మైక్రోప్లాస్టిక్‌లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్‌లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్‌కు చెక్‌పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్‌లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్‌లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు.
ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్‌లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి.
దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్‌జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్‌లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్‌ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్‌జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్‌ల కణాల డోస్‌ని పెంచింది.
వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్‌స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment