micro
-
సూక్ష్మ సేద్యం.. ఏపీకి 4వ స్థానం
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023–24 సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. సూక్ష్మ సేద్యం పరికరాలు రైతులకు ఇవ్వడం లేదని, సూక్ష్మ సేద్యాన్ని అటకెక్కించారంటూ కూటమి నేతలు ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో నిజం లేదనే విషయం అదే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఎలుగెత్తి చాటింది. గత ఆర్థిక ఏడాదిలో 2.05 లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచి్చనట్టు సర్వే తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో రూ.793.67 కోట్లు సాయం అందించిందని, తద్వారా 26 జిల్లాల్లో 75,035 మంది రైతులు ప్రయోజనం పొందారని సర్వే పేర్కొంది. టాప్–20లో ఐదు జిల్లాలు ఏపీవే 2023–24లో సూక్ష్మ సేద్యంలో దేశంలోని టాప్ 20 జిల్లాల్లో ఐదు జిల్లాలు (అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య) ఏపీలోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వైఎస్సార్ జిల్లా పులివెందుల మండల ఇ–కొత్తపల్లి గ్రామ పంచాయతీ సూక్ష్మ సేద్యంలో ఉత్తమ పద్ధతులు, విధానాలను అమలు చేయడంతో ఆ గ్రామాన్ని ‘వన్ డ్రాప్.. మోర్ క్రాప్’ జాతీయ వర్క్‌షాపు ప్రశంసించిందని సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం ప్రయోజనాలపై అధ్యయనం ప్రకారం 18 నుంచి 20 శాతం వరకు అదనపు విస్తీర్ణం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు తేలిందని, అలాగే 35 నుంచి 60 శాతం ఉత్పాదకత పెరిగిందని, 35 నుంచి 40 శాతం విద్యుత్ ఆదా అయిందని, 40 నుంచి 45 శాతం ఎరువులు ఆదా అయ్యాయని, సాగు వ్యయం 18 శాతం తగ్గిందని, నికరాదాయం 75 శాతం పెరిగిందని సర్వే వివరించింది. సూక్ష్మ సేద్యంతో నీరు, విద్యుత్, ఎరువులు, కూలీ వేతనాల్లో భారీ ఆదాతో పాటు అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొంది. సూక్ష్మ సేద్యంలో హెక్టార్‌కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుందని, హెక్టార్‌కు రూ.1,15,000 అదనపు ఆదాయం వస్తుందని సర్వే తెలిపింది. -
మహిళా సూక్ష్మ సంస్థలకు సంక్షోభాల రిస్క్
న్యూఢిల్లీ: మహిళల ఆధ్వర్యంలో నడిచే మెజారిటీ సూక్ష్మ సంస్థల వద్ద అత్యవసర నిధులు లేవని, ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైతే వీటిపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఓ నివేదిక తెలిపింది. మహిళలు నిర్వహించే సూక్ష్మ సంస్థల ఆర్థిక పరిస్థితులపై ‘మైక్రోసేవ్ కన్సల్టింగ్’ (ఎంఎస్సీ) అనే సంస్థ సాధాన్ సహకారంతో అధ్యయనం నిర్వహించింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల పరిధిలో ఇది జరిగింది. 1,460 కంప్యూటర్ ఆధారిత వ్యక్తిగత ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించింది. వ్యాపార నిర్వహణ పరంగా ఆర్థిక నిర్ణయాలు ఎలా తీసుకునేది, సవాళ్లు, ప్రేరణల గురించి మహిళలు తమ అంతరంగాన్ని ఈ సంస్థతో పంచుకున్నారు. ముఖ్య అంశాలు.. → ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం కావాల్సిన నిధులు లేవని 45 శాతం మహిళా వ్యాపారవేత్తలు తెలిపారు. → వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక అంశాలను వేర్వేరుగా నిర్వహించే విషయంలో చాలా మంది సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో న గదు నిర్వహణ సంక్లిష్టంగా మా రడమే కాకుండా, కచ్చితమై న ఆర్థిక రికార్డుల నిర్వహణ లో రాజీపడాల్సి వస్తోంది. → 60 శాతం మంది మహిళా వ్యాపారవేత్తలు తమ సంస్థలకు సంబంధించి లిఖితపూర్వక రికార్డులు నిర్వహించడం లేదు. లాభాలు, వ్యాపార కార్యకలాపాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున ప్రత్యేకమైన రికార్డుల నిర్వహణ అవసరం లేదని వీరిలో 55 శాతం మంది భావిస్తున్నారు. మిగిలిన వారు రికార్డుల నిర్వహణలో ఉన్న సంక్లిష్టతలను వ్యక్తపరిచారు. రికార్డులు నిర్వహించకపోవడంతో వ్యాపార పనితీరు, ఆర్థిక సామర్థ్యాలను సమీక్షించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. → ఇక ఈ సంస్థల్లో 55% మంది ఎలాంటి ఉద్యోగులను కలిగి లేవు. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఉపా ధి కల్పనకు ఇవి ఏమంత తోడ్పడడం లేదు. -
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్‌ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల -
కిచెన్‌లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్‌కి చెక్!
మైక్రోప్లాస్టిక్‌లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్‌కు చెక్‌పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్‌లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్‌లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్‌లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్‌ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్‌ల కణాల డోస్‌ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్‌స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
మార్కెట్ల ప్రవేశం, కస్టమర్లను కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: మార్కెట్లలోకి ప్రవేశించలేకపోవడం, కస్టమర్లను కాపాడుకోవడం, తమ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేసుకోలేకపోవడం వంటి ప్రధాన సవాళ్లను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) ఎదుర్కొంటున్నాయి. మార్కెటింగ్‌కు సంబంధించి సవాళ్లు వాటి వృద్ధికి అవరోధంగా ఉంటున్నాయి. ఈ వివరాలను ‘కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్’(ఐసీఆర్ఐఈఆర్) సర్వే తెలిపింది. 2022 నవంబర్ 4 నుంచి 2023 జనవరి 20 మధ్య కాలంలో 2,007 ఎంఎస్ఎంఈల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకుంది. ఇందులో 65 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. 19 శాతం చిన్నవి కాగా, 16 శాతం మధ్య స్థాయి సంస్థలు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను విక్రయ మార్గాలుగా ఎంపిక చేసుకుంటున్న ఎంఎస్ఎంఈలు ప్రధానంగా యువ, విద్యావంతులైన వారి నిర్వహణలో ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఇతర ఎంఎస్ఎంఈలతో పోలిస్తే, ఎగుమతి ఆధారిత ఎంఎస్ఎంఈలలో అధిక శాతం ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై ఉన్నాయి. ఎగుమతుల పట్ల అవగాహన కలిగిన సంస్థలు, ఈ కామర్స్ సేవల వినియోగానికి అనుకూలంగా ఉన్నట్టు ఇది తెలియజేస్తోంది. సమీకృత ఎంఎస్ఎంఈలు పనితీరు, టర్నోవర్, లాభదాయకత, ఉద్యోగ ప్రయోజనాల విషయంలో మెరుగ్గా ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తెలిపింది. సదుపాయాల కొరత, రుణ సాయం లభించకపోవడం, నిపుణులైన కార్మిక శక్తి, ఆలస్యపు చెల్లింపులు ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఈ కామర్స్‌తో అవకాశాల విస్తరణ.. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 1,005 ఇప్పటికే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమయ్యాయి. మిగిలిన 1,002 ఈ కామర్స్‌పై నమోదు కానివి. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానం కావడం వల్ల కేవలం మార్కెట్ విస్తరణ అవకాశాలు పెరగడమే కాకుండా, రుణ సదుపాయానికి అవకాశం ఉంటుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. సమ్మిళిత వృద్ధికి ఎంఎస్ఎంఈలు కీలకమని పేర్కొంటూ.. అవి డిజిటల్‌గా పరివర్తనం చెందడం ఎంతో అవసరమని ఈ సర్వే ప్రస్తావించింది. ఈ కామర్స్ వేదికల ద్వారా మరిన్ని భౌగోళిక ప్రాంతాలకు విస్తరించే అవకాశాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన ఉన్నట్టు పేర్కొంది. ఎంఎస్ఎంఈలు టెక్నాలజీ సాయంతో మార్కెట్ అనుసంధానాన్ని పెంచుకునేందుకు, వాటికి ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర రుణ హామీ పథకం తదితర ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా, వాటి మధ్య స్థిరీకరణ అవసరమని ఎంఎస్ఎంఈలు అభిప్రాయపడ్డాయి. విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అసవరాన్ని కూడా ప్రస్తావించాయి. సమగ్ర ఎంఎస్ఎంఈ విధానం ఉండాలని, ఒకే వేదికగా అన్ని ప్రయోజనాలు పొందేలా అవకాశం కలి్పంచాలని పేర్కొన్నాయి. ఈ ప్రయోజనాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన కలి్పంచాలని కూడా అభిప్రాయపడ్డాయి. -
వామ్మో రూ. 1.15 కోట్లు.. ఇది టీవీ ధర!
Samsung Micro LED TV: కోటి రూపాయల కంటే ఖరీదైన టీవీ గురించి ఎప్పుడైనా విన్నారా? రూ.1 కోటి కంటే ఎక్కువ ఖరీదు చేసే టీవీని ప్రముఖ టెలివిజన్ కంపెనీ భారతదేశంలో విడుదల చేసింది. 110-అంగుళాల భారీ మైక్రో ఎల్ఈడీ టీవీని రూ. 1,14,99,000 ధరకు శాంసంగ్ తాజాగా లాంచ్ చేసింది. అల్ట్రా-ప్రీమియం వీక్షణ అనుభవాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం మైక్రో ఎల్ఈడీ టీవీని రూపొందించనట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ శామ్సంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ భూమిపై రెండో అత్యంత కఠినమైన పదార్థం నీలమణితో తయారు చేశారు. శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ ఆగస్ట్ 2 నుంచి దేశంలోని ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, శాంసంగ్ అధీకృత వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. టీవీ ప్రత్యేకతలివే.. 24.8 మిలియన్ మైక్రోమీటర్-సైజ్ అల్ట్రా-స్మాల్ ఎల్ఈడీ అంటే పెద్ద సైజు ఎల్ఈడీలలో 1/10వ వంతు. ఆకట్టుకునే డెప్త్, వైబ్రెంట్ కలర్స్, అధిక స్థాయి స్పష్టత, కాంట్రాస్ట్ ద్వారా ఈ మైక్రో ఎల్‌ఈడీలన్నీ ఒక్కొక్కటిగా కాంతి రంగును ఉత్పత్తి చేస్తాయి. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీలో మైక్రో ఎల్ఈడీతోపాటు మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్డీఆర్, మైక్రో ఏఐ ప్రాసెసర్ ఉన్నాయి. ఓటీఎస్ ప్రో, డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీలతో కూడిన అరేనా సౌండ్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. అద్భుతమైన త్రీడీ సౌండ్, సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. మైక్రో ఏఐ ప్రాసెసర్ మల్టీ-ఇంటెలిజెన్స్ ఏఐ అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్పాన్షన్+ పాత వీడియోలను కూడా మెరుగ్గా ప్రదర్శిస్తుంది. -
మైక్రో బ్యాగు.. మైండ్ బ్లోయింగ్ బ్యాగు
ఈ చిత్రాల్లో ఒకదానిలో చేతి వేలిపై ఏదో ఇసుక రేణువు, మరో చిత్రంలో ఓ హ్యాండ్‌బ్యాగ్ కనిపిస్తున్నాయా? ఇసుక రేణువుకు, హ్యాండ్ బ్యాగ్‌కు సంబంధమేంటి అంటారా? సింపుల్.. రెండూ ఒకటే. ఇలాంటి విచిత్రమైన వస్తులకు పాపులర్ అయిన యూఎస్ ఆర్టిస్ట్ కలెక్టివ్ మిస్చీఫ్.. మరొక ఆఫ్‌బీట్ ప్రొడక్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు. కేవలం మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే అతి సూక్క్ష్మ పర్స్ తయారు చేశారు. ప్రఖ్యాత ఫ్యాషన్ వస్తువుల కంపెనీ మిస్చీఫ్.. ఫొటోపాలిమర్ రెసిన్తో ఈ మైక్రోస్కోపిక్ హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేసింది. దీని పరిమాణం 700 మైక్రోమీటర్లు (అంటే మిల్లీమీటర్లో సగానికంటే ఎక్కువ). సూది రంధ్రం నుంచి సులువుగా దూరిపోగలదు. ఈ నెల 20 నుంచి దీనిని పారిస్‌లో ప్రదర్శనకు పెట్టనున్నారు. ఆ తర్వాత జూపిటర్ వేలం శాలలో వేలం వేయనున్నారు. -
Union Budget 2023-24: ఎంఎస్ఎంఈలకు చేయూత..
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 9,000 కోట్లు కేటాయించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదనంగా రూ. 2 లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఈ స్కీము ఉపయోగపడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అలాగే రుణ వ్యయం కూడా 1 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో కాంట్రాక్టులను పూర్తి చేయలేని ఎంఎస్ఎంఈలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారు. అవి జమ చేసిన లేదా సమర్పించిన పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని జప్తు చేసుకుని ఉంటే.. అందులో 95 శాతం మొత్తాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు వాపసు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలుగా ఆమె అభివర్ణించారు. ఎంఎస్ఎంఈలు, బడా వ్యాపార సంస్థలు, చారిటబుల్ ట్రస్టుల కోసం డిజిలాకర్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్రాలను ఆన్లైన్లో భద్రపర్చుకునేందుకు, అవసరమైనప్పుడు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు మొదలైన వాటితో షేర్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఉపశమనం.. ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం కల్పిస్తున్న ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విషయంలో మరింత వెసులుబాటు లభించింది. వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు, ఎంఎస్ఎంఈలు అయితే వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల వరకు ఉంటే ఆదాయపన్ను చట్టం కింద ప్రిజంప్టివ్ ఇనక్మ్ (ఊహించతగిన ఆదాయం) పథకానికి అర్హులు. తాజా ప్రతిపాదన ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్ లేదా స్థూల చెల్లింపుల స్వీకరణల్లో నగదు రూపంలో స్వీకరించే మొత్తం 5 శాతంలోపు ఉంటే ప్రిజంప్టివ్ స్కీమ్ కింద మరింత ప్రయోజనం పొందొచ్చు. అంటే తమ వార్షిక టర్నోవర్‌లో 5 శాతం లోపు నగదు స్వీకరించే సంస్థలు వార్షిక టర్నోవర్ రూ.3 కోట్ల వరకు ఉన్నా, వృత్తి నిపుణుల ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ప్రయోజనానికి అర్హులు. ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా.. వాస్తవంగా ఆ చెల్లింపులు చేసినప్పుడే అందుకు అయ్యే వ్యయాలను మినహాయించుకునే విధంగా నిబంధనలు మార్చారు. ప్రిజంప్టివ్ స్కీమ్ నిబంధనల కింద చిన్న వ్యాపార సంస్థలు తమ టర్నోవర్‌లో 8 శాతం కింద (నాన్ డిజిటల్ రిసీప్ట్స్) లాభంగాను, డిజిటల్ లావాదేవీల రూపంలో స్వీకరించినట్టయితే టర్నోవర్‌లో 6 శాతాన్ని లాభం కింద చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. -
ఎంఎస్ఎంఈల్లో వ్యాపార ఆశావహం
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లో (ఎంఎస్ఎంఈ) వ్యాపార ఆశావహం పుంజుకుంది. 2022 డిసెంబర్ వరకు ఆరు నెలల్లో వ్యాపార వృద్ధి పట్ల 71 శాతం ఎంఎస్ఎంఈలు సానుకూలంగా ఉన్నాయి. వచ్చే ఆరు నెలల్లో వ్యాపారం కుంటుపడొచ్చని కేవలం 5 శాతం మందే చెప్పారు. ఫిన్‌టెక్ సంస్థ ‘ఖాతాబుక్’ అర్ధ సంవత్సర ఎంఎస్ఎంఈ బిజినెస్ సెంటిమెంట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలతో ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనూ ఎంఎస్ఎంఈలో అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాల్లోనూ వృద్ధిని చూసినట్టు ఈ నివేదిక తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంఎస్ఎంఈల్లో సానుకూల వృద్ధి ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందంజంలో ఉన్నట్టు పేర్కొంది. 2021లో ప్రతికూల వృద్ధిని చూసిన పారిశ్రామిక సేవలు, స్టేషనరీ, హోమ్ ఫర్నిషింగ్ కంపెనీలు సైతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో సానుకూల వ్యాపారాన్ని నమోదు చేసినట్టు వివరించింది. 2022 మొదటి రెండు త్రైమాసికాల్లో ఫార్మా, సెలూన్లు, రెస్టారెంట్లు అధిక వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. సమస్యలు కూడా తక్కువే.. తమకు వ్యాపారానికి సంబంధించి పెద్ద సమస్యలు ఏమీ లేవని 66 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పాయి. దీనికి విరుద్ధంగా ఇతర ఎంఎస్ఎంఈలు డిమాండ్ బలహీనంగా ఉందని, రుణాల లభ్యత, లిక్విడిటీ సమస్యలను ప్రస్తావించాయి. 7,295 అభిప్రాయాలను సర్వేలో తెలుసుకోగా, 58 శాతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వ్యాపారం మెరుగుపడినట్టు చెప్పాయి. ఇదే కాలంలో వ్యాపారం క్షీణించినట్టు 14 శాతం ఎంఎస్ఎంఈలు తెలిపాయి. రిటైలర్లు, హోల్‌సేల్ విక్రేతలు, పంపిణీదారులు, తయారీదారుల్లో వ్యాపార సెంటిమెంట్ బలపడింది. -
ఎంఎస్ఎంఈలకు రూ.6,062 కోట్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ప్రపంచబ్యాంకు సహకారంతో కూడిన 6,062 కోట్ల పథకానికి (ర్యాంప్) ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా మార్కెట్ అనుసంధానత, రుణ సాయం మెరుగుపడనుంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ర్యాంప్ అమల్లోకి వస్తుందని ప్రభు త్వం తెలిపింది. రూ.6,062 కోట్లలో రూ.3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,312 కోట్లను కేంద్రం సమ కూరుస్తుంది. కరోనా తర్వాత ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడం తెలిసిందే. -
లఘు బీమా కంపెనీలకు వెసులుబాటు
న్యూఢిల్లీ: స్టాండెలోన్ లఘు–బీమా కంపెనీల ప్రారంభ స్థాయి మూలధన నిబంధనలను సడలించాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ భావిస్తోంది. ఇప్పటిదాకా రూ. 100 కోట్లుగా ఉన్న పరిమాణాన్ని రూ. 20 కోట్లకు తగ్గించాలని ఐఆర్డీఏఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. దేశీయంగా బీమా మార్కెట్‌ను మరింతగా విస్తృతం చేసే ఉద్దేశంతో, లఘు బీమాను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఐఆర్డీఏఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ‘కరోనా వైరస్ మహమ్మారితో లక్షల కొద్దీ ప్రజలు జీవనోపాధి కోల్పోయి పేదరికంలోకి జారిపోతున్న నేపథ్యంలో తాజా సిఫార్సులను సత్వరం అమలు చేయాల్సిన అవసరం ఉంది‘ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అనారోగ్యం, ప్రమాదాలు, మరణాలు, ఆస్తి నష్టం వంటివి అల్పాదాయ వర్గాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. తాహతుకు మించి అప్పులు చేయడం వల్ల చాలా మంది రుణాల సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీమాను మరింతగా వినియోగంలోకి తేవాలంటే ఈ రంగంలోకి మరిన్ని సంస్థలు వచ్చే పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని వివరించింది. ఇందులో భాగంగానే లఘు బీమా సంస్థల ప్రారంభ స్థాయి పెట్టుబడి పరిమితిని తగ్గించే అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది. ఇక ఒకే సంస్థ ద్వారా జీవిత బీమా, జీవితయేతర బీమా కార్యకలాపాలు కూడా సాగించేందుకు అనుమతించవచ్చని కమిటీ తెలిపింది. అలాగే, ఐఆర్డీఏఐ లేదా కేంద్ర ప్రభుత్వం.. లఘు బీమా అభివృద్ధి నిధిని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని వివరించింది. -
‘సూక్ష్మ’ పంటలో ఆరోగ్య మోక్షం!
సూక్ష్మ మొక్కల (మైక్రోగ్రీన్స్)ను సులువుగా ఇంటి దగ్గరే పెంచుకోవచ్చు. వీటిని దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా తరిగిపోతున్న వనరులు, పెరుగుతున్న భూతాపం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలను నివారించవచ్చునంటున్నారు ‘మేనేజ్’ శాస్త్రవేత్తలు సూక్ష్మ మొక్కలు.. 7 నుంచి 10 రోజుల మొక్కలు. కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్లు తదితర రకాల మొక్కలు. వీటిని 2 అంగుళాలు లేదా అంతకంటే పొడవైన తరువాత కత్తిరించి వివిధ వంటకాలలో లేదా పచ్చివైనా తినవచ్చు. చాలా సార్లు మొలకెత్తిన గింజలు, సూక్ష్మ మొక్కలకు మధ్య తేడాని గుర్తించడంలో చాలా మంది పొరపడుతుంటారు. మొలకెత్తిన గింజలను కేవలం నీరు చల్లి ఒక వస్త్రంలో మొలక కట్టి తయారు చేయవచ్చు. కానీ సూక్ష్మ మొక్కలను నీరు, టిష్యూస్ మట్టి లేదా కంపోస్టు వంటి మాధ్యమంలో పెంచడం జరుగుతుంది. మామూలుగా వంటింట్లో దొరికే వివిధ విత్తనాలను ఉపయోగించి అతి తక్కువ స్థలంలో సూక్ష్మమొక్కలను పెంచుకోవచ్చు. ♦ వీటిని తేలికగా పెంచుకోవచ్చు. సూక్ష్మ మొక్కలను రెండు ఆకుల దశలో కత్తిరించాలి. కత్తిరించిన వాటిని నీటితో శుభ్రపరిచి వంటలలో లేదా పచ్చివి అయినా తినవచ్చు. 40 రెట్లు ఎక్కువ పోషకాలు సూక్ష్మమొక్కలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. అన్నిరకాల మొక్కలు దాదాపుగా పొటాషియం, ఇనుము, జింక్, మెగ్నీషియం, కాపర్లను అధిక శాతం కలిగి ఉంటాయి. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ♦ ఎదిగిన ఆకుకూరల కంటే ఈ సూక్ష్మ మొక్కలు 4 నుంచి 40 రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వివిధ జంతు పరిశోనలలో శరీర బరువును, చెడు కొలస్ట్రాల్‌ను, కొవ్వును, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయని నిరూపితమైనది. ♦ సూక్ష్మమొక్కలను తినటం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ మొక్కలు పెద్దగా ఎదిగిన కూరగాయల మొక్కల కంటే సమానంగా, ఎక్కువగా పోషకాలను కలిగి ఉంటాయి. కావున వీటిని తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ ఎక్కువగా పోషకాలను పొందవచ్చు. పెంపకానికి కావలసినవి విత్తనాలు: అన్ని రకాల కూరగాయల విత్తనాలను ఉపయోగించుకొని సూక్ష్మ మొక్కలుగా పెంచుకోవచ్చు. ఉదాహరణకు బీట్రూట్, ముల్లంగి, ఆవాలు, తోటకూర, అవిసెలు, పెసర్లు మొదలగునవి. మిశ్రమాన్ని బట్టి రుచి సాధారణ మట్టిని ఉపయోగించి పెంచడమే కాకుండా, బలమైన మట్టి మిశ్రమం, కొబ్బరిపొట్టు, నీరు, టిష్యూస్ ఉపయోగించి కూడా పెంచుకోవచ్చు. మనం ఉపయోగించే మిశ్రమాన్ని బట్టి సూక్ష్మ మొక్కల రుచి, పోషకాలు ఆధారపడి ఉంటాయి. ట్రే / ప్లేట్లు ఈ సూక్ష్మ మొక్కలు పెంచడానికి చిన్న ట్రేలు లేదా ప్లేట్లు కావాలి. ఇవి వారం నుంచి పది రోజుల్లో కత్తిరించి వాడుకోవచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న పాత్రలను కూడా వాడుకోవచ్చు. నీరు: స్ప్రే బాటిల్‌ను ఉపయోగించి నీటిని చల్లాలి. సూక్ష్మ మొక్కలను పెంచే విధానం ♦ హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్), జాతీయ పోషకాహార సంస్థతో కలిసి ఈ సూక్ష్మ మొక్కలపై అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మమొక్కలు 7–14 రోజుల వ్యవధిలో కత్తిరించడానికి సిద్ధమవుతాయి. వాటిలోని పోషక విలువలు అవి పెరిగే మాధ్యమంపై ఆధారపడి ఉంటాయి. ♦ బలమైన మట్టిమిశ్రమం: దీనిలో మట్టి, వర్మీ కంపోస్టును 1:1 శాతంగా లేదా సమపాళ్లలో కలుపుకొని ఒక ట్రేలో తీసుకొని దానిపైన విత్తనాలను చల్లుకోవాలి. పైన మళ్లీ కొంత మిశ్రమాన్ని చల్లాలి. తరువాత నీటిని స్ప్రేయర్‌తో మెల్లగా చల్లుకోవాలి. 2 నుంచి 3 రోజుల్లో మొలకెత్తుతాయి. కొబ్బరి పొట్టు: ఒక ట్రేలో కొబ్బరి పొట్టును రెండు నుంచి మూడు అంగుళాల ఎత్తులో పరుచుకొని ఆ పైన విత్తనాలు చల్లుకోవాలి. విత్తనాలు కనపడకుండా మరోమారు కొబ్బరిపొట్టును ఒక పొరలాగా వేసుకొని నీరు చల్లుకోవాలి. ఈ ట్రేను రెండు రోజుల వరకు మూతతో కప్పి ఉంచి తరువాత రెండు రోజులు ఎండ తగిలేలా ఆరుబయట ఉంచాలి. టిష్యూస్: ముఖానికి ఉపయోగించే టిష్యూ పేపర్లను ఉపయోగించి కూడా సూక్ష్మ మొక్కలను పెంచుకోవచ్చు. ఒక ట్రేను తీసుకొని టిష్యూలను పరిచి దానిపైన నీటిని చల్లాలి. విత్తనాలను చల్లుకొని తరువాత మరలా కొద్దిగా నీటిని చల్లాలి. ఈ టిష్యూస్ తడి ఆరిపోకుండా ఎప్పుడూ కొంత నీరు చల్లుతూ ఉండాలి. విత్తనాలు వేసిన ట్రేలో తేమ ఆవిరైపోకుండా ఉండటానికి మరొక ట్రేతో కప్పి ఉంచాలి. హైడ్రోపోనిక్స్: ఒక ట్రేని తీసుకొని నీటితో నింపుకొని దానిపైన వేరొక జాలీ ట్రేని అమర్చి విత్తనాలు చల్లుకోవాలి. కింద ట్రేలో ఉన్న నీరు పైన పెట్టిన జాలీ ట్రేకి తాకే విధంగా చూసుకోవాలి. సూక్ష్మ మొక్కలను పెంచుకొనే విధానంలో దశలు 1. ముందుగా విత్తనాలను శుద్ధి పరుచుకొని పెద్ద సైజు కలిగిన వాటిని తొందరగా మొలకెత్తడం కోసం గోరువెచ్చని నీటిలో కొన్ని గంటలు లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. 2. మొలకలు వేయడానికి కావలసిన పాత్రలు లేదా ట్రేలు, మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. మట్టి మిశ్రమాన్ని 2 నుంచి 3 సెం.మీ.లు లేదా ట్రేకి 3/4వ భాగం వరకు నింపుకోవాలి. 3. విత్తనాలను మెల్లిగా సమాంతరంగా చల్లుకోవాలి. తరువాత స్ప్రే బాటిల్‌తో నీటిని చల్లుకొని మళ్లీ ఒక పొర పలుచగా మట్టిని కప్పుకోవాలి. మట్టిమిశ్రమం ఎండిపోకుండా రోజూ చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నీరు పోయటం వలన విత్తనాలు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. 4. విత్తనాల నుంచి మెలకలు 2.5 నుంచి 10 సెంటీమీటర్లు ఎత్తు ఎదిగిన తరువాత వాటిని నెమ్మదిగా కాండం నుంచి పైకి కత్తిరించి రోజు ఆహారంలో వాడుకోవాలి. (ఇంకా ఉంది)– డా. వినీత కుమారి (83672 87287),డెప్యూటీ డైరెక్టర్ (జెండర్ స్టడీస్),మేనేజ్, హైదరాబాద్. -
పారిశ్రామిక మేడలు..!
ఎచ్చెర్ల క్యాంపస్: పేరుకు పారిశ్రామిక వాడలు.. అక్కడ వెలుస్తున్నాయి కమర్షియల్ మేడలు.. నిరుద్యోగిత ముసుగులో కొంతమంది వ్యాపారులు దర్జాగా వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని, 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉండటంతో పారిశ్రామిక వాడ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. గత టీడీపీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోపాటు ఏపీఐఐసీ అధికారులతో లాలూచీ పడి పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు పొందినట్టు తెలుస్తోంది. ఇదీ ఏపీఐఐసీ లక్ష్యం... నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా పోత్సహించాలి. సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగి పది మందికి ఉపాధి కల్పించాలి. ఇదీ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన శాఖ (ఏపీఐఐసీ) లక్ష్యం. అధికారుల పర్యవేక్షణ లోపం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటు కంటే వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మాణం, అద్దెలకు ఇచ్చేందుకు ఈ పారిశ్రామికవాడ ఉపయోగపడుతుంది. ఆన్లైన్ వ్యాపార గోదాములు, కార్యాలయాలు వంటివి నిర్వహణకు అద్దెకు ఇచ్చుకునేందుకు అనువైన స్థలం కావటంతో ఎక్కువ మంది వ్యాపార సముదాయాల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్నారు. పారిశ్రామిక వాడలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు.... కుశాలపురం సమీపంలోని నవభారత్ పారిశ్రామికవాడ 16.37 ఎకరాలు విస్తరించి ఉంది. నిరుద్యోగ యువతకు పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయిస్తారు. పరిశ్రమలు మూతపడితే స్థలాలు ఏపీఐఐసీ స్వా«దీనం చేసుకుని, మరొకరికి ఇవ్వాలి. ప్రస్తుతం 55 పరిశ్రమలు ఉండగా, ఇందులో 12 పరిశ్రమలు మూతపడ్డాయి. స్టీల్, గ్రానైట్, అల్యూమినియం, గార్నటైట్, రంగులు, రీ ట్రైడ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. గత ప్రభుత్వం సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించకపోవటం, ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకోకపోవటం వంటి అంశాల వల్ల కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఇదేక్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా కమర్షియల్ కాంప్లెక్స్ (వాణిజ్య సముదాయాలు)ను నిర్మిస్తున్నారు. గతంలో పరిశ్రమల కోసం తీసుకున్న స్థలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని అద్దెకు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదు కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఈ పారిశ్రామిక వాడలో ఉండటం గమనార్హం. పరిశ్రమల స్థాపన పేరిట రాయితీలు... పరిశ్రమల ఏర్పాటు పేరుతో బ్యాంకుల నుంచి రాయితీ రుణాలు సైతం కొందరు తీసుకుంటున్నారు. వీటితో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకున్న విధంగా పరిశ్రమ నిర్మాణం చేపట్టాలి. లేదంటే అధికారులు స్థల మంజూరును రద్దు చేయాలి. ఇలా చేయడం లేదు. దీంతో నిరుద్యోగుల స్థానంలో వ్యాపారులు ప్రయోజనాలు ఎక్కువుగా పొందుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు వాణిజ్య సముదాయాలు నిర్మాణం చేపడుతున్నారు. ఏపీఐఐసీ శాఖ స్పందించకుంటే భవిష్యత్తులో ఇక్కడ సూక్ష్మ పరిశ్రమలు సైతం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల అమలుకు కృషి వాణిజ్య సమదాయాల నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకం. స్థలాలు పొందిన వారు నిబంధనలు పక్కాగా పాటించాలి. స్థలాలు తీసుకున్నప్పుడు దరఖాస్తులో పేర్కొనేలా నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు ఉండాలి. దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. – సుధాకర్, ఏపీఐఐసీ, జోనల్ మేనేజర్ -
హలో..నేనండీ.. చిట్టిపొట్టి చీమను..
