థికవ్యవస్థలో కనిపించినప్పుడు ఫిక్స్డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. ఈఎంఐ మొత్తాలు చెల్లించేందుకు దరఖాస్తులు సౌకర్యవంతంగా ఉంటారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్ల మధ్య ఎంపిక చేసుకోవాలి. 2. వ్యవధి హౌసింగ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది, అంటే 360 వాయిదాలు. ఈఎంఐ భారం తక్కువుంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. అయితే వడ్డీ చెల్లింపును తగ్గించుకునేందుకు స్వల్పవ్యవధి అనువైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ చెల్లింపును స్వల్పకాలానికే లెక్కిస్తారు. ఉదాహరణకు, 15 సంవత్సరాల వ్యవధికి రూ.80 లక్షల హౌసింగ్ లోన్ ను 8.25 శాతం వార్షిక రేటు లెక్కన తీసుకుంటే ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే, చెల్లించే మొత్తం వడ్డీ రూ.59,70,000గా ఉంటుంది. ఒకవేళ ఈ రుణవ్యవధిని 20 ఏళ్లకు పెంచినట్టు అయితే, ఇన్స్టాల్మెంట్ మొత్తం రూ.68,165కు తగ్గుతుంది. కాని చెల్లించే వడ్డీ మొత్తం రూ.83.59,760 అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు హోమ్ లోన్ కాలిక్యూలేటర్ ఉపయోగించాలి. ఇన్స్టాల్మెంట్ మొత్తం తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయస్సు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 3. డౌన్ పేమెంట్ రుణమిచ్చే సంస్థలు ఆస్తివిలువలో కొంతమొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి, మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తిధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది75 శాతం నుంచి 90శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. రుణంగా ఎంత మొత్తం తీసుకోవాలి, బిల్డర్ లేదా అమ్మకందారుకు తన దగ్గరనున్న సొమ్ములోఎంత చెల్లించాలనే విషయాన్ని కొనుగోలుదారులు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. గణనీయస్థాయిలోడౌన్ పేమెంట్ చెల్లించేందుకు ముందుకు వస్తే హోమ్ లోన్(Home Loan) అర్హత అవకాశాలు మెరగువుతాయి. కాబట్టి, కుదిరిన పక్షంలో ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ గా చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన రీపేమెంట్ భారం కూడా తగ్గుతుంది. అర్హత విషయానికి వస్తే తమకు ముందుస్తు ఆమోదిత ఆఫర్ తో కూడిన హోమ్ లోన్ అందుబాటులోఉందా అన్నది పరిశీలించుకోవాలి. ఇలా చేయడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఇలాంటి ఆఫర్లు అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పై ఉంటాయి, ఉదాహరణకు ఆస్తిపై లోన్. ముందస్తు ఆమోదిత ఆఫర్ గురించి తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు తమపేరు, ఫోన్ నెంబర్ అందించాల్సిఉంటుంది. 4. అనుబంధఛార్జీలు హోమ్ లోన్ పై కేవలం వడ్డీ మాత్రమే ఉండదు. దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే దీనిని రుణదాతతో చర్చించడం మంచిది. ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటువిషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం మంచిది. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. 5. క్రెడిట్ స్కోర్ హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవ డానికి ముందు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ పెంపొందించుకోవడం మంచిది. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడమన్నది చాలాపెద్ద నిర్ణయం, అది రానున్న సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలాముఖ్యం. పైన పేర్కొన్న విషయాలన్నీ మీరు అర్థంచేసుకున్నారు కాబట్టి, హోమ్ లోన్ సంబంధించి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ముఖ్యం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తున్నహోమ్ లోన్ ఎంచుకోవడమన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక సౌకర్యవంతమైన ఆప్షన్. మీ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు మీరు రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు సౌకర్యవంతంగా 30 ఏళ్లవ్యవధిలోపు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. (అడ్వర్టోరియల్) -
సొంతింటికి దారి ఇదీ..!
ఇంటి కొనుగోలును ఆకర్షణీయం చేసే పలు నిర్ణయాలను మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ప్రకటించింది. అందుబాటు గృహాలపై బిల్డర్లకు పన్ను రాయితీలను 2019–20 వరకు పొడిగించింది. అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లపైనా పన్ను మినహాయింపు రెండేళ్లకు పొడిగించారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను మినహాయింపునిచ్చారు. దీనికి పైన మరో రెండు లక్షల ఆదాయం ఉన్న వారు రుణంపై ఇంటిని తీసుకుని వడ్డీ రూ.2 లక్షలు చెల్లించడం ద్వారా మొత్తం ఆదాయంపై పన్ను లేకుండా ప్రయోజనం పొందొచ్చు. త్వరలో ఇళ్లపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వచ్చేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక బడ్జెట్‌కు ముందే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడ్డీ సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఇవన్నీ కలసి మధ్యతరగతి జీవులు సొంతింటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన కొన్ని అంశాలున్నాయి. అవేంటో చూడండి మరి... ఇల్లు కొనుగోలు అన్నది ఆర్థికంగా ఓ పెద్ద నిర్ణయం. ఈ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంటారు. సొంతిల్లును సమకూర్చుకోవడాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నిజానికి ఇది ఆర్థిక కట్టుబాటు కూడా. అందుకే ఇంటి కొనుగోలుకు సిద్ధమైన వారు ముందుగా చూడాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. రుణంతో మొదటి సారి ఇంటిని కొనాలనుకునే వారు.. డౌన్ పేమెంట్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నెలవారీ సమాన వాయిదాల (ఈఎంఐ)ను సక్రమంగా చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకోవాలి. వీటికి తోడు మరెన్నో అంశాలు ఇంటి కొనుగోలు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలి. డౌన్ పేమెంట్... ఇంటి రుణానికి డౌన్ పేమెంట్ తప్పనిసరి. ఓ ఇంటి కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని రుణం తీసుకోదలిచిన వ్యక్తి తన వంతుగా రెడీ చేసుకోవాల్సినదే డౌన్ పేమెంట్. రుణాలిచ్చే సంస్థలు సాధారణంగా ఇల్లు కొనుగోలు వ్యయంలో 20 శాతం డౌన్‌పేమెంట్ కింద అడుగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేసే వారు కనీసం తమ వంతుగా రూ.10 లక్షలను డౌన్‌పేమెంట్‌గా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రూ.40 లక్షలను బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఇంటి కొనుగోలు విలువ... డౌన్‌పేమెంట్ ఎంతన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ మొత్తం లేకపోతే ఇంటి రుణం సాధ్యం కానట్టే. అత్యవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాల్సిందే జీవితంలో అత్యవసరాలు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. వాటిని తప్పించుకోలేం. అటువంటి పరిస్థితులను అధిగమించేందుకు ముందే తగిన విధంగా సన్నద్ధం కావాలి. సొంతింటి కోసం అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ కోసం వినియోగిస్తే... వేతనంలో మిగిలేదంతా ఈఎంఐగా పోతుంటే... అత్యవసరం ఎదురైతే ఏంటి పరిస్థితి? ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? అందుకే అత్యవసర నిధిని పక్కన పెట్టి మిగిలిన మొత్తానే డౌన్‌పేమెంట్‌గా వాడుకోవడం వివేకం. కనీసం ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్నే అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. అలాగే, ఇంటి రుణం తీసుకునే వారు, అత్యవసర నిధికి అదనంగా మూడు నెలల ఈఎంఐ మొత్తాన్ని కూడా విడిగా రెడీగా ఉంచుకోవాలి. ముఖ్య లక్ష్యాల కోసం పెట్టుబడులు... డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకుని, అత్యవసర నిధిని పక్కన పెట్టి, నెలవారీ ఈఎంఐ చెల్లించడంతోనే అన్ని బాధ్యతలు తీరినట్టు కాదు. జీవితంలో కీలకమైన లక్ష్యాలు వేరేవీ ఉన్నాయి. పిల్లల ఉన్నత విద్య ఇందులో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. పిల్లల ఉన్నత విద్య వంటి కీలక లక్ష్యాలకు అవసరమైనంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండాలి. దీనికి తోడు స్వల్పకాల లక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. వీటికి పెట్టుబడులు పోను వేతనంలో ఎంత మిగులుతుంది, ఎంత ఈఎంఐగా చెల్లించగలరన్నది నిర్ణయించుకోవాలి. చాలా మంది సొంతింటిని సమకూర్చుకునే విషయంలో కీలకమైన పెట్టుబడులు, అత్యవసరాలను విస్మరిస్తుంటారు. ఈఎంఐ మొత్తాన్ని నిర్ణయించుకోవడంలోనూ అన్ని అంశాలను చూడరు. అందుకే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. ఈఎంఐ ఎంత మేర...? డౌన్ పేమెంట్ అవసరమైనంత ఉన్న వారు చూడాల్సిన తదుపరి అంశం ఈఎంఐ. రుణం తీసుకుంటే నెలవారీగా ఈఎంఐ మొత్తాన్ని చెల్లించగల సామర్థ్యం ఉందా? అనేది చూడాలి. కట్టగలమన్న నమ్మకం వేరు, సామర్థ్యం వేరు. ఉదాహరణకు మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ మొత్తం 30–40 శాతాన్ని మించరాదనేది పాటించాల్సిన సూత్రం. ఇక ఈఎంఐ ఎంతన్నది రుణం ఎంత తీసుకుంటున్నారనే అంశంతోపాటు, ఎంత కాలానికి తీసుకుంటున్నారనేదీ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు నెలవారీ ఆదాయం రూ.75,000 ఉందనుకుంటే... 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఎంత కాలానికి, ఎంత రుణం తీసుకుంటే ఈఎంఐ ఎంత ఉంటుందంటే... ఆదాయంలో ఈఎంఐ 20% ► రూ.18 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను బ్యాంకులు రూ.14.4 లక్షల రుణం ఇస్తాయి. 15 ఏళ్ల కాలానికి తీసుకుంటే 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ రూ15,000 అవుతుంది. అంటే రూ.75,000 నెలసరి ఆదాయంలో 20 శాతాన్ని ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. ► రూ.20 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.16 లక్షల రుణం ఇస్తాయి కనుక 20 ఏళ్ల కాలాన్ని నిర్ణయించుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ రూ.15,000 అవుతుంది. రుణం పెరిగినప్పటికీ కాల వ్యవధి ఐదేళ్లు పెంచుకున్నారు గనుక ఈఎంఐ మొదటి ఉదాహరణలో మాదిరే ఉంటుంది. ► ఇక రూ.21.5 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.17.2 లక్షల రుణాన్ని ఇస్తాయి. దీనిపైనా రూ.15,000 ఈఎంఐ ఉండాలనుకుంటే ఇంటి రుణ కాల వ్యవధిని 25 ఏళ్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఆదాయంలో ఈఎంఐ 30% ► రూ.26.8 లక్షల ఇంటికి డౌన్ పేమెంట్ పోను రూ.21.5 లక్షలు రుణంగా లభిస్తుంది. 15 ఏళ్ల టర్మ్ పెట్టుకుంటే ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.30.3 లక్షల ఇంటికి 24.2 లక్షలు రుణంగా తీసుకుంటే టర్మ్‌ను 20 ఏళ్లుగా నిర్ణయించుకున్నా కూడా ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.32.3 లక్షల ఇంటికి రూ.25.8 లక్షలు రుణంగా లభిస్తుంది. 25 ఏళ్ల టర్మ్‌ను నిర్ణయించుకుంటే ఈఎంఐ 22,500 అవుతుంది. ఆదాయంలో ఈఎంఐ 40% ► రూ.36 లక్షల ఇంటిపై రూ.28.8 లక్షల రుణానికి గాను, 15 ఏళ్ల టర్మ్‌కు ఈఎంఐ రూ.30,000. ► రూ.40.3 లక్షల ఇంటికి రూ.28.8 లక్షల రుణం లభిస్తుంది. రుణం చెల్లించాల్సిన వ్యవధి 20 ఏళ్లు అయితే అప్పుడూ ఈఎంఐ రూ.30,000 దాటదు. ► ఇక రూ.43 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను వచ్చే రుణం రూ.34.4 లక్షలు. కాల వ్యవధి 25 ఏళ్లు అయితే ఈఎంఐ రూ.30,000 అవుతుంది. నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే తప్ప, ఈఎంఐ 20 శాతానికి మించకుండా ఉంటే దాన్ని సురక్షితంగా భావించొచ్చు. ఒకవేళ డౌన్ పేమెంట్ 20 శాతానికి మించి సమకూర్చుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ భారం తగ్గుతుంది. నెల వేతనంలో ఈఎంఐ 40 శాతం వరకు ఉంటే చెల్లింపులు కష్టం కావచ్చు. తప్పదనుకుంటే నెల ఆదాయంలో 30 శాతాన్ని ఈఎంఐగా నిర్ణయించుకోవచ్చు. కొందరు దంపతులు ఇద్దరూ కలసి ఇంటి రుణం తీసుకుంటుంటారు. ఇరువురు ఆర్జనాపరులైతే అధిక ఈఎంఐ చెల్లించగలరు. అయితే, రుణ కాల వ్యవధి ముగిసే వరకు ఇద్దరూ ఆర్జనను కొనసాగించాలి. లేదంటే మధ్యలో ఇల్లాలు కుటుంబ అవసరాల కోసం ఉద్యోగాన్ని విడిచిపెడితే, అప్పుడు భారీ ఈఎంఐ భారం ఆమె భాగస్వామి ఒక్కరిపైనే పడుతుంది. దీన్ని ముందే ఆలోచించుకోవాలి. -
99 రూపాయలకే నోకియా స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : ఈ - కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ బిగ్ షాపింగ్ సీజన్ ముగిసి రెండు రోజులు కావోస్తుంది. అయ్యో ఇక మీదట తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొందామంటే ఇక కుదరదేమో అని నిరాశ పడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 99 రూపాయల డౌన్‌పేమంట్‌లో ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చని హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది. మిగతా మొత్తాన్ని నో - కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లో నెలవారీ ఇన్స్టాల్మెంట్లో చెల్లించవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ 2018 నవంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లోనే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. హెచ్ఎండీ గ్లోబల్ లైనప్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ నోకియా 8 సిరాకో పై హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుదారులకు 15 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్ కార్పొరేట్, బిజినెస్, కమర్షియల్ క్రెడిట్ కార్డులకు వర్తించదు. నోకాస్ట్ ఈఎంఐలో రూ.99కే అందుబాటులో ఉన్న ఫోన్లు... నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఆఫర్ పొందడమెలా..? ఈ ఆఫర్‌ని పొందాలనే ఆసక్తి ఉన్న వారు దగ్గరలోని రిలయన్స్ జియో, జియో డిజిటల్ లైఫ్, క్రోమా స్టోర్లలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కనుగొనవచ్చు. అంతేకాక అధికారిక నోకియా ఆన్లైన్ స్టోర్‌లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. -
డౌన్‌పేమెంట్ కట్టి ప్రేయసిని కొనుక్కున్నాడు!
