న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వస్తు ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకుల బాటలోనే కొనసాగుతున్నాయి. నవంబర్‌లో క్షీణతను నమోదుచేసుకున్న ఈ కీలక రంగం డిసెంబర్‌లో స్వల్పంగా ఒక శాతం పెరుగుదలను నమోదుచేసుకుంది. విలువలో ఇది 38.45 బిలియన్ డాలర్లు. అయితే వస్తు దిగుమతుల విభాగం మాత్రం క్షీణతలోనే కొనసాగింది. విలువ 4.85 శాతం తగ్గి 58.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు– దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.80 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
కొన్ని ముఖ్యాంశాలు...
► పెట్రోలియం ప్రొడక్టులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, తోలు ఉత్పత్తులుసహా పలు విభాగాల్లో డిసెంబర్ ఎగుమతులు తగ్గాయి.
► ప్లాస్టిక్, ఎల్రక్టానిక్ గూడ్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల విభాగాలు వృద్ధిని నమోదుచేసుకున్నాయి.
► క్రూడ్ దిగుమతులు సమీక్షా నెలలో 22.77% తగ్గి 15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
► పసిడి దిగుమతులు మాత్రం 156 శాతం ఎగసి 3 బిలియన్ డాలర్లుకు చేరాయి.
9 నెలల్లో క్షీణతే..
మరోవైపు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో భారత్ వస్తు ఎగుమతులు 5.7 శాతం క్షీణించి 317.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా ఇదే కాలంలో 7.93% క్షీణించి 505.15 బిలియన్ డాలర్లుకు దిగాయి. వెరసి వాణిజ్యలోటు 188.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ఈ లోటు 212.34 బిలియన్ డాలర్లు.
సేవల రంగం కూడా నిరాశే...
సేవల రంగం ఎగుమతులు డిసెంబర్‌లో క్షీణతను నమోదుచేసుకుని, 27.88 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2022 ఇదే కాలంలో ఈ విలువ 31.19 బిలియన్ డాలర్లు. ఇక ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఈ విలువ 239.5 బిలియన్ డాలర్ల నుంచి 247.92 బిలియన్ డాలర్లకు ఎగసింది.
ఒడిదుడుకుల బాటనే ఎగుమతులు
Published Wed, Jan 17 2024 5:25 AM | Last Updated on Wed, Jan 17 2024 5:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment