Fluctuations
-
మహిళా సూక్ష్మ సంస్థలకు సంక్షోభాల రిస్క్
న్యూఢిల్లీ: మహిళల ఆధ్వర్యంలో నడిచే మెజారిటీ సూక్ష్మ సంస్థల వద్ద అత్యవసర నిధులు లేవని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైతే వీటిపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఓ నివేదిక తెలిపింది. మహిళలు నిర్వహించే సూక్ష్మ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ‘మైక్రోసేవ్ కన్సల్టింగ్’ (ఎంఎస్సీ) అనే సంస్థ సాధాన్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల పరిధిలో ఇది జరిగింది. 1,460 కంప్యూటర్ ఆధారిత వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించింది. వ్యాపార నిర్వహణ పరంగా ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకునేది, సవాళ్లు, ప్రేరణల గురించి మహిళలు తమ అంతరంగాన్ని ఈ సంస్థతో పంచుకున్నారు. ముఖ్య అంశాలు.. → ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం కావాల్సిన నిధులు లేవని 45 శాతం మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు. → వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక అంశాలను వేర్వేరుగా నిర్వహించే విషయంలో చాలా మంది సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో న గదు నిర్వహణ సంక్లిష్టంగా మా రడమే కాకుండా, కచ్చితమై న ఆర్థిక రికార్డుల నిర్వహణ లో రాజీపడాల్సి వస్తోంది. → 60 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు తమ సంస్థలకు సంబంధించి లిఖితపూర్వక రికార్డులు నిర్వహించడం లేదు. లాభాలు, వ్యాపార కార్యకలాపాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున ప్రత్యేకమైన రికార్డుల నిర్వహణ అవసరం లేదని వీరిలో 55 శాతం మంది భావిస్తున్నారు. మిగిలిన వారు రికార్డుల నిర్వహణలో ఉన్న సంక్లిష్టతలను వ్యక్తపరిచారు. రికార్డులు నిర్వహించకపోవడంతో వ్యాపార పనితీరు, ఆర్థిక సామర్థ్యాలను సమీక్షించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. → ఇక ఈ సంస్థల్లో 55% మంది ఎలాంటి ఉద్యోగులను కలిగి లేవు. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఉపా ధి కల్పనకు ఇవి ఏమంత తోడ్పడడం లేదు. -
పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్ మూడు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్, ఆర్థి క సంవత్సరం గడువు ముగింపు అంశాలు ట్రేడింగ్ ప్రభావితం చేయచ్చని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముఖ్యంగా అమెరికా జీడీపీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని అంచనా. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. హోలీ సందర్భంగా నేడు (సోమవారం), గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులు జరగుతుంది. అయితే ఈ రెండు సెలవు రోజుల్లో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘ఈ వారం ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మూడు రోజులే కావడంతో ఎక్సే్చంజీల్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండొచ్చు. అయితే టి+0 సెంటిల్మెంట్ ప్రారంభం, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు నేపథ్యంలో సూచీల ఊగిసలాట ఉండొచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 21,700 తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో అమ్మకాలతో చతికిలపడిన స్టాక్ సూచీలు ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన వైఖరి, సంస్థాగత ఇన్వెస్టర్ల బలమైన కొనుగోళ్లతో కారణంగా ద్వితీయార్థంలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించిన రికవరీకి తమ వంతు సాయం చేశాయి. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచనల మేరకు ట్రేడింగ్ జరిగిన రోజే సెటిల్మెంట్(టి+0) విధానాన్ని ఎక్సే్చంజీలు గురువారం(మార్చి 28) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నాయి. అన్ని షేర్లకు టి+0 విధానం అమలు చేయడానికి ముందుగా 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. ప్రయోగ పనితీరు ఫలితాలను బట్టి టి+0 అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అలాగే భారత స్టాక్ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది. గురువారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(మార్చి 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆప్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ వివ రాలు, అమెరికా గృహ అమ్మకాలు సోమవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసెస్ సెంటిమెట్, వినియోగదారుల వి శ్వాస గణాంకాలు బుధవారం వెల్లడి కాను న్నాయి. బ్రిటన్ క్యూ4 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి డేటా గురువారం విడుదల అవుతుంది. చైనా కరెంట్ ఖాతా, జపాన్ నిరుద్యోగ రేటు, అమెరికా పీసీఈ ప్రైజ్ ఇండెక్స్ డేటా వివరాలు శుక్రవారం వెల్లడి అవుతాయి. విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి భారతీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వర కు (మార్చి 22 నాటికి) రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాను కూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు ఎఫ్ఐఐలను ఆక ట్టుకుంటున్నాయి. ‘‘భారత జీడీపీ వృద్ధి, ఆర్బీ ఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20–50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల షేర్లను విక్ర యించారు. ఈ ఏడాదిలో ఇప్పటివర కు ఎఫ్‌పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. -
ఫెడ్ నిర్ణయాలకు ఎదురుచూపు
ముంబై: అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే రిలయన్స్ (1.45%)తో పాటు మెటల్, ఇంధన, ఆటో షేర్లూ రాణించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 672 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 105 పాయింట్ల లాభంతో 72,748 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 207 పాయింట్ల రేంజ్లో 22,124 వద్ద గరిష్టాన్ని, 21,917 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 32 పాయింట్లు పెరిగి 22,056 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ తర్వాత ఇటీవల దిగివచి్చన నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ,, ప్రైవేటు బ్యాంకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ స్వల్పంగా 0.4% లాభపడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% నష్టపోయింది. -
ఒడిదుడుకుల బాటనే ఎగుమతులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వస్తు ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకుల బాటలోనే కొనసాగుతున్నాయి. నవంబర్‌లో క్షీణతను నమోదుచేసుకున్న ఈ కీలక రంగం డిసెంబర్లో స్వల్పంగా ఒక శాతం పెరుగుదలను నమోదుచేసుకుంది. విలువలో ఇది 38.45 బిలియన్ డాలర్లు. అయితే వస్తు దిగుమతుల విభాగం మాత్రం క్షీణతలోనే కొనసాగింది. విలువ 4.85 శాతం తగ్గి 58.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు– దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.80 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కొన్ని ముఖ్యాంశాలు... ► పెట్రోలియం ప్రొడక్టులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, తోలు ఉత్పత్తులుసహా పలు విభాగాల్లో డిసెంబర్ ఎగుమతులు తగ్గాయి. ► ప్లాస్టిక్, ఎల్రక్టానిక్ గూడ్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల విభాగాలు వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ► క్రూడ్ దిగుమతులు సమీక్షా నెలలో 22.77% తగ్గి 15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పసిడి దిగుమతులు మాత్రం 156 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లుకు చేరాయి. 9 నెలల్లో క్షీణతే.. మరోవైపు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో భారత్ వస్తు ఎగుమతులు 5.7 శాతం క్షీణించి 317.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా ఇదే కాలంలో 7.93% క్షీణించి 505.15 బిలియన్ డాలర్లుకు దిగాయి. వెరసి వాణిజ్యలోటు 188.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ఈ లోటు 212.34 బిలియన్ డాలర్లు. సేవల రంగం కూడా నిరాశే... సేవల రంగం ఎగుమతులు డిసెంబర్లో క్షీణతను నమోదుచేసుకుని, 27.88 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022 ఇదే కాలంలో ఈ విలువ 31.19 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఈ విలువ 239.5 బిలియన్ డాలర్ల నుంచి 247.92 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
Stock Market: ఒడిదుడుకులు కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ – అదానీ గ్రూప్ పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వీఎఐక్స్ ఇండెక్స్ 17.32% నుంచి 14.4శాతానికి దిగిరావడం కలిసొచ్చే అంశంగా ఉంది. వీటితో పాటు దేశీయ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలను ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ఇటీవల భారీ దిద్దుబాటులో భాగంగా కనిష్టాలకు దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారం సూచీలు రెండున్నరశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1534 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు లాభపడ్డాయి. అయితే హిండెన్ బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ సంక్షోభంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కేంద్ర ప్రకటించిన సంతులిత బడ్జెట్ సైతం అస్థిరతలను తగ్గించలేకపోయింది. ‘‘వారాంతాపు బౌన్స్‌బ్యాక్ కాస్త ఒత్తిడిని తగ్గించింది. అయితే సంకేతాలు ఇప్పటికీ మిశ్రమంగానే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలోని స్థిరత్వం కలిసొచ్చే అంశమే. ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, అదానీ గ్రూప్ సంక్షోభం పరిణామాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. నిఫ్టీ 17,900 స్థాయిని అధిగమించగలితే ఎగువస్థాయిలో 18,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 17,550 వద్ద తక్షణ మద్దతు కలిగివుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ అడ్వైజరీ ఇన్వెస్టర్స్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేత్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం వారాంతాపు రోజైన శుక్రవారం డిసెంబర్ పారిశ్రామిక, తయారీ రంగ డేటా విడుదల కానుంది. అదేరోజున ఫిబ్రవరి మూడో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల జనవరి 27 వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. జనవరి యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ కన్స్ట్రక్షన్ పీఎంఐ డేటా, బ్రిటన్ సీఐపీఎస్ కన్స్ట్రక్షన్ పీఎంఐ గణాంకాలు నేడు విడుదల అవుతాయి. యూఎస్ వాణిజ్యలోటు రేపు(మంగళవారం) వెల్లడికానుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. ఆర్బీఐ ఎంసీపీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య విధాన పాలసీ కమిటీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జరుగనున్న ఈ భేటీ నిర్ణయాలు బుధవారం (ఫిబ్రవరి 8న) వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గానూ ఆర్బీఐ నిర్వహించే చివరి ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఇది. వడ్డీరేట్ల పెంపు 25 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని అంచనా. గతేడాది డిసెంబర్లో వరుసగా ఐదో విడత కీలక రెపో రేటును 0.35 శాతం పెంచడంతో 6.25 శాతానికి చేరింది. భవిష్యత్తులో వడ్డీరేట్ల పెంపు/తగ్గింపు, బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థ పై విధాన కమిటీ అభిప్రాయాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్బీఐ ఛైర్మన్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిగణలోకి తీసుకొనే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఈ కొత్త ఏడాది తొలి నెలలో దేశీయ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరిని ప్రదర్శించారు. ఈ జనవరిలో మొత్తం రూ.28,852 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. గతేడాది జూన్ తర్వాత ఒక నెలలో ఎఫ్ఐఐల జరిపిన అత్యధిక విక్రయాలు ఇవే. కొనసాగింపుగా ఈ ఫిబ్రవరి మొదటివారంలోనూ రూ.5,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ‘‘ఎఫ్ఐఐలు భారత్ మార్కెట్లో షార్ట్ పోజిషన్లతో భారీ లాభపడ్డారు. తక్కువ విలువ వద్ద ట్రేడ్ అవుతున్న చైనా, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, థాయిలాండ్ మార్కెట్లపై ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, జొమాటో, లుపిన్‌తో సహా ఈ వారంలో మొత్తం 1300 పైగా కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో నిఫ్టీ–50 సూచీలోని ఎనిమిది కంపెనీలున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. -
ఎగుమతులపై ప్రపంచ అనిశ్చితి ప్రభావం! డిసెంబర్లో వృద్ధిలేకపోగా..
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులపై అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం కనబడుతోంది. 2022 డిసెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 12.2 శాతం క్షీణతను నమోదుచేసుకున్నట్లు వాణిజ్యశాఖ వెలువరించిన తాజా గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022 డిసెంబర్లో వస్తు ఎగుమతుల విలువ 2021 ఇదే నెలతో పోల్చి 12.2 శాతం తగ్గి, 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇక వస్తు దిగుమతుల విలువ కూడా 3.5 శాతం తగ్గి 58.24 బిలియన్ డాలర్లుగా ఉంది. ► వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ డిసెంబర్లో 12 శాతం పడిపోయి 9.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు ఆభరణాల ఎగుమతులు సైతం 15.2 శాతం పడిపోయి 2.54 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► కాఫీ, జీడిపప్పు, ఔషధాలు, కార్పెట్, హస్తకళ లు , తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీ గా తగ్గాయి. ► పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా 27 శాతం తగ్గి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక చమురు దిగుమతులు 6 శాతం పెరిగి 17.5 బిలియన్ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 75 శాతం క్షీణించి 1.18 బిలియన్ డాలర్లకు చేరాయి. తొమ్మిది నెలల పరిస్థితి ఇలా... ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య దేశ వస్తు ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 218.94 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22లో దాదాపు 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరగ్గా, 2022–23లో ఈ స్థాయికి మించి ఎగుమతులు జరగాలన్నది కేంద్రం ధ్యేయం. అయితే అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఈ లక్ష్యంపై నీలినీడలు అలముకుంటున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతల విలువ 45.62 శాతం పెరిగి 163.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి ప్రోత్సాహకాల వల్ల ప్రయోజనం ఒనగూడిందని వాణిజ్యశాఖ కార్యదర్శి సునిల్ భరత్వాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో ఎగుమతులు ఏప్రిల్–డిసెంబర్ మధ్య 52 శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రష్యా నుంచి ఏప్రిల్–డిసెంబర్ మధ్య దిగుమతులు నాలుగురెట్లు పెరిగి 32.88 బిలియన్ డాలర్లకు చేరాయి. చైనా నుంచి సైతం దిగుమతులు 12 శాతం పెరిగి 75.87 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతులు 35.58 శాతం తగ్గి 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు నిలిచాయి. -
స్వల్ప శ్రేణిలోనే ట్రేడింగ్
ముంబై: స్టాక్ మార్కెట్ కొత్త ఏడాది తొలి వారంలోనూ ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, చైనాలో కోవిడ్ పరిస్థితులు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులపై దృష్టి సారించే వీలుంది. గతవారం ప్రారంభమైన షా పాలీమర్స్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ముగుస్తుంది. అదే రోజున రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఐపీఓ లిస్టింగ్ ఉంది. ఇటీవల దిద్దుబాటులో దిగివచ్చిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గతవారంలో స్టాక్ సూచీలు రికవరీ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్ల మినహా అన్ని రంగాల షేర్లలో బుల్ ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ‘‘ఆర్థిక మాంద్య భయాలు, చైనా కోవిడ్ పరిస్థితులు సూచీల అప్‌సైడ్ ర్యాలీని అడ్డుకుంటున్నాయి. ఇదే సమయంలో కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. కావున సూచీలు కొంతకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవచ్చు. నిఫ్టీ 17800–18400 పాయింట్ల పరిధిలో స్వల్పకాలం పాటు స్థిరీకరణ కొనసాగొచ్చు. కన్సాలిడేషన్ దశను పూర్తి చేసుకున్నట్లయితే నిఫ్టీ జీవితకాల గరిష్టం 18,887 స్థాయిని చేరుకునేందుకు ప్రయత్నం చేయోచ్చు’’ అని ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ తెలిపారు. మార్కెట్‌ను నడిపించే అంశాలు ఇవీ.. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ గతేడాది డిసెంబర్ 14న జరిగిన అమెరికా ఫెడ్ రిజర్వ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్ వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. గత నాలుగుసార్లు 75 బేసిస్ పాయింట్లు పెంచిన ఫెడ్.. గత నెలలో 50 పాయింట్లు పెంచింది. దీంతో 4.25 – 4.50 శాతానికి ఫెడ్ బెంచ్ మార్క్ వడ్డీ రేటు చేరింది. గత 15 సంవత్సరాల్లో ఇదే అత్యధికం. భవిష్యత్తు(2023)లోనూ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ద్రవ్య విధాన వైఖరిపై ఫెడ్ మినిట్స్‌లో మరింత స్పష్టత వచ్చే వీలుంది. ఎఫ్‌పీఐలు ఓకే డిసెంబర్లో ఈక్విటీల్లోకి రూ. 11,119 కోట్ల పెట్టుబడులు గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ ఈక్విటీలలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం 2022 డిసెంబర్లో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో వరుసగా రెండో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. కొన్ని ప్రపంచ దేశాలలో తిరిగి కోవిడ్–19 కేసులపై ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలోనూ దేశీ స్టాక్స్‌పట్ల ఎఫ్‌పీఐలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటం గమనార్హం! ఫలితంగా 2022 నవంబర్‌లో నమోదైన రూ. 36,239 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు భారీగా తగ్గాయి. యూఎస్‌లో మాంద్య భయాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ నిపుణులు హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలోనూ చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన దేశీ స్టాక్ మార్కెట్లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. భారీ అమ్మకాలు దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు 2022లో భారీగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూఎస్ ఫెడ్‌సహా ప్రపంచవ్యాప్తంగా పలు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూపోవడం, చమురు ధరల పెరుగుదల, రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. వెరసి గత మూడేళ్లలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు 2022లో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌పీఐలు ఇంతక్రితం అంటే 2021లో రూ. 25,752 కోట్లు, 2020లో రూ. 1.7 లక్షల కోట్లు, 2019లో రూ. 1.01 లక్షల కోట్లు విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇక 2022 డిసెంబర్లో రూ. 1,673 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను విక్రయించగా.. ఏడాది మొత్తం రూ. 15,911 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 2021లోనూ డెట్ విభాగంలో రూ. 10,359 కోట్లు, 2020లో రూ. 1.05 లక్షల కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలు విక్రయించారు. స్థూల ఆర్థిక గణాంకాలు ముందుగా నేడు మార్కెట్ ఆదివారం వెలువడిన డిసెంబర్ ఆటో విక్రయాలకు స్పందించాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు ఈ వారంలో డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలను వెల్లడించనున్నాయి. కోవిడ్ కేసులు తెరపైకి వచ్చిన నేపథ్యంలో కరోనా ప్రభావం ఈ రంగంపై ఎంతమేర పడిందనే అంశాన్ని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. భారత్, అమెరికా డిసెంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా(నేడు), బ్రిటన్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. సేవారంగ పీఎంఐ డేటా బుధవారం విడుదల అవుతుంది. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్‌ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
వరుసగా మూడో నెలా క్షీణత నుంచి వృద్ధికి...
