ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది.
ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్‌లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్‌ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్‌లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్‌ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు.
ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్‌ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్‌లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్‌ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్‌లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్‌లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్‌ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు.
అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్‌ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
(చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు)
Comments
Please login to add a commentAdd a comment