SME
-
ఎనిమిది నెలల్లో 3.5 కోట్ల దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ఎనిమిది నెలల్లో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయని ఆన్లైన్ జాబ్‌సెర్చ్ ప్లాట్‌ఫామ్ ‘అప్నా.కో’ నివేదిక తెలిపింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో డిమాండ్ కారణంగా ఈ ఏడాది ఉద్యోగ దరఖాస్తులు పెరిగినట్లు సంస్థ పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు 31 వరకు సూక్ష్య, చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి 3.5 కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తులు వచ్చాయి. వివిధ రంగాల్లోని సేల్స్, మార్కెటింగ్ మేనేజర్లు, అకౌంటింగ్ టెక్నీషియన్లు, టెలికాలర్స్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్ వంటి స్థానాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), బీపీఓ, హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంబీ), ఎంఎస్ఎంఈల్లో దాదాపు 11 కోట్లమంది పని చేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు ఈ రంగాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్ఈ సందర్భంగా అప్నా.కో సీఈఓ నిర్మిత్ పారిఖ్ మాట్లాడుతూ..‘ఎనిమిది నెలల్లో వచ్చిన ఉద్యోగ దరఖాస్తుల్లో 55 శాతానికి పైగా జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, లఖ్‌నవూ, కొచ్చి, భువనేశ్వర్ వంటి టైర్-2, టైర్-3 నగరాలవే కావడం విశేషం. ఈ నగరాల్లో వ్యాపారాలు విస్తరిస్తుండటంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ఉద్యోగుల అవసరం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 3.5 కోట్ల దరఖాస్తుల్లో 1.4 కోట్ల మహిళల దరఖాస్తులే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే వీటి సంఖ్య 30 శాతం పెరిగింది. ఫైనాన్స్, అకౌంట్స్, మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్.. వంటి ఉద్యోగాలకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు’ అని చెప్పారు. -
ఈ ఆఫర్ ఓ తుఫాన్!
దేశీ ప్రైమరీ మార్కెట్లలో తాజాగా ఒక విచిత్రమైన రికార్డ్ నమోదైంది. కేవలం రూ.12 కోట్ల సమీకరణకు ఒక చిన్నతరహా సంస్థ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అయితే కనీవినీ ఎరుగని రీతిలో రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఢిల్లీకి చెందిన రీసోర్స్ఫుట్ ఆటోమొబైల్ కంపెనీ యమహా ద్విచక్ర వాహన డీలర్‌గా వ్యవహరిస్తోంది. అదికూడా రెండు ఔట్లెట్లను మాత్రమే కలిగి ఉంది. 2018లో ఏర్పాటైన సంస్థ 8 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2023 డిసెంబర్ 28న సెబీకి దాఖలు చేసిన ఐపీవో ప్రాస్పెక్టస్ వివరాలు కింది విధంగా ఉన్నాయి.కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు సాధిస్తున్న రికార్డుల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిన్న, మధ్యతరహా కంపెనీల(ఎస్ఎంఈలు) ఐపీవోలకూ ఇటీవల భారీ డిమాండ్ నెలకొంటోంది. వెరసి తాజాగా ఐపీవోకు వచ్చిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఏకంగా 419 రెట్లు అధికంగా సబ్‌స్రైబ్ అయింది. సాహ్నీ ఆటోమొబైల్ బ్రాండుతో యమహా డీలర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు, సర్వీసింగ్ చేపడుతోంది. ఇన్వెస్టర్ల నుంచి హెవీ రష్ఈ నెల 22న ప్రారంభమై 26న ముగిసిన రీసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీవోలో భాగంగా 9.76 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. అయితే 40.76 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. రూ.12 కోట్ల సమీకరణకు తెరతీస్తే ఏకంగా రూ.4,800 కోట్ల విలువైన బిడ్స్ లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కేటగిరీలో 316 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 496 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూకి తొలి రోజు 10.4 రెట్లు, రెండో రోజు 74 రెట్లు అధికంగా స్పందన లభించింది. చివరి రోజుకల్లా బిడ్డింగ్ తుఫాన్ సృష్టించింది. షేరుకి రూ.117 ధరలో మొత్తం 10.25 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీల కోసం ఏర్పాటు చేసిన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సాహ్నీ ఆటోమొబైల్ లిస్ట్‌కానుంది.ఇదీ చదవండి: భారత్‌లో ఎప్పటికీ చిన్నకార్లదే హవాఎస్ఎంఈలకు కనిపిస్తున్న అనూహ్య డిమాండ్ అసంబద్ధమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన పెట్టుబడుల వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. లిస్టింగ్ లాభాల కోసం ఇన్వెస్టర్లు నాణ్యతా సంబంధ విషయాలను సైతం విస్మరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అధిక సబ్స్క్రిప్షన్వల్ల తాత్కాలికంగా లాభాలు వచ్చినప్పటికీ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కొంత నిరాశ కలిగించవచ్చన్నారు. అయితే కంపెనీ బిజినెస్‌పై పూర్తి అవగాహనతో పెట్టుబడి పెట్టే వారు తక్కువవుతున్నారని ఆందోళన వ్యక్తి చేశారు. నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ వేలంవెర్రి కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్లాట్ ఫామ్ ద్వారా లిస్టయ్యే కంపెనీల ఖాతాలను మరింత అప్రమత్తంగా ఆడిటింగ్ చేయమంటూ గత వారం సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్ అశ్వనీ భాటియా చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏలు)కు సూచించడం గమనార్హం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎస్ఎంఈ ఐపీవోల దూకుడు
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్ల ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజాగా ఇటు సెన్సెక్స్ 72,000 పాయింట్ల మైలురాయిని చేరగా.. పోటీగా అటు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్క్‌వైపు కదులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుండటంతో ప్రధాన ప్రైమరీ మార్కెట్ పలు ఐపీవోలతో కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్ఎంఈ) సైతం లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. వెరసి ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో 2023లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూల విభాగం దూకుడు చూపుతోంది. ఇప్పటివరకూ 166 కంపెనీలు ఐపీవోలను పూర్తి చేసుకున్నాయి. బ్రోకింగ్ సంస్థ ఫైయర్స్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం రూ. 4,472 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఇంతక్రితం 2022లో 109 ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 1,980 కోట్లు సమకూర్చుకున్నాయి. కాగా.. ఈ ఏడాది ఐపీవోకి వచ్చిన 166 సంస్థలలో 136 లాభాలతో లిస్టయ్యాయి. వీటిలో 24 ఎస్ఎంఈలు లిస్టింగ్ రోజున ఏకంగా 100 శాతం లాభాలను సాధించాయి. జాబితాలో గోయల్ సాల్ట్ 258 శాతం దూసుకెళ్లి టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో సన్‌గార్నర్ ఎనర్జీస్ 216 శాతం, బేసిలిక్ ఫ్లై 193 శాతం జంప్‌చేసి తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. ఇన్వెస్టర్ల క్యూ ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది లిస్టయిన సంస్థలలో 51 ఇష్యూలు 100 రెట్లుపైగా సబ్ర్స్కిప్షన్ను సాధించాయి. మరో 12 ఐపీవోలు ఏకంగా 300 రెట్లు అధికంగా డిమాండును అందుకున్నాయి. ఫైయర్స్ వివరాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు చరిత్రాత్మక స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. అంతగా ప్రసిద్ధంకాని చాలా కంపెనీల ఇష్యూలలో సైతం రిటైలర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వెరసి స్పందనలో గత రికార్డులను తుడిచిపెడుతున్నారు. అయితే ఇకపై రానున్న ఐపీవోల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు ఫైయర్స్ పేర్కొంది. మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తోంది. ఈ స్పీడ్ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడింది. కొన్ని కంపెనీల షేర్లు దూకుడు చూపుతున్నప్పటికీ ఆర్థిక పనితీరు ఆ స్థాయిలో ఉండటంలేదని ప్రస్తావిస్తోంది. వెరసి చిన్న ఇన్వెస్టర్లకు బహుపరాక్ చెబుతోంది! జోరు తీరిదీ.. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన సంస్థలలో గోయల్ సాల్ట్ ముందునిలవగా.. లిస్టింగ్ రోజు భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోల జాబితాలో పలు సంస్థలు చోటు సాధించాయి. వీటిలో సన్‌గార్నర్ ఎనర్జీస్(216 శాతం), బేసిలిక్ ఫ్లై స్టుడియో(193 శాతం), స్(216 శాతం), ఓరియానా పవర్(169 శాతం), ఏనియన్ టెక్ సొల్యూషన్స్(164 శాతం), సీపీఎస్ షేపర్స్(155 శాతం), శ్రీవారి స్పైసెస్(154 శాతం), ఇన్ఫోలియన్ రీసెర్చ్(142 శాతం), రాకింగ్‌డీల్స్ సర్క్యులర్(125 శాతం), నెట్ ఎవెన్యూ టెక్(122 శాతం), పారగాన్ ఫైన్ ఎస్(114 శాతం), విన్యాస్ ఇన్నొవేటివ్ టెక్(110 శాతం), కృష్ణా స్ట్రాపింగ్(109 శాతం), సార్ టెలివెంచర్(101 శాతం), ఇన్నోకయిజ్ ఇండియా(100 శాతం) తదితరాలున్నాయి. -
ఎస్బీఐ ఫెస్టివ్ ఆఫర్స్: ఎస్ఎంఈలకు తీపి కబురు
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ షురూ అయిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) కోసం వరుస పండుగ ఆఫర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. కొన్ని లాభదాయకమైన హోమ్ లోన్ డిస్కౌంట్లతో పాటు ఎస్ఎంఈల కోసం కొలేటరల్-ఫ్రీ లోన్స్ అందించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో SMEల కోసం ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాలను అందిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) ఎస్బీఐ ఎండీ అలోక్ కుమార్ చౌదరి జీ బిజినెస్‌కు అందించిన వివరాల ప్రకారం ఎస్ఎంఈల కోసం కొలేటరల్-ఫీ లోన్( ఎలాంటి తనఖా) అందించేందు ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులు డిజిటల్‌గా క్రెడిట్ సౌకర్యాలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాలను కస్టమర్లకు విస్తరించే లక్ష్యంలో భాగంగా ఇది డిజిటల్ సేవల ద్వారా వినియోగదారులకు అనుకూలమైన సేవలతో నిమగ్నమవ్వడానికి కూడా సహాయపడుతుందని భావిస్తోంది.అలాగే ‘అండర్‌రైటింగ్’ ప్రక్రియ లేదా రుణదాత ఒకరి ఆదాయం, ఆస్తులు, అప్పు, ఆస్తి వివరాలను ధ్రువీకరించే ప్రక్రియ మరింత ఈజీ చేస్తుంది. అంతేకాదు ఎస్ఎంఈలకు ఈ పండుగ సీజన్లో ఎస్బీఐ యోనో యాప్‌లో తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్నికల్పిస్తోంది. బ్యాంక్ తన ఎస్ఎంఈ రుణగ్రహీతలను ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లాగా యోనో యాప్‌లో తమ ఉత్పత్తుల లిస్టింగ్‌కు అనుమతిస్తుందని, ఈ ఆఫర్లు కస్టమర్లకు నచ్చతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇతర ఆఫర్లపై కూడా మాట్లాడిన ఆయన ఎంపిక చేసిన కస్టమర్లకు తమ గృహ రుణాలపై 65 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు రాయితీలను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుందన్నారు. -
వెలవెలబోతున్న ఐపీవో మార్కెట్
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) మార్కెట్లో సందడి కనిపించడం లేదు. జనవరి నెలలో కేవలం 12 ఐపీవోలు రాగా, ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.478 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. ఇందులోనూ రూ.323 కోట్లు కేవలం రెండు కంపెనీలు మెయిన్‌బోర్డ్ రూపంలో సమీకరించినవి కావడం గమనించొచ్చు. 10 ఎస్ఎంఈ కంపెనీలు కలసి రూ.155 కోట్లను సమీకరించాయి. గత డిసెంబర్లో ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన మొత్తం రూ.5,120 కోట్లుగా ఉంది. ‘‘నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 10 శాతం పడిపోవడంతో సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఐపీవోలకు ఇది అనుకూల సమయం కాదు. అయినప్పటికీ ఆకర్షణీయమైన ధరతో వచ్చే ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఉంటుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. 2022లో రూ.57,000 కోట్లు గతేడాది మొత్తం మీద 38 కంపెనీలు ఐపీవో రూపంలో రూ.57,000 కోట్లను సమీకరించాయి. ఇందులో రూ.20,557 కోట్లు ఒక్క ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించినవి కావడం గమనించొచ్చు. 2021లో 63 కంపెనీలు కలసి సమీకరించిన రూ.1.2 లక్షల కోట్లతో పోలిస్తే గతేడాది గణనీయంగా తగ్గడాన్ని గమనించొచ్చు. ఎల్ఐసీ ఐపీవో లేకుంటే నిధుల సమీకరణ గణాంకాలు మరింత తక్కువగా ఉండేవి. గతేడాది నుంచి ఈక్విటీ మార్కెట్లు అస్థిరతలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక ఈ ఏడాది జనవరిలో రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీలు రూ.644 కోట్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) రూపంలో రూ.829 కోట్లు రాబట్టాయి. -
Joom: భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక
భారత్‌లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం అడుగు పెట్టింది. లిస్బన్ కేంద్రంగా నడిచే జూమ్(Joom) భారత్‌లోని ఎనిమిది నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, ఇండోర్, జైపూర్, సూరత్, రూర్కీ, లుథియానాలలో స్థానిక వ్యాపారులు, ఎగుమతిదారుల కోసం ఒక వేదికను ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 350 మందికిపైగా వ్యాపారులు నమోదు చేసుకున్నారు. వీరిలో సగం మంది డైరెక్ట్ టు కస్టమర్ వ్యాపారాల్లో ఇంతకు ముందు ఎప్పుడూ తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో విక్రయించలేదు. వారంతా ఇప్పుడు జూమ్ ద్వారా మొదటిసారి అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోగలిగారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్, జువెలరీ, క్రిస్టల్ హీలింగ్, హెల్త్ అండ్ బ్యూటీ, హెల్త్ సప్లిమెంట్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఉమెన్స్ ఫ్యాషన్, యాక్సెసరీస్ వంటి విభాగాల్లో ఉత్పత్తులను అందిస్తోన్న ఈ జూమ్ కంపెనీ భారత్‌లో హెల్మెట్లు, కవచాలు, తేనెటీగల పెంపకందారుల ఉత్పత్తులు, గుర్రాలకు జీనులు, వివిధ రకాల రత్నాలు, తివాచీలు, సాంప్రదాయ వస్త్రాల వంటి ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించింది. తాము 2022 ప్రారంభం నుంచే భారత్‌లోని ప్యాపారులతో అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని, ఇందులో పూర్తిగా విజయవంతం కాకపోయినప్పటికీ టాప్-5 కొత్త కంపెనీలలో ఒకటిగా నిలిచామని కంపెనీ ఆసియా-పసిఫిక్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మాగ్జిమ్ బెలోవ్ తెలిపారు. జూమ్ ఈ-కామర్స్ కంపెనీని 2016లో లాట్వియాలో స్థాపించారు. 2023 నాటికి భారత్ ఈ సంస్థకు టాప్-2 గ్లోబల్ మార్కట్‌గా నిలుస్తుందని, దీని బీటూసీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2023 నాటికి 25.8 శాతం వృద్ధితో 5.57 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గ్రాండ్‌వ్యూ రీసర్చ్ అంచనా వేసింది. ఈ కంపెనీకి ఫార్మా, ఫిన్‌టెక్ , లాజిస్టిక్ వంటి ఈ-కామర్స్ వ్యాపారాలు ఉన్నాయి. 2022 నాటికి ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. -
ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్ తేవాలి
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల నిధుల అవసరాలను తీర్చేందుకు ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్‌ను కేంద్ర బడ్జెట్లో ప్రకటించాలని బిజ్2ఎక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ అరోరా కోరారు. చిన్న వ్యాపార సంస్థలు రుణాల లభ్యత సమస్య ఎదుర్కొంటున్నాయని, వాటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకమైన ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్ అవసరమన్నారు. కాసా అకౌంట్లు, ఇన్వాయిస్, పేమెంట్ ప్రాసెసింగ్, కరెస్పాండెంట్ బ్యాంకింగ్, ఎస్ఎంఈ క్రెడిట్, ట్రేడ్ ఫైనాన్స్ సేవలను ఎస్ఎంఈ డిజిటల్ బ్యాంక్ అందించొచ్చన్నారు. బిజ్2ఎక్స్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్‌కు కస్టమైజ్డ్ ఆన్లైన్ లెడింగ్ సేవలను అందించే సాస్ ప్లాట్‌ఫామ్. -
నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్’ మార్గం
ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గాంధీనగర్ గిఫ్ట్సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో లిస్ట్ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 400 కంపెనీల లిస్టింగ్ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్ సిటీ ప్లాట్‌ఫామ్ లేదా ముంబై బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ లేదా రెండింటిలో ద్వంద్వ లిస్టింగ్ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది. ఉంటుందన్నది పరిశీలించాలి. ► ద్వంద్వ లిస్టింగ్ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం. ► అంతర్జాతీయ ఫండ్లు కూడా ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్ వెల్త్ ఫండ్లు ఈ ఎక్సే్ఛంజ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్ఈ ప్రయత్నాలు జరపాలి. ► ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి. ► ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి. ► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్‌జీసీ, టీఆర్‌ఈడీఎస్‌సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది. ► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు. ► స్టార్టప్‌ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్ 100 కంటే ఎక్కువ యునికార్న్‌లకు (బిలియన్ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు), 70–80 ‘సూనికార్న్‌లకు‘ (యూనికార్న్‌లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానానికి బీఎస్ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్‌లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) ప్లాట్‌పామ్‌పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. కార్యక్రమంలో బీఎస్ఈ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్ చరణ్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్ఈ ఎంఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 60,000 కోట్లు దాటింది. -
కేవలం నెలకు రూ. 85 చెల్లిస్తే 5 లక్షల ఆరోగ్య బీమా మీ సొంతం..! వివరాలు ఇవే..!
అతి తక్కువ ప్రీమియంతో అదిరిపోయే హెల్త్ బీమా పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య బీమా ప్లాట్‌ఫాం ప్లమ్ ప్రారంభించింది. కేవలం నెలకు రూ. 85 ప్రీమియం చెల్లిస్తే రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను పొందవచ్చును. డిసెంబర్ 21 న ఈ కొత్త పాలసీను ప్లమ్ ప్రకటించింది. ఎవరికీ వర్తిస్తుందంటే..! చిన్న తరహా స్టార్టప్స్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులు, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసే వారు ఈ ఆరోగ్య బీమాను పొందవచ్చును. ఈ బీమాతో ఆయా పాలసీదారులు అపరిమితంగా వైద్యుల అపాయింట్మెంట్స్, వారానికోసారి వెల్నెస్ సెషన్స్, డెంటల్, కళ్ల పరీక్షలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్ కన్సల్టేషన్స్, కోవిడ్-19 చికిత్స మొదలైన వాటికి క్లెయిమ్ చేసుకోనే వీలు ఉంటుంది. అప్పుడే మొదలైన స్టార్టప్స్‌కు చేయూత..! దేశవ్యాప్తంగా సుమారు 6.3 కోట్ల స్మాల్మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. వీటితో పాటుగా భారత్‌లో 1 కోటి 15 లక్షలకు పైగా గిగ్ వర్కర్స్ (కాంట్రాక్టు పద్దతిలో పనిచేసేవారు) ఉన్నారు. వీరికి ఎటువంటి బీమా సౌకర్యాలు లేనట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా ప్రారంభ దశలో మొదలైన స్టార్టప్స్‌కు ప్లమ్ బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడనుంది. ఆయా స్టార్టప్స్‌లో ఇద్దరు సభ్యుల కంటే తక్కువ టీమ్‌లను కలిగి ఉన్న కంపెనీలకు, స్టార్టప్స్లోని ఉద్యోగులను బీమా కవర్ అందివచ్చును. హెల్త్ బెనిఫిట్స్ అందరికీ ఇవ్వడమే మా లక్ష్యం..! అప్పుడే మొదలైన చిన్న స్టార్టప్స్‌కు, గిగ్ వర్కర్స్కు హెల్త్ బీమాను అందించడమే మా ముఖ్య లక్ష్యమని ప్లమ్ కో-ఫౌండర్, సీఈవో అభిషేక్ పొద్దార్ అన్నారు. ఆయా కార్యాలయాల్లో వెల్నెస్ ప్రవర్తనను సృష్టించాలనే లక్ష్యంతో ఈ బీమాను ప్రారంభించినట్లు తెలిపారు. 2024 నాటికి సుమారు ఒక కోటి మందికి బీమా చేయాలనే ప్లమ్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చదవండి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ -
చిన్న సంస్థలకు ఊతం..