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల తొలి, తుది లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం దిగుమతులు 8.66 శాతం పెరిగి 61.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 26.16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య క్షీణత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ ఎగుమతులు వృద్ధిలేకపోగా 16.96 బిలియన్ డాలర్లు క్షీణించి 231.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 38.55 శాతం పెరిగి 380.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 148.46 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ విలువ 76.25 బిలియన్ డాలర్లు. కీలక రంగాలు నిరాశ ► ఇంజనీరింగ్ వస్తు ఎగుమతులు 10.85 శాతం క్షీణించి 8.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు కూడా 18 శాతం క్షీణించి బిలియన్ డాలర్లకు తగాయి. ► ప్లాస్టిక్స్ కూడా ఇదే పరిస్థితి. 12.2 శాతం క్షీణతతో 660.66 మిలియన్ డాలర్లకు చేరాయి. ► అయితే రత్నాలు–ఆభరణాలు, పెట్రోలియం ప్రొడక్టులు, తోలు, ఫార్మా, కెమికల్స్, బియ్యం ఎగుమతులు పెరిగాయి. దిగుమతులు ఇలా... ► ఆయిల్ దిగుమతులు 5.38 శాతం తగ్గి 15.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పసిడి దిగుమతులు 24.62 శాతం పడిపోయి 3.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతులు 60.82 శాతం పెరిగి 3.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల రంగం ఎగుమతులు 19 శాతం అప్ ఇదిలావుండగా, సేవల రంగం ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 18.72 శాతం పెరిగి 25.65 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దిగుమతుల విలువ 20 శాతం పెరిగి 15.10 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సేవల ఎగుమతులు 27.88 శాతం వృద్ధితో 150.43 బిలియన్ డాలర్లకు చేరాయి. జూలై, ఆగస్లుల్లో సవరణలు ఇలా... జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్ డాలర్లు) తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది. ఇక జూలైలో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయని తొలి గణాంకాలు వెలువడ్డాయి. తాజా గణాంకాలు పరిస్థితిని ఆశాజనకంగా మార్చాయి. వరుసగా 22 నెలలూ ఎగుమతులు వృద్ధి బాటన నడిచినట్లయ్యింది. లక్ష్యం కష్టమేనా... 2021–22లో 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం సాధన కష్టమేనన్న విశ్లేషణ ఉంది. అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతాయన్న విశ్లేషణలే దీనికి కారణం. -
మార్కెట్లో ఒడిదుడుకులే..?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు సూచీల గమనాన్ని నిర్ధేశిస్తాయన్నారు. ఇక దేశీయ పరిణామాలను పరిశీలిస్తే.., ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు(గురువారం) తేదీ ఉంది. అదే రోజున జూన్ ద్రవ్యలోటు, మే మాసపు పారిశ్రామికోత్పత్తి డేటా, మరుసటి రోజున(జూలై 1న) ఆటో కంపెనీల జూన్ విక్రయ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, వర్షపాత నమోదు, కోవిడ్ కేసులు అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. కమోడిటీ ధరలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూలతలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు కనిష్ట స్థాయి నుంచి రెండున్నర శాతం రికవరీ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో సెన్సెక్స్ 1,368 పాయింట్లు, నిఫ్టీ 406 చొప్పున లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 15,700 స్థాయి వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 15,900–16,250 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రెండ్ బేర్స్‌కు అనుకూలంగా మారితే దిగువస్థాయిలో 15,350 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది’’ స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ► క్రూడాయిల్ కదలికలు ఇటీవల గరిష్టాలకు(127.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్ ధర శుక్రవారం నాటికి 113.12 డాలర్లగా ఉంది. ‘‘ప్రస్తుతానికి క్రూడ్ ధరలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రతికూలతలు సద్దుమణిగితే రానున్న రోజుల్లో చమురు ధరలు తిరిగి పెరొగొచ్చు’’ అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెరిపి లేకుండా దేశీయ ఈక్విటీలను అమ్మేస్తుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. ఈ జూన్‌లో రూ.46,000 కోట్లు, ఈ ఏడాది మొత్తంగా ఇప్పటికి(జూన్ 24వ తేదీ నాటికి) వరకు రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. డాలర్ మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌లు కఠినతర ద్రవ్య విధాన అమలు తదితర అంశాలు ఎఫ్ఐఐల విక్రయాలకు కారమణని యస్ సెక్యూరిటీస్ ఇస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ జైన్ తెలిపారు. గురువారం ఎఫ్ అండ్ ఓ ముగింపు ఈ గురువారం(జూన్ 30న) నిఫ్టీ సూచీకి చెందిన జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చు. ► శుక్రవారం ఆటో విక్రయ గణాంకాలు దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం జూన్ నెల వాహన విక్రయాలు గణాంకాలను వెల్లడించనున్నాయి. ఆటో డేటా విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, ఎస్కార్ట్స్ షేర్లు అధిక పరిమాణంలో ట్రేడయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు దిగిరావడంతో గత వారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా ఏడు శాతం ర్యాలీ చేసింది. వార్షిక ప్రాతిపదికన ‘‘లో బేస్ ఎఫెక్ట్’’తో మెరుగైన గణాంకాలు నమోదు కావచ్చు. ► అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా మే నెల గృహ అమ్మక గణాంకాలు వెల్లడి కానున్నాయి. ఎల్లుండి యూఎస్ తొలి త్రైమాసిక జీడీపీ యూరోపియన్ యూనియన్ జూన్ పారిశ్రామిక, సేవా రంగ గణాంకాలు(జూన్ 29న) విడుదల అవుతాయి. అదే రోజున జపాన్ రిటైల్ విక్రయాలు వెల్లడి అవుతాయి. ఆ మరుసటి రోజున(జూన్ 30)న అమెరికా నిరుద్యోగ గణాంకాల డేటా వెల్లడి అవుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను తెలియజేసే ఈ గణాంకాల ప్రకటనకు ముందుకు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. -
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ ముగింపుతో పాటు యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ వారంలోనూ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పనితీరు, చైనాలో కోవిడ్ కేసుల నమోదు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టొచ్చు. తుది దశకు చేరిన దేశీయ కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను పరిశీలించవచ్చు. ప్రాథమిక మార్కెట్లో రెండు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. మరో రెండు ఐపీవోలు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదిలికలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణుల చెబుతున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో సాంకేతికంగా నిఫ్టీ 16,250 స్థాయిపై ముగిసింది. బౌన్స్‌బ్యాక్ ర్యాలీ కొనసాగితే 16,400 స్థాయిని.., ఆపై 16,666 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 16,000 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,800వద్ద మద్దతు లభించొచ్చు. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎంజీసీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ పెరుగుదల, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల అస్థిరత తదితర ప్రతికూల పరిస్థితులను అధిగమించి గతవారం దేశీయ సూచీలు దాదాపు మూడుశాతం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 484 పాయింట్ల లాభాలన్ని ఆర్జించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత విశ్లేషిస్తే.., ► గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఏప్రిల్ 26న) నిఫ్టీ సూచీకి చెందిన మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ► కార్పొరేట్ ఫలితాల ప్రభావం దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్ తుది దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,200కి పైగా కంపెనీలు తమ క్యూ4తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. దీవీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సెయిల్, జొమాటో, అదానీ పోర్ట్స్, గ్రాసీం, ఇప్కా ల్యాబ్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఇండిగో, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, బర్గర్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నైకా సంస్థలు మొదలైనవి జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ► విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ వంటి వర్ధమాన దేశాల్లో పెద్ద ఎత్తున ఈక్విటీలను విక్రయిస్తున్నారు. ఈ మే నెల(20 తేదీ నాటికి)లో ఇప్పటి వరకు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఈ నెల చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వరుసగా ఐదో నెలలో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా మారడం ఈక్విటీ మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తోంది. ► ప్రాథమిక మార్కెట్‌పై దృష్టి ఇటీవల ఐపీవోలను పూర్తి చేసుకున్న డెలివరీ.., వీనస్ పైప్స్అండ్ట్యూబ్స్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున ఏథర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుండగా.., గతవారంలో ప్రారంభమై ఈ ముద్ర ఐపీవో మంగళవారం ముగియనుంది. ఈ రెండు పబ్లిక్ ఇష్యూల మొత్తం పరిమాణం రూ.1,221 కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరు.., ఐపీఓ స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ చైర్మన్ పావెల్.., ఈసీబీ ప్రెసిడెంట్ లాగార్డ్ ప్రసంగాలు మంగళవారం ఉన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జీడీపీ వృద్ధి రేటు అవుట్‌లుక్(గురువారం) విడుదల కానున్నాయి. జపాన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా వెల్లడి అవుతుంది. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. -
ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, కీలక వడ్డీరేట్ల పెంపు భయాల నేపథ్యంలో స్టాక్ సూచీలు ఈ వారంలోనూ తడబడవచ్చని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పోరేట్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ఆందోళనలతో గతవారంలో మొత్తంగా సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్లు నష్టపోయాయి ‘‘గత నాలుగు నెలలుగా మార్కెట్లో స్థిరీకరణ కొనసాగుతోంది. ఇప్పటికీ నిర్ణయాత్మక దిశను ఎంచుకోలేకపోయింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఆందోళనలు, రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. నిఫ్టీకి సాంకేతికంగా దిగువస్థాయిలో 17050 వద్ద బలమైన మద్దతు స్థాయి ఉంది. ఎగువస్థాయిలో 17,550–17,650 వద్ద శ్రేణిలో నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెచ్ వినోద్ నాయర్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) వెల్లడికానున్నాయి. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, యూరోజోన్ డిసెంబర్ పారిశ్రామికోత్పత్తి, అమెరికా జనవరి రిటైల్ అమ్మకాలు ఈనెల 16న (బుధవారం) వెల్లడికానున్నాయి. యూఎస్ ఫెడ్ మినిట్స్ గురువారం విడుదల అవుతాయి. జపాన్ జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు ఈనెల 18న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. కార్పొరేట్ ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం చివరి దశకు చేరుకుంది. కోల్ ఇండి యా, ఐషర్ మోటార్స్, గ్రాసీం ఇండస్ట్రీస్, స్పైస్ జెట్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అం బుజా సిమెంట్స్, నెస్లేలతో సహా బీఎస్ఈలో నమోదైన 1,000కు పైగా కంపెలు ఈ వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. ద్రవ్యోల్బణ ఆందోళనలు అంతర్జాతీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం మార్కెట్ల వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా ద్రవ్యోల్బణ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ ఈ మార్చి కంటే ముందుగానే వడ్డీరేట్లను పెంచవచ్చనే భయాలు నెలకొన్నాయి. ధరల కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్యపాలసీని కట్టడి చేసేందుకు సిద్ధమయ్యాయి. గురువారం ఫెడ్ మినిట్స్ వెల్లడి అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ మినిట్స్ గురువారం వెల్లడికానున్నాయి. ద్రవ్యపాలసీ, ద్రవ్యోల్బణంతో సహా అర్థిక వ్యవస్థ పనితీరుపై ఫెడరల్ ఓపెన్ మా ర్కెట్ కమిటీ వైఖరిని తెలియజేసే ఈ మినిట్స్ ఈక్విటీ మార్కెట్లకు దిశానిర్ధేశం చేయనున్నాయి. తారాస్థాయికి రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక సరిహద్దు వివాద ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యా ఈనెల 16న ఉక్రెయిన్‌పై దాడి చేయవచ్చని అమెరికా నిఘా వర్గాలు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం ఇచ్చాయి. యూఎస్‌తో సహా పలు దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కి వచ్చేయాలని కోరుతున్నాయి. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ ఫిబ్రవరి తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.14,935 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.10,080 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.4,830 కోట్లను, హైబ్రిడ్ సిగ్మెంట్ నుంచి రూ.24 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, బాండ్ ఈల్డ్స్ పెరుగుదల భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారని మార్నింగ్‌స్టార్ ఇండియా ఎండీ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ నిర్ణయాలు, కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు మార్కెట్ పనితీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, మూడో దశ కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో గతవారంలో సెన్సెక్స్ 1445 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 17,450 వద్ద మద్దతు స్థాయి, ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని కలిగి ఉంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ్ శెట్టి తెలిపారు. రేపటి నుంచి ‘పాలసీ’ సమావేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమై గురువారం ముగిస్తుంది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేందుకు మొగ్గుచూపుతున్న వేళ ఆర్బీఐ ద్రవ్యవిధాన వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రపంచ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 90 డాలర్లపైకి చేరడం ఆర్బీఐకి మరో సమస్యగా మారింది. కీలక దశలో కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్, ఏసీసీ, భాష్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, హిందాల్కో, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీతో సహా బీఎస్ఈలో నమోదైన 1600కు పైగా కంపెలు ఇదే వారంలో తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. భయపెడుతున్న బాండ్ ఈల్డ్స్ రాబడులు భారత ప్రభుత్వ పదేళ్ల బాండ్ల రాబడి గతవారం రెండేళ్ల గరిష్టం 6.9 స్థాయికి చేరింది. యూఎస్ పదేళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 1.9 శాతంపైన ముగిసింది. క్రూడాయిల్ ధరల మంటలు రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ మంచు తుఫాన్లతో సప్లై అంతరాయాలు నెలకొని ముడిచమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గడిచిన ఏడు వారాల్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 26 శాతం పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్న వేళ క్రూడ్ ధరలు పెరగడం మంచిది కాదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు ఈ ఫిబ్రవరి తొలి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి రూ.6,834 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల నుంచి రూ.3,173 కోట్లను, డెట్ విభాగం నుంచి రూ.3,173 కోట్లను, హైబ్రిడ్ సెగ్మెంట్ నుంచి రూ.34 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. రేపు అదానీ విల్మర్ లిస్టింగ్ ఇటీవల ఐపీఓ పూర్తి చేసుకున్న అదానీ విల్మర్ షేర్లు మంగళవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో ఇష్యూ ధర (రూ.230) కంటే అధికంగా రూ.25–30 పలుకుతున్నాయి. ఇక ఫిబ్రవరి 4న ప్రారంభమైన మాన్యవర్ మేకర్ ‘వేదాంత ఫ్యాషన్స్’ ఐపీఓ మంగళవారం ముగియనుంది. పాలసీ సమావేశం వాయిదా ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘భారత రత్న లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల జరగాల్సిన కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గురువారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు’’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. -
మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్–సౌదీ ఆరామ్కో ఒప్పందానికి బ్రేక్ పడింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్లను భయపెడుతున్నాయి. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 25న) ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. ఈ అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సూచీలు దాదాపు రెండుశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 1051 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లను కోల్పోయాయి. కార్పొరేట్ల సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పించినప్పటికీ.., అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా మార్కెట్లో కన్సాలిడేషన్(స్థిరీకరణ)కొనసాగుతుంది. ప్రస్తుతం నిఫ్టీ 17,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. అమ్మకాలు జరిగితే 17,500 వద్ద మరో మద్దతు స్థాయి ఉంది. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేనందున రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి’’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. ట్రేడింగ్‌పై వ్యవసాయ చట్టాల రద్దు ప్రభావమెంత..? కొద్ది నెలలుగా కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య వివాదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర శుక్రవారం మోదీ ప్రకటించారు. ‘‘వాస్తవానికి మూడు చట్టాలు వ్యాపార అనూకూలమైనవి. ఈ చట్టాలు అమల్లో లేనందున ట్రేడింగ్‌పై పెద్దగా ఉండకపోవచ్చు. అయితే కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గడం, మార్కెట్లో నెలకొన్న అస్థిరత పరిస్థితుల దృష్ట్యా చట్టాల రద్దు అంశం ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ కు మంగళం రిలయన్స్ – సౌది ఆరాకో ఒప్పందానికి మరోసారి బ్రేక్ పడింది. సౌదీ అరామ్కోకు తన 20 శాతం వాటా విక్రయ ఒప్పందాన్ని మరోసారి మూల్యాంకనం చేయాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ ఎక్సే్చంజీలకు సమాచారం ఇచ్చింది. ఒప్పంద రద్దు ధీర్ఘకాలంలో రిలయన్స్ షేరుపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోవచ్చని అయితే స్వల్పకాలం పాటు తీవ్ర ఒడిదుడుకులను లోనుకావచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20 శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ భావించిన సంగతి తెలిసిందే. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 25న) నిఫ్టీ సూచీకి చెందిన నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మార్కెట్లో ఒడిదుడుకులు ఉండొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల తేది ఈ గురువారంతో ముగియనుంది. సూచీలు జీవితకాల గరిష్టస్థాయికి చేరడంతో పలు షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆటో కంపెనీలు సెపె్టంబర్ వాహన విక్రయ గణాంకాలను శుక్రవారం విడుదల చేయనున్నాయి. అదే రోజున కేంద్ర గణాంకాల శాఖ సెపె్టంబర్ తయారీ రంగ డేటాను, ఆర్బీఐ సెపె్టంబర్ 24తో ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వల గణాంకాలను విడుదల చేయనున్నాయి. ఈ వారంలోనే ఒక ఐపీఓతో పాటు మరో లిస్టింగ్ ఉంది. ఈ పరిమాణాల దృష్ట్యా ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు తదితర అంశాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని నిపుణులు అంటున్నారు. టెలికాం, టెక్, క్యాపిటల్ గూడ్స్, ఇంధన ఆటో రంగాల షేర్లు రాణించడంతో గతవారంలో సెన్సెక్స్ 1033 పాయింట్లు ఆర్జించింది. తొలిసారి 60వేల పైన ముగిసింది. నిఫ్టీ 268 పాయింట్లు లాభపడింది. సూచీలకిది వరుసగా ఐదోరోజూ లాభాల ము గింపు కావడం విశేషం. ‘సూచీలు భారీ వ్యాల్యూవేషన్లతో ట్రేడ్ అవుతున్న తరుణంలో ట్రేడర్లు అప్రమత్తత వహించవచ్చు. దీంతో లాభాలు పరిమితం గా ఉండొచ్చు. నిఫ్టీకి ఎగువస్థాయిలో 18,000 స్థాయి వద్ద బలమైన నిరోధం ఉంది. లాభాల స్వీకరణ జరిగితే 17,500 వద్ద తక్షణ మద్దతు ఉంది’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. జోరుగా విదేశీ పెట్టుబడులు దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐల) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ సెపె్టంబర్ 1–24 తేదిల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ. 21,875 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,536 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.8,339 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దేశీయ ఈక్విటీలపై ఎఫ్ఐఐల బుల్లిష్ వైఖరి కొనసాగితే సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగ వచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఆదిత్య బిర్లా సన్ ఐపీఓ అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓ సెపె్టంబర్ 29న (బుధవారం) మొదలై అక్టోబర్ ఒకటవ తేదిన ముగియనుంది. ధరల శ్రేణిని రూ.695–712 గా నిర్ణయించారు. కంపెనీ ఇష్యూ ద్వారా 3.88 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. ఇందులో ఆదిత్య బిర్లా క్యాపిటల్ 28.5 లక్షలకు పైగా షేర్లను విక్రయించనుండగా, సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ 3.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2,768.25 కోట్లను సమీకరించనుంది. కనీసం ఒక లాట్ సైజ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఐపీఓ ప్రక్రియ పూర్తైన తర్వాత షేర్లు అక్టోబర్ 11న ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌కానున్నాయి. శుక్రవారం పరస్ డిఫెన్స్ షేర్ల లిస్టింగ్ పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాల జీస్ షేర్లు శుక్రవారం ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ కానున్నాయి. ధరల శ్రేణిని రూ.165 – 175గా నిర్ణయించి కంపెనీ రూ.170.70 కోట్లను సమీకరించింది. ఈ ఐపీఓ ఏకంగా 304 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 71.4 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.., 217 కోట్లకుపైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (క్విబ్) విభాగంలో 170 రెట్లు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 928 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. -
ఇంట్రాడే నష్టాలు రికవరీ
ముంబై: మిడ్‌సెషన్ నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రెండోరోజూ ఫ్లాట్‌గానే ముగిశాయి. ఇంట్రాడేలో 484 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 85 పాయింట్ల నష్టంతో 51,849 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 115 పాయింట్ల కనిష్టం నుంచి కోలుకుని చివరకు ఒక పాయింటు స్వల్ప లాభంతో 15,576 వద్ద నిలిచింది. తొలి భాగంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, రెండో సెషన్లో దిగువ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రూపాయి మూడోరోజూ పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఫార్మా, షేర్లు రాణించి సూచీలకు రికవరికి సహకారం అందించాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రధాన సూచీలు తడబాటుకు లోనైప్పటికీ.., మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరగడం విశేషం. నిఫ్టీ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒక టిన్నర % లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 921 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.242 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. మిడ్‌సెషన్ నుంచి రికవరీ... దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 176 పాయింట్లను కోల్పోయి 51,749 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పతనమైన 15,520 