పెరంబూరు (చెన్నై): ప్రేమించిన యువతికి వివాహమైనా ఆమె భర్తను ఒప్పించి ప్రేయసిని దక్కించుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడులో ఆదివారం చోటు చేసుకుంది. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీప ప్రాంతానికి చెందిన దేవి (24) చదువుకునే రోజుల్లో ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు దేవికి మేనమామతో ఇష్టంలేని వివాహం జరిపించారు. అయితే మామతో జీవించలేని దేవి.. ప్రియుడితో రెండుమార్లు వెళ్లింది. తల్లిదండ్రులు దేవిని తిరిగి తీసుకువచ్చి భర్తతో కలిపారు. ఇటీవల మళ్లీ ప్రియుడి వద్దకు వెళ్లిన దేవిని తిరిగి తీసుకువచ్చిన మనప్పారై పోలీసులు.. ఆమెను విచారించారు. భర్తతో కాపురం చేయనని ఆమె తేల్చి చెప్పింది. వివాహం జరిగిన తర్వాత ఆమెను ఎంఈ చదివించినందుకు రూ.లక్ష ఖర్చు అయినట్టు భర్త తెలిపాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా మనప్పారై పోలీసుల నేతృత్వంలో జరిగిన చర్చల ఫలితంగా రూ.లక్షను దేవి భర్తకు విడతలవారీగా ఇవ్వడానికి ప్రియుడు ముందుకొచ్చాడు. తొలి విడతగా రూ.25 వేలు ఇచ్చి ఆదివారం దేవిని తనతో తీసుకెళ్లాడు. -
రూ.7777 చెల్లిస్తే..ఐ ఫోన్ 7 మీ సొంతం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులను ఆకర్షించటానికి దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ ఐ ఫోన్ 7 పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్‌లో భాగంగా లాంచ్ చేసిన ఆన్లైన్ స్టోర్ ద్వారా ఐ ఫోన్‌పై ఆకర్షణీయ మైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 7 ను ఆకర్షణీయమైన డౌన్ చెల్లింపుల్లో అందిస్తోంది. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్లను త్వరలోనే జోడించాలని సంస్థ యోచిస్తోంది. జియోనుంచి గట్టిపోటీని ఎదుర్కొంటూ, దూకుడు ధరలను ఆఫర్ చేస్తున్న సంస్థ ఆన్లైన్ స్టోర్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై సరసమైన డౌన్ పేమెంట్స్, తక్షణ క్రెడిట్ వెరిఫికేషన్, ఫైనాన్సింగ్, నెలసరి ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో సోమవారం ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఆపిల్ ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లను జోడించింది. కేవలం రూ. 7,777 ల డౌన్ పేమెంట్‌తో 32 జీబీ ఐఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. మిగిలిన సొమ్మును 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,499 ( పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో కలిపి) చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తోంది. అంతేకాదు దీంతోపాటు, నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా, అపరిమిత కాలింగ్ (స్థానిక, ఎస్టీడీ, జాతీయ రోమింగ్) తోపాటు సైబర్ ప్రొటెక్షనతో పాటు ఫోన్ డ్యామేజ్ కవర్ చేసే ఎయిర్టెల్ సెక్యూర్ ప్యాకేజీ అందించే ప్రత్యేకమైన పోస్ట్ పెయిడ్ పధకాన్ని కూడా అందిస్తోంది. ఐఫోన్7 128 జీబీ వేరియెంట్‌కు రూ.16,300 డౌన్‌పేమెంట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ వేరియంట్‌కు రూ.17,300, 128 జీబీ వేరియంట్‌కు రూ.26వేల డౌన్‌పేమెంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం www.airtel.in/onlinestore కు లాగిన్ అయ్యి మొబైల్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మన ఎలిజిబిలిటీ, రుణ సదుపాయం తదితర అంశాలను పరిశీలించుకోవాలి. చివరగా మనం ఎంపిక చేసుకున్న మొబైల్‌కు సంబంధించిన డౌన్ పేమెంట్ చెల్లించాలి. లావాదేవీ సక్రమంగా పూర్తయితే సంబంధిత చిరునామాకు మొబైల్ చేరుతుంది. లక్షలాది మంది వినియోగదారులని ఆహ్లాదపరిచేందుకు ఎయిర్టెల్ మరో ఉత్తేజకరమైన డిజిటల్ ఆవిష్కరణను తీసుకొచ్చినట్టు హర్మీన్ మెహతా భారతి ఎయిర్టెల్ గ్లోబల్ డైరెక్టర్ తెలిపారు. కస్టమర్లు ఎల్లప్పుడూ కోరుకునే పరికరాలకు అప్‌గ్రేడ్ చేయడమే కాదు, డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధునాతనమైన, సరళమైన ప్రక్రియతో వారి కలను సాకారం చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తమ భాగస్వాములకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ సేవలు భారతదేశంలోని 21 నగరాల్లో ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఇంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, క్లిక్స్ కాపిటల్, సెయిన్స్ టెక్నాలజీస్, బ్రైట్ స్టార్ టెలికమ్యూనికేషన్స్ , వుల్కాన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలతో భాగస్వామ్యంను కలిగి ఉంది. -
డిసెంబర్లో మారుతీ అమ్మకాలు జూమ్
హైదరాబాద్: మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో గణనీయంగా పెరిగాయి. 2013 డిసెంబర్ ఇదే కాలంతో పోల్చిచూస్తే, కొనుగోళ్లు 47 శాతం పెరిగాయి. కొనుగోళ్లపై గరిష్టంగా రూ. లక్ష వరకూ పొదుపు ఆఫర్లను మారుతీ సుజుకీ అమలు చేస్తోంది. పాత కార్లకు సంబంధించి చక్కటి ‘ఎక్స్ఛేంజ్’ ప్రయోజనాలను కూడా సంస్థ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. అతి తక్కువ డౌన్ పేమెంట్లతో ఆకర్షణీయమైన పథకాలను అందించడానికి ప్రముఖ ఫైనాన్స్ సంస్థలతో మారుతీ అవగాహన కుదుర్చుకుంది. డిసెంబర్ 31వ తేదీతో కేంద్ర ఎక్సైజ్ సుంకం ప్రయోజనం ముగియనుండడం, ఇది కొనసాగించని పక్షంలో ధరలు పెరిగే అవకాశం, ఏడాది చివర్లో స్టాక్స్ క్లియర్‌కు పలు ఆఫర్ల ప్రకటన, వెరసి ఈ నెలలో కొనుగోళ్లపై రూ.50,000- రూ.75,000 శ్రేణిలో పొదుపు అవకాశాలు... వీటన్నింటికీ తోడు వ్యయ భారాలను తట్టుకోడానికి వచ్చే ఏడాది జనవరి నుంచీ సహజంగానే ధరలు పెరిగే అవకాశాలు ఉండడం వంటి అంశాల నేపథ్యంలో కార్ల కొనుగోలుకు డిసెంబర్‌ను ఒక మంచి అవకాశంగా వినియోగదారులు భావిస్తున్నారు. -
సొంతింటి కల.. తీర్చుకోండిలా
సొంతిల్లు ఉంటే నీడతో పాటు .. ఒక భరోసా కూడా వస్తుంది. హోదాకు ఒక చిహ్నంగా నిలుస్తుంది. సొంత ఇంటిని సమకూర్చుకోవడం అనేది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న వ్యవహారం కావడంతో దీన్ని చాలామంది ఖరీదైన కలగా భావిస్తుంటారు. కాని చక్కటి ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికను అనుసరిస్తే సులభంగా ఆ కలను నెరవేర్చుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యమున్న సొంత ఇంటిని కొనుక్కునేటప్పుడు తెలుసుకోవాల్సినవిషయాలపై ఈ వారం ప్రాఫిట్ కథనం. ప్రస్తుతం అనేకానేక గృహ నిర్మాణ ప్రాజెక్టులతో దేశీ హౌసింగ్ మార్కెట్ కళకళ్లాడుతోంది. వివిధ ఆదాయ వర్గాల వారి కోసం వివిధ సదుపాయాలు గల ఇళ్లు రూపొందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో.. కొనుగోలుదారుల దృష్టికోణం