న్యూఢిల్లీ: కోట్లాది మందికి ఉపాధి కల్పించే లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్ఎంఈ) తోడ్పాటునిచ్చేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఇటీవలే 59 నిమిషాల్లోనే రూ. 1 కోటి దాకా రుణాల పథకాన్ని ప్రారంభించామని, జీఎస్టీలో నమోదు చేసుకున్న ఎస్ఎంఈలకు రూ. 1 కోటిపైగా రుణాలపై రెండు శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక రూ. 5 కోట్ల కన్నా తక్కువ వార్షిక టర్నోవరు ఉన్న 90 శాతం మంది జీఎస్టీ చెల్లింపుదారులు ఇకపై మూణ్నెల్లకోసారి రిటర్నులు దాఖలు చేసేలా నిబంధనలు సడలిస్తున్నామన్నారు. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇక నుంచి 25 శాతం కొనుగోళ్లు ఎస్ఎంఈల నుంచే జరపాల్సి ఉంటుందని, ఇందులోనూ 3 శాతం కొనుగోళ్లు మహిళల సారథ్యంలోని సంస్థల నుంచి కొనాల్సి ఉంటుందని చెప్పారు. రూ. 17వేల కోట్ల లావాదేవీలు.. ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆన్లైన్ కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా గడిచిన రెండేళ్లలో రూ. 17,500 కోట్ల పైచిలుకు లావాదేవీలు జరిగాయని గోయల్ చెప్పారు. వీటితో 25–28 శాతం మేర ఆదా అయ్యిందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో 1,90,226 మంది విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్లు 7,53,162 పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రూ. 7 లక్షల కోట్ల ముద్ర రుణాలు.. మోదీ సర్కారు ముద్ర స్కీమ్‌ను ప్రవేశపెట్టినప్పట్నుంచీ రూ. 7.23 లక్షల కోట్ల విలువ చేసే 15.56 లక్షల రుణాలు మంజూరైనట్లు గోయల్ చెప్పారు. లబ్ధిదారుల్లో మహిళల సంఖ్య 70 శాతం పైగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
ఎస్ఎంఈలపై అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగుల వ్యయ నియంత్రణ, నిర్వహణ సేవలందిస్తున్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్ దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ)లపై దృష్టిసారించింది. ఉద్యోగుల వేతనాలు, ప్రయోజనాల తర్వాత నియంత్రించగలిగేవి వినోద, ప్రయాణ వ్యయాలేనని అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గ్లోబల్ కమర్షియల్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ శారు కౌశల్ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేట్ కార్డ్ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీల వ్యయ భారం తగ్గుతుందని, సుమారు 10 శాతం వరకు వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో 60 శాతం కంటే ఎక్కువ కంపెనీలకు మా కస్టమర్లుగా ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల వ్యాపార సంస్థల తమ సేవలు వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. మన దేశంలో రూ.75 కోట్ల నుంచి రూ.600 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న ఎస్ఎంఈ కంపెనీలు తమ సేవలు వినియోగించుకుంటూ ఆయా కంపెనీల్లోని ఉద్యోగుల వినోద, ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నాయని తెలిపారు. సుమారు దేశంలో 13 వేల కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని.. ఎంఎంఈ విభాగం వృద్ధి చెందుతుందని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ కంపెనీలతో పాటూ స్టార్టప్స్, ఎస్‌ఎంఈలూ ఉన్నాయి. వీటన్నింటికీ మా వాణిజ్య చెల్లింపుల వ్యాపారం బాగా సెట్ అవుతాయి. అందుకే నగరంపై ఫోకస్ చేశామని పేర్కొన్నారు. -
వ్యాపారం మీది.. వేదిక మాది!
⇒ వ్యక్తిగత వర్తకులు, ఎస్ఎంఈలకు ఆన్లైన్ వ్యాపార వేదిక ⇒ క్రాఫ్ట్లీలో చేనేత, హస్తకళలకు ప్రత్యేక విభాగం కూడా.. ⇒ కేంద్ర ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యండీక్రాఫ్ట్స్తో ఎంవోయూ ⇒ అందుబాటులో 1,500 విభాగాల్లో 70 లక్షల ఉత్పత్తులు ⇒ ఇప్పటివరకు 9.5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ⇒ ‘స్టార్టప్ డైరీ’తో క్రాఫ్ట్లీ కో–ఫౌండర్ విశేష్ ఖురానా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో బ్రాండెడ్ ఉత్పత్తులు లేదా స్థానికంగా పేరొందిన ఉత్పత్తులు ఆన్లైన్లో కొనాలంటే ఈజీనే. ఎందుకంటే వీటికి బోలెడన్ని వేదికలున్నాయి. మరి, చిన్న, మధ్య తరహా సంస్థలు, వ్యాపారస్తుల ఉత్పత్తుల పరిస్థితేంటి? మరీ ముఖ్యంగా చేనేత, హస్తకళా ఉత్పత్తులకో? ఆయా తయారీ సంస్థలు, విక్రయదారులకు సరైన ఆన్లైన్ వేదికంటూ లేకపోవటంతో పోటీపడలేకపోతున్నాయి. దీనికి పరిష్కారం చూపిస్తోంది క్రాఫ్ట్లీ.కామ్. ఈ సంస్థ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి దాని వ్యవస్థాపకుడు విశేష్ ఖురానా ఏం చెబుతారంటే... ఢిల్లీ కేంద్రంగా ఆగస్టు 2015లో సాహిల్ గోయెల్, గౌతమ్ కపూర్, నేను కలిసి దీన్ని ప్రారంభించాం. వ్యక్తిగత వర్తకులకు, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించుకునే వేదికే క్రాఫ్ట్లీ. విక్రయదారులకు ఉత్పత్తుల కేటలాగ్, ఉత్పత్తుల ప్రదర్శన, ఆన్లైన్ మార్కెటింగ్, పేమెంట్ సొల్యూషన్స్, లాజిస్టిక్ సేవలను కూడా అందిస్తాం. 1,500 విభాగాలు, 70 లక్షల ఉత్పత్తులు.. ప్రస్తుతం క్రాఫ్ట్లీలో 17 వేల మంది విక్రయదారులు నమోదయ్యారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యాషన్, జ్యుయెలరీ, హోమ్‌డెకర్, ఫుట్‌వేర్ వంటి 1,500 కేటగిరీల్లో సుమారు 70 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. ప్రతి రోజూ క్రాఫ్ట్లీ ద్వారా 10 వేల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ప్రతి ఉత్పత్తి అమ్మకంపై విక్రయదారుడి నుంచి 10 శాతం కమీషన్ తీసుకుంటాం. వ్యాపారులు లేదా సంస్థలు కావాలంటే ఈ–కామర్స్ వేదికను అభివృద్ధి చేసిస్తాం. ఫీచర్లను బట్టి వీటి ధరలు రూ.3–15 వేల వరకూ ఉంటాయి. త్వరలోనే మరో విడత నిధుల సమీకరణ.. ఈ ఏడాది ముగింపు నాటికి 5 మిలియన్ డాలర్ల ఆదాయంతో పాటు వచ్చే ఏడాది కాలంలో మరో లక్ష మంది విక్రయదారుల్ని నమోదు చేయాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మా సంస్థలో 200 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 9.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాం. బెర్టెల్స్మెన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ), నిర్వాణా వెంచర్, బీనూస్, 500 స్టార్టప్స్ వంటివి ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ముగింపునాటికి మరో విడత నిధుల సమీకరణ చేస్తాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. చేనేత, హస్తకళలకు ప్రత్యేకం.. ఇటీవలే కేంద్ర ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యండీక్రాఫ్ట్స్ (ఈపీసీహెచ్)తో ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాం. ఈ ఎంవోయూతో ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ కింద చేనేతదారులు, హస్త కళాకారులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్పత్తిదారులు నమోదయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మంది చేనేత, హస్తకళాకారులున్నారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
కొన్ని రాష్ట్రాలపైనే బ్యాంకుల దృష్టి : సిబిల్