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలిసెషన్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యతనివ్వడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 484 పాయింట్లు పతనమై 51,451 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు నష్టమై 15,460 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలకు ఊరటనిచ్చింది. అలాగే దిగువ స్థాయిలో సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు రాణించడంతో సూచీలు మార్కెట్ ముగిసే సరికి దాదాపు నష్టాలన్నీ పూడ్చుకోగలిగాయి. ‘‘ఆర్బీఐ పాలసీ సమావేశాల నేపథ్యంలో రెండోరోజూ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగాయి. ప్రైవేటీకరణ జాబితాను కేంద్రం త్వరలో ఖరారు చేస్తుందనే ఆశలతో ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) షేర్లు రాణించాయి. నిఫ్టీ ఇండెక్స్ మరికొంత కాలం 15,500 స్థాయిని నిలుపుకొంటే, అప్‌సైడ్‌లో ఆల్‌టైం హై (15,661) స్థాయిని మరోసారి పరీక్షించవచ్చు. ఇక దిగువస్థాయిలో 15,431 వద్ద, 15300 వద్ద బలమైన మద్దతు స్థాయిలను కలిగి ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ క్యూ4 ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత ఇన్వెస్టర్లు ఈ షేరును అమ్మేందుకు మొగ్గుచూపారు. దీంతో ఐటీసీ షేరు మూడు శాతం నష్టపోయి రూ.209 వద్ద స్థిరపడింది. ► ఇన్సైడర్ కేసులో సెబీ తాజా ఆదేశాల ఫలితంగా ఇన్ఫోసిస్ అంతర్గత దర్యాప్తును చేపట్ట డంతో కంపెనీ షేరు విక్రయాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో అరశాతం నష్టంతో రూ.1,380 వద్ద ముగిసింది. ► ఆటో కాంపొనెంట్స్ కంపెనీ మదర్సన్ సుమీ షేరు 13 ర్యాలీ చేసి రూ.269 వద్ద ముగిసింది. క్యూ4లో కంపెనీ 8 రెట్ల నికరలాభాన్ని ప్రకటించడం ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: స్టాక్ మార్కెట్ లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ భయాలతో పాటు ఆర్థిక రికవరీపై ఆందోళనలు మరోసారి మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీశాయి. అలాగే డాలర్ మారకంలో రూపాయి విలువ 75 స్థాయికి దిగివచ్చింది. అమెరికాలో సంపన్నులపై అధిక పన్నులు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఇంట్రాడేలో 596 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరకు 202 పాయింట్ల నష్టంతో 47,878 వద్ద ముగిసింది. అలాగే 188 పాయింట్ల రేంజ్లో ట్రేడైన నిఫ్టీ 64 పాయింట్లను కోల్పోయి 14,341 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మీడియా, ఆర్థిక రంగాల షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లోనూ మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్లు రాణించాయి. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు అరశాతం లాభంతో ముగి శాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,361 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,696 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి ఆరు పైసలు బలహీనపడి 75.01 వద్ద స్థిరపడింది. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 953 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. సూచీలకిది వరుసగా మూడోవారమూ నష్టాల ముగింపు. ‘‘కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేళ దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున వెనక్కి తీసుకుంటున్నారు. స్థానిక లాక్డౌన్లతో ఆర్థి్థక కార్యకలాపాలు స్తంభించి కంపెనీల ఆదా యాలు క్షీణింవచ్చనే భయాలు ఇప్పటికీ ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చొరవతో స్వల్పకాలంలో అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా అభిప్రాయపడ్డారు. ► ఇటీవల ఐపీఓకు పూర్తి చేసుకున్న నజరా టెక్ కంపెనీ మార్చి క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఫలితంగా షేరు ఐదు శాతం లాభపడి రూ.1,692 వద్ద నిలిచింది. ► కోవిడ్ ఔషధ తయారీకి డీసీజీఐ నుంచి అనుమతి తో క్యాడిల్లా హెల్త్‌కేర్ 4% ర్యాలీ చేసి రూ.576 వద్ద స్థిరపడింది. -
ఒడిదుడుకుల ట్రేడింగ్..!
స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్ఛేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాల పాటు ఇదే వారంలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. గత వారాంతాన విడుదలైన దేశ క్యూ2(జూలై– సెప్టెంబర్)జీడీపీ గణాంకాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగడం, అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బిడైన్ పాలన దిశగా అడుగులు వేయడం లాంటి అంశాలతో గతవారం సెన్సెక్స్ 267 పాయింట్లను, నిఫ్టీ 110 పాయింట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే. తగిన స్థాయిలో వాహన విక్రయాలు దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం తమ నవంబర్ నెల వాహన విక్రయ గణాంకాలను విడుదల చేయనున్నాయి. దీంతో ఈ వారంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఆశోక్ లేలాండ్, ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎస్కార్ట్స్ లాంటి ఆటో కంపెనీల షేర్లు అధిక పరిమాణంతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. పండుగ సీజన్‌తో ప్యాసింజర్ వాహన విక్రయాల్లో వృద్ధి కనబడే అవకాశం ఉందని, వ్యవస్థలో రికవరీతో వాణిజ్య వాహన అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో మెరుగైన వర్షాలతో ట్రాక్టర్ అమ్మకాలు పెరిగి ఉండొచ్చని, ద్వి – చక్ర వాహన విభాగపు అమ్మకాల్లో మాత్రం ఫ్లాట్ లేదా స్వల్ప క్షీణత నమోదు కావచ్చని వారంటున్నారు. పాలసీ సందర్భంగా జాగరూకత! ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ సమావేశం డిసెంబర్ 2న (బుధవారం) ప్రారంభమవుతుంది. కమిటీ డిసెంబర్ 4న(శుక్రవారం)తన నిర్ణయాలు ప్రకటించనుంది. మూడురోజుల పాటు జరిగే ఈ సమావేశ నిర్ణయాలు స్టాక్ మార్కెట్‌కు ఎంతో కీలకం కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సర్దుబాటు ద్రవ్య విధానానికి కట్టుబడుతూ పాలసీ కమిటీ కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 4 శాతం గానూ, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి. అండగా ఎఫ్ఐఐల పెట్టుబడులు.. ఈ నవంబర్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 65,317 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలను కొన్నారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని గణాంకాలు చెబుతున్నాయి. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చే అంశమని నిపుణులంటున్నారు. అమెరికా, యూరప్ దేశాల కేంద్ర బ్యాంకుల మానిటరీ పాలసీ సమావేశాల నేపథ్యంలో ఎఫ్ఐఐలు స్వల్పకాలం పాటు దేశీయ మార్కెట్లోకి తమ పెట్టుబడులను తగ్గించుకోవచ్చని అంటున్నారు. అయితే దీర్ఘకాలం దృష్ట్యా భారత మార్కెట్ల పట్ల ఎఫ్ఐఐలు బుల్లిష్‌గానే ఉన్నట్లు నిఫుణులంటున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం... ఈ వారంలో అమెరికా, ఐరోపా, చైనాతో జపాన్ దేశాలు నవంబర్ నెల పీఎంఐ గణాంకాలను విడుదల చేయనున్నాయి. వారాంతపు రోజున యూఎస్ నిరుద్యోగ గణాంకాలు, యూరప్ దేశాల అక్టోబర్ రిటైల్ విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. అలాగే ఓపెక్ సమావేశం కూడా నవంబర్ 30న ప్రారంభమై, డిసెంబర్ 1న ముగుస్తుంది. వ్యాక్సిన్ ఆశలతో నవంబర్‌లో క్రూడాయిల్ ధరలు 28 శాతం పెరిగాయి. దీంతో ఓపెక్ క్రూడ్ ధరలను పెంచదని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం బర్గర్ కింగ్ ఐపీఓ ప్రారంభం... ప్రముఖ చెయిన్ రెస్టారెంట్ల సంస్థ బర్గర్ కింగ్ ఐపీఓ డిసెంబర్ 2 న ప్రారంభమై డిసెంబర్ 4 న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.59 – 60 గా నిర్ణయించారు. ఇష్యూ ద్వారా కంపెనీ రూ.810 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 450 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ప్రమోటర్ల వాటాలో క్యూఎస్ఆర్ ఆసియా పీటీఈ లిమిటెడ్ 6 కోట్ల షేర్లను అమ్మనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఐపీఓ అనంతరం డిసెంబర్ 14న షేర్లను ఎక్చ్సేంజీల్లో లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది(2020)లో బర్గర్ కింగ్ ఐపీఓ 14వది. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. మంగళవారం నాడు స్టాక్ మార్కెట్ యధావిధిగా పనిచేస్తుంది. -
అంతర్జాతీయ సంకేతాలే కీలకం...
ప్రధాన ఆర్థిక గణాంకాలేమీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్‌కు అంతర్జాతీయ సంకేతాలే కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి... ఈ అంశాలు కూడా తగినంత ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెంబర్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ప్రధాన ట్రిగ్గర్లు ఏమీ లేకపోవడంతో అనిశ్చితి కొనసాగుతుందని, అందుకే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచ పీఎమ్ఐ గణాంకాలు.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ తక్షణ తాయిలాలేమీ ఇవ్వకపోవడం గత వారం ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ను కూడా దెబ్బతీసింది. సున్నా స్థాయి రేట్లు మరో మూడేళ్ల పాటు కొనసాగుతాయని సంకేతాలిచ్చిన ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అనిశ్చితిని వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అమెరికా, ఇంగ్లాండ్, యూరోజోన్‌ల పీఎమ్ఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు ఈ వారం విడుదలవుతాయి. ఈ వారం మూడు ఐపీఓలు.... ఈ వారంలో మూడు కంపెనీల ఐపీఓలు వస్తున్నాయి. క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లతో సందడి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులు రూ.3,944 కోట్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో రూ.3,944 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.1,766 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.2,178 కోట్ల చొప్పున ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ జోరుగా బాండ్లను కొనుగోలు చేస్తుండటంతో బాండ్ల రాబడులు తక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా అధికంగా లభిస్తున్న లిక్విడిటీ... ఈ కారణాల వల్ల మన మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వస్తున్నాయని నిపుణులంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను సున్సా స్థాయిల్లోనే మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని వారంటున్నారు. ఐపీఓల సందడి చాలా రోజుల తర్వాత ఈ నెలలో ప్రైమరీ మార్కెట్లో ఐపీఓల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ నెలలో హాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్స్ తమ ఐపీఓలతో దుమ్ము రేపాయి ఇక ఈ వారం మూడు కంపెనీలు–క్యామ్స్(కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్), కెమ్‌కాన్ స్పెషాల్టీ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్ కంపెనీలు తమ ఐపీఓలతో సందడి చేయనున్నాయి. ఈ ఐపీఓలకు సంబంధించిన తేదీలు, ప్రైస్‌బాండ్, జీఎమ్‌పీ తదితర వివరాలు..... -
సెన్సెక్స్ 36,980పైన... ర్యాలీ వేగవంతం
పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా, ప్రతీ చిన్న క్షీణతలోనూ సైతం పెట్టుబడులు వెల్లువెత్తుతున్నందున, భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ కొద్దిపాటి ఒడిదుడుకులకు లోనైనా, గతవారం పటిష్టంగానే ట్రేడయ్యాయి. కొన్ని కార్పొరేట్లు వెల్లడించిన త్రైమాసికపు ఫలితాలు, ఆ సందర్భంగా ఆయా కంపెనీలు చేసిన ప్రకటనలే గతవారపు స్వల్ప హెచ్చుతగ్గులకు కారణం. ఇక భారత్ విషయానికొస్తే బ్యాంకింగ్ షేర్ల నుంచి ఇతర రంగాలకు పెట్టుబడుల మళ్లింపు కొనసాగుతోంది. గతవారంరోజుల్లోనే బ్యాంక్ నిఫ్టీ ఇటీవలి గరిష్టస్థాయి నుంచి 8 శాతం వరకూ నష్టపోవడం ఇందుకు నిదర్శనం. నిఫ్టీ మాత్రం లాభంతో ముగిసింది. అయితే తిరిగి బ్యాంకింగ్ షేర్ల తోడ్పాటుతోనే భారత్ సూచీలు...గత శుక్రవారం కీలక అవరోధస్థాయిల్ని ఛేదించాయి. ఇక స్టాక్ సూచీల సాంకేతిక అంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూలై 17తో ముగిసినవారం ప్రథమార్ధంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన కీలక 200 రోజుల చలన సగటు రేఖ (200 డీఎంఏ) సమీపంలో గట్టి నిరోధాన్ని చవిచూసి 35,877 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ, ద్వితీయార్ధంలో వేగంగా కోలుకుని 200 డీఎంఏను ఛేదించింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 426 పాయింట్ల లాభంతో 37,020 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం 36,980 సమీపంలో వున్న 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖను సెన్సెక్స్ అధిగమించినందున, ఈ స్థాయిపైన స్థిరపడితే రానున్న రోజుల్లో ర్యాలీ మరింత వేగవంతం కావొచ్చు. ఈ స్థాయిపైన సెన్సెక్స్ నిలదొక్కుకుంటే, కోవిడ్ కారణంగా పతనానికి దారితీసిన మార్చి తొలివారంనాటి బ్రేక్‌డౌన్ స్థాయి అయిన 37,740 పాయింట్ల స్థాయిని త్వరలో అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం ఛేదించగలిగితే, వచ్చే కొద్దిరోజుల్లో క్రమేపీ 38,380 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్సు వుంటుంది. పైన ప్రస్తావించిన 36,980 పాయింట్లస్థాయిపైన సెన్సెక్స్ నిలదొక్కుకోలేకపోతే 36,525 సమీపంలో తొలి మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 36,030 వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 35,870 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక స్థాయి 10,872... గత మంగళవారం నిఫ్టీ కీలకమైన 200 డీఎంఏ రేఖ సమీపస్థాయి 10,890 పాయింట్ల వరకూ పెరిగి, వెనువెంటనే 10,562 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అటుతర్వాత అంతేవేగంతో రిక వరీ అయ్యి, కీలక అవరోధస్థాయిని దాటి, 10,933 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 134 పాయింట్ల లాభంతో 10,902 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,872 పాయింట్ల స్థాయి నిఫ్టీకి ఈ వారం కీలకం. ఈ స్థాయిపైన 11,035 పాయింట్ల వరకూ వేగంగా పెరిగే అవకాశం వుంటుంది. ఈ స్థాయిపైన ముగిస్తే, స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, క్రమేపీ కొద్దిరోజుల్లో 11,245 వరకూ ర్యాలీ జరిపే ఛాన్స్ వుంటుంది. ఈ వారం నిఫ్టీ 10,872 పాయింట్ల స్థాయిని పరిరక్షించుకోలేకపోతే 10,750 సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,595 వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 10,560 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
ఒడిదుడుకులుంటాయ్...!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఈ వారం తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను నిర్దేశిస్తాయని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ సంకేతాలు కూడా కీలకమేనని నిపుణులంటున్నారు. ఈ నెల 14(మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. నేడు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు.... మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం), టోకు ధరల ద్రవ్యోల్బణ గణాం కాలు మంగళవారం(ఏప్రిల్ 14న) వెలువడుతాయి. ఇక ఈవారం నుంచే క్యూ4 ఫలితాల సీజన్ మొద లవుతోంది. బుధవారం(ఈ నెల 15న) విప్రో, ఈ నెల 16న(గురువారం) టీసీఎస్, ఈ నెల 18న (శనివారం) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వస్తాయి. లాక్‌డౌన్‌కు, మార్కెట్‌కు లింక్! దశలవారీగానైనా లాక్‌డౌన్‌ను తొలగిస్తే, ఆర్థిక కార్యకలాపాలు పాక్షికంగానైనా పుంజుకుంటాయనే అంచనాలతో ఇటీవల మార్కెట్ భారీగా పెరిగింది. అయితే లాక్డౌన్ పొడిగింపు సూచనలే కనిపిస్తుండటం.. మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపుతుందని అంచనా. అయితే జనాలే కాదు, జీవనోపాధి కూడా ముఖ్యమేనని ప్రధాని వ్యాఖ్యానించడంతో లాక్డౌన్ నుంచి ఒకింత ఊరట లభించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కొనసాగుతున్న ‘విదేశీ’ విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సురక్షిత మదుపు సాధనాలైన పుత్తడి, డాలర్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికే విదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే భారత్ లాంటి వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కాగా ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.2,951 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.6,152 కోట్లు.. వెరసి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.9,103 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో రికార్డ్ స్థాయిలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
మార్కెట్ అక్కడక్కడే
ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకున్నా మన మార్కెట్లో మాత్రం ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో జీడీపీ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం, నవంబర్ నెల వాహన విక్రయాలు నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో వాహన, బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు మరో మూడు రోజుల్లో ఆర్బీఐ పాలసీ విధానాన్ని ప్రకటించనుండటంతో పలువురు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 8 పాయింట్ల లాభంతో 40,802 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8 పాయింట్లు తగ్గి 12,048 పాయింట్ల వద్ద ముగిశాయి. మొబైల్ చార్జీలు 40 శాతం మేర పెరగడంతో టెలికం కంపెనీల షేర్లు జోరుగా పెరిగాయి. -
స్వల్ప లాభాలతో సరి
రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 20 పైసలు నష్టపోవడం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 423 పాయింట్ల మేర కదలాడిన సెన్సెక్స్ చివరకు 86 పాయింట్ల లాభంతో 39,616 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,871 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు లాభపడగా, ఫార్మా, లోహ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 98 పాయింట్లు నిఫ్టీ 52 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. రోలర్ కోస్టర్ రైడ్‌లా ట్రేడింగ్: సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల్లోకి వచ్చింది. ఇలా లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. సెన్సెక్స్ ఏడు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే, మార్కెట్లో ఏ రేంజ్లో ఒడిదుడుకులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 251 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 173 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 424 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బడ్జెట్‌పైనే దృష్టి.... నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిధుల సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా లేకపోవడంతో ఎంపిక చేసిన బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు లాభపడ్డాయని వివరించారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు, రానున్న కేంద్ర బడ్జెడ్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కినా, వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్, లుపిన్, బేయర్ క్రాప్ సైన్స్, క్యాడిలా హెల్త్‌కేర్, మన్‌పసంద్ బేవరేజేస్, రాడికో ఖైతాన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ఇన్ఫ్రా, ఫోర్టిస్ హెల్త్‌కేర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు హావెల్స్ ఇండియా, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, చంబల్ ఫెర్టిలైజర్స్, తదితర 30కు పైగా షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ► ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా షేర్లు శుక్రవారం కూడా 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. 14% నష్టంతో రూ.45 వద్ద ముగిసింది. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ 13 శాతం నష్టపోయి 15 ఏళ్ల కనిష్ట స్థాయి, రూ.74కు పతనమైంది. గత రెండు రోజుల్లో ఈ షేర్ 25 శాతం క్షీణించింది. -
అమ్మో.. ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫలానా గుడికి వెళితే.. పదవి మటాష్ అన్న ప్రచారం ఉంటే.. నాయకులెవరూ పద విలో ఉన్నంతకాలం అటువైపు కన్నెత్తి చూడరు. అలాగే.. ఫలానా పదవి చేపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. అన్న ప్రచారం సాగితే.. దాన్ని చేపట్టేందుకు చాలా తక్కువ మంది ముందుకొస్తారు. అవే స్పీకర్, ఆర్టీసీ చైర్మన్, పీఏసీ చైర్మన్ పదవులు. తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకులంతా వీటిని చేపట్టాలంటే వెను కడుగు వేస్తారు. ఈ పదవులు చేపట్టాక రాజకీయంగా ఒడిదుడుకులు తప్పవన్న సంప్రదాయం చాలా ఏళ్లుగా రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఆర్టీసీలో అడుగుపెడితే అంతేనా ఆర్టీసీ చైర్మన్ పదవి చేపట్టినవారూ రాజకీయంగా ఇబ్బందులు పడతారన్న ప్రచారం ఉంది. గతంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన గోనె ప్రకాశ్‌రావుకు ఆ తర్వాత రాజకీయాల్లో ప్రభ తగ్గింది. క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే పదవిని చేపట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్.సత్యనారాయణ చైర్మన్‌గా తప్పుకొన్నాక ప్రత్యక్ష రాజకీయాల జోలికే వెళ్లట్లేదు. ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ కూడా తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆర్టీసీ సెంటిమెంట్ మరోసారి పునరావృతమైందంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. పీఏసీ చైర్మన్.. తెలంగాణలో పీఏసీ చైర్మన్ పదవులు చేపట్టినవారికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. గత అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 2015 ఆగస్టులో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ పదవిని కాంగ్రెస్‌కే చెందిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టారు. 2016 మార్చిలో ఆయన కూడా అనారోగ్యంతో మరణించారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అంతా ఆలోచించారు. ఆఖరికి ఆ పదవిని మరో సీనియర్ నాయకురాలు గీతారెడ్డి చేపట్టారు. 2018 ఎన్నికల్లో ఆమె కూడా ఓటమి చవిచూశారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి వల్లే గీతారెడ్డి ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు. కొనసాగిన స్పీకర్ సెంటిమెంట్ స్పీకర్ పదవిపైనా పలువురు గులాబీ నేతలు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవి చేపడితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంటు చాలా ఏళ్లుగా ఉంది. గత స్పీకర్ మధు సూదనాచారి ఓటమితో అది మరోసారి పునరావృతమైంది. గతంలో స్పీకర్‌గా వ్యవహరించిన సురేశ్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ లాంటి వారిని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. దీంతో ఈసారి స్పీకర్ పదవి ఎవరిని వరించినా వారు కూడా రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదని నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. -
ఒడిదుడుకుల వారం..
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం వచ్చే నెల 5న ఆర్బీఐ పాలసీ సమీక్ష రేట్ల కోతపై అంచనాలు న్యూఢిల్లీ: మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారం స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని నిపుణులంటున్నారు. హోలి, గుడ్ ప్రైడే కారణంగా గత వారంలో గురు, శుక్రవారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఈ దీర్ఘకాల సెలవుల అనంతరం ప్రారంభం కానున్న ఈ వారం స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల విక్రయాల గణాంకాలను ఈ శుక్రవారం(ఏప్రిల్ 1న) వాహన కంపెనీలు వెల్లడించనున్నందున ఆ కంపెనీ షేర్లు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వారం కూడా ఇదే. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలో గురువారం నాడు(మార్చి 31న) ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేయనున్న నేపధ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. రేట్ల కోత కీలకం.. వచ్చే నెల 5న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. సమీప కాలంలో స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నదని సింఘానియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు... స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య సమీక్షపైననే తర్వాతి దశ స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్)వినోద్ నాయర్ చెప్పారు. ఈ సమీక్షలో సానుకూల నిర్ణయం వెలువడితే స్టాక్ మార్కెట్ మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు. పరిమితశ్రేణిలో ట్రేడింగ్.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమితశ్రేణిలో ట్రేడవుతుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభమయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని వివరించారు. చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లను తగ్గించినందున ఆర్బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలు సర్వత్రా నెలకొన్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవుతోందని, తాజాగా పొజిషన్లు తీసుకోవడం ద్వారా ట్రేడర్లు.. స్టాక్ మార్కెట్ పెరిగితే లాభపడతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా మార్కెట్ మరింత బలహీనపడవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) వైభవ్ అగర్వాల్ చెప్పారు. ఆర్బీఐ రేట్ల కోత, కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు మార్కెట్ పెరగడానికి దోహద పడవచ్చని పేర్కొన్నారు. ఒడిదుడుకులున్నప్పటికీ, స్టాక్ సూచీలు తమ జోరును కొనసాగిస్తాయని యెస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ చెప్పారు. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగానే ఉంటుందని వివరించారు. భారత్‌తో సహా అన్ని వర్ధమాన దేశాలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు కీలకం కానున్నదని వివరించారు. మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు (1.54 శాతం)లాభపడి 25,338 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు(1.47 శాతం) లాభపడి 7,717 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లో రూ.16,500 కోట్లు (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)ఈ నెల 23 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ.15,660 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.816 కోట్లు పెట్టుబడుటు పెట్టారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.