నుంచి చూస్తే, ఇల్లు కొనుక్కునేందుకు ఇది సరైన తరుణం. సాధారణంగా మొదటిసారిగా ఇల్లు కొనుక్కుంటున్నవారికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇంటిని ఎంపిక చేసుకోవడం నుంచి కొనుక్కునే దాకా ముందుకు వెడుతున్న కొద్దీ గందరగోళం పెరుగుతున్నట్లు ఉంటుంది. కొన్ని సార్లు వృథా ప్రయాసగానూ, కష్టసాధ్యంగాను అనిపిస్తుంటుంది. అదే రెండోసారి కొనుక్కుంటున్న వారికయితే అప్పటికే ఇంటి కొనుగోలు విషయంలో ఎదురయ్యే పరిస్థితుల గురించి కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి.. ఈ గందరగోళం కాస్త తక్కువగా ఉంటుంది. కొనుక్కుంటున్నది మొదటిసారైనా లేదా రెండోసారైనా .. ఒక ప్రణాళిక వేసుకోవడం, ముందుచూపుతోనూ .. నిర్ణయాత్మకంగానూ వ్యవహరించగలగడం చాలా కీలకమైన విషయాలు. ఎందుకంటే.. ఇల్లనేది దీర్ఘకాలికమైన ఆస్తి. అదే సమయంలో ఆ కలను సాకారం చేసుకునేందుకు తీసుకునే గృహ రుణం అనేది దీర్ఘకాలికమైన అప్పు కూడా. అందుకే డీల్‌ని కుదుర్చుకునే ముందు దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మీతో పాటు కుటుంబసభ్యుల అవసరాలను కూడా గుర్తించాలి ముందుగా మీకేం కావాలి, మీ కుటుంబ సభ్యుల అవసరాలేమిటి అన్నది గుర్తించాలి. మీరు ఏ వయస్సులో ఇల్లు కొనుక్కునే ప్రయత్నాన్ని ప్రారంభించారన్న దాన్ని బట్టి.. మీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నారన్న విషయంపై అవగాహన ఉండాలి. ఎన్ని గదులు ఉండాలి, ఏ ప్రాంతంలో తీసుకోవాలి, ఎలాటి సదుపాయాలు ఉండాలి అనుకుంటున్నారో.. ఆలోచించుకోవాలి. ఇలా ప్రాధాన్యతలను రాసుకుంటే షార్ట్‌లిస్ట్ చేసుకోవడం సులభం అవుతుంది. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోవాలి విష్ లిస్ట్‌తో పాటు ఎంత పొదుపు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటివి లెక్క వేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుస్తుంది. ఇల్లు కొనుక్కునేందుకు ఎంత పక్కన పెట్టగలరన్న దానిపై అవగాహన వస్తుంది. ఇంటి కల సాకారం కోసం అవసరమైతే భారీ ఖర్చులు, విలాసవంతమైన టూర్లు వగైరాలు తగ్గించుకోవాల్సి రావొచ్చు. అలాగే, గృహ రుణం తీసుకోవడానికి ముందే దీర్ఘకాలికమైన ఇతరత్రా రుణాలేమైనా ఉంటే చెల్లించేసే ప్రయత్నం చేయాలి. మీ ఆదాయ, వ్యయాల విధానాన్ని బట్టి ఇల్లు తీసుకునేందుకు గరిష్టంగా మీకు ఎంత రుణం లభిస్తుందో లెక్కవేసుకోవడానికి కావాలంటే బ్యాంకులు సహకారం అందిస్తాయి. డౌన్‌పేమెంటు కోసం దాచిపెట్టండి ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్‌పేమెంట్‌ను సమకూర్చుకునేందుకు యుక్తవయస్సు నుంచే పొదుపు చేయడం మొదలుపెట్టాలి. దీనివల్ల కలల సౌధాన్ని దక్కించుకోవడం సులభమవుతుంది. హోమ్ లోన్ తీసుకోవడానికి కొన్నాళ్ల ముందు నుంచే ప్రతిపాదిత ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని ప్రతి నెలా తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టడం మంచిది. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సొంతింటి కోసం నిధి తయారవుతుంది. రెండోదేమిటంటే.. మీకొచ్చే ఆదాయంలో ప్రతిపాదిత ఈఎంఐలకు కూడా చోటు కల్పించడం సాధ్యపడుతుంది. ఈ మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే, అవసరమైతే గడువుకు ముందే విత్‌డ్రా చేసుకునే వీలు కూడా ఉంటుంది. -
మహిళకూ రిటైర్మెంట్ ప్లాన్ అవసరమే!
నాకు ఆరు నెలల క్రితం ఉద్యోగం వచ్చింది. ఇంకా పెళ్లి కాలేదు. నాకంటూ ఓ స్వంత ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్ అవసరాలు, రెండేళ్లలో పెళ్లి, అయిదేళ్లలో ఇల్లు, 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులు, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్... వీటికోసం ఏ పొదుపు మార్గాలున్నాయి. ఎక్కువ రిస్కు భరించలేను. - రాగలలిత, హైదరాబాద్ రెండేళ్లలో పెళ్లి పెట్టుకుంటున్నారంటే బ్యాంకులో ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్ వేసుకోవడం ఉత్తమ మార్గం. ఎందుకంటే స్వల్పకాలానికి మీరు మార్కెట్లోకి వెళ్లడం మంచిది కాదు. మీ జీతం వచ్చే బ్యాంకులో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ రాసిస్తే, బ్యాంక్ కంప్యూటర్లే ఆ మొత్తాన్ని బదిలీ చేస్తాయి. ఇక మీరు ఐదేళ్లలో ఇల్లు కొనాలంటే చేతిలో డౌన్‌పేమెంట్ కొంతకావాలి. ఆర్.డి.ద్వారా వచ్చే వడ్డీ హోమ్‌లోన్ స్వల్పతేడాతోనే ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పట్నుంచే దానికోసం కూడా ఆర్.డి. చేసుకోవడం మంచిది. ఇందులో చక్రవడ్డీ పరంగా చూస్తే హోమ్‌లోన్‌కు కట్టే వడ్డీ మీకు గిట్టుబాటు అయినట్లే. ఇక 18, 20 ఏళ్ల తర్వాత పిల్లల చదువులకి ప్లాన్ చేయాలనుకుంటే మదుపు అవకాశాలు పెరుగుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో సొమ్ము దాచుకోవచ్చు. ఇది పన్ను రహితం. మీ ఆదాయంలో కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోనూ పెట్టొచ్చు. ప్రతినెలా సిప్ మార్గంలో సొమ్ము దాచుకుంటూ పోతే దీర్ఘకాలానికి రిస్క్ పోయి మదుపు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి పిల్లల చదువులకు ఈ రెండు మార్గాలు ఉత్తమమైనవి. ఇక 35 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ గురించి మీరు ఆలోచించడం అభినందనీయం. మీ వయసు ఇంకా తక్కువే కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. షేర్ మార్కెట్‌పై అవగాహన వచ్చేవరకు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి. సుదీర్ఘ భవిష్యత్‌లో మార్కెట్ భారీగా వృద్ధి చెందే అవకాశం ఉన్నవి మార్కెట్, రియల్ ఎస్టేట్... ఈ రెండే. వీటిలో పెట్టుబడి మంచిదే. - వంగా రాజేంద్రప్రసాద్, ఆర్థిక వ్యవహారాల నిపుణులు