ఆ రాజుగారి ఏడుగురు కొడుకులు వేట కెళ్లిన కథలో.. పుట్టలో వేలు పెడితే నే కుట్టనా అన్న చీమను నేనే.. అంతేకాదు.. చిన్నప్పుడు మీ పుస్తకాల్లో కష్టజీవి, సంఘజీవి అంటూ పొగడ్తల వర్షం కురిపించిన చీమను కూడా నేనే.. మీకు తెలుసుగా.. మేము మా బరువు కంటే 100 రెట్లు ఎక్కువ బరువును మోయగలమని.. అయితే.. అలా మోసినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారా? ఇదిగో ఇప్పుడు చూసేయండి. మావోడు ఇచ్చిన స్టిల్ చూస్తుంటే.. బాడీ బిల్డింగ్ పోటీలకు ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఇండోనేసియాకు చెందిన మాక్రో ఫొటోగ్రాఫర్ ఎకో అడియాంటో తీశారు. ఆయన సూక్ష్మ చిత్రాలు తీయడంలో ప్రసిద్ధుడు. మా కండబలాన్ని ప్రదర్శిస్తూ.. మాకంటే ఎంతో బరువైన పండును నెత్తిన బాలెన్సింగ్ చేస్తూ.. తీసుకొస్తున్న చిత్రాలను ఆయన భలేగా తీశారు. ఎలాగూ వచ్చాను కాబట్టి.. మా గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పి పోతాను. మా అంత బలం మనుషులకుంటే.. వారు ఏకంగా 4 వేల కిలోల బరువును ఎత్తేయగలరు. చీమలు మీకంటే ముందు నుంచే అంటే.. ఈ భూమ్మీద 13 కోట్ల ఏళ్ల నుంచీ ఉన్నాయి.. అంతేకాదు.. ఈ భూమ్మీద ఉన్న మొత్తం చీమల బరువు.. 700 కోట్ల మంది మనుషుల బరువుతో సమానం. అంటార్కిటికా.. గ్రీన్లాండ్.. కొన్ని సుదూర ద్వీపాల్లో తప్పిస్తే.. మేం అన్నిచోట్లా ఉన్నాం. మాకు రెండు పొట్టలు ఉంటాయి.. ఒకటి మేం తిన్నది జీర్ణం చేసుకోవడానికి.. మరొకటి ఆహారాన్ని నిల్వ చేయడానికి.. మాకు ఊపిరితిత్తులు ఉండవు. చిన్నచిన్న రంధ్రాల ద్వారా ఆక్సిజన్ మా శరీరంలోకి వెళ్తుంది. మాలో కొన్ని చీమల జాతులు కొన్నివారాల పాటు బతికితే.. మా రాణులు 30 ఏళ్ల వరకూ బతుకుతాయి. చెప్పింది చాలు.. చాలా పనుంది.. ఇక ఉంటా మరి.. -
32 పళ్లు.. 3 క్షణాలు..
మీరు పరమ బద్దకిస్టులా.. పళ్లు తోముకోవడానికి కూడా ఆలోచించే టైపా.. లేదా మీరు బాగా బిజీనా.. అయితే.. ఇది మీలాంటోళ్ల కోసమే.. దీని పేరు యూనికో.. ఇదో స్మార్ట్ బ్రష్. కేవలం 3 క్షణాల్లో మన 32 పళ్లనూ శుభ్రం చేసేస్తుందట. ఇందులో చిన్నచిన్న సైజుల్లో చాలా బ్రష్షులుంటాయి. మైక్రో పంప్ సిస్టం ద్వారా టూత్ పేస్టు ఆయా బ్రష్షులకు చేరుతుంది. దీనికి తగిలించి ఉండే పవర్ యూనిట్ ద్వారా ఆ బ్రష్షులు పనిచేస్తాయి. మన నోటికి సరిపోయేటట్టు 4 రకాల సైజుల్లో దొరుకుతుంది. దీంతోపాటు ఓ బాక్సు ఇస్తారు. బ్రష్షును వాడిన తర్వాత దాన్ని బాక్సులో పెట్టేస్తే.. అందులో ఉండే యూవీ కిరణాల ద్వారా అది క్లీన్ అయిపోతుంది. దాంతోపాటు చార్జింగ్ కూడా అయిపోతుంది. మొబైల్లో వాడుకోవడానికి వీలుగా ఓ యాప్ కూడా ఉంది. దాన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే.. బ్రష్షు పనిచేసే స్పీడు.. సమయాన్ని మనం మార్చుకోవచ్చు. దీని ధర రూ.8,065. -
అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
అనంతపురం టౌన్ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు రాష్ట్రస్థాయి అవార్డుల కోసం ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్‌బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2014 మార్చి 31వ తేదీకి ముందు ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు అవార్డు ఎంపికకు అర్హతగా నిర్ణయించామన్నారు. దరఖాస్తు వివరాలు, సమర్పించాల్సిన పత్రాలు, పాటించాల్సిన విధి విధానాల సమాచారం కోసం జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
కొన్ని రాష్ట్రాలపైనే బ్యాంకుల దృష్టి : సిబిల్
అందుకే ఎన్పీఏలు ముంబై: బ్యాంకులు కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి పెట్టడం వల్ల రుణ ఎగవేతలు, మైక్రో, ఎస్ఎంఈ వాణిజ్య రంగాల్లో చెల్లింపుల్లో వైఫల్యాలు చోటు చేసు కున్నాయని ట్రాన్స యూనియన్ సిబిల్ సంస్థ పేర్కొంది. ‘‘కేవలం కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల బ్యాంకులు వాటి రుణ వృద్ధికి ఉన్న అవకాశాలను కోల్పోతున్నారుు. కొన్ని బ్యాంకుల వ్యూహాత్మక దృష్టి ఐదు రాష్ట్రాలు లేదా పది రాష్ట్రాలపైనే ఉంటోంది’’ అని ట్రాన్‌సయూనియన్ సిబిల్ ఇండియా ఎండీ సతీష్ పిళ్లై చెప్పారు. ఉదాహరణకు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వాణిజ్య రుణాలకు సంబంధించిన మొండి బకారుులు (ఎన్పీఏ) అతి తక్కువగా ఉన్నాయని, అవి రెండు శాతమని, అదే సమయంలో రుణాల జారీ కూడా తక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన తెలిపారు. సూక్ష్మ సంస్థలకు సంబంధించి ఎన్పీఏలు 6-6.5 శాతం స్థారుులో ఆగిపోగా... ఎస్ఎంఈ విభాగంలో మాత్రం ఆస్తుల నాణ్యత ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు పిళ్లై పేర్కొన్నారు. ఈ విభాగంలో ఎన్పీఏల రేటు లోగడ 8 శాతంగా ఉంటే అది 11 శాతానికి పెరిగినట్టు చెప్పారు. -
చిల్లర కష్టాలకు చెక్
కలెక్టర్ అరుణ్‌కుమార్ - ఏటీఎం మొబైల్ సేవలు ప్రారంభం కాకినాడ వైద్యం: నిరుపేదల చిల్లర కష్టాలు తీర్చేందుకు ఏటీఎం మొబైల్ సేవా కేంద్రాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాత ఓపీ విభాగంలో ఏటీఎం మొబైల్ సేవాకేంద్రాన్ని కార్డు స్వైప్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రద్దు చేసిన రూ.500, రూ. 1,000 నోట్లతో చిల్లర కోసం తాత్కాలికంగా ఇబ్బందులున్నా, భవిష్యత్తులో దేశానికి, అందరికీ మంచి జరుగుతుందన్నారు. గురువారం నుంచి పాత 500, 1,000 నోట్లు పూర్తిగా చెల్లవన్నారు. ఇంకా ఎవరి వద్దయినా పాతనోట్లు ఉంటే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిసెంబర్ నెలాఖరులోపు జమ చేసుకోవాలని చెప్పారు. ఇతరుల ప్రలోభాలకు తలొగ్గి వారి నగదును వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసుకోరాదని, ఒకవేళ అలా చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికొచ్చే ప్రజల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఏటీఎంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జీజీహెచ్‌లో వారం రోజులపాటు మెబైల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సాయిబాబా ప్రకటించారు. రోజుకి రూ.లక్ష మేర రూ. రూ.20, రూ.100 నోట్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ వై.నాగేశ్వరరావు, రంగరాయ మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, ఛాతి విభాగాధిపతి డాక్టర్ రాఘవేంద్రరావు, సీఎస్‌ఆర్‌ఎంవో మూర్తి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు, ఎఫ్ఏసీ హనుమంతరావు పాల్గొన్నారు. -
మోదీ మొగ్గు ఎమ్మెన్సీలకే
♦ చిన్న సంస్థలకు ప్రోత్సాహకం లేదు: ఈటల విమర్శ ♦ ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీకి హాజరు సాక్షి, న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో మాత్రం బహుళజాతి కంపెనీలకు దారులు తీస్తూ వారివైపే మొగ్గుతున్నారు తప్ప చిన్న సంస్థలకు మేలు చేకూర్చడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్రం నుంచి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల యూనిట్లకు ప్రోత్సాహం ఉండటం లేదన్నారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని చెప్పి రెండేళ్లు అయింది. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. 14వ ఆర్థిక సంఘం 42 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పినా కేంద్ర ప్రాయోజిత పథకాలను తగ్గించారు. పలు పథకాలను రద్దు చేశారు. కస్తూర్బా పాఠశాలలనూ ఎత్తేశారు. ఐసీడీఎస్ నిధుల్లో కోతలు పెట్టారు’’ అని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి సీఎస్టీ పరిహారం తక్షణమే ఇవ్వాలని జైట్లీని అడిగామన్నారు.. 2012-13 వరకే కాకుండా ఎప్పటివరకైతే జీఎస్టీ అమలు జరగదో అప్పటివరకు రాష్ర్టం కోల్పోతున్న ఆదాయాన్ని భర్తీ చేయాలని కోరామన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ యూనిట్ల ప్రోత్సాహ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1.5 కోట్ల రూ. 5 కోట్లకు పెంచడంతోపాటు వాటికి 5 శాతం వడ్డీ రాయితీ, పన్ను రాయితీ ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. అలాగే రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని నెల నెలకు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని జైట్లీని అడిగామని, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా తెలంగాణకు ఎన్ని నిధులు ఇస్తారని అడిగినట్లు చెప్పారు. ‘‘కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కూడు, గుడ్డపై దృష్టి కేంద్రీకరించాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. పేదల పట్ల ప్రేమ ఉంటే మా పథకాలకు మద్దతు ఇవ్వండి.. దేశ వృద్ధి రేటు కంటే రెట్టింపుగా తెలంగాణ వృద్ధి రేటు 15 శాతం ఉంది. మా ఉత్సాహానికి కేంద్రం కొంత తోడైతే బాగుంటుంది..’’ అని జైట్లీని కోరామన్నారు. సూరజ్‌కుండ్ మేళా సందర్శన: హరియాణాలోని సూరజ్‌కుండ్ మేళాను శనివా రం రాత్రి మంత్రి ఈటల సందర్శించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెబుతూ మేళాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను అభినందించారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత వృద్ధి చెందినా మన సంస్కృతిని మరువరాదన్నారు. -
శరీర నిర్మాణం... వివరంగా!
సంక్లిష్టమైన మానవ శరీర నిర్మాణాన్ని, అవయవాలను సూక్ష్మస్థాయిలో చూడటం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చుగానీ.. వైద్య విద్యార్థులకు మాత్రం వరమేనని చెప్పాలి. అలాంటి వారి కోసం రూపొందించిన అప్లికేషన్ ఈ అనాటమీ 4డీ. దీంట్లోని లైబ్రరీ నుంచి మీకు నచ్చిన చిత్రాన్ని తీసుకుని ప్రింట్ చేయడం ద్వారా ఈ అప్లికేషన్ తన పని మొదలుపెడుతుంది. స్కాన్ చేసిన చిత్రాన్ని టేబుల్‌పై ఉంచి స్కాన్ చేశారనుకోండి. ఆ చిత్రంలోని అన్ని అవయవాలు సూక్ష్మ వివరాలతో కనిపిస్తాయి. కేవలం చూడటానికి మాత్రమే కాకుండా... వాటి నుంచి ప్రయాణం చేస్తున్న అనుభూతి కల్పించడం ఈ అప్లికేషన్ ప్రత్యేకత. -
సెటైక్ గాడ్జెట్స్
కిటికీ అద్దం... కరెంటు! కిటికీ అద్దాలు వెలుగుతోపాటు కొంచెం కరెంటు కూడా అందిస్తే ఎలా ఉంటుంది? ఫొటోలో కనిపిస్తున్న గాజుముక్క ఈ పనే చేస్తుంది. మిషిగన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు దీన్ని. ఈ రకమైన అద్దాల తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా పారదర్శకంగా ఉంటూ సౌరశక్తిని గ్రహించేలా చేయగలగడం ఇదే తొలిసారి. మనిషి కంటికి కనిపించని పరారుణ, అతినీలలోహిత కిరణాల్లోని శక్తిని ప్రత్యేక పదార్థాల సాయంతో సేకరించి... గాజు అంచుల్లో ఏర్పాటు చేసే సూక్ష్మస్థాయి సౌరశక్తి ఘటకాలకు సరఫరా చేయడం ద్వారా ఈ అద్దాలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం వీటి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. వీటిని విద్యుదుత్పత్తికి మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లుగానూ ఉపయోగించుకునే అవకాశముందని ఈ పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్త రిచర్డ్ లంట్ అంటున్నారు. పరికరం చిన్న...ప్రయోజనం మిన్న..! వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి, వ్యయప్రయాసలూ ఎక్కువే. కానీ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పరికరాన్ని చూశారుగా... రక్త, మూత్రపరీక్షలను చిటికెలో చేసేస్తాయి. మొబైల్‌ఫోన్‌ను జత చేస్తే.. ఫలితాలను ఎక్కడికైనా పంపవచ్చు. తగిన సలహా, సూచనలు పొందవచ్చు కూడా. హార్వర్డ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని భారతదేశంలోనే పరీక్షిస్తున్నారు. కేవలం రూ.1500తో తయారు చేయగల ఈ పరికరం ఏ మొబైల్ఫోన్తోనైనా పనిచేస్తుంది. ఏ రకమైన పరీక్ష నిర్వహించాలన్నది సెలెక్ట్ చేసుకునేందుకు, రెండు బటన్లు ఉంటాయి. పరీక్షించాల్సిన పదార్థంలోకి కొసను ముంచి విద్యుత్తు వోల్టేజీ పంపినప్పుడు రసాయన సమ్మేళనాలను గుర్తించి విశ్లేషణ జరుపుతుంది. మధుమేహం, మలేరియా వంటి వ్యాధులతోపాటు వాతావరణ కాలుష్యాలను, నీటి కాలుష్యాన్ని కూడా ఈ పరికరం ద్వారా గుర్తించగలగడం మరో విశేషం. కరవును గుర్తించేందుకు నాసా ఉపగ్రహం... నాలుగు చినుకులు పడగానే దుక్కిదున్నడం... విత్తులేయడం రైతుల పని. కురిసిన వర్షం సరిపోకపోతే పంట చేతికందకపోవడమూ కద్దు. మరి నేల పైభాగంలో ఎంత తేమ ఉందో తెలిస్తే? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రెండు నెలల్లో ప్రయోగించే ‘సాయిల్ మాయిశ్చర్ ఆక్టివ్, పాసివ్ (ఎస్‌మ్యాప్)’ ఉపగ్రహం ఇదే పనిచేయనుంది. భూమికి 365 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ప్రపంచం మొత్తమ్మీద ఉపరితల తేమను లెక్కకట్టడం దీని లక్ష్యం. ఉపరితలం నుంచి అయిదు సెంటీమీటర్ల లోతువరకూ ఉండే తేమను గుర్తిస్తుంది ఈ ఉపగ్రహం. ఎస్‌మ్యాప్ ఒకసారికి దాదాపు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలోని తేమను లెక్కిస్తుంది. రెండు మూడు రోజులకు భూమి మొత్తం వివరాలు సేకరించగలుగుతుంది. కరవు పరిస్థితులను ముందుగానే తెలుసుకొనేందుకు ఎస్‌మ్యాప్ ఉపయోగపడుతుందని నాసా శాస్త్రవేత్త నరేంద్ర దాస్ తెలిపారు. కంటి పరీక్షలకు హైటెక్ కెమెరా! బాష్ ఇంజినీరింగ్ కంపెనీ తొలిసారి కంటి పరీక్షలను సులువు చేయగల, చేతిలో ఇమిడిపోయే సరికొత్త హైటెక్ కెమెరాను తయారు చేసింది. ఈ పరికరం తాలూకూ ఆలోచన, ఆచరణ మొత్తం భారత్‌లోనే పూర్తికావడం విశేషం. అరచేతిలో పట్టుకుని పరీక్షించగలిగేలా ఉండటం ద్వారా ఈ పరికరాన్ని ఎక్కడైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. డయలేషన్ లేకుండా (కళ్ల పరీక్షకు ముందు చుక్కల మందు వేయడాన్ని డయలేషన్ అంటారు) కూడా కళ్లను పరీక్షించగలగడం దీని మరో ప్రత్యేకత. కంటి జబ్బులను గుర్తించేందుకు అత్యాధునిక సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించారు. కంటి ముందు, వెనుకభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను గుర్తించేలా దీని నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్లజోడు దుకాణాలు మొదలుకొని ఆసుపత్రుల వరకూ అందరూ సులువుగా ఉపయోగించవచ్చు.