కొన్ని రాష్ట్రాలపైనే బ్యాంకుల దృష్టి : సిబిల్
అందుకే ఎన్‌పీఏలు
ముంబై: బ్యాంకులు కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి పెట్టడం వల్ల రుణ ఎగవేతలు, మైక్రో, ఎస్‌ఎంఈ వాణిజ్య రంగాల్లో చెల్లింపుల్లో వైఫల్యాలు చోటు చేసు కున్నాయని ట్రాన్‌స యూనియన్ సిబిల్ సంస్థ పేర్కొంది. ‘‘కేవలం కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల బ్యాంకులు వాటి రుణ వృద్ధికి ఉన్న అవకాశాలను కోల్పోతున్నారుు. కొన్ని బ్యాంకుల వ్యూహాత్మక దృష్టి ఐదు రాష్ట్రాలు లేదా పది రాష్ట్రాలపైనే ఉంటోంది’’ అని ట్రాన్‌సయూనియన్ సిబిల్ ఇండియా ఎండీ సతీష్ పిళ్లై చెప్పారు.
ఉదాహరణకు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వాణిజ్య రుణాలకు సంబంధించిన మొండి బకారుులు (ఎన్‌పీఏ) అతి తక్కువగా ఉన్నాయని, అవి రెండు శాతమని, అదే సమయంలో రుణాల జారీ కూడా తక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన తెలిపారు. సూక్ష్మ సంస్థలకు సంబంధించి ఎన్‌పీఏలు 6-6.5 శాతం స్థారుులో ఆగిపోగా... ఎస్‌ఎంఈ విభాగంలో మాత్రం ఆస్తుల నాణ్యత ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు పిళ్లై పేర్కొన్నారు. ఈ విభాగంలో ఎన్‌పీఏల రేటు లోగడ 8 శాతంగా ఉంటే అది 11 శాతానికి పెరిగినట్టు చెప్పారు.