అందుకే ఎన్పీఏలు ముంబై: బ్యాంకులు కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి పెట్టడం వల్ల రుణ ఎగవేతలు, మైక్రో, ఎస్ఎంఈ వాణిజ్య రంగాల్లో చెల్లింపుల్లో వైఫల్యాలు చోటు చేసు కున్నాయని ట్రాన్స యూనియన్ సిబిల్ సంస్థ పేర్కొంది. ‘‘కేవలం కొన్ని రాష్ట్రాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల బ్యాంకులు వాటి రుణ వృద్ధికి ఉన్న అవకాశాలను కోల్పోతున్నారుు. కొన్ని బ్యాంకుల వ్యూహాత్మక దృష్టి ఐదు రాష్ట్రాలు లేదా పది రాష్ట్రాలపైనే ఉంటోంది’’ అని ట్రాన్‌సయూనియన్ సిబిల్ ఇండియా ఎండీ సతీష్ పిళ్లై చెప్పారు. ఉదాహరణకు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ వాణిజ్య రుణాలకు సంబంధించిన మొండి బకారుులు (ఎన్పీఏ) అతి తక్కువగా ఉన్నాయని, అవి రెండు శాతమని, అదే సమయంలో రుణాల జారీ కూడా తక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన తెలిపారు. సూక్ష్మ సంస్థలకు సంబంధించి ఎన్పీఏలు 6-6.5 శాతం స్థారుులో ఆగిపోగా... ఎస్ఎంఈ విభాగంలో మాత్రం ఆస్తుల నాణ్యత ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్టు పిళ్లై పేర్కొన్నారు. ఈ విభాగంలో ఎన్పీఏల రేటు లోగడ 8 శాతంగా ఉంటే అది 11 శాతానికి పెరిగినట్టు చెప్పారు. -
విత్డ్రాయెల్స్పై పరిమితితో పరిశ్రమలకు దెబ్బ
కోయంబత్తూర్: కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో క్యాష్ విత్డ్రాయెల్స్పై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడం వల్ల రియల్టీ సహా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ) రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయా పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి రాసిన ఒక మెమోరాండంలో లోకల్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐసీసీఐ).. విత్డ్రాయెల్స్పై పరిమితి అంశంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల పరిశ్రమకు సంబంధించిన దైనందిన కార్యకలాపాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఎస్ఎంఈలు వాటి కార్యకలాపాల కోసం నగదు లావాదేవీలపైనే ప్రధానంగా ఆధారపడతాయని ఐసీసీఐ ప్రెసిడెంట్ వనిత మోహన్ గుర్తుచేశారు. తాజా పరిమితుల వల్ల ఇవి సమస్యలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. దీంతో మొత్తంగా ఉత్పత్తి తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు. వి కార్మికులు వేతన చెల్లింపులు ఆలస్యం కావొచ్చని తెలిపారు. ‘కార్మికులందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండవు. వారికి తప్పనిసరిగా నగదు రూపంలోనే వారం చివరిలో చెల్లింపులు జరపాలి. ఇప్పుడు వారు ఈ వారంలో పేమెంట్స్‌ను కోల్పోయే పరిస్థితి వచ్చింది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా ఈ మెమోరాండంలో తొమ్మిది టెక్స్టైల్ అసోసియేషన్స, పలువురు మ్యానుఫ్యాక్చరర్స్ సహా రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ సంతకాలు చేశారుు. -
స్నాప్‌డీల్, పేపాల్‌తో ఎస్బీఐ జట్టు
కోల్‌కతా: చిన్న, మధ్య తరహా సంస్థలకు(ఎస్ఎంఈ) తోడ్పాటు కోసం ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేపాల్‌తో ఎస్బీఐ చేతు లు కలిపింది. స్నాప్‌డీల్‌తో అవగాహన ఒప్పం దం(ఎంవోయూ) ప్రకారం సదరు సైట్ ద్వారా లావాదేవీలు జరిపే విక్రేతలు లేదా తయారీ సంస్థలకు ఎస్బీఐ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తుంది. మహిళా వ్యాపారవేత్తలకు వడ్డీ రేటుపై మరో 0.25% తగ్గింపు ఉంటుంది. రూ. కోటి దాకా రుణాలకు తనఖా అవసరం ఉండదు. నిధుల సమస్యల వల్ల వ్యాపారాలను విస్తరించలేకపోతున్న ఎస్ఎంఈలకు ఈ డీల్‌తో ప్రయోజనం లభిస్తుందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. తమ ఎస్ఎంఈ కస్టమర్లు సీమాంతర ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా, సులభతరంగా నిర్వహించుకునేలా పేపాల్‌తో ఎస్బీఐ ఎంవోయూ కుదుర్చుకుంది.