స్వల్ప లాభాలతో ముగింపు
ముంబై: అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే రిలయన్స్ (1.45%)తో పాటు మెటల్, ఇంధన, ఆటో షేర్లూ రాణించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 672 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 105 పాయింట్ల లాభంతో 72,748 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 207 పాయింట్ల రేంజ్‌లో 22,124 వద్ద గరిష్టాన్ని, 21,917 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.
ఆఖరికి 32 పాయింట్లు పెరిగి 22,056 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ తర్వాత ఇటీవల దిగివచి్చన నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ,, ప్రైవేటు బ్యాంకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ స్వల్పంగా 0.4% లాభపడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment